28, ఫిబ్రవరి 2017, మంగళవారం

ఎన్టీఆర్ వ‌ర్సెస్ ప‌వ‌న్ విన్న‌ర్ ఎవ‌రు..!


టాలీవుడ్‌లో సంక్రాంతి త‌ర్వాత మ‌రో బడా క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలోనే మరోసారి నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బడా ఫైట్‌కు రెడీ అవుతున్నారట. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వ‌ర్సెస్ యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రిగింది. వీరిలో చిరు త‌న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తోను, బాల‌య్య త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో పోటీప‌డి ఇరువురు విజ‌యం సాధించారు.
ఇప్పుడు ఇదే క్ర‌మంలో మ‌రోసారి ఈ యేడాదే బాక్సాఫీస్ వ‌ద్ద ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ పోటీప‌డ‌నున్నారు. వీరిద్ద‌రి సినిమాలు ఒకేరోజు విడుదలకు ముస్తాబవుతున్నాయట. ఎన్టీఆర్, బాబి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘జై లవకుశ’ చిత్రం ఆగస్టు 11న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ముందుగానే చెప్పేశారు.
ఇక అదేరోజున పవన్, త్రివిక్రమ్ సినిమా కూడా రిలీజ్ కానుందట. పవన్ సినిమా కోసం ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్.. త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్తాడట. ఒకే షెడ్యూల్‌లో కంటిన్యూగా షూటింగ్ పూర్తిచేసి ఆగస్టులో విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఆగ‌స్టు 11 త‌ర్వాత వ‌రుస‌గా మూడు రోజుల వీకెండ్‌తో పాటు రెండు రోజులు సెల‌వులు రావ‌డంతో ప‌వ‌న్ సైతం అదే డేట్‌మీద క‌న్నేశాడ‌ట‌. మ‌రి ప‌వ‌న్ వ‌ర్సెస్ ఎన్టీఆర్ పోరులో ఎవ‌రిది పైచేయి అవుతుందో చూడాలి.

లేబుళ్లు: ,

27, ఫిబ్రవరి 2017, సోమవారం

మరోక సారి సిక్స్ ప్యాక్ లో తారక్..


ఎన్టీఆర్ మరి కొన్నిరోజుల్లో తన సిక్స్ ప్యాక్ బాడీని వెండితెరపై తెలుగు ప్రేక్షకులకు చుపించాబోతున్నాడు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా , ముద్దుగా ఉండేవాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాకోసం బక్కచిక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు గంటల సమయం జిమ్ లో గడుపుతూ సిక్స్ ప్యాక్ బాడీకి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సిక్స్ ప్యాక్ బాడీ ఓ ట్రెండ్ అయ్యింది.

కమెడియన్ సునీల్ నుంచి జయం సినిమాతో హీరోగా మారిన నితిన్ వరకు ఇప్పుడు అందరు జిమ్ లో గంటల సమయం కేటాయించి వారి బాడీకి పని పెట్టి వెండితెరపై సిక్స్ ప్యాక్ బాడీతో వెండితెరపై కనిపిస్తున్నారు.అయితే ఎన్టీఆర్ అభిమానులు కూడా అతనిని మరోక సిక్స్ ప్యాక్ బాడీలో చూడటానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.జై లవకుశ సినిమా లో ఒక పాత్ర లో సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడు అని సమాచారం.

దాంతో ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నా జై లవ కుశ సినిమాలో తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించడం ఖాయమని అంటున్నారు. ఇప్పటి వరకు టాప్ డాన్సర్ అని పేరుంది. కానీ ఇంతకు ముందు టెంపర్ సినిమా లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపించి ధియేటర్ల వద్ద చేసినా సందడి అంత ఇంత కాదు..అసలు ఎన్టీఆర్ స్పీడు పెరగడానికి యూత్ ఐకాన్ గా మారాడానికి ఈ సిక్స్ ప్యాకే ఒక కారణం గా చెప్పోచ్చు..

లేబుళ్లు: , , , ,

సుమ‌ను అరెస్టు చేయించిన రాజ‌మౌళి


దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’ తొలి పార్ట్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మ‌నోడు ఇప్పుడు బాహుబ‌లి ది కంక్లూజ‌న్ తెర‌కెక్కించే ప‌నిలో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ఆర్ఎఫ్‌సీలో జ‌రుగుతోంది.
శుక్ర‌వారం ఈ సినిమా సెట్‌లోకి వెళ్లిన ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ‌కు అక్క‌డ రాజ‌మౌళి షాక్ ఇచ్చాడు. బాహుబ‌లి సెట్‌కు వ‌చ్చే వారు ఎవ్వ‌రూ కెమేరాలు, సెల్‌ఫోన్లు తీసుకురాకూదని, సెల్ఫీలు అసలు తీసుకోకూడదని జక్కన్న ఆర్డర్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్డర్‌ను పట్టించుకోని సుమ అక్కడ సెల్ఫీ తీసుకుంది. దీంతో వెంటనే దేవసేన కోసం తయారుచేసిన జైల్లో పడిపోయింది.
త‌న‌ను ఆ జైలు నుంచి విడిపించ‌మ‌ని ఆమె ఎంత వేడుకున్నా ఆమె మాట‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో ఆమె ఆ జైలు నుంచే రాజ‌మౌళిని ఇంట‌ర్వ్యూ చేసింది. ఇదంతా నిజం అని షాక్ అవ్వొద్దు. శివ‌రాత్రి కానుక‌గా రాజ‌మౌళి డిఫ‌రెంట్‌గా ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ను ప్లాన్ చేశాడు.
సుమ‌ను దేవసేన జైల్లో ఉంచి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు రాజమౌళి. ఆ తర్వాత తమ సినిమా ఆడియో ఫంక్షన్‌ ప్రోగ్రామ్‌కు డబ్బులు తీసుకోకుండా హోస్ట్‌గా వ్యవహారిస్తానని మాట ఇస్తేనే జైలు నుంచి విడుదల చేస్తానని కండీషన్‌ పెట్టాడు. అందుకు సుమ అంగీకరించడంతో వెంటనే ఆమెను విడుదల చేసి ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాడు.

లేబుళ్లు: , ,

బ‌న్నీ ప‌రువు తీసేసిన దువ్వాడ జ‌గ‌న్నాథం


స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే టీజర్ వచ్చేసింది. సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే టీజ‌ర్‌కు కూడా మంచి టాక్ వ‌స్తోంది. అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బ‌న్నీకి మ‌ధ్య వైరం దెబ్బ‌కు ఈ టీజ‌ర్ తొలి గంట‌..తొలి ఐదు గంట‌లు ఇలా గంట గంట‌కు ఓ చెత్త రికార్డు క్రియేట్ చేసేస్తోంది. ఈ టీజ‌ర్ రిలీజ్ అయిన తొలి గంట‌లోనే రికార్డు స్థాయిలో డిస్లయిక్స్ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
తొలి గంట‌కే 10 వేల డిజ్‌లైక్స్ వ‌చ్చాయి. ఇక ఐదు గంట‌ల‌కు 39000 లైక్స్ వస్తే.. 27000 డిస్లయిక్స్ వచ్చాయి. మొత్తంగా వచ్చిన రెండు ల‌క్ష‌ల వ్యూస్‌లో ఈ స్థాయిలో డిజ్‌లైక్స్ ఉండ‌డం టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు లేదు. అయితే ఈ డిజ్ లైక్స్ అన్నీ యాంటీ ఫ్యాన్స్ పనికట్టుకొని చేస్తున్నవని బ‌న్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
అటు ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా దువ్వాడ జ‌గ‌న్నాథం టీజ‌ర్‌కు డిజ్‌లైక్స్ కొట్టండి బ్ర‌ద‌ర్ అని ప‌నిగ‌ట్టుకుని సోష‌ల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక సినిమాలో బన్నీ చేసిన పాత్ర ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి కొందరు నచ్చక డిజ్ లైక్ చేస్తుంటే.. కొందరు మాత్రం చెప్పను బ్రదర్ అంటూ డిజ్ లైక్ ను కొట్టేస్తున్నారు. ఏదేమైనా ఓవ‌రాల్ టాక్ ప్రకారం ప‌వ‌న్ ఫ్యాన్స్ దెబ్బ‌కు బన్నీ డీజే టీజ‌ర్ తొలి రోజే చెత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది.

లేబుళ్లు: , ,

23, ఫిబ్రవరి 2017, గురువారం

టాప్-1లో జనతా గ్యారేజ్ ...చిరు ఎంఈకే షో రేటింగ్స్ షాకింగే


నాగార్జున హోస్ట్ గా ఏడాదిన్నర కిందట మొదలుపెట్టిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మరే కార్యక్రమానికి రాని స్థాయిలో అనూహ్యమైన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది ఈ కార్యక్రమం. ఐతే తొలి సీజన్ తో పోలిస్తే తర్వాతి రెండు సీజన్లలో రేటింగ్స్ తగ్గుతూ వెళ్లడంతో నాలుగో సీజన్ కు నాగ్ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చింది మాటీవీ యాజమాన్యం.

మళ్లీ టీఆర్పీ రేటింగ్స్ పుంజుకుంటాయని.. రికార్డులు బద్దలైపోతాయని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పాత రేటింగ్స్ బద్దలు కొట్టడం సంగతలా ఉంచితే.. ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ లిస్టులోనూ ‘ఎంఈకే’కు అగ్రస్థానం దక్కలేదు. అసలు టాప్-5లోనే ఎంఈకే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బార్క్ రేటింగ్స్ ప్రకారం గత వారం ‘జనతా గ్యారేజ్’ ప్రిమియర్ షో అగ్రస్థానంలో ఉంటే.. తర్వాతి నాలుగు స్థానాల్ని టీవీ సీరియల్స్ దక్కించుకున్నాయి.

‘ఖైదీ నెంబర్ 150’తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎంఈకే షోకు రెస్పాన్స్ మామూలుగా ఉండదనే అనుకున్నారు. పైగా ఆరంభంలోనే నాగార్జున అతిథిగా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాకపోవడం ఆశ్చర్యమే. ఈ వైఫల్యాన్ని చిరంజీవికి కట్టబెట్టేయలేం. నాగార్జున ఉండగానే షోకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు జనాలకు దీని మీద ఏమంత ఆసక్తి ఉండట్లేదని అర్థమవుతోంది. మెగాస్టార్ వచ్చిన ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు రేటింగ్స్ మరింత తగ్గే అవకాశమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో షో భవితవ్యంపై సందేహాలు నెలకొంటున్నాయి.

లేబుళ్లు: ,

22, ఫిబ్రవరి 2017, బుధవారం

NTR27 చరిత్రను తిరగరాసేలా ఉందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2017 జైలవకుష పై బోలెడు అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే…ఇంకా షూటింగ్ కూడా మొదలుకానీ ఈ సినిమాపై ఇండస్ట్రీలో రికార్డు స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

దాంతో ఇప్పటినుండే దిమ్మతిరిగే ఆఫర్స్ ఎన్టీఆర్27 కి వస్తున్నాయంటూ ఇండస్ట్రీలో వార్తలు శిఖారు చేస్తున్నాయి…ఆ వార్తల ప్రకారం సినిమాకు నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డు లెవల్ లో 25 కోట్ల రేటు దక్కినట్లు చెబుతున్నారు…

ఇది నిజమైతే స్టార్ హీరోల్లో 25 కోట్ల ప్రీ రిలీజ్ ని నైజాంలో సొంతం చేసుకున్న తొలి హీరో ఎన్టీఆర్ అవుతాడు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఆగస్ట్ లో రిలీజ్ కి సిద్ధం కానుందని సమాచారం…ఎన్టీఆర్ ఇంతకుముందు ఎన్నడు చేయని విధంగా ఇందులో మూడు పాత్రలతో భీభత్సం సృష్టించబోతున్నాడు.

లేబుళ్లు: , ,

21, ఫిబ్రవరి 2017, మంగళవారం

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ 28 ఫిక్స్‌


టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్ – నాన్న‌కుప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో కేరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే గ్యారేజ్ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల డైరెక్ట‌ర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సెప్టెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు.
అయితే పవన్‌తో త్రివిక్ర‌మ్ ఓ పొలిటిక‌ల్ బేస్‌డ్ స్టోరీతో సినిమా తెర‌కెక్కించేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తాడు. ఇక జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత స‌రైన ప్లానింగ్ లేక‌పోవ‌డంతో చాలా రోజుల పాటు ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు ప్లానింగ్‌తో ఉన్నాడు.
ప్ర‌స్తుతం బాబి డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా 27వ సినిమా కాగా…ఇక త‌న 28వ సినిమాను టాలీవుడ్ స్టార్ అండ్ మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడ‌ట‌. త‌న నెక్ట్స్ సినిమాను ఎన్టీఆర్ వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో చేయ‌డం దాదాపు ఖ‌రారైనట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వినాయ‌క్ ఎన్టీఆర్ సినిమా కోసం క‌థ‌ను డ‌వ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డికానున్నాయి.

లేబుళ్లు: , ,

ఊహించని విషయం – భావన ఘటన బ్యాక్ గ్రౌండ్ నిజాలు!


సంచలనం రేపిన మలయాళ ముద్దుగుమ్మ భావన సంఘటన వెనుక తన మాజీ కారు డ్రైవర్ సునీల్ కుమార్ అని భావించిన వారికి షాక్ ఇచ్చేలా లేటెస్ట్ న్యూస్ అందుతోంది. ఇప్పటివరకు మాజీ కారు డ్రైవర్ హస్తం అనుకుంటే, పోలీసుల విచారణలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉన్నారన్న విషయం బయటపడింది. శుక్రవారం రాత్రి భావనపై లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురిలో ఇద్దరు డ్రైవర్లు మినహా, మిగిలిన నలుగురు వ్యక్తులు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులేనని, వీరు పలు ప్రొడక్షన్ ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

భావన కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అడిషనల్ డీజీపీ బీ సంధ్య నేతృత్వంలో దినేంద్ర కస్యప్ ను విచారణ అధికారిగా నియమించగా, ఈ కేసులో మరో ఇద్దరిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఆరుగురికి ఈ కేసులో భాగం ఉందని, ఇప్పటివరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా ఈ విషయంలో మీడియాతో ఎక్కువగా మాట్లాడవద్దని భావనకు సలహా ఇచ్చామని, సాధ్యమైనంత త్వరగా నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

మళయాళం సినీ పరిశ్రమలోని నిందితులకు, బాధితురాలికి మధ్య గతంలో ఉన్న సంబంధాలు చెడిపోవడంతోనే వారు పగబట్టి ఈ కిడ్నాప్ ప్లాన్ చేశారని తెలిపారు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకోవడంతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే దీనిపై ప్రకటన చేసి, నిందితులను త్వరగా పట్టుకుంటామని చెప్పారు. సిఎం చెప్పిన కొద్ది గంటల్లోనే పోలీసులు మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి, మొత్తం ముగ్గురిని లోపల వేసి విచారణ జరుపుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తుంటే, ఇక తమకు రక్షణ ఎలా ఉంటుందని వాపోవడం ముద్దుగుమ్మల వంతవుతోంది.

లేబుళ్లు: ,

20, ఫిబ్రవరి 2017, సోమవారం

అమ్మతోడు… పక్కాగా… అంటూ ఎన్టీఆర్ పై కామెంట్స్..!


వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న జూనియర్ ఎన్టీఆర్, తన తాజా చిత్రాన్ని ‘పవర్, సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రాల ఫేం బాబీ దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన అయిన నాటి నుండి, ఈ కధపై రకరకాల వార్తలు ప్రచారమయ్యాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఖచ్చితంగా మరో కలికితురాయి అవుతుందని, మునుపెన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తారన్న టాక్ ఊపందుకుంది.

వీటికి మరింత బలాన్నిచ్చే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ సినిమా కధ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ తన అనుభూతులను వెల్లడించగా, తాజాగా ఈ సినిమాకు పాటలను అందించనున్న రామజోగయ్య శాస్త్రి ‘యంగ్ టైగర్’ అభిమానులకు ఓ తీపికబురును అందించారు. “మ్యాటర్ ఏంటంటే… ఈ రోజు దర్శకుడు బాబీ వచ్చి కలిసారు. మళ్ళీ మా జూనియర్ ఎన్టీఆర్ – దేవిశ్రీప్రసాద్ తో… అద్దీ ఆనందం… మాంచి పాటలు ఉంటాయి… పక్కాగా… అమ్మతోడు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

రామజోగయ్య ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే… ఈ సినిమా కధ ఏ రేంజ్ లో ఉందన్న విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తను రాసే అన్ని చిత్రాల గురించి పెద్దగా సోషల్ మీడియాలో స్పందించని శాస్త్రి గారు, ఈ సినిమాపై తన అభిప్రాయం చెప్పారంటే… కధలో విషయం ఓ రేంజ్ లో ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు. దీంతో రోజులు గడిచే కొద్ది, ఈ సినిమాపై ‘యంగ్ టైగర్’ అభిమానుల అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా హల్చల్ చేస్తున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో జూనియర్ పోషించబోయే మూడు పాత్రలలో ఒకటి క్రికెటర్ అన్న టాక్ హల్చల్ చేస్తోంది.

లేబుళ్లు: , ,

తెరపైకి హీరోయిన్ భావన ‘సీక్రెట్’ వీడియో!


భావన కారులో ప్రయాణిస్తుండగా, వెనుకగా వచ్చి కారును గుద్దిన తర్వాత భావన కారులోకి ఎక్కిన దుండగులు దాదాపుగా గంటన్నర్ర పాటు వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ భావనను లైంగికంగా వేధింపులకు గురి చేసారన్న వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సదరు దుండగులు పలు అసభ్యకరమైన ఫోటోలను, వీడియోలను చిత్రీకరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కేసులో సరికొత్త విషయం వెలుగు చూసింది.

కారులో ఎక్కిన దుండగులు అసలు భావనపై లైంగిక వేధింపులకు గురిచేయలేదని, కేవలం బ్లాక్ మెయిల్ మాత్రమే చేసారని తాజాగా వెలువడుతున్న అంశం. ఓ షూటింగ్ లో భాగంగా భావన డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న వీడియోను చూపిస్తూ… డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లుగా సరికొత్త విషయం బయటకు వచ్చింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన భావన పోలీసులకు ఫిర్యాదు చేసిందని, సరైన సమాచారం లభించక, లైంగిక వేధింపులకు దిగినట్లుగా మీడియా ప్రచారం చేసిందని చెప్తున్న విషయాలలో అసలు వాస్తవం ఏంటన్నది త్వరలో తెలియనుంది.

ఏది ఏమైనా రోజుకొక మలుపు తిరుగుతున్న ఈ కేసులో భావనకు అండగా మాలీవుడ్ సినీ ప్రముఖులంతా నిలిచారు. ఆ మాటకు వస్తే ఒక్క మలయాళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే కాదు, బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, రితేష్ దేశ్ ముఖ్, జెనిలియా, అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ తదితరులు కూడా స్పందించారు. అలాగే టాలీవుడ్ నుండి సమంత, రవితేజలు కూడా స్పందిస్తూ భావనకు బాసటగా నిలిచారు.

లేబుళ్లు: , ,

“పవన్ కళ్యాణ్” చుట్టూ “మాఫియా” ఉంది!


గతేడాది సమ్మర్లో విడుదలై, “సర్ధార్ గబ్బర్ సింగ్” బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. భారీ నష్టాలను తీసుకువచ్చిన ఈ సినిమా పంపిణీదారులలో, తాజాగా కృష్ణాజిల్లాకు పంపిణీ చేసిన సంపత్ కుమార్ బయటకు వచ్చి ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ను తానూ 4.50 లక్షల రూపాయలకు సినిమాను కొనుగోలు చేసానని, 4.38 లక్షలు కట్టాను గానీ, ఒక 3 శాతం మాత్రం అప్పుడున్న కొన్ని కారణాల వలన కట్టలేకపోయాయని అన్నారు.

ఇక, ఈ సినిమా మొత్తంగా 2.52 కోట్లు షేర్ వసూలు చేసిందని, 1.80 కోట్లు నష్టం వచ్చిందని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో నష్టాలు రావడంతో పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి, ఈ సినిమా నష్టపోయిన వారి కోసం మరో సినిమా చేస్తానని చెప్పి, ‘కాటమరాయుడు’ ప్రారంభించారని అన్నారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పారని, అలాగే ఈ సినిమా ప్రారంభమైన తర్వాత పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ గారిని కలిసినపుడు… ‘సినిమా స్టార్ట్ చేసాం కదా… రిలీజ్ కు ముందు ఒకసారి కలిసి అమౌంట్స్ మాట్లాడుకుందాం… కళ్యాణ్ గారి మీ కోసమే ఈ సినిమా స్టార్ట్ చేసారు’ అని తమతో చెప్పినట్లుగా తెలిపారు సంపత్.

అయితే జనవరి చివరి వారంలో వారికి అనుకూలంగా ఉండే వారికి ఇచ్చేసారని, తనకు మాత్రం ‘మీరు మా సినిమా కొనలేదు, ఈరోస్ దగ్గర కొన్నారు, వారిని అడగండి అని చెప్తున్నారని,’ నిజానికి ఆ రోజు నిర్మాత శరత్ మరార్ ఆఫీసులో వారు చెప్తేనే ఈరోస్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అంతేతప్ప తమకు అసలు ఈరోస్ అంటే ఎవరో తెలియదని అన్నారు. తనకు దాదాపుగా 2 కోట్ల రూపాయలు నష్టం రాగా, నైజాం పంపిణీదారునికి 8 కోట్ల మేర నష్టం వచ్చిందని, మిగతా ఏరియాలైన గుంటూరు, ఈస్ట్, వెస్ట్, సీడెడ్ లలో పెద్దగా నష్టం రాలేదని, వారికి గ్యారెంటీలు ఉన్నాయని అన్నారు.

కృష్ణా, నైజాం, నెల్లూరు ఏరియాలలో మినహా మిగతా ప్రాంతాలలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ డిస్ట్రిబ్యూటర్లకే సినిమాను ఇచ్చారని, తాము ఫోన్లు చేస్తుంటే కళ్యాణ్ గారి మేనేజర్ శ్రీనివాస్ గారు గానీ, నిర్మాత శరత్ మరార్ గానీ సమాధానాలు ఇవ్వడం లేదని, మెస్సేజ్ లు చేస్తున్నా స్పందన లేదని, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామంటే, ఆయన చుట్టూ ఉన్న మాఫియా కలవనివ్వడం లేదని, సినిమా ఆఫీస్ కు ఆయన రావడం లేదని, పార్టీ ఆఫీస్ కు వెళ్తే ఇక్కడ పార్టీ విషయాలు తప్ప ఏమీ చర్చించరని చెప్తున్నారని, ఈ విషయం కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడానికే తానూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసానని తెలిపారు.

ఈ విషయం మా దృష్టికి తీసుకురాగా, వారు మేనేజర్ శ్రీనివాస్ తో మాట్లాడగా, ‘నా అంతు చూస్తానని చెప్తూ అసభ్యకరంగా మాట్లాడారని, ఆవేదనతో తాము వెళ్తే మా అంతు చూస్తామంటున్నారని, అదే జరిగితే అభిమానులకు అండగా ఉండే పవన్ కళ్యాణ్ అస్సలు ఊరుకోరని, ఆయనే చూసుకుంటారని’ అన్నారు. మీరు నష్టాల్లో ఉన్నారు, మీరు డబ్బులు కట్టలేరు అనే కారణాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని, నష్టం వచ్చింది ఎవరి వలనో ఆలోచించాలని, ఒక డిస్ట్రిబ్యూటర్ కు 2 కోట్ల మేర నష్టం అంటే అది ఆత్మహత్యకు దారి తీసే విషయమని తన ఆవేదనను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసారు.

లేబుళ్లు: ,

19, ఫిబ్రవరి 2017, ఆదివారం

ఎన్టీఆర్ ను టార్గెట్ చేసుకున్నా నేషనల్ మీడియా..


టైగర్ టైగర్ టైగర్ ఎవరు ఈ టైగర్ అంటూ ప్రస్తుతం సౌత్ మొత్తంతో పాటు నార్త్ లో ఉన్నవాళ్ళు కూడా యంగ్ టైగర్ గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. దీనికంతటికీ కారణ౦ జనతాగ్యారేజ్ సినిమా సృష్టించినా కలెక్షన్స్ సునామీ,ట్వీటర్లో గత సంవత్సరం ట్రెండింగ్ గా నిలవడం,ఇక ఇండియా లో టాప్ డ్యాన్సర్ గా నిలవడం అని చెప్పొచ్చు. ఇప్పుడు చేయబోతున్న 27 సినిమాలో నటిస్తున్న హేమాహేమీలు-టాప్ క్లాస్ టెక్నీషియన్స్ కావొచ్చు ఈ టైగర్ ఎవరు అంటూ తెగ ఆరాలు తీయడం మొదలుపెట్టారు అందరూ.

జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ సక్సెస్ తర్వాత ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో హాలివుడ్ అండ్ బాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై టోటల్ బాలీవుడ్ నుండి సౌత్ వరకు అన్ని ఇండస్ట్రీలు షాక్ అవుతున్నాయి.

అసలు ఆ ప్రాజెక్ట్ లో ఏముంది ఎందుకు ఇంత క్రేజ్ అంటూ ఈ టైగర్ గురించి ఆరాలు తీస్తున్నారట బాలీవుడ్ లో ఈ సినిమాకు క్రేజ్ కూడా మొదలు అవ్వడంతో కచ్చితంగా అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక కోలివుడ్ లోనూ క్రేజ్ ఉండటంతో అక్కడ నుండి కూడా సూపర్ ఆఫర్స్ వస్తున్నాయి. అవి సినిమా తెలుగు వెర్షన్ లోనే అక్కడ సంచలనం సృష్టించడంతో ఇక మీదట ఎన్టీఆర్ చేసే సినిమాలు ఒకేసారి డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇలా అన్ని చోట్ల .టైగర్ టైగర్ అంటూ ఎన్టీఆర్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు యూ  ట్యూబ్ లో కూడా దమ్ము సినిమా కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఇక అలాగే సెట్స్ మ్యాక్స్ లో కూడా ఎన్టీఆర్ సినిమా మంచి టీఆర్ పి రేటింగ్ ఉంది..అందుకే నేషనల్ మీడియా కూడా తారక్ తో ఒక ఇంటర్వూ చేయాలనుకుంటోందట..ఎన్టీఆర్ ఈ సంవత్సరం గూగుల్ ఎక్కవ సెర్చ్ లో నెం 1 నిలిచినా సంగతీ తెలిసిందే. ఇక అలాగే నేషనల్ లెవల్లో ట్వీటర్లో 20 వ స్ధానం లో ఉన్నా సంగతీ తెలిసిందే..


లేబుళ్లు: , ,

” నేను లోక‌ల్ ” 14 డేస్ క‌లెక్ష‌న్స్‌..ఆల్ టైం నాని కేరీర్ రికార్డు


యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోక‌ల్ మూడో వారంలో కూడా జోరు చూపిస్తోంది. ఈ సినిమా రెండో వారంలో 7 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ వ‌సూలు చేసిందంటే నాని క్రేజ్ అర్థ‌మ‌వుతోంది. మొత్తం రెండు వారాలకు కలిపి నేను లోకల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 29.46 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఇప్పటికే నాని కెరీర్ బెస్ట్ అయిన భలేభలే మగాడివోయ్ ను దాటేసిన నేను లోకల్ మూడో వారంలో కూడా ఎక్కువ థియేట‌ర్ల‌లో కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా 14 డేస్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 9.23 కోట్లు
సీడెడ్ – 2.7 కోట్లు
నెల్లూరు – 68 లక్షలు
గుంటూరు – 1.69 కోట్లు
కృష్ణా – 1.72 కోట్లు
వెస్ట్ – 1.28 కోట్లు
ఈస్ట్ – 2.03 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.37 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ = 22.7 కోట్లు
————————————
కర్నాటక – 2.05 కోట్లు
యూఎస్ఏ – 3.9 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 80 ల‌క్ష‌లు
——————————————
14 డేస్ వ‌ర‌ల్డ్ షేర్ = 29.46 కోట్లు
——————————————-

లేబుళ్లు: , ,

” ఘాజీ ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌




ద‌గ్గుపాటి వారి వార‌సుడు ద‌గ్గుబాటి రానా హీరోగా న‌టించిన ఘాజీ సినిమాకు మాంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఒక‌వైపు ఓంన‌మో వెంక‌టేశాయ‌, మ‌రోవైపు సింగం-3 సినిమాలున్నా ఘాజీ ఓపెనింగ్స్ పై ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాయి. సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బ‌జ్ ఉండ‌డంతో పాటు ప్రీమియ‌ర్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఘాజీ మ‌రి ఎక్కువ కాక‌పోయినా ఫ‌స్ట్ డే ఓ మోస్త‌రు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.
సోలోగా ఇవి రానా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌. ఘాజీ నైజాంలో తొలి రోజు రూ.50ల‌క్ష‌ల షేర్ ను సాధించింది. బాహుబ‌లి త‌ర్వాత నైజాంలో రానాకు ఇదే అతిపెద్ద ఓపెనింగ్. నైజాం త‌ర్వాత ఉత్త‌రాంధ్ర‌లో అత్య‌ధికంగా తొలిరోజు రూ. 18 ల‌క్ష‌ల షేర్ వ‌సూలు చేసింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం క‌లిపి తొలి రోజు రూ.1.21 కోట్ల‌ను వ‌సూలు చేసింది.
నైజాం – 50 ల‌క్ష‌లు
సీడెడ్ – 10 ల‌క్ష‌లు
నెల్లూరు – 4.5 ల‌క్ష‌లు
గుంటూరు – 12.75 ల‌క్ష‌లు
కృష్ణ – 13.26 ల‌క్ష‌లు
వెస్ట్ – 5.05 ల‌క్ష‌లు
ఈస్ట్ – 8 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర – 18 ల‌క్ష‌లు
—————————————
ఏపీ+తెలంగాణ = 1.12 కోట్లు
—————————————-
సినిమాకు రెండో రోజు నుంచి క‌లెక్ష‌న్లు మ‌రింత బాగుండడం, ఈ శని, ఆది వారాల్లో అన్ని అర్బన్ సెంటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు ఫుల్ అయిపోయాయి. మల్టీ ఫ్లెక్స్ లు షోలు పెంచాయి. అందువల్ల శని, ఆదివారాల కలెక్షన్లు బాగా వుండే అవకాశం వుంది. ఇక ఫ‌స్ట్ డే త‌మిళ్‌, హిందీ క‌లెక్ష‌న్ల వివ‌రాలు అందాల్సి ఉంది.

లేబుళ్లు: ,

లీక్ అయిన బన్నీ బెదిరింపు డైలాగులు!


‘ఫస్ట్ లుక్’ ముందు వరకు అస్సలు ఏ మాత్రం లీక్ కాకుండా జాగ్రత్తపడిన “దువ్వాడ జగన్నాధమ్” చిత్ర యూనిట్ కు షాక్ నిచ్చే విధంగా, వరుసగా ఫోటోలు, వీడియోలు లీక్ బారిన పడుతున్నాయి. ‘ఫస్ట్ లుక్’కు ముందు బ్రాహ్మణుని గెటప్ లో ఉన్న బన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో లీకై, హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ లుక్ విడుదల తర్వాత తాజాగా ఓ చిన్నపాటి వీడియో విడుదలై సందడి చేస్తోంది.

పంచెకట్టుతో ఉన్న అల్లు అర్జున్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియోలో బన్నీ డైలాగ్స్ పెద్దగా వినపడకపోయినా… బాగా కీన్ గా విన్న వారికి ‘ఆ మాటల్ని మీ బాబాయిలకు చెప్పానంటే తక్షణం మీ పెళ్లి ఆగిపోతుంది జాగ్రత్త’ అంటూ ఓ జంటకు బెదిరిస్తున్నట్లుగా ఉంది. ఫస్ట్ వీడియో ఇలా లీక్ కాగా, చిత్ర యూనిట్ నుండి అధికారికంగా మాత్రం శివరాత్రి రోజున ఫస్ట్ టీజర్ అభిమానులకు కనువిందు చేయనుంది.

లేబుళ్లు: ,

బాయ్ ఫ్రెండ్ గుట్టు విప్పేసిన శృతి


దక్షిణాది సోయగం శృతి హాసన్.. ఇప్పుడు ఫుల్ బిజీ అనే విషయం తెలిసిందే. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో సినిమాలు చేసేస్తూ.. బ్రాండ్ అండార్స్ మెంట్ ను పట్టేస్తూ తెగ బిజీగా ఉంటుంది ఈ భామ. బాలీవుడ్ లో అంటూ అడుగు పెట్టాక అడుగడుగునా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అలాగే శృతి బాయ్ ఫ్రెండ్స్ అంటూ అక్కడ పెద్ద లిస్టే వినిపిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ తో ఎయిర్ పోర్టులో కనిపించింది. ఇతను లండన్ బేస్డ్ యాక్టర్ కావడం.. ప్రొఫెషన్స్ కలవడంతో ఈ మైకేల్ కోర్సలేను శృతి హాసన్ లవర్ అంటూ అన్వయించేశారు మీడియా జనాలు. సహజంగా ఇలాంటి రూమర్స్ పై శృతి స్పందించదు కానీ.. ఈసారి మాత్రం ఎందుకనో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మైకేల్ కు తనకు మధ్య ఏమీ లేదని మైకు పట్టుకుని మరీ అరిచి చెప్పేసింది.

జస్ట్ తామిద్దం మంచి ఫ్రెండ్స్ మాత్రమే ఓ పెద్ద క్లారిటీ కూడా ఇచ్చిన శృతి.. తనకు ఎవరితోనూ రిలేషన్స్ లేవని డీటైల్డ్ గా వివరించింది. దీంతో మైకేల్ తో ఈమె చెట్టాపట్టాల సంగతి అంతా జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. వచ్చే నెలలో రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడుతో.. తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది శృతి హాసన్.

లేబుళ్లు: ,

18, ఫిబ్రవరి 2017, శనివారం

యంగ్ టైగర్ రెడీ....యాక్టింగ్ మెరుపులే


యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత కెమేరా ముందుకు అడుగుపెట్టే ముహూర్తం సెట్ చేసుకున్నాడు. మూడూ పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని కెరీర్‌లోనే ఫస్ట్ టైం ప్లే చేస్తున్న ఎన్టీఆర్……ఆ మూడు క్యారెక్టర్స్‌లోనూ మూడు వేరియేషన్స్‌తో కంప్లీట్ ఛేంజ్ చూపించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు ఎన్టీఆర్. యాక్టింగ్ పరంగా కూడా ది బెస్ట్ అనిపించుకోవాలని ఆలోచిస్తాడు ఈ స్టార్ హీరో. ఆ విషయాన్ని ఇప్పుడు చేస్తున్న జై లవకుశతో మరోసారి నిరూపిస్తాడని చెప్తున్నారు.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. అయితే ఎన్టీఆర్ మాత్రం నెక్ట్స్ మంత్ 1 నుంచి షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ లోగా ఇతర తారాగణంపైన ఉన్న సీన్స్‌ని షూట్ చేస్తారట. ఎన్టీఆర్ సీన్స్ విషయంలో కూడా ముందుగా ఫుల్ లెంగ్త్ కామెడీ పండించే క్యారెక్టర్‌తో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. సో……త్రిమూర్తులుగా ఎన్టీఆర్ యాక్టింగ్ విశ్వరూపాన్ని బిగ్ స్క్రీన్ పైన చూసే టైం దగ్గర పడుతూ ఉందన్నమాట……..లెట్స్ వెయిట్…….విత్ లవ్…..

లేబుళ్లు: , , , ,

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్విస్ట్


వరుస హిట్లతో మంచి జోష్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ జై – ల‌వ‌-కుశ అనే మూడు రోల్స్‌లో న‌టించ‌నున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్విస్ట్ ఇస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న మూడు పాత్ర‌ల‌కు ముగ్గురు ముద్దుగుమ్మ‌లు కూడా సెల‌క్ట్ అయ్యారు. ఈ మూడు రోల్స్ ప‌క్క‌న రాశీఖ‌న్నా – త‌మ‌న్నా -కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇచ్చే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే… ఇప్పటిదాకా తారక్.. ఏ సినిమాలో కూడా మీసం లేకుండా కనిపించలేదు.
కానీ, త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఓ పాత్ర కోసం.. మీసం లేకుండా కనిపిస్తాడ. సినిమాలో ఎన్టీఆర్‌ను మీసం లేకుండా చూపించాలని దర్శకుడు ఓ పాత్రను సృష్టించాడట. మీసం లేకుండా కొత్త గెట‌ప్‌లో ఎన్టీఆర్ అభిమానులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

లేబుళ్లు: , , ,

16, ఫిబ్రవరి 2017, గురువారం

ఖైదీ నెంబ‌ర్ 150పై అల్లు అర‌వింద్ బోగ‌స్ లెక్క‌లు


మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామి క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి క‌లెక్ష‌న్ల విష‌యంలో మెగా క్యాంప్ చాలా శ్ర‌ద్ధ తీసుకుంది. తొలి రోజు నుంచే చిరు బావ‌మ‌రిది, అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ ప్రెస్‌మీట్లు మీద ప్రెస్‌మీట్లు పెట్టి క‌లెక్ష‌న్ల గురించి చెప్పారు.
ఖైదీ నెంబ‌ర్ 150 రూ.100 క‌లెక్ష‌న్లు సాధించింద‌ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. అయితే ఈ చిత్ర నిర్మాత రాంచ‌ర‌ణ్ మాత్రం ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో కేవ‌లం రూ.75 కోట్ల కలెక్షన్లను సాధించినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించిన రిటర్న్స్‌లో చెర్రీ పేర్కొన్నాడట. చిరంజీవి పారితోషికం రూ.20 కోట్లు, డైరెక్టర్ వినాయక్ పారితోషికం రూ.10 కోట్లు సహా.. సినిమాకు రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని, రూ.15 కోట్లను లాభాలుగా ఆర్జించామని ఐటీ అధికారులకు చెర్రీ వెల్లడించాడని టాక్.
అల్లు అర‌వింద్‌తో పాటు డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ఇద్ద‌రూ కూడా సినిమా రూ.100 కోట్ల క‌లెక్షన్లు సాధించిన‌ట్టు ప్రెస్‌మీట్ల మీద ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ చెప్పారు. మొత్తంగా ఫుల్ రన్‌లో రూ.105 కోట్లను సాధించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు చెర్రీ అల్లు అర‌వింద్ లెక్క‌ల‌కు భిన్నంగా చెప్ప‌డంతో అల్లు అర‌వింద్ లెక్క‌ల‌న్నీ బోగ‌స్సేనా ? అన్న డౌట్లు వ‌స్తున్నాయి. ఖైదీకి పోటీగా శాత‌క‌ర్ణి సినిమా ఉండ‌డంతో ఖైదీకి బాగా హైప్ తీసుకొచ్చేందుకే అర‌వింద్ ఈ రాంగ్ ఫిగ‌ర్స్ చూపించారా ? అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి అస‌లు నిజాలేంటో చెర్రీ, అర‌వింద్‌కే తెలియాలి.

లేబుళ్లు: , ,

జనతాగ్యారేజ్ మార్కెట్ వాల్యూ 300 కోట్లు

సౌత్ సినిమాలంటే మనకన్నా నార్త్ వాళ్లకు ఎక్కువ మోజు….ఇక్కడ ఏ సినిమా అయినా హిట్ అయితే పాపం వెంటనే అక్కడ నుండి రీమేక్ రాజులు ఆ సినిమా హక్కుల కోసం కొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా ఈ కొట్టుకోవడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ విషయంలోను జరుగుతుంది.

ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ టోటల్ గా 85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి రచ్చ రచ్చ చేసింది. కాగా ఈ సినిమా కనుక బాలీవుడ్ లో రీమేక్ చేస్తే కచ్చితంగా 300 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందని అక్కడి స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ అంటున్నాడట.

తన ప్రొడక్షన్ లో ఈ సినిమాను హృతిక్ రోషన్-అమితాబ్ ల కాంబోలో రీమేక్ చేయాలనే ఆలోచన కరణ్ జోహార్ కి ఉన్నట్లు ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ మధ్య సరైన హిట్స్ లేక వెనకపడ్డ హృతిక్ కి ఈ స్టోరీ పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని కరణ్ అంటున్నట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

లేబుళ్లు: ,

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

ఎన్టీఆర్ రికార్డును అందుకోలేకపోయిన చిరంజీవి

మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్150 టాలీవుడ్ హిస్టరీలో ఏ రికార్డును వదిలిపెట్టకుండా అన్ని రికార్డులను వేటాడి వెంటాడి బ్రేక్ చేస్తూ నయా హిస్టరీ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది…ఇంత క్రేజ్ లో కూడా ఓ రికార్డును అందుకోలేకపోయింది ఖైదీ నంబర్150.

అదేంటంటే పక్క రాష్ట్రం నైజాంలో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ షేర్ రికార్డును యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో 19.65 కోట్లతో నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పాడు…కాగా ఖైదీ ఇప్పటివరకు అక్కడ కేవలం 16.40 కోట్ల దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే జనతాగ్యారేజ్ టికెట్ రేటు 100 నే పెట్టగా ఖైదీకి 150 నుండి టికెట్ రేటు స్టార్ట్ అయింది…అది 250 కొన్ని చోట్ల 300 ని కూడా పాకింది.

కొత్త సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేపద్యంలో నైజాంలో జనతాగ్యారేజ్ ని ఇంకా క్రాస్ చేయలేదు….కొన్ని లక్షల తేడానే ఉండటంతో అది సాధ్యం అవుతుందా లేదా అన్న ఉత్కంట కంటిన్యూ అవుతుంది.

లేబుళ్లు: ,

ఇంట‌ర్నెట్‌లో నంద‌మూరి వార‌సుడు హ‌ల్‌చ‌ల్‌…ఎవ‌రో తెలుసా ?


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా లాంచ్ అయ్యింది. ప‌వ‌ర్‌-స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర‌(బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో న‌టిస్తాడ‌ని…మూడు పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమాకు జై – ల‌వ – కుశ అనే టైటిల్ పెడుతున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.
ఇక శుక్ర‌వారం ప్రారంభ‌మైన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ స్వ‌యంగా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్‌కు ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తితో పాటు తండ్రి హ‌రికృష్ణ‌తో పాటు మ‌రో స్పెష‌ల్ గెస్ట్ కూడా వ‌చ్చారు.
ఆ గెస్ట్ ఎవ‌రో కాదు..నంద‌మూరి వార‌సుడు, ఎన్టీఆర్ త‌న‌యుడు అభ‌య్‌రామ్‌. తన ముద్దు ముద్దు మాటలతో తన తల్లిని ఆటపట్టిస్తూ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నందమూరి బుల్లి హీరో అభయ్ రామ్ నిలిచాడు. త‌న కుమారుడిని పబ్లిక్ ప్లేస్‌ల‌కు తీసుకురాని ఎన్టీఆర్ ఈ సినిమా ఓపెనింగ్‌కు తీసుకువ‌చ్చాడు.
ఇక ఈ సినిమా ఓపెనింగ్‌లో అభ‌య్‌రామ్ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కొబ్బ‌రికాయ కొట్టేందుకు ట్రై చేయ‌గా… తాత హ‌రికృష్ణ వ‌చ్చి అభ‌య్‌కు సాయం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది.

లేబుళ్లు:

9, ఫిబ్రవరి 2017, గురువారం

ఎన్టీఆర్ జైల‌వ‌కుశ వ‌సూళ్ల టార్గెట్… ఫీజులు ఎగ‌రాల్సిందే


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చాలా త‌క్కువ వ‌య‌స్సులోనే స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ కేరీర్ ప‌రంగా ప్ర‌స్తుతం తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ – నాన్న‌కుప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్‌లాంటి హిట్ల‌తో ఉన్న ఎన్టీఆర్ బాబి డైరెక్ష‌న్‌లో త‌న కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓ స‌రికొత్త టార్గెట్‌పై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ చివ‌రి చిత్రం జనతా గ్యారేజ్ 135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. ఇక బాబి డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ న‌టించే సినిమాలో ఎన్టీఆర్ జై-ల‌వ‌-కుశ అనే మూడు క్యారెక్ట‌ర్ల‌లో న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
ఇక ఈ సినిమా కోసం ప్ర‌ముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ సీకే.ముర‌ళీధ‌ర‌న్‌తో పాటు హాలీవుడ్‌లో 30 ఏళ్ల ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న మేక‌ప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్‌ను కూడా తీసుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ తెలుగు, ఓవ‌ర్సీస్‌, త‌మిళ్‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో మొత్తం రూ.200 కోట్ల వ‌సూళ్ల‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా కొత్త జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.
గ్యారేజ్‌తో మ‌ళ‌యాళ మార్కెట్‌పై క‌న్నేసిన ఎన్టీఆర్ ఇప్పుడు త‌మిళ్‌లో కూడా భారీ వ‌సూళ్లు సాధించేందుకు బాలీవుడ్‌, హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌తో ఈ సినిమాకు వ‌ర్క్ చేయిస్తున్నాడ‌ట‌. సినిమా స‌బ్జెక్ట్ అన్ని భాష‌ల్లోను క‌నెక్ట్ అయ్యేది కావ‌డంతో సౌత్‌లోని అన్ని భాష‌ల్లోను ఈ సినిమా ఒకేసారి గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

లేబుళ్లు:

ఛాన్స్ తీసుకోవడం లేదు… హ్యాట్రిక్ కోసం యంగ్ టైగర్..!


మణిశర్మ వదిలేసిన స్థానాన్ని విజయవంతంగా ఒడిసి పట్టుకోవడంలో దేవిశ్రీప్రసాద్ సక్సెస్ సాధించారు. అప్పటినుండి ప్రతిష్టాత్మక సినిమాలను దేవిశ్రీనే ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నారు. దేవికి కుదరని పక్షంలోనే అలాంటి అవకాశాలు మరో సంగీత దర్శకుడికి చేరుతున్నాయి గానీ, దర్శక నిర్మాతల పరంగా గానీ, హీరోల పరంగా గానీ, అందరికీ దేవి దగ్గరయ్యాడు. అలాంటి దేవి మరోసారి తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కొట్టిన దేవి, హ్యాట్రిక్ కోసం మళ్ళీ వీరిద్దరూ జోడి కడుతున్నారు. బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న “జై లవకుశ” సినిమా కోసం అనేక మంది సంగీత దర్శకులను పరిశీలించిన మీదట, చివరికి దేవినే ఆ అవకాశం వరించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.

లేబుళ్లు:

అంజలిపై ప్రేమని ఆ హీరో ఎలా చూపెట్టాడో తెలుసా?


తెలుగ‌మ్మాయి అయినా అజంలి తెలుగులో కంటే త‌మిళ్‌లోనే ఎక్కువుగా పాపుల‌ర్ అయ్యింది. ఏ.ఆర్.మురుగదాస్ నిర్మించిన ‘జర్నీ’ అనే సినిమాతో అంజలి, జై జోడీ ఏ స్థాయిలో పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా త‌ర్వాత చాలా సినిమాల్లో న‌టించిన ఈ జంట ప్రేమ‌లో ఉన్నారని…వీరు త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటున్నారని చాలాసార్లు వార్త‌లు వ‌చ్చాయి.
అయితే ఈ వార్త‌ల‌పై అటు జై, ఇటు అంజ‌లి ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. అయితే ఇప్పుడు జైతో అంజ‌లి అడ్డంగా బుక్ అయిపోయింది. వీరిద్ద‌రూ ప్రేమలో ఉన్నారన్నది నిజమేనని, ఇద్దరూ కలిసే ఉంటున్నారన్న వార్త‌ల‌కు జై వేసిన ట్వీట్ చాలా బ‌లం ఇస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం ఓ దోశ వేసి, ‘మీరూ మీకిష్టమైన వారికోసం ఒక దోశ చేయండి’ అంటూ దోశ చాలెంజ్ మొదలుపెట్టారు. ఇక హీరో జై కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొని, ఒక దేశ వేసి, హీరోయిన్ అంజలికి ఇచ్చారు. జై ఇలా దోశ వేశాడో లేదో ఆ వెంట‌నే అంజ‌లికి అందించే ఫొటో కూడా పోస్ట్ చేశాడు.
దీంతో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉంటున్నార‌న్న వార్త‌ల‌తో పాటు వీరు క‌లిసే ఉంటున్నార‌న్న గుస‌గుస‌లు స్టార్ట్ అయ్యాయి. కోలీవుడ్ మీడియా కూడా వీరు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు ప్ర‌చురిస్తోంది.

లేబుళ్లు:

8, ఫిబ్రవరి 2017, బుధవారం

తారక్ కొత్త సినిమాకు అదరగొట్టనున్న ట్యూన్స్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టేశాడు. ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకొని వస్తున్న ఎన్టీఆర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు నామమాత్రంగా పని చేసిన డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను తారక్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాకోసం తారక్ తన లుక్‌ను టోటల్‌గా మార్చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ విషయంపై టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. ఈ వార్త వింటే.. తారక్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం చాలా హ్యీపీగా ఫీలవుతారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో తెలియాలంటే.. అసలు విషయంలోకి వెళ్లాల్సిందే!
తమిళ ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగి.. ధనుష్ ‘3’ సినిమాలోని ‘‘వై దిస్ కొలవెరి..’ అనే పాటతో యావత్ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌ కోసం తెలుగులో తన మొదటి సినిమాను చేయనున్న అనిరుధ్, ఇప్పుడు తన రెండో సినిమాగా తారక్ బాబీ సినిమా చేయనున్నాడు. ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయాల్సి ఉంది.
అయితే అనిరుధ్ ఈ చిత్రానికి ఫిక్సయ్యాడంటూ టాలీవుడ్‌లో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. తారక్ సినిమాకు అనిరుధ్ అందించే ట్యూన్స్ యూత్‌ను కట్టిపడిస్తాయనడం లో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.


‘కాటమరాయుడు టైటిల్ సాంగ్’ లీక్.. !!


‘కాటమరాయుడు’ సత్తా ఏంటో టీజర్ తో తెలిసొచ్చింది. ఇటీవలే రిలీజైన పవన్ ‘కాటమరాయుడు’ టీజర్ రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకొంది. అన్నయ్య ‘ఖైదీ నెం.150’ రికార్డ్ ని బద్దలు కొట్టేసింది. దీంతో.. కాటమరాయుడు అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడంతా ఉగాధికి రానున్న కాటమరాయుడు కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే, ఇప్పుడు ‘కాటమరాయుడు’ టైటిల్ సాంగ్ అంటూ.. ఓ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పవన్ వ్యక్తిత్వం ప్రతిభింబించేలా
వెస్ట్రన్ బీట్స్ తో సాంగ్ ని రూపొందించారు. అసలు ఇది సినిమాలోనిదేనా.. ? లేక పవన్ అభిమానుల క్రియేటివిటీనా.. ?? అన్న విషయంలో క్లారిటీ లేదు. బహుశా.. ఇది పవన్ అభిమానుల పైత్యం అయివుంటుందని చెప్పుకొంటున్నారు.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాటమరాయుడు’లో పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. శరత్ మరార్ నిర్మాత. ఈ చిత్రం ఉగాధి కానుకగా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేబుళ్లు:

మహేష్ కొత్త 'ఫేక్' పోస్టర్ బాగుందే


మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ లో అయితే చాలానే ఆశలు ఉన్నాయి. గతేడాది బ్రహ్మోత్సవంతో మహేష్ నిరుత్సాహపరచిన తర్వాత.. మురుగదాస్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో చేస్తున్న మూవీ కావడం ఒక కారణం అయితే.. ఇది కంప్లీట్ యాక్షన్ మూవీ అని తెలిసిపోవడం మరో రీజన్ గా చెప్పచ్చు.

అయితే.. మహేష్-మురుగ సినిమాకి ఇంకా ఫస్ట్ లుక్ కూడా ఇవ్వకపోవడం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. సమ్మర్ తర్వాత రిలీజ్ అంటున్నా.. ఇప్పటివరకూ టైటిల్ కానీ.. పోస్టర్ కానీ బైటపెట్టలేదు. దీంతో మహేష్ ఇలా ఉంటాడని ఊహించుకుంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ డిజైన్ అయిపోతున్నాయి. తాజాగా మహేష్ 23 అంటూ ఇలాంటిదే ఓ పోస్టర్ నెట్ లో హల్ చల్ చేసింది. మహేష్ గాల్లో ఎగురుతున్నట్లుగా ఉండే ఈ పోజ్ చూసి చాలామంది అభిమానులు తెగ ఉత్సాహపడ్డారు.

కానీ ఇది 2014లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ బ్రిక్ మాన్షన్స్ ను కాపీ చేశారంతే. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీగా తెరకెక్కిన ఆ మూవీలో.. డేవిడ్ బెల్లె జంపిగ్ సీన్ కు.. మహేష్ ఫేస్ ను మార్ఫింగ్ చేశారు. ఈ విషయం తెలిశాక మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డా.. ఈ రేంజ్ కి తగ్గకుండా తమ హీరో సినిమా ఉంటుందని ఆశలు పెట్టేసుకుంటున్నారు.

లేబుళ్లు:

7, ఫిబ్రవరి 2017, మంగళవారం

యంగ్ టైగర్ సునామీకి సిద్ధం కండి

టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యంత ఫాస్ట్ గా 25 సినిమాలు పూర్తి చేసిన హీరోగా రికార్డు సొంతం చేసుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. కెరీర్ ని మిగిలిన హీరోలతో పోల్చితే కొద్దిగా ఆలస్యంగా మొదలుపెట్టినా వాళ్ళ కన్నా ముందే ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ మూడు వరుస హిట్ల తర్వాత ఎవ్వరూ ఊహించని స్పీడ్ తో వరుసగా క్రేజీ కాంబినేషన్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నాడు.

కాగా 2017 లో 2 సినిమాలను మొదలు పెట్టబోతున్న యంగ్ టైగర్ 2018 లో మూడు సినిమాలను మొదలు పెట్టబోతున్నాడు..బాబీ, త్రివిక్రమ్, విక్రమ్ కుమార్, కొరటాల శివ తర్వాత జక్కన్న సినిమాలతో టాలీవుడ్ లో సునామీ సృష్టించడానికి పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకున్నాడు యంగ్ టైగర్.

లేబుళ్లు:

6, ఫిబ్రవరి 2017, సోమవారం

ఏంటి ఈ హీరోయిజం… ప్రేక్షకులు ఎన్నాళ్ళు భరించాలి..?


మన తెలుగు సినిమాలలో ‘హీరోయిజం’ చూస్తుంటే జుగుప్స కలుగక మానదు. ఇప్పటికే అభిమానులు ‘దైవం’గా నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటే, ఆ అంచనాలను రీచ్ అయ్యేందుకు ఈ హీరోలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. మన తెలుగు సినిమా హీరోలు కొడితే గోడలు బద్దలైపోతాయి.., పిల్లర్లు విరిగిపోతాయి.., ఇనుప చువ్వలు వొంగిపోతాయి… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మన తెలుగు సినిమా హీరో చేయని పనంటూ ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తాజాగా విడుదలైన “కాటమరాయుడు” సినిమాలో చూపించిన ‘హీరోయిజం’ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. రైలులో ఉన్న వ్యక్తిని పవన్ కొడితే డోర్ తో సహా ఊడిపడడం చూస్తే… బాబోయ్… ఎన్నాళ్ళు ఈ బీభత్సకరమైన దృశ్యాలు చూడాలి అన్న అనుభూతి కలుగక మానదు. అభిమానులకు తమ అభిమాన హీరో ఏం చేసినా బాగానే ఉంటుంది గానీ, సాధారణ ప్రేక్షకులు ఇలాంటి ‘ఓవర్ డోస్’ యాక్షన్ సీన్లను చూస్తే చీదరించుకుంటున్నారన్న సంగతిని సదరు హీరోలు, దర్శకులు, ఫైట్ మాస్టర్లు గుర్తించలేకపోవడమే మరీ విడ్డూరం.

ఇందుకు ‘కాటమరాయుడు’లో చూపించిన షాట్లు ఒక్కటే పరిమితం కాదు. టాలీవుడ్ లో ప్రస్తుతం చలామణి అవుతోన్న చిన్న, పెద్ద హీరోలంతా ఇలాంటి అద్భుతమైన షాట్లలో నటించినవారే. ఒక హీరో తొడకొడితే ఏకంగా ట్రైన్ వెనక్కి పోతే, మరో హీరో రెండు ట్రైన్ల మధ్య నుండి జంప్ చేస్తాడు. ఇంకో హీరో ఏకంగా విమానం నుండి బిల్డింగ్ పైకి దూకేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాలో లెక్కలేనన్ని చెత్త ‘హీరోయిజం’ సీన్లు దర్శనమిస్తాయి. అయితే ఇలాంటి ‘ఓవర్ యాక్షన్’ సీన్ల కంటే, రియలిస్టిక్ ఫైట్లకే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారని ఈ మహామహులంతా ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో..! అసలు వీరికి జ్ఞానోదయం అవుతుదంటారా..!?

లేబుళ్లు: , , ,

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ లెజెండ్


ఏమో అనుకున్నాం కానీ.. ఎన్టీఆర్ కొత్త సినిమా వ్యవహారం మామూలుగా లేదు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూడు పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి మేకప్ పరంగా గొప్ప ప్రయత్నమే జరిగేలా ఉంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ లెజెండరీ టెక్నీషియన్ ఒకరిని తీసుకోవడం విశేషం. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’.. ‘ఐరన్ మ్యాన్’.. ‘లైఫ్ ఆఫ్ పై’ లాంటి సినిమాలకు ప్రోస్థెటిక్ అండ్ లెగసీ ఎఫ్ఎక్స్ నిపుణుడు వాన్స్ హార్ట్ వెల్ సేవల్ని ఎన్టీఆర్ 27వ సినిమాకు ఉపయోగించుకుంటున్నారు. వాన్స్ ఆల్రెడీ హైదరాబాద్ కు వచ్చేసి.. ఎన్టీఆర్ తో కలిసి పని చేస్తున్నాడు కూడా.

ఎన్టీఆర్ తో వాన్స్ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ అతను ఈ సినిమాకు పని చేస్తున్న విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ వెల్లడించింది. వాన్స్ హార్ట్ వెల్ శంకర్ విజువల్ వండర్ ‘రోబో’కు కూడా పని చేయడం విశేషం. ప్రోస్థెటిక్ మేకప్ విషయంలో వాన్స్ చెయ్యి తిరిగిన వాడు. నటుల అవతారాలు మార్చేసి వినూత్నంగా తీర్చిదిద్దడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అతడి సేవల్ని ఉపయోగించుకుంటున్నారంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ లుక్ లో దర్శనమివ్వబోతున్నట్లే అన్నమాట. ఈ న్యూస్ మన ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ను పెంచేదే. ఇంకో పది రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఆలోపు ఎన్టీఆర్ లుక్స్ ఫైనలైజ్ అయ్యే అవకాశముంది.

లేబుళ్లు: ,

ఎన్టీఆర్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్స్….!


2016ను జూనియర్ ఎన్టీఆర్ ఘనంగా ముగించాడు. నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ రూపంలో రెండు భారీ హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే మూడు వ‌రుస హిట్లు కొట్టి ఉండ‌డంతో ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా కోసం చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నిర్మించే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాలో పాత్రధారుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమా గురించి ఓ షాకింగ్ రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాలో కీల‌క‌మైన ఓ రోల్‌ను సీనియర్ నటీమణితో చేయించాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. ఈ రోల్ కోసం శ్రీదేవిని అడుగుతున్నారనే రూమర్ వినిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు బాబీ ముంబై వెళ్లి ఓసారి శ్రీదేవిని కలిసి ఆ పాత్ర గురించి కూడా చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఈ పాత్ర చేసేందుకు శ్రీదేవి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిందా లేదా అన్న‌దానిపై మాత్రం క్లారిటీ లేదు. శ్రీదేవి రీ ఎంట్రీ తర్వాత దక్షిణాదిలో ఒకే ఒక సినిమా చేసింది. కోలీవుడ్ హీరో విజయ్ మూవీ పులిలో కీలక పాత్ర చేసినా.. ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ మూవీలో శ్రీదేవి ఎన్టీఆర్‌కు అత్త పాత్ర‌లో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ సినిమాలో శ్రీదేవి న‌టిస్తే సినిమా క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ఇదిలా ఉండగా ఐటం సాంగులే తప్ప హీరోయిన్స్ ఛాన్సులు తగ్గాయని వాపోతున్న హిరోయిన్ లక్ష్మి రాయి అయితే ఈ వయ్యారికి ఇలాంటిదే మరో ఛాన్స్ ఇస్తున్నాడట ఎన్టీఆర్ మరి ఈ ఇద్దరి భామలతో ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో చూడాలంటే సినిమ రిలీస్ అయ్యేవరకు ఆగాల్సిందే మరి…..!

లేబుళ్లు: ,

2, ఫిబ్రవరి 2017, గురువారం

ర‌వితేజ ఫ్యామిలీ గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్స్‌

మాస్ మహరాజా రవితేజ ఎంత ఎనర్జిటిక్‌గా ఉత్సాహంగా సినిమాలు చేస్తుంటాడు. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత యేడాదిన్న‌ర పాటు చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ర‌వితేజ ఇప్పుడు ఒకేసారి రెండు కొత్త సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. గతేడాది సినిమాలను ప్రక్కన పెట్టి ఫ్యామిలీతో టూర్స్ వేశాడు. ఇక ఈ ఏడాది విక్రమ్ సిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు అనే చిత్రంతో పాటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ అనే చిత్రాన్ని చేయనున్నాడు.
ర‌వితేజ ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ చిన్న మ్యాట‌ర్ కూడా బ‌య‌ట‌కు రాలేదు. ర‌వితేజ సోద‌రుల గురించి మిన‌హా ర‌వితేజ భార్య‌, పిల్ల‌ల‌కు సంబంధించిన వివ‌రాలు ఎప్పుడూ లీక్ కాలేదు. ర‌వితేజ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో త‌న ఫ్యామిలీతో ఉన్న సెల్ఫీని పోస్ట్ చేశాడు.
రవితేజ త‌న ఫ్యామిలీని ఎలాంటి ప్రైవేట్ ఫంక్షన్స్‌కు తీసుకురాలేదు. మాస్ మ‌హ‌రాజ్ అభిమానులు కూడా ఎప్పటి నుంచో తమ అభిమాన హీరో ఫ్యామిలీని చూడాలని ముచ్చటపడుతున్నారు. తాజాగా ఆ కోరిక‌ను తీర్చాడు రవితేజ. తన భార్య కళ్యాణి తేజతో పాటు కొడుకు మహాదన్.. అలాగే కూతురు మోక్షదలతో కలిసి సెల్ఫీ దిగి ఆ పిక్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన రవితేజ ఫ్యాన్స్ కి అదిరిపోయే కిక్చిచ్చాడు. ర‌వితేజ స్వ‌గ్రామం తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట..వీరికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కూడా బంధువులు ఉన్నారు.

లేబుళ్లు:

ఫస్ట్ లుక్: అజిత్ అదిరిందిలే

ఎన్నాళ్ళనుండో తల57 అంటూ ఇంటర్నెట్లో తెగ ప్రచారం చేయబడుతున్న తమిళ సూపర్ స్టార్ అజిత్ కొత్త సినిమా పేరు కన్ఫామ్ చేసేశారు. అంతేకాదు.. గత రాత్రి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. తెలుగులో శౌర్యం.. శంఖం.. దరువు సినిమాలను తీసిన దర్శకుడు కమ్ సినిమాటోగ్రాఫర్ శివ.. ఇప్పుడు ఈ 57వ సినిమాకు డైరక్టర్. 

చూస్తున్నారుగా లుక్ ఎలా ఉందో.. అజిత్ ఒక ఆర్మీ పర్సన్ అంటూ చెప్పకనే చెబుతున్నారు. అంతకంటే ఎక్కువగా ఇక్కడ మనోడు కొత్తగా పెంచిన సిక్స్ ప్యాక్ బాడీని తెగ చూపించేస్తున్నాడు. మొత్తానికి మళ్లీ ఒక హీరోయిక్ యాక్షన్ ఫిలింతోనే అజిత్ దూసుకొస్తున్నాడనమాట. తన సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ లుక్స్ (సగం నెరిసిన జుట్టు) అలాగే కంటిన్యూ చేశాడులే. ఇక అజిత్ బాబుకు 'వి' అనే అక్షరంతో సినిమాలు మొదలెట్టడం అనేది ఒక సెంటిమెంట్ గా మారిపోయినట్లుంది. అజిత్ తో వీరమ్.. వేదాళమ్ సినిమాలను తీసిన ఇదే దర్శకుడు శివ.. ఈ సినిమాకు ''వివేకం'' (తమిళంలో వివేగమ్) అంటూ టైటిల్ ఎంచుకున్నాడు. సెక్సిణి కాజల్ అండ్ అక్షర హాసన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. యంగ్ సంచలనం అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. 

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ''వివేకం'' సినిమా ఏప్రియల్ లో విడుదలవ్వనుంది. మొత్తానికి చాలా రోజుల నుండి ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్న అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు పెద్ద ఫీస్ట్ అనే చెప్పాలి. 

లేబుళ్లు:

గ్లామర్ సీక్రెట్...మహేష్ టు మలేషియా

మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ మూవీ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో ఇప్పటికే చాలా వాయిదాలు పడిపోతుండడంతో.. షూటింగ్ ఆలస్యంగా అవుతోందనే విషయం అందరికీ అర్ధమయిపోతోంది. ఇప్పుడు మలేషియా ట్రిప్ కోసం ఈ సినిమా షూటింగ్ కి మహేష్ బ్రేక్ ఇస్తున్నాడని తెలుస్తోంది.

సహజంగా మహేష్ ఇలాంటి బ్రేక్స్ తీసుకుని ఫ్యామిలీతో పాటు టూర్స్ వేస్తుంటాడు. కానీ ఈ మలేషియా ట్రిప్ మాత్రం అందుకు కాదు. తన హెల్త్ కండిషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మలేషియా వెళ్తున్నాడట మహేష్. అలాగని ఇప్పుడు సూపర్ స్టార్ కి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. కానీ ఏడాదికి రెండు సార్లు.. బాడీ మొత్తాన్ని డీటాక్సినేషన్ చేయించుకోవడం మహేష్ కి అలవాటు. అంటే శరీరంలో పేరుకుపోయే మలినాలను పూర్తిగా శుభ్రం చేయించడం అన్నమాట. కొన్ని రకాల మందులు.. ఎక్సర్ సైజులు.. మసాజ్ ల ద్వారా ఒంట్లో పేరుకున్న చివరి మలినాలను కూడా క్లీన్ చేసేస్తారు.

గతంతో డెహ్రాడూన్ లో ఈ ట్రీట్మెంట్ తీసుకునేవాడు కానీ.. ఈ సారి మాత్రం మలేషియాకు షిఫ్ట్ అయ్యాడట మహేష్. అలా తన ఆరోగ్యం కాపాడుకోవడం మహేష్ గ్లామర్ సీక్రెట్స్ లో ఒకటి. హ్యాండ్సమ్ అనే పదానికి అబ్రివేషన్ గా మహేష్ బాబు ఎందుకు మారిపోయాడో ఇప్పుడు అర్ధమైందా? 

లేబుళ్లు:

‘సార్వభౌమ’పై బాలయ్య కన్నేశాడా?

నందమూరి బాలకృష్ణకు సరిపోయే టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. అలా అయితేనే నందమూరి ఫ్యాన్స్ కూడా బాగా కనెక్ట్ అయిపోతారు. అందుకే సింహా - లయన్ - డిక్టేటర్ లాంటి ఎన్నో వెయిట్ వున్న టైటిల్స్ అన్నీ బాలయ్య కోసమే అన్నట్టు వున్నాయి. తాజాగా ‘సార్వభౌమ’ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ బాలయ్య కోసమే అన్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘లయన్’ దర్శకుడు సత్యదేవా ఈ టైటిల్ తో ఓ మాంచి మాస్ స్క్రిప్టును బాలయ్యకోసం రెడీ చేశాడంట. ఇప్పటికే స్టోరీని కూడా బాలయ్యకు వినిపించేశాడని టాక్ వినబడుతోంది. 

గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ల్యాండ్ మార్క్ తరువాత.. బాలయ్య తదుపరి చిత్రమేమిటనేది ఇంకా తెలియడం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీతో ‘రైతు’ చేస్తాడని ప్రచారం వున్నా... అందులో అమితాబ్ పోషించే కీలక పాత్రకోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దాంతో ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. 

సో... బాలయ్య తదుపరి చిత్రం ఏంటనేది ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో సత్యదేవా రాసుకున్న ‘సార్వభౌమ’ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే టాక్ వుంది. లయన్ సినిమా కొంత నిరాశ పరిచినా... ఈ సినిమా స్క్రిప్టు మాత్రం బాలయ్య అభిమానులను అన్ని విధాల మెప్పించేలా వుందని అంటున్నారు. చూడాలి మరి.. బాలయ్యను సత్యదేవా ‘సార్వభౌమ’ అంటాడో లేదో!

లేబుళ్లు:

1, ఫిబ్రవరి 2017, బుధవారం

నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్… నెంబర్ 10 చిరంజీవి..!


టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? బరిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో ఏ హీరో అభిమానులు ఆ హీరో పేరు చెప్తారు. అయితే ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? అంటే అది కూడా సమాధానం లేని ప్రశ్నే. కానీ, ‘గూగుల్’ మాత్రం దీనికి సమాధానం ఇచ్చింది. టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే ‘బెస్ట్ డ్యాన్సర్’గా ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చింది. అంతేకాదు, ఆలిండియా టాప్ 10 డ్యాన్సర్ల జాబితాను కూడా ఇచ్చింది.

ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో ఉండగా, హృతిక్ రోషన్ రెండవ స్థానంలో, ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండడంతో టాప్ 3లో ఇద్దరు టాలీవుడ్ హీరోలు నిలిచారు. అలాగే ఇండియన్ మైకేల్ జాక్సన్ గా భావించే ప్రభుదేవాకు 4, లారెన్స్ కు 5, మాధురి దీక్షిత్ కు 6, తమిళ హీరో విజయ్ కు 7, రాఘవ క్రోక్ రోజు కు 8, ఐశ్వర్యారాయ్ 9లో నిలువగా, 10వ స్థానంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఈ జాబితాపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ‘గూగుల్’లో సెర్చ్ చేస్తే సమాధానం మాత్రం ఇదే వస్తోంది.

ఏది ఏమైతేనేం మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ కు వెనక్కి నెట్టి ప్రధమ స్థానంలో నిలవడం విశేషం. బహుశా ఈ జాబితాను చూస్తే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిక్కిలి సంతోషిస్తారేమో..! ఉత్తరాది ఆధిపత్యాన్ని పక్కకు నెట్టి, గూగుల్ సెర్చ్ లో మన దక్షిణాది హీరోలు ఆధిపత్యం ప్రదర్శించడం పవన్ కే కాదు, దక్షిణాది సినీ పరిశ్రమకు కూడా శుభపరిణామమే కదా!

లేబుళ్లు: , ,

టాలీవుడ్ ఆల్ రౌండర్ ఎన్టీఆర్ మాత్రమే అంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో చాలామందికి నచ్చిన హీరో, యాక్టర్, డాన్సర్…నికార్సయిన ఆల్ రౌండర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే…చాలామంది సీనియర్లు జూనియర్లు ఓపెన్ గానే ఎన్టీఆర్ గురించి తమ ఫీలింగ్ ని చెప్పేశారు…లేటెస్ట్ గా ఓ క్యూట్ హీరోయిన్ కూడా తన ఫీలింగ్ ని చెప్పేసింది.

జెంటిల్ మాన్ సినిమాతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్న అమ్మడు నివేదాథామస్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఓ చిన్న చిట్ చాట్ సెషన్ చేయగా మీ అభిమాన హీరో ఎవరు అంటూ ఓ ఫ్యాన్ నివేదాని అడిగాడు.

డానికి నివేదా తడుముకోకుండా ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ అని చెప్పగా వరుసగా రెండు సినిమాలు చేస్తున్న నాని ఫేవరేట్ యాక్టర్ అని చెప్పింది…ఎన్టీఆర్ 27 సినిమా రేసులో నివేదా కూడా ఉందని టాక్ వినిపిస్తుంది కాబట్టి ఆల్ మోస్ట్ ఈమె ఫిక్స్ అయినట్లే అంటున్నారు విశ్లేషకులు.

లేబుళ్లు: ,

బాహుబ‌లి -2 ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్‌…ఆల్ టైం ఇండియ‌న్ రికార్డు


ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి సాధించిన షాకింగ్ విజ‌యంతో ఇప్పుడు అంద‌రూ బాహుబ‌లి-2 కోసం వెయిట్ చేస్తున్నారు. బాహుబ‌లి రూ.600 కోట్ల వ‌సూళ్లు సాధించింది. దీంతో ఇప్పుడు బాహుబ‌లి 2 ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాల్లోను ఠారెత్తుతోంది.
ఓవ‌రాల్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాహుబ‌లి -2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.600 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఏపీ, తెలంగాణ‌లో బాహుబ‌లి -2 రూ.130 కోట్ల బిజినెస్ చేసింది. ఓ ప్రాంతీయ సినిమా ఓ రాష్ట్రంలో ఈ రేంజ్‌లో బిజినెస్ చేయ‌డం ఆల్ ఇండియా రికార్డుగా నిలిచింది.
బాహుబ‌లి ది బిగినింగ్ ఏపీ+తెలంగాణ‌లో రూ.66 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసి రూ.110 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇప్పుడు ఆ సినిమా సాధించిన వ‌సూళ్ల కంటే మ‌రో రూ.20 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు సినీ అభిమానుల‌కు సైతం దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది.
బాహుబ‌లి -2 ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ :
నైజాం – 47.5 కోట్లు
సీడెడ్ – 25 కోట్లు
ఉత్త‌రాంధ్ర + కృష్ణా – 23 కోట్లు
గుంటూరు – 11.5 కోట్లు
ఈస్ట్ + వెస్ట్ – 17.50 కోట్లు
నెల్లూరు – 5.50 కోట్లు
——————————————
టోట‌ల్ ఏపీ+తెలంగాణ = 130 కోట్లు

లేబుళ్లు: ,

ఓవర్సీస్ బాక్సాఫీస్ పై రానా సోలో వార్..!

బాహుబలి తరువాత రానా అంటే తెలియనివారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు తమిళ హిందీ భాషల్లో సుపరిచిత నటుడిగా గుర్తింపు పొందాడు. రానా తాజా చిత్రం ఘాజీ విడుదలకు సిద్ధమౌతోంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ లో కూడా ఈ ట్రైలర్ కి మాంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు విదేశాల్లో కూడా ఘాజీపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఘాజీ ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

యువీ క్రియేషన్స్ అనగానే అందరికీ ప్రభాస్ గుర్తొస్తాడు. అది ఆయన కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అంటారు. తెలుగులో హిట్ చిత్రాల నిర్మించిన అనుభవం యూవీకి ఉంది. అలానే చాలా చిత్రాలను పంపిణీ కూడా చేస్తోంది. రానా తాజా చిత్రం ఘాజీ విదేశీ హక్కుల్ని యూవీ క్రియేషన్స్ సొంతం చేసుకుంది. విదేశాల్లో తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ చిత్ర విదేశీ హక్కుల్ని రూ. 2 కోట్లకు యూవీ సొంతం చేసుకోవడం విశేషం.

బాహుబలితో రానాకి ఓవర్సీస్ లో కూడా ఫ్యాన్స్ పెరిగారు. అయితే రానా సోలో హీరోగా ఆ తరువాత సినిమాలేవీ రాలేదు. బాహుబలి తరువాత రానా సోలో హీరోగా విడులౌతున్న చిత్రం ఇదే. దీంతో ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రానా సోలో సత్తా చాటుకుంటాడని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఘాజీ ఓవర్సీస్ రైట్స్ మాంచి ఫ్యాన్సీ ధరకే అమ్ముడయ్యాయి. మరి ఘాజీ ఏ స్థాయి కలెక్షన్లను దక్కించుకుంటుందో వేచి చూడాలి.

లేబుళ్లు: ,

చేనేత వస్త్రాలకు మనమ్మాయిలు లేరా కేటీఆర్?

Samantha - KTR
మిగిలిన వారిని ఇలాంటి ప్రశ్నలు వేయలేం. తెలంగాణ ఉద్యమ సమయంలో మన ప్రాంతం.. మన ప్రజలు అన్నట్లుగా నినాదాలు చేయటమే కాదు.. ఏఎంపిక జరిగినా.. అందులో తెలంగాణ కోణాన్ని బయటకు తీసిన వారిలో మంత్రి కేటీఆర్ ఒకరు. ఉద్యమ నాయకుడిగా వ్యవహరించిన ఆయన.. ఇన్ని కోట్ల మంది తెలంగాణ వారు ఉంటే.. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదా? ఇదంతా సీమాంధ్ర ప్రభుత్వాల దుర్మార్గం అంటూ తిట్టిపోసేవారు. అప్పట్లో ఇదంతా నిజమని నమ్మినోళ్లు కోట్లల్లో ఉండేవారు. అలా కాదంటూ ఎవరైనా మాట్లాడితే.. వారిని తప్పు పట్టేశారు.

తెలంగాణ ఉద్యమం ముగిసింది. కొత్త రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ సర్కారు కొలువు తీరింది. ఈ మధ్య కాలంలో చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఆయన స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తూ చేనేత వస్త్రాలకు సరికొత్త ఇమేజ్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. కాకుంటే.. చేనేత వస్త్రాలకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీ నటి.. అక్కినేని ఇంటికి రానున్న కొత్త కోడలు సమంతను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్.. సమంతలు మెట్రో రైల్ భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తయారవుతున్న చేనేత వస్త్రాలకు బ్రాండ్అంబాసిడర్ గా వ్యవహరించాలని కోరటం.. ఆమె ఓకే అనేయటం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే.. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఒక తమిళ అమ్మాయి అవసరం ఏమిటన్నది? సమంత తెలుగులో టాప్ హీరోయిన్ కదా అని అడగొచ్చు. హైదరాబాద్ లో పుట్టి.. పెరిగినా సీమాంధ్ర మూలాలు ఉంటే వారిని ఆంధ్రోళ్లుగా ఉద్యమ సమయంలో అభివర్ణించే కేటీఆర్ లాంటి ఉద్యమ నేత.. తమిళ రాష్ట్రానికి చెందిన మహిళను తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయటం ఏమిటి? ఇన్ని కోట్ల మంది ఉన్న తెలంగాణలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ప్రముఖ మహిళలే లేరా..?అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తంచేస్తున్నారు. నిజమే.. వారి వాదనల్లోనూ పాయింట్ ఉందని చెప్పాలి.

లేబుళ్లు: , ,

రవితేజ భార్యని చూశారా?

ప్రొఫిషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని చాలా బ్యాలెన్స్ గా డీల్ చేసే హీరోల్లో రవితేజ ఒకరు. సినిమా విషయాలు సెట్ లోనే మాట్లాడుతారు. షూటింగ్ ఒత్తిడిని ఇంటికి తీసుకుపొరు. తన్ఫా ఫ్యామిలీ మెంబర్స్ ని సినిమా వేడుకలకి తీసుకురారు. అయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన వరకు అయన ఇదే పద్దతిని ఫాలో అయ్యారు.
కనీసం ఇంటర్వూస్ లో కూడా ఫ్యామిలీ విషయాల గురించి మాట్లాడరు. వారు కూడా మీడియాకి దూరంగా ఉంటారు. అందుకే రవితేజ భార్య, పిల్లల గురించి అభిమానులకు కూడా తెలియవు. తాజాగా తన ఫ్యామిలీతో కలసి వరల్డ్ టూర్ వెళ్లోచ్చిన రవితేజ ర్పస్తుతం టచ్ చేసి చూడు అనే సినిమాని ప్రారంభించారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వ్రలోర్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నది.
అందరూ ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా రవితేజ తన ఫ్యామిలీతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇందులో భార్య కళ్యాణి తేజ, కూతురు మోక్షద, కొడుకు మహాధాన్ ఉన్నారు. నలుగురూ ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ ఉన్న ఈ ఫోటో చూసి రవితేజ అభిమానుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 

లేబుళ్లు: ,

పక్కా లోకల్‌ నేను ఓన్లీ లోకలే

తమిళ మార్కెట్‌ని టార్గెట్‌ చేసి హీరోలుగా రేంజ్‌ పెంచుకోవడానికి స్టార్‌ హీరోలు పోటీలు పడుతోంటే నాని మాత్రం ఇక తమిళ చిత్రాల జోలికి పోనని తేల్చేసాడు. గతంలో తమిళ చిత్రాలు చేయడానికి చేసుకున్న అడ్జస్ట్‌మెంట్ల వల్ల చాలా గ్యాప్‌ వచ్చిందని, బాగా స్లో అయిపోయానని, ఇకపై అలాంటివి జరగకుండా ఓన్లీ తెలుగు సినిమాల మీద, లోకల్‌ మార్కెట్‌ పైన కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నట్టు 'నేను లోకల్‌' హీరో చెప్పాడు. 

తెలుగు సినిమాల మీదే దృష్టి పెట్టినప్పుడు తనకి డైవర్షన్స్‌ ఉండట్లేదని, ఒక కథని బాగా జడ్జి చేయగలుగుతున్నానని, అదే తెలుగు, తమిళం అంటూ రెండు పడవలపై కాళ్లు పెడితే ఎవరికి నచ్చేలా సినిమా వుండాలనే దానిపై ఆలోచనలు మారతాయని నాని వివరించాడు. నేను లోకల్‌ సినిమాపై నాని ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా వున్నాడు. మాస్‌ క్యారెక్టర్‌ చేయడం వల్ల దీనికి ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాడు. 

ఈ సినిమాని తొలిరోజు ప్రేక్షకుల మధ్య కూర్చుని చూస్తానని, వాళ్ల స్పందన కోసం ఎక్సయిటెడ్‌గా చూస్తున్నానని చెప్పాడు. గత ఏడాది నుంచి చేసే సినిమాల వేగం బాగా పెంచిన నాని ఇకపై కూడా అదే స్పీడు కొనసాగించాలని అనుకుంటున్నానని, తన సినిమాలతో బయ్యర్లంతా హ్యాపీగా వుంటే తనకి చాలని, అలాంటి విజయాల కోసమే తపిస్తున్నానని చెప్పాడు. 

లేబుళ్లు: , ,

విజ‌య్ ఆంటోనీ.. ఇంకే టైటిలూ దొర‌క‌లేదా?

మ‌ణిర‌త్నం త‌మిళ సినిమాల‌న్నీ ఎప్ప‌ట్నుంచో తెలుగులోకి డ‌బ్ అవుతున్నాయి. ఐతే త‌న ప్ర‌తి సినిమాకూ సాధ్య‌మైనంత వ‌ర‌కు చ‌క్క‌టి తెలుగు టైటిళ్లు ఉండేలా చూసుకుంటాడాయ‌న‌. డ‌బ్బింగ్ విష‌యంలోనూ చాలా శ్ర‌ద్ధ పెడ‌తాడు. అందుకే మ‌న ప్రేక్ష‌కులు కూడా ఆయ‌న‌ సినిమాల‌కు బాగా క‌నెక్ట‌వుతారు. ఇలాంటి శ్ర‌ద్ధ ఎవ‌రైనా చూపించాల్సిందే. 

టైటిళ్ల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సిందే. ఐతే ఆ మ‌ధ్య సూర్య ‘సింగం’ సిరీస్‌లో తెర‌కెక్కిన రెండో సినిమాకు ‘సింగం’ అనే టైటిల్ పెట్టి వ‌దిలేశాడు. ‘సింగం’ అన్న‌ది త‌మిళ ప‌దం. దాన్ని తెలుగు సినిమాకు పేరుగా ఎలా నిర్ణ‌యించారో ఏంటో? ఇప్పుడు విజ‌య్ ఆంటోనీ కొత్త సినిమా విష‌యంలోనూ ఇలాగే చేస్తున్నారు.

‘బిచ్చ‌గాడు’ సినిమాతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించిన విజ‌య్ ఆంటోనీ.. ఆ త‌ర్వాత ‘బేతాళుడు’ సినిమాతో ప‌ల‌క‌రించాడు. ఇప్పుడు అత‌డి లేటెస్ట్ మూవీ ‘య‌మ‌న్’ కూడా తెలుగులోకి అనువాద‌మ‌వుతోంది. తెలుగు వెర్ష‌న్ కోసం వేరే పేరేమీ ఆలోచించ‌కుండా ‘య‌మ‌న్ అని పెట్టేసి ప్ర‌మోష‌న్ మొద‌లుపెట్టేశారు. ‘య‌మ‌న్ అంటే ‘య‌ముడు అని అర్థం. 

అదే టైటిల్ పెట్ట‌డానికి ఇబ్బంది ఉంటే ‘య‌మ’ అనో.. ‘య‌మధ‌ర్మ‌రాజు’ అనో పెట్టుకోవ‌చ్చు. కానీ అలా కాకుండా ‘య‌మ‌న్’ అనే టైటిలే తెలుగుకూ ఫిక్స్ చేసేశారు. ఫిబ్ర‌వ‌రి 11న ఆడియో వేడుక చేయ‌బోతున్నారు. జీవా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ‘రోబో-2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ్యూస్ చేస్తుండ‌టం విశేషం. తెలుగులో మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమాను అందిస్తున్నాడు.

లేబుళ్లు: , , ,

చిరు ఔట్ అని ఒప్పేసుకున్నట్లేనా?



ఇంకా మూడేళ్లు కూడా కాలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టి. అప్పటికి ఇప్పటికి పార్టీ పరంగా పెద్ద మార్పులేమీ లేవు. పవన్ ఏమీ ఎన్నికల్లో పోటీ పడలేదు. ఫలితాలేమీ అందుకోలేదు. ఐతే పవన్ సోదరుడు నాగబాబు మాత్రం తమ్ముడి విషయంలో స్టాండ్ మార్చేశాడు. పవన్ జనసేన పెట్టగానే తనతో పాటు మెగా అభిమానులంతా చిరంజీవితోనే ఉంటారంటూ ప్రకటన చేశాడు. కానీ ఇప్పుడు తాను తమ్ముడి వెంట నడుస్తానంటున్నాడు. పవన్ నిజాయితీ పరుడని.. ప్రజా శ్రేయస్సు కోరతాడని.. ఫ్యామిలీ కంటే కూడా సొసైటీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడని.. ఇంకా పవన్లోని చాలా చాలా క్వాలిటీల గురించి చెబుతూ అతణ్ని ఆకాశానికెత్తేశాడు.

తాను జనసేన కోసం పని చేయనున్నట్లు.. అందుకోసం ఏపీకి తన ఓటు కూడా మార్చుకోనున్నట్లు చెప్పాడు. 2019 ఎన్నికల్లో తన ఓటు కూడా తమ్ముడికేనని స్పష్టం చేశాడు. ఐతే ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయమేంటంటే.. చిరంజీవి ఇంకా రాజకీయాల నుంచి నిష్క్రమించలేదు మొన్న కూడా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కూడా చెప్పాడు. అన్నయ్య రాజకీయాల్ నిష్క్రమిస్తున్నట్లు చెప్పాక నాగబాబు తమ్ముడికి మద్దతిస్తే ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ చిరంజీవి ఇంకా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగానే నాగబాబు తమ్ముడికి తమ్ముడి పార్టీకి మద్దతివ్వడంతో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. తాము ఎవరి వైపు నిలబడే తెలియని అయోమయ పరిస్థితి తలెత్తింది. ఒక రకంగా నాగబాబు తాజా వ్యాఖ్యాలతో త్వరలోనే చిరంజీవి రాజకీయాల నుంచి నిష్క్రమించేస్తాడేమో.. 2019 ఎన్నికల్లో ఆయన పాత్ర ఏమీ ఉండదేమో అన్న బలమైన అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. 

లేబుళ్లు: ,

బాలయ్య విషయంలో మిల్కీ ఓపెన్

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయాన్ని.. ల్యాండ్ మార్క్ మూవీగా చారిత్రాత్మక చిత్రాన్ని ఎంచుకుని చరిత్ర సృష్టించడాన్ని.. పురస్కరించుకుని.. ఆయనకు ఘనసన్మానం నిర్వహించారు టీ సుబ్బిరామిరెడ్డి.  ఈ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీ కూడా హాజరు కావడం చాలా రకాల ప్రశ్నలను రేకెత్తించింది.

బాలయ్య ఫంక్షన్ కు మిల్కీ హాజరు కావడంపై చాలా రకాల రూమర్స్ వచ్చేస్తున్నాయి. వీటిన్నిటికీ చెక్ పెట్టేస్తూ.. తమన్నా డైరెక్ట్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. 'నేను రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారితో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను. అంతేకాదు.. క్రిష్ దర్శకత్వంలో మూవీ చేయాలని ఉంది' అంటూ ఓపెన్ గానే చెప్పేసింది తమ్మూ. ఇలా సీనియర్ హీరోతో చేయాలని ఉందని ఓ స్టార్ హీరోయిన్ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా అరుదు అనే చెప్పాలి. ఈ విషయంలో అమ్మడి ధైర్యాన్ని అందరూ పొగిడేస్తున్నారు.

మరోవైపు.. ఇప్పటివరకూ స్టార్ హీరోయిన్లను తన సినిమాల్లో ఎంపిక చేసేందుకు బాలయ్యకు కొంత క్లిష్టంగా ఉండేది. కానీ గౌతమిపుత్ర శాతకర్ణితో ఆయన సాధించిన ఘనవిజయం తర్వాత.. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు స్టార్ హీరోయిన్సే ముందుకు వస్తుండడం విశేషం. 

లేబుళ్లు: , , ,