యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత కెమేరా ముందుకు అడుగుపెట్టే ముహూర్తం సెట్ చేసుకున్నాడు. మూడూ పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని కెరీర్‌లోనే ఫస్ట్ టైం ప్లే చేస్తున్న ఎన్టీఆర్……ఆ మూడు క్యారెక్టర్స్‌లోనూ మూడు వేరియేషన్స్‌తో కంప్లీట్ ఛేంజ్ చూపించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు ఎన్టీఆర్. యాక్టింగ్ పరంగా కూడా ది బెస్ట్ అనిపించుకోవాలని ఆలోచిస్తాడు ఈ స్టార్ హీరో. ఆ విషయాన్ని ఇప్పుడు చేస్తున్న జై లవకుశతో మరోసారి నిరూపిస్తాడని చెప్తున్నారు.
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. అయితే ఎన్టీఆర్ మాత్రం నెక్ట్స్ మంత్ 1 నుంచి షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ లోగా ఇతర తారాగణంపైన ఉన్న సీన్స్‌ని షూట్ చేస్తారట. ఎన్టీఆర్ సీన్స్ విషయంలో కూడా ముందుగా ఫుల్ లెంగ్త్ కామెడీ పండించే క్యారెక్టర్‌తో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. సో……త్రిమూర్తులుగా ఎన్టీఆర్ యాక్టింగ్ విశ్వరూపాన్ని బిగ్ స్క్రీన్ పైన చూసే టైం దగ్గర పడుతూ ఉందన్నమాట……..లెట్స్ వెయిట్…….విత్ లవ్…..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి