ఎన్టీఆర్ మరి కొన్నిరోజుల్లో తన సిక్స్ ప్యాక్ బాడీని వెండితెరపై తెలుగు ప్రేక్షకులకు చుపించాబోతున్నాడు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా , ముద్దుగా ఉండేవాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాకోసం బక్కచిక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు గంటల సమయం జిమ్ లో గడుపుతూ సిక్స్ ప్యాక్ బాడీకి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సిక్స్ ప్యాక్ బాడీ ఓ ట్రెండ్ అయ్యింది.
కమెడియన్ సునీల్ నుంచి జయం సినిమాతో హీరోగా మారిన నితిన్ వరకు ఇప్పుడు అందరు జిమ్ లో గంటల సమయం కేటాయించి వారి బాడీకి పని పెట్టి వెండితెరపై సిక్స్ ప్యాక్ బాడీతో వెండితెరపై కనిపిస్తున్నారు.అయితే ఎన్టీఆర్ అభిమానులు కూడా అతనిని మరోక సిక్స్ ప్యాక్ బాడీలో చూడటానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.జై లవకుశ సినిమా లో ఒక పాత్ర లో సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడు అని సమాచారం.
దాంతో ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నా జై లవ కుశ సినిమాలో తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించడం ఖాయమని అంటున్నారు. ఇప్పటి వరకు టాప్ డాన్సర్ అని పేరుంది. కానీ ఇంతకు ముందు టెంపర్ సినిమా లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపించి ధియేటర్ల వద్ద చేసినా సందడి అంత ఇంత కాదు..అసలు ఎన్టీఆర్ స్పీడు పెరగడానికి యూత్ ఐకాన్ గా మారాడానికి ఈ సిక్స్ ప్యాకే ఒక కారణం గా చెప్పోచ్చు..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి