దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’ తొలి పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మనోడు ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ తెరకెక్కించే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్‌సీలో జరుగుతోంది.
శుక్రవారం ఈ సినిమా సెట్‌లోకి వెళ్లిన ప్రముఖ యాంకర్ సుమకు అక్కడ రాజమౌళి షాక్ ఇచ్చాడు. బాహుబలి సెట్‌కు వచ్చే వారు ఎవ్వరూ కెమేరాలు, సెల్‌ఫోన్లు తీసుకురాకూదని, సెల్ఫీలు అసలు తీసుకోకూడదని జక్కన్న ఆర్డర్ వేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్డర్‌ను పట్టించుకోని సుమ అక్కడ సెల్ఫీ తీసుకుంది. దీంతో వెంటనే దేవసేన కోసం తయారుచేసిన జైల్లో పడిపోయింది.
తనను ఆ జైలు నుంచి విడిపించమని ఆమె ఎంత వేడుకున్నా ఆమె మాటను ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆ జైలు నుంచే రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. ఇదంతా నిజం అని షాక్ అవ్వొద్దు. శివరాత్రి కానుకగా రాజమౌళి డిఫరెంట్‌గా ఈ సినిమా ప్రమోషన్‌ను ప్లాన్ చేశాడు.
సుమను దేవసేన జైల్లో ఉంచి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు రాజమౌళి. ఆ తర్వాత తమ సినిమా ఆడియో ఫంక్షన్ ప్రోగ్రామ్‌కు డబ్బులు తీసుకోకుండా హోస్ట్‌గా వ్యవహారిస్తానని మాట ఇస్తేనే జైలు నుంచి విడుదల చేస్తానని కండీషన్ పెట్టాడు. అందుకు సుమ అంగీకరించడంతో వెంటనే ఆమెను విడుదల చేసి ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి