మాస్ మహరాజా రవితేజ ఎంత ఎనర్జిటిక్‌గా ఉత్సాహంగా సినిమాలు చేస్తుంటాడు. బెంగాల్ టైగర్ తర్వాత యేడాదిన్నర పాటు చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న రవితేజ ఇప్పుడు ఒకేసారి రెండు కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. గతేడాది సినిమాలను ప్రక్కన పెట్టి ఫ్యామిలీతో టూర్స్ వేశాడు. ఇక ఈ ఏడాది విక్రమ్ సిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు అనే చిత్రంతో పాటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ అనే చిత్రాన్ని చేయనున్నాడు.
రవితేజ ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ చిన్న మ్యాటర్ కూడా బయటకు రాలేదు. రవితేజ సోదరుల గురించి మినహా రవితేజ భార్య, పిల్లలకు సంబంధించిన వివరాలు ఎప్పుడూ లీక్ కాలేదు. రవితేజ తాజాగా తన సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో ఉన్న సెల్ఫీని పోస్ట్ చేశాడు.
రవితేజ తన ఫ్యామిలీని ఎలాంటి ప్రైవేట్ ఫంక్షన్స్‌కు తీసుకురాలేదు. మాస్ మహరాజ్ అభిమానులు కూడా ఎప్పటి నుంచో తమ అభిమాన హీరో ఫ్యామిలీని చూడాలని ముచ్చటపడుతున్నారు. తాజాగా ఆ కోరికను తీర్చాడు రవితేజ. తన భార్య కళ్యాణి తేజతో పాటు కొడుకు మహాదన్.. అలాగే కూతురు మోక్షదలతో కలిసి సెల్ఫీ దిగి ఆ పిక్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన రవితేజ ఫ్యాన్స్ కి అదిరిపోయే కిక్చిచ్చాడు. రవితేజ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట..వీరికి పశ్చిమగోదావరి జిల్లాలో కూడా బంధువులు ఉన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి