ప్రొఫిషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని చాలా బ్యాలెన్స్ గా డీల్ చేసే హీరోల్లో రవితేజ ఒకరు. సినిమా విషయాలు సెట్ లోనే మాట్లాడుతారు. షూటింగ్ ఒత్తిడిని ఇంటికి తీసుకుపొరు. తన్ఫా ఫ్యామిలీ మెంబర్స్ ని సినిమా వేడుకలకి తీసుకురారు. అయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన వరకు అయన ఇదే పద్దతిని ఫాలో అయ్యారు.
కనీసం ఇంటర్వూస్ లో కూడా ఫ్యామిలీ విషయాల గురించి మాట్లాడరు. వారు కూడా మీడియాకి దూరంగా ఉంటారు. అందుకే రవితేజ భార్య, పిల్లల గురించి అభిమానులకు కూడా తెలియవు. తాజాగా తన ఫ్యామిలీతో కలసి వరల్డ్ టూర్ వెళ్లోచ్చిన రవితేజ ర్పస్తుతం టచ్ చేసి చూడు అనే సినిమాని ప్రారంభించారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వ్రలోర్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నది.
అందరూ ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా రవితేజ తన ఫ్యామిలీతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇందులో భార్య కళ్యాణి తేజ, కూతురు మోక్షద, కొడుకు మహాధాన్ ఉన్నారు. నలుగురూ ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ ఉన్న ఈ ఫోటో చూసి రవితేజ అభిమానుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి