ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్విస్ట్


వరుస హిట్లతో మంచి జోష్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ జై – ల‌వ‌-కుశ అనే మూడు రోల్స్‌లో న‌టించ‌నున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్విస్ట్ ఇస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న మూడు పాత్ర‌ల‌కు ముగ్గురు ముద్దుగుమ్మ‌లు కూడా సెల‌క్ట్ అయ్యారు. ఈ మూడు రోల్స్ ప‌క్క‌న రాశీఖ‌న్నా – త‌మ‌న్నా -కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇచ్చే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే… ఇప్పటిదాకా తారక్.. ఏ సినిమాలో కూడా మీసం లేకుండా కనిపించలేదు.
కానీ, త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఓ పాత్ర కోసం.. మీసం లేకుండా కనిపిస్తాడ. సినిమాలో ఎన్టీఆర్‌ను మీసం లేకుండా చూపించాలని దర్శకుడు ఓ పాత్రను సృష్టించాడట. మీసం లేకుండా కొత్త గెట‌ప్‌లో ఎన్టీఆర్ అభిమానులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

కామెంట్‌లు