30, డిసెంబర్ 2016, శుక్రవారం

ఎన్టీఆర్ – బాబి సినిమా హీరోయిన్ ఫిక్స్‌…


మూడు నెల‌లుగా ఊరిస్తూ వ‌స్తోన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమాపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. ఎన్టీఆర్ – ప‌వ‌ర్ ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) కాంబోలో తెర‌కెక్కే సినిమా ఈ నెల 9న ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది.

ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు ఎన్టీఆర్‌కు బాగా క‌లిసొచ్చిన హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాలేన‌ట‌. కాజ‌ల్‌ కెరియర్ మందగించిందని అంతా అనుకుంటున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న ఆమెకు ఛాన్స్ రావ‌డంతో కెరియ‌ర్ మ‌ళ్లీ గాడిలో ప‌డింది. ఈ యేడాది ఇప్ప‌టికే ఆమె స్టార్ హీరోల‌తో చేసిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, బ్ర‌హ్మోత్స‌వం సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి.
దీంతో కాజ‌ల్ పెద్ద ఐరెన్‌లెగ్ అన్న ముద్ర ప‌డిపోయింది. ఈ టైంలో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్‌లో స్పెష‌ల్ సాంగ్ ఆమె కేరీర్‌కు పెద్ద బూస్ట‌ప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ .. బాబీల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలోను కాజల్ కి మ‌రో ఛాన్స్ దక్కిందని స‌మాచారం.

ఎన్టీఆర్ తో ‘బృందావనం’ .. ‘టెంపర్’ సినిమాలు చేసిన కాజల్, రీసెంట్ గా ‘జనతా గ్యారేజ్’లో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. కాజల్ తో వున్న హిట్స్ కారణంగా ఆమె పేరును ఎన్టీఆర్ సూచించాడట.


లేబుళ్లు:

మళ్లీ కబాలి.. ఓర్నాయనో!!


ఈ ఏడాది రిలీజ్ కి ముందే ఎన్నో సెన్సేషన్స్ సృష్టించిన మూవీ కబాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రంతో సంచలనాలు సృష్టిస్తారని భావిస్తే.. ఒక్క తమిళనాడు తప్ప మిగిలిన ప్రాంతాల్లో తేడా వచ్చేసింది. అక్కడ కూడా పది రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ లు ఇచ్చేయడంతో సేఫ్ జోన్ లోకి వచ్చేసిందంతే.

రజినీకాంత్ ని మాఫియా డాన్ గా చూసి ఎంజాయ్ చేద్దామని అనుకున్న ఆడియన్స్ కి.. ఓ డాన్ ఆత్మకథను చూపించి దర్శకుడు నిరాశపరిచాడు. ఇదిలాఉంటే ఇప్పటికే కబాలి2 చిత్రాన్ని కూడా అనౌన్స్ చేయడం విశేషం. ఇప్పుడు కబాలి నిర్మాత కలైపులి ఎస్ థాను.. ఓ అనౌన్స్ మెంట్ చేశాడు. కబాలి మూవీకి గాను ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ ను అభిమానులకు అందించనున్నాడట ఈ నిర్మాత. 'కబాలిలో డిలెట్ చేసిన సన్నివేశాలు 31 డిసెంబర్ న యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నాం' అంటూ అధికారికంగా ప్రకటించాడు. 

ఈ నిర్మాతను మూవీ మార్కెటింగ్ విషయంలో ట్రెండ్ సెట్టర్.. డాన్ అంటారు. ఇప్పటికే కబాలితో రాబట్టిగలిగినదంతా అయిపోయాక.. ఇప్పుడు అభిమానుల కోసం అంటూ.. తీసేసిన సీన్స్ తో కూడా రెవెన్యూ సాధించే ఐడియాతోనే.. యూట్యూబ్ లో వాటిని రిలీజ్ చేస్తున్నాడని.. రజినీ మేనియాను ఇలా ఉపయోగించుకుంటున్నాడని అంటున్నారు కోలీవుడ్ జనాలు. 


లేబుళ్లు:

రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు…!


సినిమా పేరు: అప్పట్లో ఒకడుండేవాడు
నటీనటులు: నారా రోహిత్‌.. శ్రీవిష్ణు.. తాన్య హోప్‌.. బ్రహ్మాజీ.. రాజీవ్‌ కనకాల.. ప్రభాస్‌ శీను.. జీవీ.. సత్యదేవ్‌ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
ఛాయాగ్రహణం: నవీన్‌ యాదవ్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: ప్రశాంతి.. కృష్ణ విజయ్‌
రచన.. దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర
సంస్థ: అరుణ్‌ మీడియా వర్క్స్‌
విడుదల: 30-12-2016
నవతరం దర్శకులంటే ప్రేమ.. కాలేజీ కథతోనే వస్తారని అనుకోవడం పొరపాటు. వాళ్ల ఆలోచనలూ మారుతున్నాయి. ఓ సీరియస్‌ విషయాన్ని సిన్సియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం.. అందులోని వ్యక్తులు.. భావోద్వేగాల మధ్య నుంచి కథల్ని అల్లుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా చూస్తుంటే కొత్త దర్శకుడు సాగర్‌ కె.చంద్ర కూడా భిన్నమైన ఆలోచనలతోనే వచ్చాడనిపిస్తోంది. టైటిల్‌తోనే కాదు.. ప్రచార చిత్రాలతోనూ కొత్తగా కనిపించిన సాగర్‌.. వెండి తెరపై ఏం చూపించారు? విడుదలకు ముందు పెంచిన ఆసక్తి సినిమా చూసేటప్పుడు ఏమైందన్నది చూస్తే..
కథేంటంటే..?: 1992నాటి కథ ఇది. అప్పట్లో రైల్వే రాజు (శ్రీవిష్ణు) అని ఒకడుండేవాడు. క్రికెటర్‌ కావాలన్నది అతని కల. అందుకోసం బాగా ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. అమ్మ.. ఇల్లు.. క్రికెట్‌ తప్ప మరో ప్రపంచం తెలీదు. నిత్య (తాన్య హోప్‌)ని ప్రేమిస్తాడు. జాతీయ జట్టులో రైల్వే రాజు స్థానం ఖాయమనుకొంటున్న దశలో.. తన జీవితంలోకి ఇంతియాజ్‌ (నారా రోహిత్‌) ప్రవేశిస్తాడు. అతనో నిజాయతీగల పోలీస్‌. నక్సలైట్లను ఏరి పారేసే పనిలో ఉంటాడు.
ఓ నక్సల్‌ ముఠాకి సంబంధించిన కీలక సమాచారం రైల్వే రాజు దగ్గర ఉందన్నది అతని అనుమానం. దాంతో.. కటకటాల పాలవుతాడు రాజు. అక్కడ్నుంచి రాజు జీవితమే మారిపోతుంది. ఓ హత్య కేసులోనూ ఇరుక్కుంటాడు. క్రికెటర్‌ కావాల్సిన రాజు క్రిమినల్‌ కావాల్సి వస్తుంది. ఆ తర్వాతేం జరిగింది? రైల్వేరాజుకీ ఇంతియాజ్‌కీ జరిగిన పోరాటంలో ఎవరు గెలిచారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..?: కథా నేపథ్యం.. దాన్ని చెప్పే తీరును పోలిస్తే.. ఇప్పుడొస్తున్న సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుందీ చిత్రం. ఓ అమ్మాయి రైల్వే రాజు ఫొటో పట్టుకొని అతని గురించి సమాచారం తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. కాస్త గతం.. ఇంకాస్త వర్తమానం.. ఇలా స్క్రీన్‌ ప్లే సాగింది. నక్సలైట్ల నేపథ్యం వచ్చే వరకూ కథ.. కథనాలు సాదాసీదాగానే సాగుతాయి.
ఆ తరవాత సినిమా వేగం అందుకుంటుంది. నారా రోహిత్‌ పాత్ర ప్రవేశించటం.. శ్రీ విష్ణు హత్యా నేరంలో ఇరుక్కోవడం.. ఆరు బంతుల్లో నాలుగు సిక్స్‌లు కొట్టి.. జైలు నుంచి బయటపడడం ఇవన్నీ ఉత్కంఠభరితంగానే సాగుతాయి. రైల్వే రాజు ఎదిగిన తీరు… సినిమాటిక్‌గానే సాగింది.
ద్వితీయార్థంలో చాలాసేపటి వరకూ నారా రోహిత్‌ పాత్రే కనిపించదు. రైల్వే రాజు – ఇంతియాజ్‌ల పోరాటం కాస్త వన్‌సైడ్‌ అయిపోతుంది. మళ్లీ ఇంతియాజ్‌ పాత్ర కనిపించేంత వరకూ కథ.. కథనాల్లో ఎక్కడా ఉత్కంఠత ఉండదు. ఆ ఎపిసోడ్లు బోర్‌ కొట్టిస్తాయి. మళ్లీ పతాక సన్నివేశాల్లో దర్శకుడు తన మార్క్‌ చూపించుకోగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కథకు పూర్తి న్యాయం క్లైమాక్స్‌లోనే జరిగింది. దర్శకుడు ఈ కథని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా.. ఆ స్థానం శ్రీ విష్ణు ఒక్కడికే దక్కుతుంది. క్రికెటర్‌ కావాలని కలలుకన్న యువకుడిగా.. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న సామాన్యుడిగా.. రౌడీగా.. ఇలా చాలా రకాల పార్శా్వలు చూపించాడు. పతాక సన్నివేశాల్లో నటన రక్తికట్టించడానికి తన అనుభవం సరిపోలేదు గానీ.. మిగిలిన చోట్ల బాగా రాణించాడు.
నారో రోహిత్‌ కూడా ఎప్పటిలానే బేస్‌ వాయిస్‌తో ఆకట్టుకొన్నాడు. చివర్లో వేసిన ముసలి గెటప్‌ నప్పలేదు. సేటుగా బ్రహ్మాజీ నటన ఆకట్టుకొంది. కథానాయిక చేసిందేం లేదు. శ్రీనివాసరెడ్డి ఒకే ఒక్క కామెడీ ట్రాక్‌లో కనిపించాడు. అదీ సినిమాకి అనవసరమే. కెమెరా ఈ కథ అవసరానికి తగ్గట్టు పని చేసింది. పాటలు కథాగమనానికి అడ్డుకునేలా కనిపిస్తాయి. నేపథ్య సంగీతంతో సన్నివేశం స్థాయిని పెంచేశాడు సంగీత దర్శకుడు. మాటలు మరీ అంత లోతుగా లేకపోయినా.. ఎంత వరకూ వాడాలో అంతే వాడారు.
బలాలు
+ కథా నేపథ్యం
+ పతాక సన్నివేశాలు
+ నేపథ్య సంగీతం
బలహీనతలు
– కథానాయిక
– ద్వితీయార్థంలో తొలి సగం
చివరగా.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఓ సీరియస్‌ యాక్షన్‌ డ్రామా!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


లేబుళ్లు:

సినిమా తెలుగు విశ్లేష‌ణ‌: 2016 టాలీవుడ్ నెంబ‌ర్ 1 హీరో ఎవ‌రు


కాల‌గ‌ర్భంలో మ‌రో యేడాది క‌లిసిపోయింది. మ‌రో రెండు  రోజుల్లో 2016 సంవత్స‌రం చ‌రిత్ర‌పుటల్లో క‌లిసిపోనుండ‌గా 2017 కొత్త యేడాదిలోకి ఎంట్రీ ఇస్తున్నాం. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో 2016 వ‌ర‌కు చూసుకుంటే ఏ హీరో టాప్ అని లెక్క‌లేసుకుంటే .. ఏ హీరో అభిమానులు ఎవ‌రికి వారే త‌మ హీరోనే గొప్ప అని…నెంబ‌ర్ వ‌న్ అని చెప్పుకుంటారు. వాస్త‌వంగా చూస్తే మ‌రి ఏ హీరో 2016లో టాలీవుడ్ టాప్ హీరోగా గ‌ణాంకాలు చెపుతున్నాయో చూద్దాం.
ఈ యేడాది అగ్ర‌హీరోల్లో బాల‌య్య డిక్టేట‌ర్‌తో బిలో యావ‌రేజ్ మార్కులు వేయించుకున్నాడు. బాలకృష్ణతో పాటే సంక్రాంతికి వచ్చిన నాగార్జున బాక్సాఫీసుని బద్దలు కొట్టాడు. సోగ్గాడే చిన్నినాయన రూపంలో కెరీర్ బెస్ట్ గ్రాసర్ ని అందుకున్నాడు. ఊపిరితో మళ్ళీ మెరిసిన నాగ్, తన ఖాతాలో మరో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.
ఇక టాప్ 2 హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. ఈ యేడాది వీరిద్ద‌రు న‌ష్టాల విష‌యంలో పోటీప‌డ్డారు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం .. రెండు ఈ ఏడాదికి రెండు అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు. సమ్మర్ లో వచ్చిన బన్ని రూ.70 కోట్లు కొల్ల‌గొట్టి కేరీర్లోనే టాప్ హిట్ సాధించాడు.
మ‌రో అగ్ర‌హీరో విక్ట‌రీ వెంకటేష్ బాబు బంగారం యావరేజ్ గా నిలిచింది. రాంచ‌ర‌ణ్ ధృవ మ‌నోడికి చాలా రోజుల త‌ర్వాత రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేసింది. యువహీరోల్లో వరుస విజయాలు అందుకుంటున్న నటుడు నాని. ఈ ఏడాదిలో మూడు విజయాలు (కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్‌మెన్‌, మజ్ను) ఉన్నాయి. మరే యువహీరోకు దక్కని క్రెడిట్‌ నానికి లభించింది.
అక్కినేని మూడవతరం వారసుడు నాగచైతన్య నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ప్రేమమ్‌ మంచి విజయాన్ని అందించింది. నోట్ల రద్దు తర్వాత విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో యావ‌రేజ్ అయ్యింది. నితిన్ అ..ఆతో రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరి కేరీర్‌లోనే తిరుగులేని హిట్ కొట్టాడు.
2016 టాప్ హీరో ప్లేస్ ఎన్టీఆర్‌దే…తిరుగులేదు :
ఇక ఈ యేడాది టాప్ ప్లేస్ కొట్టేసిన ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి రెండు సూప‌ర్ హిట్లు సొంతం చేసుకున్నాడు. కేవ‌లం 7 నెల‌ల వ్య‌వ‌ధిలో ఎన్టీఆర్ రెండు రూ.50 కోట్ల సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. నాన్న‌కు ప్రేమ‌తో రూ.55 కోట్ల షేర్ సాధిస్తే, గ్యారేజ్ ఏకంగా రూ.83 కోట్ల షేర్ సాధించి….ఎన్టీఆర్ కేరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో పాటు టాలీవుడ్ ఆల్ టైం టాప్‌-3 సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది. సో ఈ యేడాదికి ఎన్టీఆరే టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరో ర్యాంకు సొంతం చేసుకున్న‌ట్టే అనుకోవాలి.


లేబుళ్లు:

హాట్‌ యాంకర్‌ ప్లానేంటి?


బుల్లితెర మీద ‘జబర్దస్త్‌’ ప్రోగ్రామ్‌తో సూపర్‌ పాపులర్‌ అయిపోయింది యాంకర్‌ అనసూయ. మిగిలిన హాట్‌ యాంకర్లతో పోలిస్తే అనసూయ కాస్త వెరైటీ. ప్రస్తుతం ఆమె 30ల్లో ఉంది. పైగా ఇద్దరి పిల్లల తల్లి. అయినా గ్లామర్‌ విషయంలో ఎలాంటి హద్దులూ పెట్టుకోదు.

అదే ఆమెకు సినిమా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది ఆమె నటిచించిన రెండు సినిమాలు (సొగ్గాడే చిన్నినాయన, క్షణం) సూపర్‌హిట్‌లుగా నిలిచాయి. అయినా ఆమె వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోకుండా ఆచితూచి అడగులేస్తోంది. ఇటీవల మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌ ‘విన్నర్‌’ సినిమాలో ఓ ఐటెం పాట చేసింది. ‘క్షణం’కు, ‘విన్నర్‌’కు మధ్య వచ్చిన గ్యాప్‌లో ఈ అమ్మడు పూర్తిగా గ్లామర్‌ మీద దృష్టిపెట్టిందట. కష్టమైన వర్కవట్లు చేసి సూపర్‌ ఫిజిక్‌ సాధించిందట. తాజాగా అనసూయ ఓ ఫోటో సెషన్‌లో పాల్గొంది. వైట్‌ టాప్‌, బ్లాక్‌ బాటమ్‌తో అందర్నీ అకట్టుకుంటోంది. ఇప్పటికీ బుల్లితెరను పూర్తిగా వదలని అనసూయ వచ్చే ఏడాది మరిన్ని సినిమా అవకాశాలు అందుకోవాలనే ఆలోచనలో ఉంది.


లేబుళ్లు:

ఎన్టీఆర్ పేరు తలచుకొని.. కన్నీటిపర్యంతమైన సప్తగిరి


కమెడియన్ సప్తగిరి తొలిసారి కథానాయకుడిగా నటించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మంచి విజయం సాధించింది. ఈ మూవీతోపాటు బరిలో మరో మూడు చిత్రాలు విడుదలైనా.. ఆ పోటీని ధీటుగా ఎదుర్కొని అంచనాలకు మించే భారీ వసూళ్లు రాబడుతోంది. నిజానికి.. ఈ చిత్రానికి రివ్యూలు అంతగా ప్రోత్సాహకరంగా రాలేదు. విమర్శకులు కూడా ఈ చిత్రానికి అంత సీన్‌ లేదంటూ పెదవి విరిచారు. కానీ.. అవేవీ ఈ చిత్రంఫై ఎఫెక్ట్ చూపలేదు. మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. దీంతో.. ఈ చిత్రబృందం ఆడియెన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ సక్సెస్ టూర్‌లు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే.. బుధవారం విశాఖపట్టంలోని అనకాపల్లి టౌన్‌ మెయిన్ రోడ్డు దగ్గర శ్రీసత్య థియేటర్‌లో చిత్రబృందం సందడి చేసింది. తమ చిత్రానికి ఇంతపెద్ద విజయం అందించినందుకు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ.. తన 12 ఏళ్ల కష్టానికి ఈరోజు ఫలితం చూశానని అన్నాడు. ప్రేక్షకులే దేవుళ్లుగా నిలబడి తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రేక్షకుల కోసం ఎంత దూరమైనా వస్తానని, ఇది మీరిచ్చిన జీవితమని చెప్పాడు. ఇక ఇదే సమయంలో మహానటుడు ఎన్టీఆర్ పేరుని తలచుకొని కన్నీంటి పర్యంతమయ్యాడు. ‘దాన వీరశూరకర్ణ’మూవీలో ఆ మహానటుడు చెప్పిన ఒక్క డైలాగు తానూ చెప్పడంతో.. అది తన జీవితాన్ని మార్చేసిందని ఆనందభాష్పాలతో వెల్లడించాడు. ఆ డైలాగ్ పూర్తిగా చెప్పాలని ప్రజలు కోరగా.. అది చెప్పి సప్తగిరి అందరినీ ఆకట్టుకున్నాడు.


లేబుళ్లు:

29, డిసెంబర్ 2016, గురువారం

భారీ రేటుకి ‘శాతకర్ణి’ శాటిలైట్ రైట్స్.. బాలయ్య కెరీర్‌లో రికార్డ్


టాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఒకటి. ఇది బాలయ్య వందోచిత్రం కావడం, క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి శాతకర్ణి నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ అవ్వడం వల్ల.. దీనిపై భారీ క్రేజ్ నెలకొంది. ఆ కారణంగానే.. ఈ చిత్రం భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ దాదాపుగా భారీ రేట్లకే అమ్ముడుపోయాయి. తాజాగా శాటిలైట్ రైట్స్ కూడా రికార్డ్ రేటుకి సోల్డ్ అయ్యాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని అక్షరాల రూ.9 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్ ఫిగర్. ఈ చిత్రంపై నెలకొన్న భారీ అంచనాల కారణంగానే దీని శాటిలైట్ రైట్స్ ఈ రేంజుకి సోల్డ్ అయ్యాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.60 కోట్లకు చేరుకుందని అంచనా వేస్తున్నారు. రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ఇలా ప్రభంజనాలు సృష్టిస్తుండడంతో.. రిలీజయ్యాక బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమేనని భావిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రియాశరన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలయ్య తల్లి ‘గౌతమీ’గా బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


లేబుళ్లు:

28, డిసెంబర్ 2016, బుధవారం

ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెర్రీ రికార్డుపై జోకులు


ఏ సినిమా ఇండ‌స్ట్రీలో అయినా హీరోల అభిమానులు త‌మ హీరోనే గొప్ప అంటూ ర‌క‌ర‌కాల రికార్డుల‌ను ప్ర‌చారం చేసుకోవ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్లో యంగ్ హీరోల అభిమానుల మ‌ధ్య సైతం ఇలాంటి వారే న‌డుస్తోంది. తాజాగా ధృవ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ఓ రికార్డును క్రాస్ చేశాడు.
ఎప్పుడో 2012లో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన బాద్ షా సినిమా ఓవ‌ర్సీస్‌లో సాధించిన రికార్డును చెర్రీ ధృవ‌తో బీట్ చేశాడు. నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల క్రిత‌మే బాద్ షా సినిమా ఓవ‌ర్సీస్‌లో 1.28 మిలియన్ డాలర్లను కలెక్ట్ చెయ్యగా, ఇప్పుడు ధృవ 1.29 మిలియన్ డాలర్స్ వసూలు చెయ్యడంతో యంగ్ టైగర్ రికార్డ్ ను చరణ్ బ్రేక్ చేసిన‌ట్ల‌య్యింది.
మ‌రో విశేషం ఏంటంటే చెర్రీకి ఓవ‌ర్సీస్‌లో ఇదే తొలి మిలియ‌న్ మార్క్ సినిమా. ఈ రికార్డును చెర్రీ అభిమానులు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ రికార్డు బీట్ చేసిన చెర్రీ అని పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు కౌంట‌ర్ ఎటాక్ చేస్తూ జోకులు వేసుకుంటున్నారు.
అప్పుడెప్పుడో వ‌చ్చిన బాద్ షా రికార్డును బ్రేక్ చేయ‌డానికే చెర్రీకి ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌డితే ఇక టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ సినిమాల రికార్డులు బీట్ చేయ‌డానికి ఇంకెన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుందో మీ చెర్రీకి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెర్రీ రికార్డుపై జోకులు వేసుకుంటున్నారు.


లేబుళ్లు:

శాత‌క‌ర్ణి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎన్టీఆర్‌


నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు అయిన బాబాయ్-అబ్బాయ్ మధ్య వాతావ‌ర‌ణం ఇంకా హాట్ హాట్‌గానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఎన్టీఆర్ – క‌ళ్యాణ్‌రామ్ ద‌గ్గరుండి ఏర్పాట్లు చేసిన జాన‌కీరామ్ కుమారుడు పంచెక‌ట్టు ఫంక్ష‌న్‌కు బాల‌య్య డుమ్మా కొట్టేశారు. ఇక బాల‌య్య 100వ సినిమా శాత‌క‌ర్ణి ఆడియో ఫంక్ష‌న్‌కు ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్‌రామ్ బ్ర‌ద‌ర్స్‌కు ఆహ్వాన‌మే అంద‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి.
ఈ ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ మాత్రం బాబాయ్‌తో క‌లిసేందుకు ఆరాట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్ ను యంగ్ టైగర్ మెచ్చుకున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో ట్రయిలర్ ఉందని ట్వీట్ చేశాడు. మొన్న విడుదలైన సాాంగ్స్ కూడా బాగున్నాయంటున్నాడు. ఇక క‌ళ్యాణ్‌రామ్ సైతం శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.
ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ శాత‌క‌ర్ణికి టాప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మార‌తాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఎన్టీఆర్ ఇప్పుడు బిజీగా ఏం లేడు. కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ఇంకాస్త టైం ఉంది. సో… బాలయ్య అడిగినా అడగ‌కపోయినా… శాతకర్ణి సినిమా రిలీజ్‌కు ముందు…రిలీజ్ త‌ర్వాత కూడా ఎన్టీఆర్ ఆ సినిమాపై ట్వీట్లు పెడుతూ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా త‌న వంతుగా ప్రమోట్ చేస్తాడ‌న్న చ‌ర్చ ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది.
ఎన్టీఆర్ ఇటీవ‌లే త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన ఇజం సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేశాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌కు కూడా హాజరయ్యాడు. సో… ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని.. శాతకర్ణి సినిమాను కూడా ఎన్టీఆర్ త‌న వంతుగా ప్ర‌మోట్ చేయ‌డం ఖాయంగా క‌న‌ప‌డుతోంది. మ‌రి ఎన్టీఆర్ ప్ర‌మోష‌న్‌ను బాల‌య్య ప‌ట్టించుకుంటాడో ? లేదో ? చూడాలి.


లేబుళ్లు:

పవన్ కళ్యాణ్ కు పోటి గా జూనియర్ ఎన్టీఆర్ గర్జన..


నందమూరి వంశం లో సినియర్ ఎన్టీఆర్ తరువాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్నా నేటితరం యంగ్ డైనమిక్ నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాబీ డెరక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఈ విషయం అందరికి తెలిసిందే. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స పైకి వెళ్తుంది.ఒక్క సారి ఈ మూవీ మ్యాటర్ ను అలా ప్రక్కన పెడితే, తాజాగా ఎన్టీఆర్ కు సంబందించిన తన ప్రవర్తనను చూస్తే రాజకీయాలకు ముస్తాబవుతున్నాడో అని అనిపిస్తోంది.

దీనికి సంబందించిన లెటేస్ట్ ట్వీస్ట్ పవన్ కళ్యాణ్ కు షాకింగ్ అనే చెప్పాలి. దీని కి సంబందించి విషయాలు తెలుసుకోవాలంటే 2014 లో ఎన్నికల సమీకరణాలను ఒక సారి పరిశీలించాల్సిందే. అప్పట్లో కాకినాడ లో ఒక భారీ బహిరంగ సభ ను ఎర్పాటు చేశాడు. మిగతా పార్టీ వారికి దిమ్మ తిరిగి పోయేలాగా తెలుగుదేశం పార్టీ ఒక రేంజ్ లో పోగిడాడు. ప్రజా నాయకుడు బాబు నమ్మవల్సిందిగా ఇది నా హామీ అంటూ మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

అనుకున్నాట్లుగానే అప్పట్లో టీడిపి ఉహించని రీతి లో పుంజుకోని తిరిగి అధికారాన్ని చేజిక్కుంది.ఇక్కడ ఆంద్రప్రదేశా రాజకీయాల్లో తూ.గో ,ప.గో జిల్లాలకు ఒక ప్రత్.కమైన స్ధానం ఉంది. ఈ రెండు జిల్లాలో ఎ పార్టీ అయితే రాజకీయాంగా ముందుంటుందో ఆ పార్టే అధికారం కైవసం చేసుకుంటుంది.అదీ ఎప్పటో అలా వస్తునే ఉంది.

2014 లో కాకినాడ లో అదీ పవన్ మేనియా తో మళ్ళీ అదీ రుజువు అయింది.మళ్ళీ మెన్న పవన్ కళ్యాణ్ సభ కు అదే దైర్యం ఎర్పడింది..
అందుకే తాజా గా జూనియర్ కాకినాడ టూర్ కు వెళ్ళినట్లు సమాచారం. జూనియర్ కు అడుగుఅడుగనా ప్రజలు నీరాజనాలు పలికారు. కోందరు తమ్ముళ్ళు అయితే ఒక అడుగు ముందుకు వెళ్ళీ, జై ఎన్టీఆర్,జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.

ఇప్పుడే ఇదే ఆంశం తెలుగుదేశం లో హాట్ టాపిక్ గా మారింది. తారక్ ఫాలోయింగ్ చూసి లోకల్ నాయకలు ఆశ్చర్యపోయారు అని సమాచారం. తెలుగుదేశం లో ముఖ్యమైన నాయకలు చాలా మంది బాబు దగ్గర ఈ విషయాన్నే ప్రస్తావించినట్లు సమాచారం. పవన్ ఒక వేళ టీడిపి ఎదురు నిలబడితే, పవన్ ను ఎదుర్కోవాలి అంటే జూనియర్ ఒక్కడే ఆప్షన్.
అప్పట్లో చిరంజీవి కే షాకిచ్చినా జూనియర్ ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఎవిధంగా షాక్ ఇస్తాడో చూడాలి.


లేబుళ్లు:

27, డిసెంబర్ 2016, మంగళవారం

త‌మ‌న్నా పెళ్లి చేసుకునేది ఆ అబ్బాయితొనే


మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు కుర్రాళ్ళకు ఎంత సేపు చూసినా తనివితీరవు. బాహుబ‌లి త‌ర్వాత ఈ మిల్కీబ్యూటీ కేరీర్ ఒక్క‌సారిగా పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రీసెంట్‌గా విశాల్ ప‌క్క‌న ఆమె న‌టించిన ఒక్క‌డొచ్చాడు సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ఇంట‌ర్వ్యూలో త‌మ్మూ బేబీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇచ్చేసింది.
తాను త్వ‌రోల‌నే పెళ్లి చేసుకుంటాన‌ని… త‌న మనసుకు నచ్చిన వ్యక్తి ఇంతవరకు కనిపించలేదు. వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళు చెప్పిన అబ్బాయినే చేసుకుంటా, ఒక వేళా నాకు ఎవరైనా నచ్చితే ఇంట్లో ఒప్పించే పెళ్లి పీటలెక్కుతా అని క్లారిటీ ఇచింది. ఇక పెళ్లి త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తారా ? అనే ప్ర‌శ్న‌కు ఆమె స్పందిస్తూ బాలీవుడ్‌లో విద్యా బాలన్, కరీనా కపూర్ పెళ్లి తరువాత కూడా నటిస్తున్నారు కదా ? అలాంటప్పుడు నేను ఎందుకు నటించకూడద‌ని ప్రశ్నించింది.
ఇంకా చెప్పాలంటే పెళ్లి త‌ర్వాత త‌న పిల్ల‌ల‌ను తీసుకుని కూడా సెట్‌కు వ‌స్తాన‌ని చెప్పింది. ఇక మారిన టెక్నాల‌జీ నేప‌థ్యంలో చాలా మంది స్మార్ట్ ఫోన్స్ వ‌ల్ల మ‌నుష్యుల‌కు దూర‌మైపోతున్నార‌ని.. త‌న వ‌ర‌కు అయితే ఇంటికి వెళ్లినా, ఫ్రెండ్స్‌ను క‌లిసినా ఇంటికి దూరంగా ఉంటాన‌ని చెప్పింది.
ఇక న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా తాను ప్ర‌త్యేకంగా ఏమీ రిజ‌ల్యూష‌న్స్ పెట్టుకోలేద‌ని..త‌న వ‌ర‌కు అయితే త‌న బాడీని ఫిట్‌గా ఉంచుకోవాల‌న్న‌దే త‌న గోల్ అని చెప్ప‌కొచ్చింది మిల్యీబ్యూటీ.


లేబుళ్లు:

త్రివిక్రమ్, పూరీ, క్రిష్ ముగ్గురిలో మోక్షజ్ఞ


బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తోంది. బాల‌య్య సినీ మ‌జిలీలో ఓ కీల‌క ఘ‌ట్టం పూర్త‌య్యింది. ఇక తన తనయుడిని హీరోగా లాంఛ్‌ చేయడమే నందమూరి బాలకృష్ణకు ఉన్న మరో అతి పెద్ద బాధ్యత. వంద సినిమాలను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు మోక్షజ్ఞ ను హీరోగా పరిచయం చేసే సినిమాకోసం కసరత్తు ప్రారంభించారు.
వాస్త‌వానికి బాల‌య్య వందో సినిమా శాత‌క‌ర్ణిలోనే మోక్షుకు ఓ రోల్ ఉంటుంద‌ని ముందు వార్త‌లు వ‌చ్చాయి. అయితే త‌ర్వాత ఆ వార్త‌ల‌కు తెర‌ప‌డింది. ఇక 2017లోనే మోక్ష‌కు డెబ్యూ మూవీ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాను బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడు, లెజెండ్ డైరెక్ట‌ర్ సాయి కొర్ర‌పాటి నిర్మిస్తార‌ని తెలుస్తోంది.
మోక్షు కాల్షీట్లు ఇప్ప‌టికే సాయి కొర్ర‌పాటికి బాల‌య్య ఇచ్చేశాడ‌ని కూడా ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ డెబ్యూ మూవీ కోసం బాల‌య్య ముగ్గురు దర్శకులను పరిగణనలోకి తీసుకున్నారట. త్రివిక్రమ్, పూరీ, క్రిష్.. వీళ్లు ముగ్గురిలో ఎవరో ఒకరితో మోక్షజ్ఞ తొలి సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ ముగ్గురు దర్శకులూ మూడు రకాలుగా ప్రత్యేకతను కలిగిన వారే.. మరి బాలయ్య ఎవరి చేతిలో తనయుడిని పెడతాడో చూడాలి.


లేబుళ్లు: , ,

బాల‌య్యా ఈ రాంగ్ స్టెప్ ఏంటి..!


బాలయ్య ఒక్కోసారి ఎలాంటి డెసిష‌న్లు తీసుకుంటాడో ఆయ‌న‌కే తెలియ‌ద‌న్న‌ట్లుగా ఉంటుంది. ఆయ‌న ఇచ్చిన మాట‌కోసం క‌ట్టుబ‌డి ఆ డైరెక్ట‌ర్ క్రేజ్‌, వాల్యూ ప‌ట్టించుకోకుండానే చాలా మంది ఛాన్సులు ఇచ్చేస్తుంటాడు. అలా ఛాన్సులు ఇచ్చిన‌ప్పుడ‌ల్లా బాల‌య్య సినిమాలు ప్లాప్ అయినా మ‌ళ్లీ తిరిగి భారీ రిస్క్‌లు చేస్తుంటాడు.
సింహా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాసరి నారాయణ రావుతో ‘పరమవీరచక్ర’ లాంటి సినిమా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. సినిమా డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్ అయ్యింది. లెజెండ్ త‌ర్వాత స‌త్య‌దేవా లాంటి కొత్త డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇస్తాడ‌ని ఎవ్వ‌రైనా ఊహించారా..రిజ‌ల్ట్ సేమ్ టు సేమ్‌. ల‌య‌న్ డిజాస్ట‌ర్ అయ్యింది.
మ‌ళ్లీ ఇప్పుడు బాల‌య్య పెద్ద సాహ‌స‌మే అనేక‌న్నా…భారీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా అంటే అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్న బాలయ్య.. దీని తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేస్తాడంటూ ఒక షాకింగ్ రూమర్ బయటికి వచ్చింది.


కృష్ణారెడ్డి క‌థకు బాల‌య్య‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ని…. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంద‌ని… బాలయ్యకు సన్నిహితుడైన ‘వారాహి చలనచిత్రం’ అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడన్న రూమ‌ర్లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.
దీనిపై బాల‌య్య అభిమానులు సైతం అసంతృప్తితో ఉన్నారు. కృష్ణారెడ్డి ఒకప్పుడు టాప్ ఫాంలో ఉండగా బాలయ్యతో ‘టాప్ హీరో’ అనే సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయింది. చివ‌ర‌గా ఆయ‌న నుంచి వ‌చ్చిన య‌మ‌లీల‌-2 డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు కృష్ణారెడ్డితో బాల‌య్య సినిమా నిజ‌మైతే అది రాంగ్ స్టెప్పే అని బాల‌య్య అభిమానులే అంటున్నారు.

లేబుళ్లు:

నందమూరి అభిమానుల కి మిలియన్ డాలర్ల ప్రశ్న..


తారక్ మనస్సులో బాలయ్య బాబు పై ఎలాంటి మనస్పర్ధలు కానీ  విభేధాలు లేవు అని ఎప్పటికప్పుడు జూనియర్ స్ఫష్టం చేస్తుూనే ఉన్నాడు. కానీ బాలయ్య బాబు మనస్సులో ఎముందో ఎవ్వరికి తెలియడం లేదు. కనీసం తారక్ పై నోరు కూడా మెదపడం లేదు. అసలు సమస్య ఇక్కడే వస్తోంది. పైగా తారక్ ఇప్పుడు సోంత కాళ్ళ పై నిలబడి తనకంటూ ఒక బ్రాండ్ ను ఎర్పచుకున్నాడు. ఇలాంటి సమయం లో తారక్ తో కలిసి ఉండటం బాలకృష్ణ కి కూడా మంచిదే.


నిన్న సాయంత్రం  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే ఇది జూనియర్ కళ్యాణ్ రామ్ లకు షాక్ ఇచ్చినట్లుగా ఫిలింనగర్ లో గాసిప్పులు గుప్పుమంటున్నాయి. జూనియర్ బాలయ్యల మధ్య సాన్నిహిత్యం తరిగిపోయి చాలాకాలమే అయిపోయినా జూనియర్ ఏదోవిధంగా బాలకృష్ణతో సద్దుబాటు చేసుకుందామని చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన వార్తలు ఇప్పటికే అనేక సార్లు వచ్చాయి.

లేటెస్ట్ గా ‘శాతకర్ణి’ ట్రైలర్ విడుదలైన కొద్ది సేపటికే జూనియర్ ఆ ట్రైలర్ ను ముఖ్యంగా బాలకృష్ణను ఆకాశంలోకి ఎత్తేస్తూ తన ట్విటర్ లో కామెంట్స్ చేయడంతో జూనియర్ బాలయ్యల కలయిక ఎదో ఒక సందర్భంలో బహిరంగంగా ఉంటుంది అని కలలు కన్నారు నందమూరి అభిమానులు. అయితే ఆ కలలు కూడ కల్లలుగా మారినట్లు సంకేతాలు వస్తున్నాయి.

అయితే ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం నిన్న సాయంత్రం జరుగిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ఇన్విటేషన్ కూడ జూనియర్ కళ్యాణ్ రామ్ లకు ఇప్పటివరకు చేరలేదు అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఫంక్షన్ బాలయ్య ఇంటి ఫంక్షన్ కాకపోయినప్పటికీ బాలకృష్ణ సన్నిహితులు చాలామందికి ‘శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ఇన్విటేషన్స్ పంపినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఎంతోమందిని తన 100వ చిత్రం ఆడియో ఫంక్షన్ కు శ్రద్ధతో పిలిచిన బాలకృష్ణ ఈనందమూరి బ్రదర్స్ ను మళ్ళీ పక్కకు పెట్టాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పట్లో బాలయ్యా జూనియర్ ల మధ్య సయోధ్య కుదరడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శత్రువులు అదేవిధంగా శాశ్విత మిత్రులు కలకాలం ఉండరు కాబట్టి ఎదో ఒకరోజు బాలయ్యా జూనియర్లు ఒకే వేదిక పై హడావిడి చేసే రోజులు వస్తాయని నందమూరి అభిమానులు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు..

అయితే తారక్ మనస్సులో బాలయ్య బాబు పై ఎలాంటి మనస్పర్ధలు కానీ  విభేధాలు లేవు అని ఎప్పటికప్పుడు జూనియర్ స్ఫష్టం చేస్తుూనే ఉన్నాడు. కానీ బాలయ్య బాబు మనస్సులో ఎముందో ఎవ్వరికి తెలియడం లేదు. కనీసం తారక్ పై నోరు కూడా మెదపడం లేదు. అసలు సమస్య ఇక్కడే వస్తోంది. పైగా తారక్ ఇప్పుడు సోంత కాళ్ళ పై నిలబడి తనకంటూ ఒక బ్రాండ్ ను ఎర్పచుకున్నాడు. ఇలాంటి సమయం లో తారక్ తో కలిసి ఉండటం బాలకృష్ణ కి కూడా మంచిదే. ఫంక్షన్ లో  వీరిద్దరు కలిసి ఉంటే ఆ కికే వేరు. మరి దాని కోసం  ఎన్ని రోజులు వేచి చూడాలో.


లేబుళ్లు:

24, డిసెంబర్ 2016, శనివారం

టాలీవుడ్ కి మంచి రోజులు…


ఇంతకు ముందు టాలీవుడ్ లో మెత్తం అన్ని మల్టీ స్టారర్ మూవీ స్ ఎక్కువగా వచ్చేవి.కానీ ఆ తరువాత హిరో ల మద్య క్రేజ్ పెరిగపోయి మల్టీ స్టారర్ మూవీస్ చాలా తక్కువగా వచ్చాయి. కానీ గత నాలుగు సంవత్సరాల నుండి చాలా  ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నా ఒక్క కుటుంబంలోని వారే చేస్తున్నారు. వెంకటేశ్-మహేశ్ బాబు, పవన్ కల్యాణ్-వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలే రెండు వేర్వేరు కుటుంబాల హీరోలు చేసిన సినిమాలు. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా వచ్చింది.

ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల గురించి మాట్లాడినా.. ఒక్క కుటుంబంలోని హీరోల గురించే ప్రస్తావన వస్తోంది. హీరోలంతా తాము మల్టీస్టారర్ సినిమాల్లో చేసేందుకు రెడీ అంటున్నా.. ఆ దిశగా అడుగులు అయితే పడడం లేదు. తాజాగా ఆ దిశగా అడుగులు పడినట్టు చెబుతున్నారు. 
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. ఆ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడని చెప్పుకొంటున్నారు. అయితే.. వాళ్లిద్దరూ పూర్తి హీరోలుగా మాత్రం నటించరట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తీస్తున్న సినిమాలో వాళ్లిద్దరూ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారన్న ప్రచారం సాగుతోంది. 
ఆ అతిథి పాత్రల కోసం వారిద్దరినీ కలపాలని బోయపాటి యోచిస్తున్నాడట. అందుకు తగ్గట్టు స్క్రిప్టులో మార్పులు-చేర్పులు కూడా చేసినట్లు చెప్పుకొంటున్నారు. దాంతో పాటు సినిమా బడ్జెట్‌ను పెంచేశారట. ఇంతకుముందు 22 కోట్లతో తీయాలనుకున్న సినిమాకు.. రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారన్న ప్రచారం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో సాగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఓ క్రేజీ కాంబోను తెరపై చూడొచ్చన్నమాటే.


లేబుళ్లు:

కాకినాడ వచ్చిన తారక్.. కారణం అదేనా!


జూనియర్ ఎన్టీఆర్ బయటకి వస్తే సందడే సందడి ఉంటుంది కదండీ! అలాంటి హడావుడే రాజమండ్రి ఎయిర్ పోర్టులో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కాకినాడకు వచ్చాడు తారక్. ఈ ప్రయాణంలో భాగంగా రాజమండ్రి విమానాశ్రయంలో దిగాడు. అంతే అభిమానులు ఒక్కసారిగా సందడి చేశారు. కేరింతలు కొడుతూ పలకరించారు. తారక్ కూడా అభిమానులను పలకరించాడు. ఆ తరువాత రాజమండ్రి నుంచి కాకినాడకు పయనమయ్యాడు. ఇంతకీ.. ఉన్నట్టుండీ హఠాత్తుగా కాకినాడలో తారక్ ఎందుకు ప్రత్యక్షమైనట్టు అనే అనుమానం కలగడం సర్వసాధారణం. ఉన్నట్టుండి ఒకేసారిగా కాకినాడలో తారక్ ను చూసిన అభిమానులు కూడా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు.

ఏదైనా కొత్త సినిమా షూటింగ్ కోసం కాకినాడ వచ్చాడా అనుకుంటే... కొత్త సంవత్సరంలోనే తారక్ తదుపరి చిత్రం మొదలయ్యేట్టుగా ఉంది. ప్రస్తుతానికైతే ఆ సందడే కనిపించడం లేదు. ఇంతకీ కాకినాడకు తారక్ వచ్చిన కారణం ఏంటంటే... అక్కడో కుటుంబ కార్యక్రమం జరిగింది. హరికృష్ణ మనవడు మాస్టర్ నందమూరి తారక రామారావుకు పంచెకట్టు ఫంక్షన్ కాకినాడలో జరిగింది. హరికృష్ణ కుమారుడు తారక్ కల్యాణ్ రామ్ ల సోదరుడు జానకిరామ్ ఓ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడే మాస్టర్ ఎన్టీఆర్. దాన వీర శూర కర్ణ అనే చిత్రంలో కూడా ఈ కుర్రాడు నటించాడు. కాకినాడలో జరిగిన ఈ ధోతీ సెర్మనీకి తారక్ కుటుంబంతోపాటు కల్యాణ్ రామ్ హరికృష్ణలు కూడా హాజరయ్యారు. సో... కాకినాడకు తారక్ వచ్చిన కారణం అది. 




లేబుళ్లు:

23, డిసెంబర్ 2016, శుక్రవారం

ఎన్టీఆర్ కి గణ స్వాగతం ఫాన్స్ కి పండగ


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నాన్నకు ప్రేమతో,జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ లతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో లో ఒక్కడిగా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేసాడు.జనతగ్యారేజ్ హిట్ తరువాత మూడు నెలలో సమయం తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడి అయ్యాడు.

ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ బ్యానర్ లో సద్దర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. రీసెంట్ ఎన్టీఆర్ లుక్ లీక్ అయింది.రీసెంట్ గా రాజముండ్రి వెళ్ళిన ఎన్టీఆర్ అక్కడి ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ కి గణ స్వాగతం పలికారు.

ఎన్టీఆర్ చుసిన అక్కడి ఫాన్స్ పండగ చేసుకుంటుంటే ఎన్టీఆర్ చుసిన చాలా మంది షాక్ అయ్యారు.నెల రోజుల క్రింత ఎన్టీఆర్ లుక్ చూసి ఇప్పటి ఎన్టీఆర్ లుక్ చూసి షాక్ అయ్యారు.నెల రోజులోనే 8 కిలోల బరువు తగ్గి టెంపర్ లుక్ తో ఎన్టీఆర్ అదుర్స్ అనే విధంగా ఉన్నాడు.

లేబుళ్లు:

ఎన్టీఆర్-బాబీ మూవీకి అదిరిపోయే టైటిల్..


ఎన్టీఆర్-బాబీ కాంబో సినిమా చకచకా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే హీరోయిన్లతోపాటు ప్రముఖ తారాగణాన్ని ఎంచుకున్న ఈ చిత్రబృందం.. ఇప్పుడు టైటిల్‌గా ఓ పేరు పెట్టాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీకి ‘నటవిశ్వరూపం’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ ఆలోచిస్తోందట. ఈ మూవీ కథకి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో.. ఆ పేరే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’పై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం పోషిస్తున్నాడు. అతని సరసన కాజల్ అగర్వాల్, నివేద థామస్, అనుపమలు కథానాయికలుగా నటించనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే నెలలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా చిత్రీకరణని శరవేగంగా ముగించి.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.


లేబుళ్లు:

రివ్యూ: సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ …


చిత్రం: సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌
నటీనటులు: సప్తగిరి.. రోషిణి ప్రకాష్‌.. అలీ.. షకలక శంకర్‌.. పోసాని కృష్ణమురళి.. షాయాజీ షిండే.. అజయ్‌ ఘోష్‌.. శివప్రసాద్‌ తదితరులు
సంగీతం: బుల్గానిన్‌
ఛాయాగ్రహణం: రాంప్రసాద్‌
కూర్పు: గౌతంరాజు
నిర్మాత: కె.రవికిరణ్‌
దర్శకత్వం: అరుణ్‌ పవార్‌
సంస్థ: సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌
విడుదల: 23-12-2016
హాస్యనటులు హీరోలుగా అవతారం ఎత్తడం తెలుగు చిత్రసీమకు కొత్తమీ కాదు. తాజాగా సప్తగిరి కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ‘పరుగు’, ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’.. ఇలా పలు చిత్రాల్లో తనదైన విభిన్నమైన వినోదం పండించి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొన్న సప్తగిరి.. ఇప్పుడు ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’తో హీరో అయిపోయాడు. మరి నవ్వులూ అదే స్థాయిలో పండించాడా? లేదంటే ‘హీరోయిజం’ కోసం ఆరాటపడ్డాడా? సప్తగిరికి కథానాయకుడిగా ఎన్ని మార్కులు పడతాయి? తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..: శివ ప్రసాద్‌ (శివ ప్రసాద్‌) ఓ నిజాయతీగల కానిస్టేబుల్‌. తనయుడు సప్తగిరి (సప్తగిరి)ని మాత్రం ఐఏఎస్‌ చేయాలనుకొంటాడు. కానీ సప్తగిరికి సినిమాలూ, నాటకాలంటే పిచ్చి. సినిమా నటుడవ్వాలని కలలు కంటుంటాడు. తన కాలనీకి కొత్తగా వచ్చిన పూర్ణిమ (రోషిణి ప్రకాష్‌) వెంట పడుతుంటాడు. ఓ ఎన్‌కౌంటర్‌లో శివప్రసాద్‌ని దారుణంగా చంపేస్తారు. తండ్రి ఉద్యోగం సప్తగిరికి వస్తుంది. తన తండ్రి మరణం వెనుక మనుషులున్నారన్న సంగతి తెలుసుకొన్న సప్తగిరి ఏం చేశాడు? ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? అనేదే ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ కథ.
ఎలా ఉందంటే..: తమిళంలో విజయాన్ని అందుకొన్న ‘తిరుడన్‌ పోలీస్‌’కి రీమేక్‌ ఇది. అయితే సప్తగిరి కోసం చాలా మార్పులు చేసినట్టు అర్థమవుతోంది. అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు, తన తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడన్నది కథ. మామూలు హీరో అయితే… పగ-ప్రతీకారం అంటూ భారీ డైలాగులు, యాక్షన్‌ ఛేజింగులతో తీసేద్దురు. కానీ ఇక్కడున్నది సప్తగిరి కావడంతో ఈ ఫార్ములా కాస్త కామెడీ బాట పట్టింది. సప్తగిరి ‘సినిమా పిచ్చి’తో నడిచిన ప్రారంభ సన్నివేశాలు నవ్విస్తాయి. కాలనీలో ప్రేమకథ కూడా ఓకే అనిపిస్తుంది. మరో వైపు తండ్రీ-కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు వస్తుంటాయి. సింగిల్‌ టేక్‌లో దానవీర శూరకర్ణ డైలాగ్‌ చెప్పడం ఆకట్టుకొంటుంది. కానిస్టేబుల్‌ అయిన తర్వాత సప్తగిరి పడే కష్టాలు, తండ్రిని గుర్తు చేసుకొంటూ ఎమోషన్‌కి గురైన సందర్భాలు ఆకట్టుకొనేవే. పతాక సన్నివేశాలు కూడా నచ్చుతాయి. కానీ.. రివేంజ్‌ డ్రామా మాత్రం అతకలేదు. దాన్ని మరీ కామెడీ చేశారు. అంతర్లీనంగా ఓ సీరియస్‌ విషయం ఉన్నా.. దాన్ని సప్తగిరి కోసం కామెడీగా మార్చేయడంతో కథలో సీరియస్‌నెస్‌ తగ్గింది.

ఎవరెలా చేశారంటే..: ‘నేను అన్నీ చేయగలను’ అని నిరూపించుకోవడానికి సప్తగిరి చేసిన ప్రయత్నంలా అనిపించింది ఈ సినిమా. దానికి తగ్గట్టే వినోదంతో పాటు అన్ని ఎమోషన్లూ చక్కగా పలికించాడు. డాన్సులు చేశాడు.. గాల్లో గింగిరాలు తిరుగుతూ ఫైటింగులు చేశాడు.. హీరోగా పాస్‌ అయినట్టే. సింగిల్‌ టేక్‌లో చెప్పిన డైలాగ్‌ సీన్‌ బాగా పండించాడు. షకలక శంకర్‌ పాత్ర నవ్విస్తుంది. హీరో తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర అదే. కథానాయిక అంతంత మాత్రమే. తండ్రిగా శివ ప్రసాద్‌ ఒదిగిపోయాడు.
చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు నిర్మాత. అందుకే ప్రతీ సీన్‌ రిచ్‌గా కనిపిస్తుంది. ఓ మాస్‌ హీరోకి తగిన పాటలిచ్చాడు సంగీత దర్శకుడు. మాటలు అక్కడక్కడ ఆకట్టుకొంటాయి. కొన్ని పంచ్‌లు పేలాయి కూడా. ద్వితీయార్ధంలో రివేంజ్‌ డ్రామా విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
బలాలు
+ సప్తగిరి
+ కామెడీ సీన్లు
+ తండ్రీ-కొడుకుల సెంటిమెంట్‌
బలహీనతలు
– రొటీన్‌ కథ
– ద్వితీయార్ధం
చివరిగా: ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’.. స్పీడు తక్కువ.. నవ్వులు ఎక్కువ..

లేబుళ్లు:

మూవీ రివ్యూ: వంగవీటి


చిత్రం : ‘వంగవీటి’ 

నటీనటులు: సందీప్ కుమార్ - నైనా గంగూలీ - శ్రీతేజ్ - వంశీ చాగంటి - కౌటిల్య తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్ - దిలీప్ వర్మ - సూర్య చౌదరి
రచన: రాధాకృష్ణ - చైతన్య ప్రసాద్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

‘రక్తచరిత్ర’ తర్వాత రామ్ గోపాల్ వర్మ నుంచి మళ్లీ ఆ స్థాయి సినిమా రాలేదు. ‘వంగవీటి’ ఆ లోటును తీర్చే సినిమాలా కనిపించింది. ‘రక్తచరిత్ర’కు అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల్ని కథావస్తువుగా తీసుకున్న వర్మ.. ఈసారి ఒకప్పటి బెజవాడ రౌడీ రాజకీయాల్ని ఎంచుకున్నాడు. ఎంతో ఆసక్తిని.. ఉత్కంఠను రేకెత్తించిన ఈ వివాదాస్పద చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: విజయవాడలో చిన్న రౌడీగా ప్రస్థానం ఆరంభించి.. కమ్యూనిస్టు నేత వెంకటరత్నం అండతో నగరాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు రాధా (సందీప్ కుమార్). రాధా ఎదుగుదల వెంకటరత్నానికి కంటగింపు అవుతుంది. అతణ్ని అవమానిస్తాడు. దీంతో రాధా.. వెంకటరత్నాన్ని మట్టుబెట్టి విజయవాడను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. ఆపై రాధాకు.. అన్నదమ్ములైన గాంధీ (కౌటిల్య).. నెహ్రూ (శ్రీతేజ్) దగ్గరవుతారు. ఇంతలో తమ నేతను మట్టుబెట్టాడన్న కోపంతో వెంకటరత్నం పార్టీ మనుషులు రాధాను చంపేస్తారు. దీంతో రాధా తమ్ముడైన రంగా అతడి స్థానంలోకి వస్తాడు. అక్కడి నుంచి పరిస్థితులు ఎలా మలుపు తిరిగాయి.. రంగా ప్రస్థానం ఎలా సాగింది.. ఎలా ముగిసింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: హింసతో ముడిపడిన నిజ జీవిత గాథల్ని రసవత్తరంగా తెరకెక్కించడంలో వర్మ శైలే వేరు. వాస్తవ కథలో ఎంత విషయం ఉంటే.. దాన్ని అంత ఆసక్తికరంగా చెప్పడంలో వర్మ నేర్పరి. ‘వంగవీటి’ వాస్తవ కథలో విషయం చాలానే ఉన్నా.. వర్మ చాలా కీలకమైన విషయాల్ని దాచిపెట్టేసి.. పైపై మెరుపులతోనే సరిపెట్టాడు. టేకింగ్ పరంగా మాత్రం ఇందులో వర్మ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. మర్డర్ సీన్స్ ను ఉత్కంఠభరితంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా తెరకెక్కించడంలో వర్మ ప్రత్యేకత తెలుస్తుంది. ఒక హత్య జరిగే తీరును వర్మ కంటే బాగా ఇంకెవరూ చూపించలేరేమో అనిపిస్తాయి ఇందులోని సన్నివేశాలు. కాకపోతే ‘వంగవీటి’ సినిమా అంతటా కూడా ఈ హత్యలే కనిపిస్తాయి. ఆ హత్యలకు అటు ఇటు జరిగిన విషయాలన్నింటినీ వర్మ విస్మరించడం ఈ చిత్రంలోని ప్రధాన బలహీనత.

తెరమీద మర్డర్ సీన్లను రసవత్తరంగా చిత్రీకరించడం తన బలం కాబట్టి.. వర్మ ప్రధానంగా వాటి మీదే దృష్టిపెట్టినట్లున్నాడు. బహుశా చాలా ఏళ్ల పాటు జరిగిన కథను రెండున్నర గంటల్లో చెప్పేటపుడు అన్ని అంశాల్నీ కవర్ చేయడం సాధ్యం కాదని.. అదే సమయంలో తాను ఎంచుకున్న కథలోని ఏ హత్యనూ అతను విస్మరించలేడు కాబట్టి వాటి మీదే ఫోకస్ పెట్టినట్లున్నాడు వర్మ. తెరమీద రక్తపాతాన్ని చూపించడాన్ని అమితంగా ఇష్టపడే వర్మ.. తెరమీద ఒక్కో మర్డర్ ను తనివితీరేలా డీటైల్డ్ గా చూపించడంతో చాలా సమయం ఖర్చయిపోయింది. ఒక హత్యకు నాంది.. దాని తాలూకు ప్రణాళిక.. అమలు.. ఇలా ఒక్కో హత్యకు సంబంధించిన వ్యవహారం ఒకదాని తర్వాత ఒకటి సాగిపోతాయి.

ఆరంభంలో వెంకటరత్నం ఎపిసోడ్ ఆసక్తికరంగా మొదలై.. వర్మ ముద్ర స్పష్టంగా కనిపించే మర్డర్ సీన్ తో ముగుస్తుంది. ఈ హత్యను చిత్రీకరించిన తీరు ‘వావ్’ అనిపిస్తుంది. ఐతే ఆ తర్వాత ఇలాంటి హత్యలు చూస్తూ చూస్తూ వెళ్తుంటే బోర్ కొట్టేస్తుంది. ఆరంభంలో ఉన్నంత గ్రిప్పింగ్ గా ఆ తర్వాతి సన్నివేశాలుండవు. ఇలాంటి సినిమాలో కథానాయికకు ఒక ఇంట్రో సాంగ్.. పెళ్లి పాట లాంటివి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో వర్మకే తెలియాలి. బ్యాగ్రౌండ్లో వచ్చే ‘మరణం’ లాంటి ఒకట్రెండు పాటలు ఓకే కానీ.. మిగతా పాటలు సినిమాకు స్పీడ్ బ్రేకర్లయ్యాయి. టెంపోను దెబ్బ తీశాయి. కథలో హత్యలు తప్ప ఇంకే మలుపులూ కనిపించవు. రాజకీయ అంశాలు.. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన లోతుల్లోకి వెళ్లలేదు. వంగవీటి.. దేవినేని కుటుంబాల్లో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే విషయంలో ఒక స్టాండ్ ఏమీ తీసుకోకుండా బ్యాలెన్స్ పాటించాడు వర్మ. అలాగే ప్రధాన పాత్రలకు సంబంధించి లోతుల్లోకి కూడా వెళ్లలేదు. వివాదాస్పద అంశాల్ని దాదాపుగా కప్పెట్టేశాడు. చివర్లో రంగా హత్యకు సంబంధించి ప్లానింగ్ ఎలా జరిగింది.. అందులో ఎవరి ప్రమేయం ఉందన్నది మాత్రం చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే రంగా హత్యతో ముగిసే క్లైమాక్స్ అనుకున్నంత డ్రామా.. ఉత్కంఠ లేదు.

టేకింగ్ పరంగా ప్రతి సన్నివేశంలోనూ వర్మ ముద్ర కనిపిస్తుంది. వర్మ మార్కు కెమెరా యాంగిల్స్.. సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ఒకప్పటి విజయవాడ వాతావరణాన్ని సాధ్యమైనంత మేర చూపించే ప్రయత్నం చేశాడు. వరుస హత్యలు మొహం మొత్తేలా చేసినా.. టేకింగ్ పరంగా ఆ సన్నివేశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. సినిమాలో అక్కడక్కడా వర్మ మార్కు చమక్కులు కనిపిస్తాయి. రాధా మర్డర్ ప్లాన్ జరుగుతున్నపుడు ‘‘రాధా ఎవరో ఎలా గుర్తుపట్టాలి’’ అని అడిగితే.. ‘‘మీలో 


లేబుళ్లు:

యాంకర్ కి లైవ్ లో పెళ్లి ప్రపోజల్


నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీ ఇప్పటికే హిట్ అయిపోయింది. మొదటి వారంలో పెట్టుబడికి రెట్టింపు రాబట్టి.. సూపర్ హిట్ అనిపించేసుకుంది. ఇంకో వారం కలెక్షన్స్ స్టడీగా నిలబడితే.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సాధించిన చిన్న సినిమాల లిస్ట్ లోకి కూడా ఎంటర్ అయిపోవడం ఖాయం.

ఈ మూవీ ఇంతగా హిట్ అవడానికి టైటిల్ తోపాటు.. సినిమా యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా కారణమే. ప్రచారంలో భాగంగా.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీలో నటించిన ముగ్గురు హీరోలు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఓ ఛానల్ కి నోయల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ' నిజంగానే ఓ అమ్మాయి ఇలా చేస్తే మీరేం చేస్తారు' అని నోయల్ ని ప్రశ్నించింది ఆ యాంకర్.

దీనికి నోయల్ ఇచ్చిన ఆన్సర్ దిమ్మదిరిగిపోయేలా చేసింది. 'నాకు ఓ వంద మంది గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నువ్వేమంటావ్ చెప్పు' అంటూ నోయల్ అడిగేసరికి.. ఆ యాంకర్ కి లైవ్ లోనే చుక్కలు కనిపించాయి. మొత్తానికి నవ్వుతో కవర్ ఈ సిట్యుయేషన్ ని కవర్ చేసేసింది కానీ.. నోయల్ స్పాంటేనియస్ రియాక్షన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. 


లేబుళ్లు:

21, డిసెంబర్ 2016, బుధవారం

ఎన్టీఆర్ మనసు మార్చుకున్నాడా…!


అటు అభిమానులను, ఇటు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. సెప్టెంబర్‌ నుండి ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని పతాకంపై రాధాకృష్ణ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్‌తో తెరకెక్కించే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉండగా, ఈ మూవీని ఆగష్టు లోపు కంప్లీట్‌ చేయాలని అనుకుంటున్నాడు.

ఆ తరువాత కొద్ది రోజులు గ్యాప్‌ తీసుకొని సెప్టెంబర్‌లో ఎన్టీఆర్‌తో సెట్స్‌ మీదకు వెళ్లనున్నాడు మాటల మాంత్రికుడు. అంతలోపు ఎన్టీఆర్‌ కూడా బాబీతో కమిట్‌ అయిన సినిమాను కంప్లీట్‌ చేసుకోనున్నాడు. ఇక ఈ మూవీకి కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ అనిరుధ్‌నే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

అయితే   జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత నెక్ట్స్ సినిమా ఎంపిక కోసం చాలా రోజుల పాటు ఎదురుచూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫైనల్ గా కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ను తీసుకోవాలని భావించారు. అయితే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు అలరించనున్నారు. కాజల్ అగర్వాల్ తో పాటు నివేదా థామస్, అనుపమా పరమేశ్వరన్ లను హీరోయిన్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు.

అయితే ఈ ఏడాది నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయాలను నందమూరి అభిమానులకు అందించిన ఎన్టీఆర్ మరో సక్సెస్ ని టేస్ట్ చూపించాలని ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేం బాబీతో జతకట్టాడు. ఎన్టీఆర్ 27వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఎన్టీఆర్ 27వ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించనున్నాడనే టాక్ వినిపిస్తోండగా, అందాల భామలు కాజల్ .. నివేదా థామస్ .. అనుపమ పరమేశ్వరన్ లు కథానాయికలుగా ఎంపికైనట్టు సమాచారం. ఇక సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నే ఎంపిక చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలకు దేవి సంగీతం అందించగా, ఇది కూడా సక్సెస్ లో సగభాగం అయింది. ఈ క్రమంలో ఆ సెంటిమెంట్ ని మరో సారి రిపీట్ చేయాలని యంగ్ టైగర్ భావిస్తున్నాడట. మరి ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకు తనదైన స్టైల్ లో బాణీలు అందిస్తోన్న దేవి, ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి.


లేబుళ్లు: , ,

20, డిసెంబర్ 2016, మంగళవారం

సూసైడ్ చేసుకున్న ‘జబర్దస్త్’ పొట్టి రమేష్ భార్య .. కారణం..?

తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య ఆత్మహత్యల పర్వం ఎక్కవగా కొనసాగుతోంది. రకరకాల కారణాల వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్న వాళ్లందరూ.. ఆత్మహత్యే శరణ్యమని బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ‘జబర్దస్త్’ షోలో కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందిన పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఫ్యాన్‌కి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. విశాఖపట్టణం, గాజువాకలోని శ్రీనగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘనట స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహం జరిగిన ఏడాదికే త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకోవడంతో.. ఎన్నో అనుమానాలు లేవనెత్తుతున్నాయి.

షూటింగ్ కోసం మూడు రోజుల క్రితమే పొట్టి రమేష్‌ హైదరాబాద్‌ వెళ్లగా.. ఈ సమయంలోనే త్రిపురాంబిక సూసైడ్ చేసుకుంది. తన భార్య చనిపోయిందన్న విషయం తెలిసిన వెంటనే పొట్టి రమేష్ విశాఖకి చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా.. పెళ్లి అయినప్పటి నుంచి తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమని, తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని పొట్టి రమేష్ తెలిపారు. తన భార్య సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటో తమకూ తెలియదని అంటున్నారు. దీంతో.. ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందా, లేదా అత్తమామల వేధింపులేమైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు పొట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. తమ కుమార్తె మరణవార్త విని త్రిపురాంబిక పేరెంట్స్ విశాఖకు చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పెళ్లైన మరుసటిరోజు నుంచే అత్త-ఆడపడుచు వేధించడం ప్రారంభించారని, తమ అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వాళ్లు కుట్ర పన్నుతున్నారని త్రిపురాంబిక తల్లి ఆరోపించారు. ఇక ఈ ఘటనపై మహిళా సంఘం నేత ప్రభావతి మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై కేసులు పెట్టొద్దంటూ త్రిపురాంబిక కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు.

ఇలా పొట్టి రమేష్ ఫ్యామిలీపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. త్రిపురాంబిక సూసైడ్ నోట్ ఏమైనా రాసిందా? ఒకవేళ రాసివుంటే అది ఎక్కడుందోనని వెతికే పనిలో బిజీ అయ్యారు. పొట్టిరమేష్ ఫ్యామిలీ మెంబర్స్ సూసైట్ నోట్ లేదని చెబుతున్నప్పటికీ.. వారిపై ఉన్న అనుమానంతో ఎక్కడైన ఉండవచ్చునని గాలిస్తున్నారు.


లేబుళ్లు:

కొత్త లుక్ లో కనిపించనున్న మహేష్


మహేష్ బాబు తన 23 వ సినిమాని మురగదాస్ తో చేస్తున్నారు. ఆ తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక ఆ తర్వాత చేయనున్న 25వ సినిమాకి కూడా రంగం సిద్దం చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు గతంలో ఎన్నడు లేని విధంగా ఎన్నారై లుక్ లో సరికొత్తగా కనిపించనున్నాడట. కథ మొత్తం అమెరికా నేపధ్యంలో నడుస్తుంది కనుక సినిమా ఎక్కువ భాగం యూఎస్ లోనే షూటింగ్ జరుపుకుంటుందని కూడా తెలుస్తుంది.

మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన తోలి సినిమాకి అశ్వని దత్ నిర్మాత. మహేష్ బాబు కెరీర్లోనే కీలకమైన ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేయడం విశేషం. అశ్వని దత్ తో కలసి డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొనున్నాడు. భారీ స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించే అవకాశాలుండగా హీరోయిన్, ఇతర ఇతర నటీ నటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


లేబుళ్లు:

సీడెడ్‌లో అప్పుడే రికార్డుల పర్వం మొదలెట్టిన ఎన్టీఆర్


ఒకప్పుడు ఎన్టీఆర్ రేంజ్ యావరేజ్‌గానే ఉండేది.. కానీ ‘టెంపర్’ తర్వాత అతని కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆ చిత్రం అతడ్ని నటుడిగా ఓ స్థాయికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత చేసిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీ అన్నివర్గాల ఆడియెన్స్‌ని దగ్గర చేసింది. ఇక ‘జనతా గ్యారేజ్’ మూవీ ఆల్‌టైం రికార్డుల జాబితాలో మూడోస్తానం సంపాదించి సంపాదించుకుని.. తారక్ క్రేజ్‌ని తారాస్థాయికి పెంచేసింది. దీంతో.. ఈ యంగ్ టైగర్‌ తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా.. బాబీలాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్‌తో తారక్ తన ప్రెస్టీజియస్ 27వ చిత్రం చేస్తుండడంతో.. దానికి మరింత క్రేజ్ వచ్చిపడింది.

ఈ కారణంగానే.. ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకుండానే ఈ సినిమా కళ్ళుచెదిరే రేంజులో ప్రీ-రిలీజ్ చేస్తోంది. అవును.. మీరు చదువుతోంది నిజమే. అసలు ప్రారంభోత్సవం కూడా జరుపుకోని ఈ మూవీ రైట్స్‌ని సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. భారీ అమౌంట్‌ ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఓ ప్రముఖ పంపిణీదారుడైతే ఈ మూవీ సీడెడ్ రైట్స్‌ని దక్కించుకోవడం కోసం దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న వార్త ప్రకారం.. ఈ మూవీ సీడెడ్ హక్కుల కోసం రూ.14.75 కోట్లు ఆఫర్ చేశాడట. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఒకవేళ అది నిజమైతే ఆ ఏరియాలో గత రికార్డులన్నీ తుడిచిపోయినట్లే.

ఇప్పటివరకైతే పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆ ఏరియాలో రూ.12 కోట్లపైనే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా రైట్స్ రూ.14.75 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా వస్తున్న వార్తలు నిజమైతే.. పవన్ రికార్డ్ కుదేలయిపోయినట్లే.


లేబుళ్లు: , , , , ,

‘శాతకర్ణి’ మరో సంచలన రికార్డ్


బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచి ఊహించని రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగున్నర గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సంపాదించిన ఈ ట్రైలర్.. ఆ తర్వాత 2, 3 మిలియన్ల మార్క్స్‌ని తక్కువ టైంలోనే క్రాస్ చేసి పడేసింది. ఇప్పుడు మరో మైలురాయిని ఈ ట్రైలర్ అందుకుంది. కేవలం 75 గంటల్లోపే 4 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టుకుంది. అంత ఎక్కువ టైంలో అన్ని ఎక్కువ వ్యూస్ రాబట్టిన తొలి తెలుగు ట్రైలర్ ఇదే. అంతేకాదు.. 70 వేలకుపైగా లైక్స్ రాబట్టుకుని, ఆ విషయంలోనూ ఇదే టాప్‌లో ఉంది.

క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా రూపొందుతుండడంతో దీనిపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొనడం, అతి తక్కువ టైంలోనీ షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌ని కళ్ళుచెదిరే గ్రాఫిక్స్‌తోపాటు వార్ సీన్లు అదిరిపోవడంతో.. దీనికి దేశవ్యాప్తంగా ఈ రేంజులో రెస్పాన్స్ వస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండడాన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే 5 మిలియన్ల మార్క్‌ని క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి.. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు దర్శకుడు క్రిష్.

కాగా.. ఈ మూవీ ఆడియో వేడుక ఈ నెల 26వ తేదీన గ్రాండ్‌గా నిర్వహించేందుకు యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం విస్తృతస్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


లేబుళ్లు:

ఎన్టీఆర్ తో క్రిష్ సినిమా చేస్తున్నాడా?


టాలీవుడ్ పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కానుంది. ఎన్టీఆర్, క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకేక్కనున్నట్లు పరిశ్రమ నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పనుల్లో బిజీగా ఉన్నా క్రిష్ తన కొత్త సినిమా స్క్రిప్ట్ లపై ద్రుష్టి పెట్టాడు. ఎన్టీఆర్ కోసం ఓ కథని సిద్దం చేశాడట. త్వరలో అయన ఆ లైన్ ఎన్టీఆర్ కి చెప్పనున్నాడని తెలిసింది. ప్రస్తుతం బాబితో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అనుకుంటున్నారు. అయితే దీనిపై సరైన సంచారం లేదు. ఇప్పుడు క్రిష్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్దం అవుతున్నాడు. ఒక వేల లైన్ ఓకే అయితే ఇదే ఎన్టీఆర్ తదుపరి సినిమా అయ్యే అవకాశం ఉన్నది.

లేబుళ్లు: ,

టాలీవుడ్ లో కొత్త అఫైర్?


టాలీవుడ్ లో లవ్ అఫైర్లకు కేరాఫ్ గా నిలిచే ఓ హీరో.. ఇప్పుడు మరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి.. పార్టీలకు.. ఫంక్షన్లకు కలిసే తిరుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. విడదీయలేనంతగా ఇద్దరూ పెనవేసుకుపోయారని అంతా అంటున్నారు. 

చాలా కాలం పాటు.. చెన్నైకి చెందిన ఓ హీరోయిన్ తో ‘ముచ్చట’ నడిపించిన ఆ పొడుగు హీరో.. ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఆ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. దీంతో.. ఎక్కడ చూసినా ఈ జంట కబుర్లే ముచ్చట్లు గగా వినిపిస్తున్నాయి. 

ముంబై వెళ్లినా.. షూటింగ్ కు వెళ్లినా.. పార్టీలకు వెళ్లినా.. మరింకే చోటికైనా.. ఇద్దరూ కలిసే వెళ్తున్నారట. ఇంతే కాక.. తనకు పెళ్లిపై నమ్మకం లేదని ఆ హీరోయిన్ కూడా ఈ మధ్యే ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అంటే.. ఇద్దరి మధ్య.. లవ్ కమ్ డేటింగ్ తప్ప.. అది పెళ్లి వరకూ దారి తీసే అవకాశం కూడా లేదని కొందరు అనుకుంటున్నారు. 

ఇంకా చెప్పాలంటే.. కొత్త హీరోయిన్ తో మనోడి లవ్వాట ఓ షార్ట్ ఫిల్మ్ లా ఉంటుందేమో అని కూడా గుసగుసలాడుకుంటున్నారు. 


లేబుళ్లు: ,

19, డిసెంబర్ 2016, సోమవారం

శాతకర్ణి ఆడియో డేట్ ఫిక్స్


నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తుండటం వలన చిత్ర యూనిట్ ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. అందులో భాగంగానే టీజర్, ట్రైలర్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది.

మొన్నీమధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ని అద్భుతంగ ఉంచి బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుంది. ఈ ఊపులోనే ఆడియో విడుదల చేసి సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ ఈనెల 26న తిరుపతిలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రు మున్సిపల్ హై స్కూల్ లో ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా హాజరు కానున్నారు.




లేబుళ్లు: ,

షాకింగ్: ఎన్టీఆర్ సిినిమా లో అరవింద్ స్వామి..




లేబుళ్లు: ,

దారుణం : ‘ధృవ’ సినిమా చూసి.. ఇద్దరు ఫ్యాన్స్ మృతి


తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. తమ అభిమాన నటుడు రామ్ చరణ్ తాజా చిత్రం ‘ధృవ’ సినిమా చూసిన అనంతరం ఇద్దరూ మెగా ఫ్యాన్స్ ఇంటికి తిరిగి వెళ్తుండగా.. దుర్మరణం పాలయ్యారు. వీళ్లు ఆటోలో వెళుతుండగా.. అత్యంత వేగంగా వస్తున్న లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వావిలాల గ్రామానికి చెందిన 14 మంది రామ్ చరణ్ అభిమానులు ‘ధృవ’ సినిమా చూసేందుకు అయిజ అనే పట్టణానికి ఓ ఆటోలో వెళ్ళారు. మూవీ చూసిన అనంతరం వీరంతా ఇంటికి తిరుగు పయనమవ్వగా.. ఓ ప్రాంతంలో చాలా స్పీడుగా వచ్చి ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో.. ఆ ఆటోలో ఉన్న 14 మందిలో సతీష్, రాజు అనే యువకులు చనిపోగా.. మిగతా 12 మంది గాయాల పాలయ్యారు. వీరందరినీ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

ఆ 12 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సినిమా చూసి వస్తారనుకున్న తమ కుమారులు (సతీష్, రాజు) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


లేబుళ్లు: , , , ,

18, డిసెంబర్ 2016, ఆదివారం

శాతకర్ణితో అమ్మడి సుడి తిరిగిపోతుందా?



అందం.. దానికి తగ్గ టాలెంట్ ఉంటే చాలు.. అవకాశాలు ఇచ్చేందుకు సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడూ వెనుకాడదు. ఆ వుడ్డూ.. ఈ వుడ్డూ అన్న తేడా లేకుండా ఏ వుడ్ అయినా సరే అక్కున చేర్చుకోవటం తెలుగోళ్లతో సహా సౌత్ లోని సినిమా వారికి అలవాటే. అందుకే బాలీవుడ్ బ్యూటీలే కాదు.. విదేశీ ముద్దుగుమ్ముల్ని సైతం.. మనకు తగ్గట్లుగా మార్చేసి వారికి విపరీతమైన క్రేజ్ తెచ్చేస్తుంటారు.

అలా తీసుకొచ్చిన బ్యూటీల్లో చాలామంది ఎంతగా పాగా వేశారన్నది కత్రినా.. అమీ జాక్సన్ లాంటోళ్లను చూస్తే తెలిసిపోతుంది. తాజాగా అలాంటి అందమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెదర్లాండ్స్ నుంచి ముంబయికి వచ్చిన ఫర్హా కర్మీ బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకున్నా పెద్ద వర్క్ వుట్ కాలేదు. హిమేశ్ రేష్మియాతో తేరీ సరూర్ లో అమ్మడుకి అవకాశం వచ్చినా ఎవరి కంట్లోనూ పడలేదు.

అనంతరం ఈ హాట్ బ్యూటీ సాయి ధరంతేజ చేసిన తిక్కలో మెరిసింది. అమ్మడిలోని మెరుపును గుర్తించి ధ్రువలో అవకాశం ఇచ్చారు. అరవింద్ స్వామి గర్ల్ ఫ్రెండ్ గా అదరగొట్టటమే కాదు.. తన అందంతో అందరి మనసుల్లో రిజిష్టర్ అయిన ఈ భామకు మంచి మంచి అవకాశాలు రావటం ఖాయమన్న టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే తాజాగా విడుదల చేసిన బాలయ్యబాబు.. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ ట్రైలర్ లో తళుక్కున మెరిసింది.వార్ సీన్లలోనూ.. రొమాంటిక్ సీన్లలో కనిపించిన వైనం చూస్తే.. ఈ సినిమాలోనూ కీలక పాత్ర పోషించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. ఈ మెరుపు బ్యూటీ సుడి తిరిగినట్లేనని చెబుతున్నారు. శాతకర్ణితో ఆ విషయం తేలిపోవటం ఖాయమంటున్నారు.

లేబుళ్లు: ,

దటీజ్ ఎన్టీఆర్… ఒవర్సీస్ కలక్షన్ కింగ్…


ఒవర్సీస్ లో తెలుగువాళ్ళు చక్కని కుటుంబ కథా చిత్రాలు, విభిన్నమైన కథాంశాలతో కూడిన, సాంకేతికపరంగా ఉన్నతంగా ఉన్న సినిమాలు బాగా చూస్తూ రిలాక్స్ అవుతారు వారి వీకెండ్సును సెలెబ్రేట్ చేసుకుంటారు.

ఒవర్సీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వసూళ్ళ పరంగా మిగిలిన హీరోలకి అందనంత ఎత్తులో వుండేవాడు. అతని “దేశీ అట్టర్ ఫ్లాప్ సినిమా — నంబర్ వన్ నేనొక్కడినే” కూడా ఆ పరిధిని అతిసునాయాసంగా, అవలీల గా మిలియన్ డాలర్లు సాధించటంతో మహేష్ ని మించిన ఓవర్సీస్-కింగ్ లేడని అనుకున్నారు.

మాస్ హీరోగా తన ప్రస్థానం ప్రారంభించిన ఎన్టీఆర్ కు మొదట్లో ఈ ఒవర్సీస్ మార్కెట్ అస్సలు కలిసి రాలేదు. బాద్షా తో తొలిసారిగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఎన్టీఆర్ ఆ తర్వాత మరో మూడు సినిమాలతో మిలియన్ డాలర్లు సాధించి, మహేష్ తర్వాత అత్యధిక సార్లు ఈ మార్క్ సాధించిన తెలుగు హీరోగా రికార్డులమోత మ్రోగించాడు. అంతే కాదు ఈ ఏడాదిలో ఎన్టీఆర్ సినిమాలు రెండూ కలిపి అమెరికాలో $ 3.80 మిలియన్ డాలర్లు వసూళ్ళు సాధించాయి. నాన్నకు ప్రేమతో రెండు మిలియన్లు సాధిస్తే, జనతా గ్యారేజ్ కూడా ఆ మార్కుకి దగ్గరగా అంటే $ 1.80 మిలియన్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు హీరోగా ఎన్టీఆర్ కే వసూళ్ళ కిరీటం దక్కుతుంది.

కథాయకులకు మల్లే, ఇక్కడ కొన్ని సార్లు దర్శకులకు ఆ అదృష్టం లభించిన సందర్భాలున్నాయి. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన దర్శక ప్రతిభ తో వెలిగి విజయం సాధించిన త్రివిక్రమ్ చిత్రం ‘అ ఆ’ నే. దాదాపు రెండున్నర మిలియన్ డాలర్ల వసూళ్లతో ‘అ ఆ’ ఈ ఏడాదిలో వచ్చిన అగ్ర హీరోల సినిమాలన్నిటినీ బీట్ చేసింది. అమెరికాలో హీరోలతో సమానంగా దర్శకులకి ఎంత క్రేజ్ వుందనే దానికి ఇది నిభద్ధమైన నిదర్శనం. ఓవర్సీస్లో దాదాపు ఏడు మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా.

వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ ఈ రికార్డుని బీట్ చేసి పది మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఆ చిత్రం ప్రదర్శన హక్కుల్ని ఒవర్సీస్ లో కనీ వినీ ఎరుగని మొత్తానికి సొంతం చేసుకున్నారట. ఇప్పుడు రాం చరణ్ ధ్రువ కూడా ఈ క్లబ్లో చేరబోతోంది.


లేబుళ్లు:

శాత‌క‌ర్ణి పై ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్‌…షాకింగ్ కామెంట్స్‌..



యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. బాల‌య్య 100వ చిత్రం కావ‌డంతో అభిమానులు ఈ సినిమా ట్రైల‌ర్ కోసం వేయిక‌ళ్ల‌తో ఎప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ట్రైల‌ర్ వ‌చ్చి రావ‌డంతోనే యూట్యూబ్‌ను షేక్ చేస్తూ దూసుకెళుతోంది. ఈ క్ర‌మంలోనే బాబాయ్ బాల‌య్య శాత‌కర్ణి ట్రైల‌ర్‌కు అంద‌రూ ఫిదా అయిపోతుండ‌గా…అబ్బాయ్ ఎన్టీఆర్ సైతం శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.

ఓ వైపు శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంటే ఎన్టీఆర్ ట్విట్ట‌ర్‌లో శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌పై స్పందించాడు. శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌లో బాల‌య్య ఇర‌గ‌దీశాడ‌ని…మ‌నం ఇంత‌కు ముందెన్న‌డు చూడ‌ని బాల‌య్య‌ను శాత‌క‌ర్ణిలో చూస్తున్నామ‌ని ఎన్టీఆర్ బాబాయ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. ఇక డైరెక్ట‌ర్ క్రిష్‌ను పొగిడిన ఎన్టీఆర్ శాత‌క‌ర్ణిలో స‌రికొత్త బాల‌య్య‌ను ప్ర‌జెంట్ చేశాడ‌ని మెచ్చుకోవ‌డంతో పాటు ట్విట్ట‌ర్‌లో శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ లింక్ షేర్ చేశాడు.
శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌తో బాబాయ్‌ను ఓ రేంజ్‌లో పొగిడేసిన ఎన్టీఆర్ బాబాయ్‌పై త‌న‌కు ఉన్న అనంతాభిమానాన్ని మ‌రోసారి చాటుకున్నాడు. ఇటీవ‌ల ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌ను ఎన్టీఆర్ ఈ ట్రైల‌ర్ షేరింగ్‌తో ప‌టాపంచ‌లు చేసేశాడు. ఎవ‌రేమ‌నుకున్నా తాము నంద‌మూరి వార‌సులం అని, త‌మ మ‌ధ్య చిన్న గ్యాప్‌లు టీ క‌ప్పులో తుఫాన్ లాంటివ‌ని చెప్పిన‌ట్ల‌య్యింది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. వందో చిత్రంలో బాలయ్య రాజసం ఉట్టిపడేలా ఉన్నారు. డైలాగులు అదరగొట్టారు. చిత్రంలో గ్రాఫిక్స్ చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. చిత్రంలోని నటీనటులందరూ కొత్త వారు కావడం గమనార్హం. ట్రైలర్ రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే 17,896 మంది వీక్షించారు. 10,940 మంది ట్రైలర్‌‌ను లైక్ చేశారు.


లేబుళ్లు: ,

రెండువేల నోటును లక్షకు అమ్మాడు!


కొందరికీ అదృష్టం భలేగా కలిసివస్తుంటుంది. లక్కీ డ్రా వంటి వాటిల్లో నామమాత్రంగా ఖర్చు చేస్తే లక్ కలిసి వస్తుండటం మనకు తెలుసు. కానీ మధ్యప్రదేశ్ లోని షాజపూర్ కు చెందిన విజయ్ కి అలాంటిదేమీ లేకుండా ఏకంగా లక్ష రూపాయల బంపర్ ఆఫర్ వచ్చింది. భోపాల్ లోని లాల్ ఘాటిలో గల హౌసింగ్ బోర్డులో స్వీపర్ గా పనిచేస్తున్న విజయ్ ని లక్షరూపాయల ధనవంతుడిగా మార్చింది కేవలం రెండు వేల నోటు!

ఇంతకీ ఏం జరిగింది అంటే జీతం డబ్బులు తీసుకునేందు ఏటీఎంకు వెళ్లిన విజయ్ డబ్బులు డ్రా చేసుకున్నాడు. కొత్తగా మెరిసిపోతున్న రూ.2000 నోటును అలా చూస్తుండుపోయాడు. అయితే పనిలో  మాత్రం స్వీపర్ అయినప్పటికీ ఆయన బుర్ర అద్భుతంగా పనిచేసింది. నోటు చివర్లో 786 అనే నెంబర్ ను అతడు గమనించారు. దీంతో అతని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. ఎందుకంటే ముస్లింలు పవిత్రంగా భావించే నెంబర్ అది. దీంతో ఇంతటి ప్రత్యేకత గల నెంబర్ నోటును అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందామని ప్లాన్ వేసి ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజమైన ఈబే ను సంప్రదించాడు. తన ఫోన్ లో వాట్సాప్ ద్వారా ఆ నోటును ఫొటో దింపి ఈబేకు పంపించాడు. విజయ్ స్కెచ్ వర్కవుట్ అయింది. భోపాల్ కు పొరుగున ఉన్న ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి ఆ ప్రత్యేక నెంబర్ నోటుపై తెగ ముచ్చటపడిపోయి లక్ష రూపాయలు ఇచ్చి తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. అంతేకాదు వెంటనే లక్ష రూపాయల చెక్ కూడా పంపాడు. ఇలా బుర్రకు పదునుపెట్టడం వల్ల స్వీపర్ కాస్త లక్షాధికారి అయిపోయాడు.


లేబుళ్లు: ,

17, డిసెంబర్ 2016, శనివారం

చరణ్ బాబుకి ఆ వయసు రాలేదట


రామ్ చరణ్ ఇప్పడు ఫుల్లు బిజీ. డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. ఆ తర్వాత ప్రమోషన్స్.. యూఎస్ టూర్.. తిరిగి రాగానే ఇంటర్వ్యూలు.. ఇప్పుడు మెగా 150కి ప్రొడ్యూసర్ గా వర్క్స్.. ఇలా తెగ బిజీగా ఉన్నాడు చెర్రీ. అయినా సరే ఇంటర్వ్యూల్లో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచాడు మెగా పవర్ స్టార్. 

కొంతకాలంగా ఎదురుచూస్తున్న స్థాయి హిట్ కొట్టారు కదా.. మరి మీరు తండ్రి అయ్యేదెపుడు అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి చెర్రీకి ఎదురైంది. దీనికి చరణ్ ఇచ్చిన ఆన్సర్ ఇంకా అదిరింది. 'నేనింకా చిన్నపిల్లాడినే అనుకుంటూ ఉంటాను. తండ్రి కావడం గురించి ఇంకా ఆలోచన కూడా లేదు. నా వైఫ్ నేను మరింతకాలం ఏకాంతంగా జీవించాలని అనుకుంటున్నాం.' అని చెప్పాడు చెర్రీ. 

మరోవైపు రీమేక్స్ విషయంలో కూడా చరణ్ స్మార్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. గతంలో జడ్జిమెంట్ లోపాల కారణంగా కొన్ని సినిమాలు నిరుత్సాహపరిచాయని అన్న చెర్రీ.. రిజల్ట్ ఊహించలేని ఒరిజినల్స్ కంటే.. కాన్ఫిడెంట్ గా అనిపించిన రీమేక్స్ చేయడంలో తప్పేం లేదంటూ కామెంట్ చేశాడు. తండ్రి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పనులతో సంక్రాంతి వరకూ తాను బిజీ బిజీ అన్న చరణ్.. ఆ తర్వాత రెండు వారాలు గ్యాప్ తీసుకుని.. ఫిబ్రవరి మొదట్లో సుకుమార్ సినిమాని స్టార్ట్ చేస్తానని అన్నాడు. 


లేబుళ్లు: ,

తిరుమలలో షీలా!!


కోలీవుడ్ బ్యూటీ షీలా.. ఎక్కువగా తమిళ్ లోనే నటించినా.. తెలుగులో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసింది. స్టైలిష్ స్టార్ తో పరుగు.. యంగ్ టైగర్ తో అదుర్స్ లాంటి హిట్ సినిమాలు అమ్మడి ఖాతాలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం బాలయ్య పరమవీర చక్ర చిత్రం తర్వాత అసలు సినిమాల్లో నటించడమే మానేసిన షీలా.. ఇప్పుడు సడెన్ గా తిరుమలలో దర్శనం ఇచ్చింది.

ఐదేళ్ల క్రితం సినిమాల్లో కనిపించనదానికంటే సన్నగా మారిపోయి.. మరింత చిక్కిపోయి గ్లామర్ పెంచేసిన షీలా.. గ్లామర్ కూడా పెంచేసి ఓ రేంజ్ షాక్ ఇచ్చేసింది. పుణ్యక్షేత్రంలో దర్శనం ఈ భామ.. చీరకట్టులో కూడా ఎంతో మెరిసిపోయింది. 'దర్శనం చాలా చాలా బాగా అయింది.. చాలా సంతోషంగా ఉంది' అని చెప్పిన షీలా.. కొత్త సినిమా సంగతులు కూడా చెప్పింది. 'ఇప్పుడు తమిళ్ చేస్తున్నాను.. తర్వాత తెలుగులో చేస్తాను.. డీటైల్స్ నెక్ట్స్ ఇయర్ చెబుతాను' అని చెప్పింది షీలా.

బాగా చిక్కిపోయి ఇలా సన్నగా అవడానికి కారణం ఒక సినిమా కోసం అంటూ హింట్ ఇచ్చిన షీలా.. 'నెక్ట్స్ ఇయర్ తెలుగులో చేస్తున్నాను.. అప్పుడే చెబుతాను.. ఇప్పుడు చెప్పలేను' అంటూ సస్పెన్స్ మెయింటెయిన్ చేసింది. హీరో పేరు చెబుతారా అని అడిగితే.. 'లేదండీ చెప్పలేను' అంటూ జారుకుంది. 


లేబుళ్లు: ,

శాతకర్ణి.. రికార్డ్ రికార్డ్



అద్భుతమైన విజువల్స్ తో కట్టి పడేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిన్న సాయంత్రం ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి తెలుగు నెటిజన్ల మధ్య వేరే టాపిక్స్ అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే చర్చ. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ హంగామా మామూలుగా లేదు. తెలుగు సినిమా ట్రైలర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది ‘శాతకర్ణి’ ట్రైలర్. అత్యంత వేగంగా మిలియన్ మార్కును అందుకున్న తెలుగు ట్రైలర్ గా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రికార్డు సృష్టించింది. కేవలం 4.5 గంటల్లోనే ‘శాతకర్ణి’ ట్రైలర్ ఈ రికార్డును అందుకుంది. లైక్స్ పరంగా కూడా రికార్డుల్ని తిరగరాసింది. సంక్రాంతికే రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ టీజర్ కూడా రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అది 3 గంటల 5 నిమిషాల్లోనే మిలియన్ మార్కును అందుకుని.. తెలుగు టీజర్ల రికార్డుల్ని తిరగరాసింది. ఇప్పుడు బాలయ్య ట్రైలర్ రికార్డుల్ని వేటాడేశాడు. కేవలం తెలుగు వరకే కాదు.. మిగతా భాషల వాళ్లను కూడా ‘శాతకర్ణి’ ట్రైలర్ మెస్మరైజ్ చేస్తోంది. బాలీవుడ్ జనాలు కూడా దీని గురించి గొప్పగా ట్వీట్లు చేస్తున్నారు. రెండు నిమిషాలకు కొంచెం ఎక్కువ నిడివితో ఉన్న ట్రైలర్.. ఒక క్షణం కూడా కళ్లు తిప్పుకోనివ్వలేదంటే ఆశ్చర్యం లేదు. సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాల్ని మరింత పెంచేసింది ఈ ట్రైలర్.

లేబుళ్లు: ,

బాబాయ్ ట్రైలర్.. అబ్బాయిలు అదరగొట్టారు


నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి.. సిద్ధమయిపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రతీ ఫ్రేమ్ ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దిన క్రిష్ ను.. తనదైన నటనతో శాతకర్ణి పాత్రను మెప్పించిన బాలకృష్ణ ను.. పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు ప్రేక్షకులు.

చాలాకాలంగా బాబాయ్ సినిమాల విషయంలో రియాక్ట్ కాని అబ్బాయిలు కూడా ఇప్పుడు స్పందించారు. శాతకర్ణి ట్రైలర్ అదిరిపోయిందంటూ జూ. ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లు ట్వీట్స్ పెట్టడం నందమూరి అభిమానులను మురిపించింది. ట్రైలర్ రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే వీరి నుంచి రియాక్షన్ వచ్చేసింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ అసాధారణంగా ఉంది. బాబాయ్ తన బెస్ట్ చూపిస్తున్నారు. నందమూరి బాలకృష్ణను గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా చూపించిన దర్శకుడు క్రిష్ కు అభినందనలు' అంటూ ట్వీట్ చేశాడు యంగ్ టైగర్. 

 'దేశం మీసం తిప్పుదాం.. గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ లో బాబాయ్ అద్భుతంగా ఉన్నాడు. దర్శకుడు క్రిష్ కు అభినందనలు' అంటూ ట్వీట్ చేశాడు కళ్యాణ్ రామ్. కొంతకాలంగా బాబాయ్ తో అబ్బాయిలకు విబేధాలు అనే ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు మనసారా అభినందించడం చూస్తే.. అవన్నీ ఉత్తి రూమర్లే అని అనిపిస్తోంది కదూ.!


లేబుళ్లు: , ,