నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తుండటం వలన చిత్ర యూనిట్ ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. అందులో భాగంగానే టీజర్, ట్రైలర్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది.
మొన్నీమధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ని అద్భుతంగ ఉంచి బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుంది. ఈ ఊపులోనే ఆడియో విడుదల చేసి సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ ఈనెల 26న తిరుపతిలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రు మున్సిపల్ హై స్కూల్ లో ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా హాజరు కానున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి