దటీజ్ ఎన్టీఆర్… ఒవర్సీస్ కలక్షన్ కింగ్…


ఒవర్సీస్ లో తెలుగువాళ్ళు చక్కని కుటుంబ కథా చిత్రాలు, విభిన్నమైన కథాంశాలతో కూడిన, సాంకేతికపరంగా ఉన్నతంగా ఉన్న సినిమాలు బాగా చూస్తూ రిలాక్స్ అవుతారు వారి వీకెండ్సును సెలెబ్రేట్ చేసుకుంటారు.

ఒవర్సీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వసూళ్ళ పరంగా మిగిలిన హీరోలకి అందనంత ఎత్తులో వుండేవాడు. అతని “దేశీ అట్టర్ ఫ్లాప్ సినిమా — నంబర్ వన్ నేనొక్కడినే” కూడా ఆ పరిధిని అతిసునాయాసంగా, అవలీల గా మిలియన్ డాలర్లు సాధించటంతో మహేష్ ని మించిన ఓవర్సీస్-కింగ్ లేడని అనుకున్నారు.

మాస్ హీరోగా తన ప్రస్థానం ప్రారంభించిన ఎన్టీఆర్ కు మొదట్లో ఈ ఒవర్సీస్ మార్కెట్ అస్సలు కలిసి రాలేదు. బాద్షా తో తొలిసారిగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఎన్టీఆర్ ఆ తర్వాత మరో మూడు సినిమాలతో మిలియన్ డాలర్లు సాధించి, మహేష్ తర్వాత అత్యధిక సార్లు ఈ మార్క్ సాధించిన తెలుగు హీరోగా రికార్డులమోత మ్రోగించాడు. అంతే కాదు ఈ ఏడాదిలో ఎన్టీఆర్ సినిమాలు రెండూ కలిపి అమెరికాలో $ 3.80 మిలియన్ డాలర్లు వసూళ్ళు సాధించాయి. నాన్నకు ప్రేమతో రెండు మిలియన్లు సాధిస్తే, జనతా గ్యారేజ్ కూడా ఆ మార్కుకి దగ్గరగా అంటే $ 1.80 మిలియన్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు హీరోగా ఎన్టీఆర్ కే వసూళ్ళ కిరీటం దక్కుతుంది.

కథాయకులకు మల్లే, ఇక్కడ కొన్ని సార్లు దర్శకులకు ఆ అదృష్టం లభించిన సందర్భాలున్నాయి. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన దర్శక ప్రతిభ తో వెలిగి విజయం సాధించిన త్రివిక్రమ్ చిత్రం ‘అ ఆ’ నే. దాదాపు రెండున్నర మిలియన్ డాలర్ల వసూళ్లతో ‘అ ఆ’ ఈ ఏడాదిలో వచ్చిన అగ్ర హీరోల సినిమాలన్నిటినీ బీట్ చేసింది. అమెరికాలో హీరోలతో సమానంగా దర్శకులకి ఎంత క్రేజ్ వుందనే దానికి ఇది నిభద్ధమైన నిదర్శనం. ఓవర్సీస్లో దాదాపు ఏడు మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా.

వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ ఈ రికార్డుని బీట్ చేసి పది మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఆ చిత్రం ప్రదర్శన హక్కుల్ని ఒవర్సీస్ లో కనీ వినీ ఎరుగని మొత్తానికి సొంతం చేసుకున్నారట. ఇప్పుడు రాం చరణ్ ధ్రువ కూడా ఈ క్లబ్లో చేరబోతోంది.


కామెంట్‌లు