మళ్లీ కబాలి.. ఓర్నాయనో!!


ఈ ఏడాది రిలీజ్ కి ముందే ఎన్నో సెన్సేషన్స్ సృష్టించిన మూవీ కబాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రంతో సంచలనాలు సృష్టిస్తారని భావిస్తే.. ఒక్క తమిళనాడు తప్ప మిగిలిన ప్రాంతాల్లో తేడా వచ్చేసింది. అక్కడ కూడా పది రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ లు ఇచ్చేయడంతో సేఫ్ జోన్ లోకి వచ్చేసిందంతే.

రజినీకాంత్ ని మాఫియా డాన్ గా చూసి ఎంజాయ్ చేద్దామని అనుకున్న ఆడియన్స్ కి.. ఓ డాన్ ఆత్మకథను చూపించి దర్శకుడు నిరాశపరిచాడు. ఇదిలాఉంటే ఇప్పటికే కబాలి2 చిత్రాన్ని కూడా అనౌన్స్ చేయడం విశేషం. ఇప్పుడు కబాలి నిర్మాత కలైపులి ఎస్ థాను.. ఓ అనౌన్స్ మెంట్ చేశాడు. కబాలి మూవీకి గాను ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ ను అభిమానులకు అందించనున్నాడట ఈ నిర్మాత. 'కబాలిలో డిలెట్ చేసిన సన్నివేశాలు 31 డిసెంబర్ న యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నాం' అంటూ అధికారికంగా ప్రకటించాడు. 

ఈ నిర్మాతను మూవీ మార్కెటింగ్ విషయంలో ట్రెండ్ సెట్టర్.. డాన్ అంటారు. ఇప్పటికే కబాలితో రాబట్టిగలిగినదంతా అయిపోయాక.. ఇప్పుడు అభిమానుల కోసం అంటూ.. తీసేసిన సీన్స్ తో కూడా రెవెన్యూ సాధించే ఐడియాతోనే.. యూట్యూబ్ లో వాటిని రిలీజ్ చేస్తున్నాడని.. రజినీ మేనియాను ఇలా ఉపయోగించుకుంటున్నాడని అంటున్నారు కోలీవుడ్ జనాలు. 


కామెంట్‌లు