టాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఒకటి. ఇది బాలయ్య వందోచిత్రం కావడం, క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి శాతకర్ణి నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ అవ్వడం వల్ల.. దీనిపై భారీ క్రేజ్ నెలకొంది. ఆ కారణంగానే.. ఈ చిత్రం భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ దాదాపుగా భారీ రేట్లకే అమ్ముడుపోయాయి. తాజాగా శాటిలైట్ రైట్స్ కూడా రికార్డ్ రేటుకి సోల్డ్ అయ్యాయి.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని అక్షరాల రూ.9 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్ ఫిగర్. ఈ చిత్రంపై నెలకొన్న భారీ అంచనాల కారణంగానే దీని శాటిలైట్ రైట్స్ ఈ రేంజుకి సోల్డ్ అయ్యాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.60 కోట్లకు చేరుకుందని అంచనా వేస్తున్నారు. రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ఇలా ప్రభంజనాలు సృష్టిస్తుండడంతో.. రిలీజయ్యాక బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమేనని భావిస్తున్నారు.
జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రియాశరన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలయ్య తల్లి ‘గౌతమీ’గా బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి