30, మార్చి 2017, గురువారం

అవార్డే కాదు.. మనసులనూ గెలిచేసిన ఎన్టీఆర్



జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కెరీర్ టాప్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలు తనను ఏ మాత్రం మార్చలేవని.. ఎంత ఎదిగినా ఇంకా ఒదిగే ఉంటానని తన మాటలతోనే నిరూపించేశాడు యంగ్ టైగర్. తాజాగా జరిగిన ఐఫా ఉత్సవంలో ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు.

అయితే.. దీని కంటే పెద్ద విషయం ఏంటంటే.. అక్కడ ఆన్ స్టేజ్ పై ఎన్టీఆర్ చెప్పిన మాటలే. తన సినిమాకు అవార్డ్ వస్తే.. ఆ సినిమా గురించి యూనిట్ గురించి చెప్పుకోవడం కామన్. కానీ ఎన్టీఆర్ మాత్రం.. బెస్ట్ యాక్టర్ అవార్డు నామినీల అందరూ పేర్లను చదివి వినిపించాడు. అంతే కాదు.. అందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారంటూ ప్రశంసలు గుప్పించాడు. తను అందుకున్న ఈ అవార్డు తన ఒక్కడికి మాత్రమే కాదని.. అందరికీ దక్కిన గుర్తింపు అని ఎన్టీఆర్ చెప్పడంతో.. అందరూ అతని ప్రవర్తనకు మాటలకు ముగ్ధులైపోయారు.

గతేడాది ఇదే ఐఫా అవార్డుల సందర్భంగా ఎన్టీఆర్ టెంపర్ కు కాకుండా.. శ్రీమంతుడుకి గాను మహేష్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ట్రాలింగ్ చేశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం.. తన అవార్డ్ మొత్తం అందరిదీ అని చెప్పడంతో.. అందరి మనసులను గెలిచేసుకున్నాడు.

లేబుళ్లు: , ,

ఎన్టీఆర్ బాహుబలి కత్తి పట్టి




దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుత తెలుగు కథానాయకుల్లో అత్యంత ఇష్టపడేది జూనియర్ ఎన్టీఆర్ నే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి అంటే ఎన్టీఆర్ కూ అంతే అభిమానం. వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలొచ్చాయి. వాటిలో ఒకటి ఇండస్ట్రీ హిట్ (సింహాద్రి). ఒకటి బ్లాక్ బస్టర్ (యమదొంగ). ఇంకోటి సూపర్ హిట్ (స్టూడెంట్ నంబర్ వన్). ఐతే ఈ ఇద్దరూ కలిసి సినిమా చేసి దశాబ్దం అయిపోయింది. జక్కన్నతో మళ్లీ ఓ సినిమా చేయాలన్న తన కోరికను ఎన్టీఆర్ మళ్లీ మళ్లీ బయటపెట్టినా.. జక్కన్నకే వీలు చిక్కడం లేదు. ‘బాహుబలి’ కోసం ఐదేళ్లుగా అంకితమైపోయి ఉన్నాడు రాజమౌళి.

మళ్లీ వీళ్లిద్దరి కాంబో ఎప్పుడు తెరమీదికి వస్తుందో కానీ.. ఐఫా అవార్డుల వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన బాహుబలి వీఆర్ స్టాల్ దగ్గరికి వచ్చిన తారక్.. బాహుబలి కత్తి.. డాలు పట్టి పోజు ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ వేడుకకు సూటేసుకుని చాలా స్టైలుగా.. సరికొత్తగా తయారై వచ్చిన ఎన్టీఆర్.. బాహులి ప్రభాస్ సినిమా కదా అన్న బేషజాలేమీ పెట్టుకోకుండా కత్తి.. డాలు పట్టి ఫొటోలకు పోజిచ్చాడు. తన కొత్త సినిమా ‘జై లవకుశ’ కోసం బరువు తగ్గి లుక్ మార్చుకున్న తారక్.. ఆ తర్వాత పాల్గొన్న పబ్లిక్ ఈవెంట్ ఇదే. ఊరికే చెప్పడం కాదు కానీ.. సూట్లో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. అతడి లుక్ కూడా ఆకట్టుకుంది. మరి అతను సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలి.

లేబుళ్లు: , ,

27, మార్చి 2017, సోమవారం

ఏందీ సామీ ఈ అరాచకం….100 కోట్ల మార్క్ చిన్నదయ్యేలా ఉంది

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుష పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. కాగా సినిమాపై మొదలు అయినప్పుడు కూడా లేనన్ని అంచనాలు సినిమా మొదలయ్యాక ఒక్కొటిగా పెరుగుతూ పోతున్నాయి.

రీసెంట్ గా సినిమాకు యాడ్ అయిన టెక్నీషియన్స్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురాగా సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు అన్న వార్తా ఇండస్ట్రీలో పెనుదుమారాన్ని రేపింది. కాగా ఇప్పుడు ఇంటర్నెట్ లో లీక్ అయిన ఎన్టీఆర్ పాత్ర తాలూకు మాస్క్ సోషల్ మీడియాను కుదిపేస్తుంది.

ఆ మాస్క్ చూసిన ప్రతీ ఒక్కరు జైలవకుష ఎందుకు స్పెషల్ లో అర్ధం చేసుకుని ఇప్పుడు సినిమా టార్గెట్ 100 కోట్లు కాదు అంతకుమించే అంటూ అంచనాలు పెంచుకుంటున్నారు. కాగా ఆ మాస్క్ మొదటిసారి చూసిన ప్రతీ వాళ్ళు ఇది నిజమైన ఎన్టీఆరే అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తెలుగునాట సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు.

లేబుళ్లు: ,

కీరవాణి.. కొన్ని తప్పులున్నాయ్ బాస్!!


కొందరు దర్శకులు నా మాట వినేవారు కాదు.. డెఫ్ అండ్ డంబ్ అంటూ వ్యాఖ్యానించాడు కీరవాణి. ఆయన నిన్న సంచలనాత్మకంగా చేసిన ట్వీట్లు.. ఆ క్షణంలో సంచలనం అనిపించాయి కాని.. నిధానంగా విమర్శకుల నుండి వాటిపై రియాక్షన్ వస్తోంది. ఈయనేమన్నా ప్రూవ్ చేయబడిన స్ర్కీన్ ప్లే రైటరా ఈయన మాట వినడానికి? లేకపోతే ఈయన రాసిన కథలకు ఏమన్నా ఆస్కార్లు వచ్చాయా? కెరియర్ ఫేడ్ అయిపోయి చేతిలో అవకాశాలు లేనప్పుడు గతంలో ఇళయరాజా కూడా ఇటువంటి మాటలే చెప్పాడు.. అంటూ విమర్శకులు కూడా అస్ర్తాలు సంధిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో రాజమౌళి హిట్టు సినిమాల్లో కూడా కీరవాణి కేవలం ఒకటే ఒకటి హిట్టు సాంగును ఇస్తున్నారు. ఒక ఆల్బమ్ లో 5 పాటలున్నప్పుడు.. కేవలం అందులో 1 పాట హిట్టవుతుంటే.. ఆ మ్యూజిక్ డైరక్టర్ హిట్ రేషియో ఏంటి? అటువంటప్పుడు అతను దర్శకుల హిట్ రేషియో గురించి కామెంట్లు చేయొచ్చా? బాహుబలి కాకుండా కీరవాణి ఈ మధ్య కాలంలో కంపోజ్ చేసిన ఇంటింటి అన్నమయ్యా.. అనామిక.. దిక్కులు చూడకు రామయ్య.. సైజ్ జీరో.. ఓం నమో వెంకటేశాయా.. సినిమాల్లోని ఒక్క పాటను టక్కుమని చెప్పండి చూద్దాం అంటున్నారు విమర్శకులు. వినసొంపైన సంగీతం కీరవాణి ఈ మధ్యకాలంలో కంపోజ్ చేయలేకపోవడం ఎంత నిజమో.. ఇతర దర్శకులు కూడా హిట్టు తీస్తున్నామనే అనుకుని ఫ్లాపులు తీయడం అంతే నిజం.

బాహుబలి ఈ రేంజులో విజయవంతం అవుతుందని కనీసం డైరక్టర్ కూడా అనుకోలేదని చెప్పిన కీరవాణి.. మరి రాజమౌళిని ఎవ్వరూ టచ్ చేయలేరని ఏ విధంగా చెప్పగలరు? ఏమో ఆ స్థాయిలో సినిమా తీసే యువకులు ఉత్సాహవంతులు ఎంతమందైనా రావొచ్చు.. దానికేముంది. ఏదేమైనా కూడా కీరవాణి ట్వీట్లలో నిజాయితీ పాళ్ళు ఉంటే ఉండొచ్చు కాని.. ఆయన పరస్పెక్టివ్ లో మాత్రం తప్పులున్నాయ్ బాస్!!

లేబుళ్లు: , ,

26, మార్చి 2017, ఆదివారం

దర్శకుడితో సెక్స్ టార్చర్ అనుభవించా – హీరోయిన్!


సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఎలాంటి అనుభూతులను చవిచూసామో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దగ్గర నుండి స్మాల్ హీరోయిన్ మాధవిలత వరకు చాలామంది చెప్పుకొచ్చారు. అయితే ఇది ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాదు, ఏ సినీ పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదన్న విషయాన్ని పలువురు హీరోయిన్లు చెప్పకనే చెప్పారు. తాజాగా తనకు ఎదురైన అనుభవం గురించి తమిళ హీరోయిన్ లేఖ వాషింగ్టన్ చెప్పుకొచ్చింది.

బుల్లితెర టీవీ యాంకర్ స్థాయి నుండి సిల్వర్ స్క్రీన్ స్థాయికి వచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరగా చేసిన సినిమా “కళ్యాణ సమయాల్ సాధం.” ఆ తర్వాత ఒకటి, రెండు సినిమాలలో అతిథి పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా ‘కమినా’ అనే చిత్రంలో నటించింది. 2014 తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీ వర్గాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఇండస్ట్రీలోని పోకడ గురించి ఓ బాంబు పేల్చింది. సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టమని, ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.

తానూ కూడా కెరీర్ లో కూడా ఓ తమిళ దర్శకుడితో సెక్స్ టార్చర్ అనుభవించానని, తనకు కధ చెప్పడానికి వచ్చిన ఆ దర్శకుడు, అది పూర్తయిన తర్వాత ‘ఈ సినిమాలో నీకు అవకాశం ఇస్తే నాకేం ఇస్తావు?’ అని అడిగాడని, అతని దుర్భుద్ధి తనకు అర్ధమైనా, అర్ధం కానట్లుగా ప్రవర్తిస్తే… పదే పదే అదే ప్రశ్న వేసి సినిమా ఆద్యంతం విసిగించాడని ఆవేదన చెందుతూ చెప్పుకొచ్చింది. ఇలా తమ చేదు అనుభవాలను బయట పెడుతున్న హీరోయిన్ల జాబితా అంతకంతకూ పెరుగుతూ పోతుండడంతో, ఇంకెంతమంది బయట పడతారో చూడాలి.

లేబుళ్లు: ,

ఫొటోస్: ప్రియాంక చోప్రా న్యూ స్టిల్స్






లేబుళ్లు: ,

కాటమరాయుడికి పెద్ద పంచే పడిందిగా..


అమెరికన్ తెలుగు సినిమా మార్కెట్లో మంచి పట్టు ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. అక్కడ పవన్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగుతుంది. అప్పట్లో ‘అత్తారింటి దారేది’ సినిమా టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించింది. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమాకు నెగెటివ్ టాక్ రావడం వల్ల ఆ తర్వాత కలెక్షన్లు డ్రాపయ్యాయి. ఐతే పవన్ లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’కు రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చిన నేపథ్యంలో ఓపెనింగ్స్ అదిరిపోతాయని ఆశించారు.

ఏకంగా 250 స్క్రీన్లలో ‘కాటమరాయుడు’ సినిమాను రిలీజ్ చేశారు. ఇది నాన్-బాహుబలి రికార్డు. దీంతో ఈ చిత్రం ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ల వసూళ్లు కొట్టేస్తుందని ఆశించారు అభిమానులు. కానీ ప్రిమియర్లతో పాటు తొలి రోజు వసూళ్లను కలిపినా మిలియన్ డాలర్ల మార్కును అందుకోలేదు. గురు-శుక్రవారాలు రెండూ కలిపితే ఈ చిత్రానికి 6.67 లక్షల డాలర్లు వసూలయ్యాయంతే. సినిమా మీద ఉన్న హైప్.. రిలీజ్ చేసిన థియేటర్ల ప్రకారం చూస్తే ఇవి పూర్ ఓపెనింగ్సే. అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో సినిమా అక్కడ ఫుల్ రన్లో మిలియన్ డాలర్ మార్కును దాటి ఎంతో దూరం ట్రావెల్ చేసేలా లేదు. కానీ అక్కడి బయ్యర్ సినిమాపై భారీ పెట్టుబడే పెట్టాడు. వీకెండ్ తర్వాత ఈ సినిమా నిలబడకపోతే భారీ నష్టాలు తప్పవేమో.

లేబుళ్లు:

25, మార్చి 2017, శనివారం

“కాటమరాయుడు” కలెక్షన్స్ ఏవి?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” సినిమా విడుదలై, ఒక రోజు విజయవంతంగా పూర్తయ్యింది. అదే ఓవర్సీస్ లో అయితే రెండు రోజులు గడిచాయి. ముందు రోజు ప్రీమియర్ షోలతో పాటు, తొలి రోజు కూడా ముగిసింది. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అన్న ఆసక్తి అటు పవన్ అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కలెక్షన్స్ కు సంబంధించి ఏదొక సమాచారం హల్చల్ చేస్తుంటుంది గానీ, వాటిని నమ్మే పరిస్థితి లేదు. దీంతో అధికారిక సమాచారం కోసం వేచిచూస్తున్నారు.

ఏపీ, తెలంగాణాలతో పాటు దేశవ్యాప్తంగా వసూళ్ళ గురించి ఇటీవల కాలంలో అఫిషియల్ గా ప్రకటించకపోయినా, ఓవర్సీస్ లో మాత్రం అధికారిక సమాచారం వెలువడుతుంది. నిజానికి ఓ పక్క ప్రీమియర్ షోల బుకింగ్ ప్రారంభమైన సమయం నుండి ప్రతి క్షణం కలెక్షన్స్ అప్ డేట్ అవుతుంటాయి. కానీ, ‘కాటమరాయుడు’ ప్రీమియర్ షోలనే కాదు, ఫస్ట్ డేను కూడా పూర్తి చేసుకుంది. కానీ, ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయింది. దీంతో అసలు ఓవర్సీస్ లో ఏమై ఉంటుందా? అన్న ఆతృత అభిమానుల్లో నెలకొని ఉంది.

యుఎస్ కలెక్షన్స్ వివరాల గురించి ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్, ఎప్పటికప్పుడు వివరాలు ప్రకటిస్తూ ఉంటారు. బాలీవుడ్ కు సంబంధించిన వివరాలను తెలిపారు గానీ, ‘కాటమరాయుడు’పై కనీసం ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రీమియర్ కలెక్షన్స్ వివరాలు 6.50 లక్షల డాలర్స్ గా పేర్కొంటున్నారు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ 24 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో గానీ, సదరు సమాచారం మాత్రం పవన్ ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ను పంచుతోంది.

లేబుళ్లు:

ఎన్టీఆర్ కోసం సిలికాన్ మాస్క్.. ఏ క్యారెక్టర్ కోసమో తెలుసా!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'జై లవకుశ' టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం లవకుమార్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాశిఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హంసా నందిని ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమాలోని ఓ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ సిలికాన్ మాస్క్ వాడబోతున్నాడు. పైనున్నది ఆ సిలికాన్ మాస్కే. భయంకరంగా ఉన్న ఈ మాస్క్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించబోతున్న నెగటివ్ షేడ్ క్యారెక్టర్ కోసం వాడబోతున్నారని సమాచారమ్. 'జై లవకుశ' చిత్రం స్టోరీ చాలా పవర్ ఫుల్ గా, డిఫరెంట్ గా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫీసర్ గా లవకుమార్ లుక్ అదిరింది. ఇప్పుడు ఈ సిలికాన్ మాస్క్ తో గెటప్ సంచలనం సృష్టిస్తోంది. సో... ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాతో సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

లేబుళ్లు: , ,

జూనియర్ ఎన్టీఆర్.. కింగ్ ఆఫ్ బాక్సాఫీస్



ఉత్తమ నటుడిగా ఇప్పటిదాకా చాలా అవార్డులే అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఐతే తొలిసారిగా అతను ‘కింగ్ ఆఫ్ బాక్సాఫీస్’ అనే కొత్త పురస్కారాన్ని తీసుకున్నాడు. ‘జీ’ ఛానెల్ నిర్వహించిన సినిమా అవార్డుల వేడుకలో 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ రూ.55 కోట్ల దాకా షేర్ సాధిస్తే.. ‘జనతా గ్యారేజ్’ రూ.84 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి టాలీవుడ్ టాప్-3 హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు ఈ అవార్డు అందజేశారు.

ఇంతకుముందు ఎన్టీఆర్ కు నటుడిగా మంచి పేరుండేది కానీ... బాక్సాఫీస్ రేసులో మాత్రం బాగా వెనుకబడి ఉండేవాడు. ఐతే ‘టెంపర్’ దగ్గర్నుంచి సినిమా సినిమాకూ తన రేంజ్ పెంచుకుని ‘జనతా గ్యారేజ్’తో అనూహ్యమైన స్థాయిని అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అభిమానులు.. దర్శకుల వల్లే తాను ఇప్పుడీ స్థాయిలో ఉన్నానన్నాడు. ఇక ముందూ మంచి స్క్రిప్టులు ఎంచుకుని సాగిపోతానని అన్నాడు.

మరోవైపు సమంత ‘క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్’ అవార్డును అందుకోవడం విశేషం. ఆమె గత ఏడాది ‘అఆ’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి బ్లాక్ బస్టర్లలో నటించింది. ఎన్టీఆర్.. సమంతల అవార్డుల్లో వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాకు భాగస్వామ్యం ఉండటం విశేషమే. తమిళ స్టార్ హీరో సూర్య ‘సెన్సేషన్ ఆఫ్ సౌత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. జీ టీవీ వాళ్లు ఒకేసారి బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియన్ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటించారు.

లేబుళ్లు: ,

నీ స్పీడ్ కి జోహార్లు ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ఎన్టీఆర్27 రీసెంట్ గా మొదలు అవ్వగా యంగ్ టైగర్ మాత్రం కొద్దిగా ఆలస్యంగా జాయిన్ అయ్యాడు. కాగా ఎన్టీఆర్ తో చిన్న షెడ్యూల్ ని ప్లాన్ చేసిన బాబీ ఆ షెడ్యూల్ తో ఫుల్ ఖుషి అయ్యాడు.

ఎన్టీఆర్ తో చిన్న షెడ్యూల్ ని సుమారు 10 రోజులు ప్లాన్ చేయగా ఎన్టీఆర్ షూటింగ్ లో తన పార్ట్ ని కేవాలం  ఏడంటే ఏడు రోజుల్లోనే ముగించి డైరెక్టర్ ని ఆశ్యర్యపరిచేశాడట…దాంతో కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు మరింత కాన్ఫిడెంట్ తో సినిమాను అనుకున్న సమయానికి తెచ్చేలా షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నాడట.

కాగా 10 రోజుల షూటింగ్ ని 7 రోజుల్లో ముగించడంతో ఎన్టీఆర్ స్పీడ్ కి యూనిట్ మొత్తం ఫ్లాట్ అయిపోయి జోహార్లు కొట్టేస్తున్నారట…కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు..

లేబుళ్లు: ,

24, మార్చి 2017, శుక్రవారం

కాటమరాయుడు సినిమా రివ్యూ, రేటింగ్ మరియు ప్లస్ లు మైనస్ లు


పవన్ కళ్యాణ్ సినిమా వస్తోంది అంటే చాలు జనాలలో క్రేజ్ నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఆడియో ఫంక్షన్ దగ్గర నుంచీ సినిమా థియేటర్ ల వరకూ సినిమాని మోస్తారు అతని అభిమానులు. గత చిత్రం సర్దార్ డిజాస్టర్ అవడం తో ఈ సినిమా కోసం పవన్ ఫాన్స్ ఎదురు చూసారు.మొత్తం మీద వీరం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దామా ?

కథ – పాజిటివ్ లు

రాయలసీమ ప్రాంతంలోని ఒక ఊరికి కాటమరాయుడు పెద్దగా ఉంటాడు. ఆ మాటకి వస్తే సీమ లోని చాలా ప్రాంతాల వారు రాయుడి మాట వింటూ ఉంటారు. కాంట్రాక్ట్ ల దగ్గర నుంచీ ఇతరత్రా ఏ విషయం లో అయినా రాయుడి మాటే ఫైనల్. అలాంటి రాయుడు కి నలుగురు తమ్ముళ్ళు, తమ్ముళ్ళు అంటే ప్రాణం గా చూసుకునే రాయుడుకి అమ్మాయిలు అంటే అసహ్యం. చిన్నప్పుడు తనని ఇష్టపడిన అమ్మాయి అతన్ని వదిలేయడం తో రాయుడు ఆ తరవాత నుంచీ అమ్మాయిల మీద పంతం పెంచుకుంటాడు. ఒక పక్క గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న తమ్ముళ్ళు అన్నయ్య పెళ్లి చేస్తే కానీ తమ పెళ్లి అవదు అని అర్ధం చేసుకుని అన్నయ్య మీదకి శృతి హాసన్ ని వదులుతారు. శృతి పవన్ ప్రేమలో పడిందా, అమ్మాయిలు అంటే అసహ్యం ఉన్న పవన్ మనసు కరిగిందా అనేది తెరమీద చూడాలి. పవన్ ఈ సినిమాకి వన్ మ్యాన్ షో తో మంచిగా క్యారీ చేసాడు.స్టైలింగ్ అంతా రాయలసీమ స్టైల్ లో పెట్టి .. భాష కూడా అక్కడి భాషనే మాట్లాడాడు కళ్యాణ్. దీనికి కామెడీ తోడు అవ్వడం ,శృతి తో ప్రేమ సన్నివేశాలూ ఇవన్నీ బాగా కుదిరాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. ఫైట్ లు అతిపెద్ద హై లైట్. ఎలేవేషన్ సీన్ లలో పవన్ ఫాన్స్ కి పండగే పండగ.

నెగెటివ్ లు :

ఈ సినిమాకి ప్రధాన నెగెటివ్ లుగా కథ గురించి చెప్పుకోవాలి. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ కి ఈ అన్నదమ్ములని అంటించారు అంతే. కథలో ఒక ట్విస్ట్ కానీ ఆసక్తి రేపే అంశం కానీ లేదు. స్క్రీన్ మీద పాటలు పెద్దగా వర్క్ అవ్వలేదు. డైరెక్టర్ కొన్ని లాజిక్ లు విపరీతంగా మిస్ అయ్యాడు అనిపిస్తుంది. ఇంకాస్త కేర్ తీసుకుని క్లైమాక్స్ ని కాన్సెప్ట్ ఫైట్ పెట్టి ఉంటె అదిరిపోయేది. కామెడీ బాగుంది కానీ అక్కడక్కడా విసుగు తెప్పిస్తుంది. హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ అక్కడక్కడా మిస్ అయ్యింది. కథలో డైరెక్టర్ కి సీరియస్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కాటంరాయుడు ఎందుకు ఆ ఊరుకి అంత తోపు అనేది కారణం చూపించలేదు. విలన్స్ తేలిక అయిపోయారు.
Click Here for Katamarayudu Telugu Movie Review and Rating
మొత్తంగా .. సాగతీత సన్నివేశాలు కొన్ని చోట్ల ఉన్నా కూడా డైరెక్టర్ డాలీ స్క్రీన్ ప్లే ని కాస్తంత ఫాస్ట్ గా నడిపిస్తూ వీరం లోని తలనొప్పి సీన్ లని కట్ చెయ్యడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. రొటీన్ సినిమాలు చూడడం అస్సలు ఇష్టపడని వారు ఈ చిత్రాన్ని పూర్తి గా అవాయిడ్ చెయ్యచ్చు. కళ్యాణ్ మార్క్ కామెడీ , ఫైట్ లూ , నిండుతనం కోసం ఈ సినిమా ఫామిలీ తో ఈ వారాంతం లో హ్యాపీగా చూసేయచ్చు. పవన్ నుంచి గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన అత్యంత రొటీన్ సినిమా ఇది. కానీ ఆ సినిమా రేంజ్ లో మాత్రం హిట్ అవకపోవచ్చు. మంచి రెవెన్యూ చేస్తూ కళ్యాణ్ క్యాప్ లో ఒక ఫీదర్ అవుతుంది

రేటింగ్: 2.75 / 5.0

లేబుళ్లు:

23, మార్చి 2017, గురువారం

చిరంజీవి కి మరోసారి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్…!


మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా అడుగుపెట్టాడు మెగాస్టార్.

నీ ఆ షోకి ఏమాత్రం ఆశించిన రేటింగ్స్ రాకపోవడంతో అందరిలోనూ ఒకింత నిరుత్సాహాన్ని నింపుతుంది. కాగా ఇక్కడ మరో వార్తా ఏంటి అంటే ఈ మధ్యే రెండోసారి టెలికాస్ట్ అయిన జనతాగ్యారేజ్ మాటివిలో ఈ మధ్య అత్యధిక రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది.

కాగా ఈ సినిమా వచ్చిన రేటింగ్ 10.12 అని అంటున్నారు. కాగా ఓవరాల్ గా లాస్ట్ మంత్ రేటింగ్స్ లో జనతాగ్యారేజ్ టాప్ ప్లేస్ ని దక్కించుకాగా మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు మాత్రం 5.67 రేటింగ్ తో 5 వ ప్లేస్ ని దక్కించుకుందని అంటున్నారు.

లేబుళ్లు: ,

సుచిత్ర లీక్స్ లో అనూహ్య మలుపు



ఆ మధ్య సుచిత్ర లీక్స్ ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. అసలు ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందో లేదో కానీ, ఓ ఇద్దరి నటీమణులు జీవితం మాత్రం ఆమె లీక్ చేసిన వీడియోతో దుర్బరం అయిందని చెప్పాలి. అదే విధంగా సుచిత్ర ఎకౌంటు నుంచి బయటపడిన మరికొన్ని డీటైల్స్ కూడా చాలా డిస్ట్రబింగ్ గా ఉన్నాయి.

సినిమా లోకంలో ఇలాంటి చీకటి కోణం కూడా ఉన్నదా అనిపించేలా ఉన్నాయి. అవన్నీ నిజాలా కాదా అని పక్కన పెట్టేస్తే, ఆ అకౌంట్ నుంచి వచ్చిన హింట్స్ ని బట్టి చూస్తే ఆమె ధనుష్-త్రిష-హన్సిక-మలాపాల్-దివ్యదర్శిని-ఆండ్రియా-అనిరుధ్ వంటి వారిపై చేసిన ఆరోపణలకు తగిన సాక్షాలు కనిపిస్తున్నాయి.

అవన్నీ చూసినవారికి ఎవరైనా కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే మొత్తం మ్యాటర్ ఇప్పుడు అనూహ్య మలుపు తిరుగుతుంది అంటూ తమిళనాట పుకార్లు వినిపిస్తున్నాయి. సింగర్ సుచిత్రను ఎవరో కిడ్నాప్ చేశారని అక్కడి వార్తల సారాంశం. ఈమె లీక్ చేసిన యవ్వరంతో ఇబ్బందులు పడినవారు, ఆమెని కిడ్నాప్ చేయించారని, ఆమె దగ్గర ఉన్న డేటా అంతా తీసుకున్నాకే ఆమెని వదులుతారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరు అధికారికంగా స్పందించలేదు కాబట్టి మనం కూడా ఏమి జరుగుతుందో క్లియర్ గా చెప్పడం కష్టమే

లేబుళ్లు: , ,

22, మార్చి 2017, బుధవారం

ఆక్టర్ శివబాలాజికి వార్నింగ్ ఇచ్చిన ఎన్ టి ఆర్ ఫ్యాన్


లేబుళ్లు: ,

ఐఫా లో పోటీపడుతున్నా ఎన్టీఆర్‌



ఈ నెల 28న ఒకే వేదికపై తెలుగు హీరోలు
Updated : 22-Mar-2017 : 09:37

28న హైదరాబాద్‌లో వేడుక ఒకే వేదికపై దక్షిణాది తారల సినీ సంబరం
చెన్నైలో నామినేషన్లు ప్రకటించిన రానా, జీవా
ప్రతి ష్టాత్మక ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డుల రేసులో 2016 ఏడాదికిగాను టాలీవుడ్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పోటీపడుతున్నారు. వారితోపాటు అల్లు అర్జున్, నాని, విజయ్‌ దేవర కొండ ఉత్తమ కథానాయకుడి రేసులో ఉండగా, స్వీటీ అనుష్క, చెన్నై బ్యూటీ సమంత, కొత్తభామలు రితూవర్మ, ప్రగ్యా జైస్వాల్‌ ఉత్తమ కథానాయకి నామినేషన్లు సాధించారు. ఈనెల 28న హైదరాబాద్‌లో జరుగబోతున్న ఐఫా అవార్డు ప్రదానోత్సవ వేడుక సందర్భంగా దక్షిణాదిలోని నాలుగు సినీ పరిశ్రమల నుంచి 13 విభాగాల్లో నామినేషన్లను చెన్నైలో ప్రకటించారు. ఐఫా డైరెక్టర్‌ ఆండ్రీ టిమిన్స్, రానా, జీవా తదితర సినీ ప్రముఖుల సమక్షంలో నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఐఫా అవార్డుల నామినేషన్లను వెల్లడించారు. ఈ సందర్భంగా ఐఫా డైరెక్టర్‌ మాట్లాడుతూ... తొలిసారిగా దక్షిణాది సినీ దిగ్గజాలను, సినీ తారలను ఒక వేదికపైకి చేర్చే ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుపనున్నట్టు తెలిపారు. ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన సినీ తారలు, కళాకారులకు అవార్డులను ప్రదానం చేయనున్నామని, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఈ వేడుకను జరుపనున్నామని తెలిపారు.

         ఈ వేడుకల్లో ప్రముఖ సినీతారలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్‌చరణ్‌, మహేశ్‌బాబు, శివరాజ్‌ కుమార్‌, రవిచంద్రన్, మోహన్ లాల్‌, జీవా, వెంకట్‌ ప్రభు, రానా దగ్గుబాటి, నాజర్‌, జయం రవి, జాన్‌విజయ్‌ తమన్నా, సమంత, అనుష్క, రకుల్‌ప్రీత్, మమతా మోహన్‌దాస్‌, ఖుష్బూ, తదితరులు పాల్గొంటారని ఆయన తెలి పారు.

            ఇక ఐఫా వేడుకకు తెలుగు సిగ్మంట్‌కు రానా, తమిళ సిగ్మంట్‌కు యువ నటుడు శివ కార్తికేయన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. విలేఖరుల సమావేశంలో పాల్గొన్న రానా మాట్లాడుతూ... హైదరాబాద్‌ వేదికగా దక్షిణాది తారలను ఐఫా సత్కరించనుండటం హర్షణీయమని, రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుక అభిమానులకు కన్నులపండువగా ఉంటుందని అన్నారు. ఐఫా సంస్థ తొలిసారిగా దక్షిణాదిలో ఈ వేడుకలను జరుపటం అభినందనీయమని తమిళ నటుడు జీవా పేర్కొనగా.. దక్షిణాది తారలందరినీ ఒకే వేదికపై సత్కరించేందుకు సమాయత్తమవుతున్న ఐఫా సంస్థను మనసారా అభినందిస్తున్నానని, సినీ తారల కృషికి గుర్తింపునిచ్చేవి ఐఫా వంటి సంస్థ లిచ్చే అవార్డులేనని నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ పేర్కొంది. ఈ సమావేశంలో అదానీ విల్మర్‌ లిమిటెడ్‌ సీఓఓ అంగ్‌ షూమాలిక్‌, రేనాల్ట్‌ ఇండియా ఆపరేషన్స్ మేనే జింగ్‌ డైరెక్టర్‌ సుమిత్ స్వాహ్నీ, ఐఫా ఉత్సవం జ్యూరీ సభ్యుడు పి. వాసు, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్య దర్శి కాట్రగడ్డ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్‌ నామినేషన్లు ఇవే...
మొత్తం 13 కేటగిరీలలో ఐఫా అవార్డుల ను ప్రదానం చేయనున్నారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా ‘ఊపిరి’, ‘జనతా గ్యారేజ్‌’, ‘పెళ్లిచూపులు’, ‘క్షణం’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు పోటీపడుతుండగా, ఉత్తమ హీరో విభాగంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ (జనతా గ్యారేజ్‌), రామచరణ్‌ (ధ్రువ), నాని (కృష్ణ గాడి వీర ప్రేమగాథ), అల్లు అర్జున్ (సరైనోడు), విజయ్‌ దేవరకొండ (పెళ్లిచూపులు), ఉత్తమ హీరోయిన్ విభాగంలో అనుష్క (రుద్రమ దేవి, సైజ్‌ జీరో), సమంత (అఆ), రీతూవర్మ (పెళ్లి చూపులు), ప్రగ్యా జైస్వాల్‌ (కంచె) రేసులో ఉన్నారు. ఉత్తమ దర్శకుడిగా కొరటాల శివ (జనతా గ్యారేజ్‌), సుకుమార్‌ (నాన్నకు ప్రేమతో), వంశీ పైడిపల్లి (ఊపిరి), క్రిష్‌ (కంచె), తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లి చూపులు) పోటీపడుతున్నారు.

లేబుళ్లు: ,

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉగాది జాతరే…



యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్27…మొదలు అవ్వడం ఎదో సాదాసీదా కమర్షియల్ మూవీగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు మాత్రంఓ రేంజ్   లో అంచనాలను పెంచేస్తూ సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది.

కాగా సినిమా మొదలైనా అందులో ఎన్టీఆర్ పాల్గొన్నా సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందని అందులో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడా అని అందరిలోనూ ఉత్కంట నెలకొంది…కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ న్యూస్ మాత్రం హాల్ చల్ చేస్తుంది.

ఆ న్యూస్ ప్రకారం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ ఉగాదికి బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అది కనుక జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ ఉగాది జాతరే అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

లేబుళ్లు: , ,

19, మార్చి 2017, ఆదివారం

మహేష్ సినిమాలో అదిరిపోయే పాట లీక్?



క్రేజ్ ఉన్న సినిమాల సమాచారం, అలాగే సదరు సినిమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ లీకేజ్ లను అడ్డుకోవడం అసాధ్యమని ‘బాహుబలి 2’ కూడా చెప్పకనే చెప్పింది. కానీ, ఇప్పటివరకు మురుగదాస్ – మహేష్ సినిమాకు సంబంధించి ఎలాంటి వీడియో కూడా లీక్ కాలేదు. అక్కడక్కడ ఆన్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి గానీ, ప్రధానంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు.

అలాంటిది ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పాట లీక్ అయ్యిందంటూ యూ ట్యూబ్ లో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. మెలోడీగా సాగే ఈ పాట ఆహ్లాదకరంగా ఉండడంతో, శ్రోతలను మాయలో పడేస్తోంది. రాహుల్ స్వరంతో వీనులవిందుగా మారిన ఈ పాట నిజానికి మహేష్ సినిమాలో లీక్ అయిన పాట కాదు. యూ ట్యూబ్ లో ‘పూర్ బాయ్ రాహుల్ సిప్లిగంజ్’ పేరుతో విడుదల చేసిన ప్రైవేటు ఆల్బంలోని ఈ మెలోడీ పాటను మహేష్ “సంభవామి యుగేయుగే” పాటలోదంటూ అప్ లోడ్ చేయడం, అది కాస్త వైరల్ గా మారడం జరిగిపోయాయి.

నిజానికి 2015లోనే ఈ పాట యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ అయ్యింది. అయితే ప్రైవేటు ఆల్బం కావడంతో, కావల్సినంత ప్రజాధరణ లభించలేదు. దీంతో ఈ పాట మహేష్ సినిమాలోది అని కొత్తగా అప్ లోడ్ చేయడంతో, ఇది కాస్త పాపులర్ అయ్యింది. ప్రిన్స్ అభిమానులైతే… ఈ పాట అదిరిపోయిదంటూ హరీష్ జయరాజ్ అదిరిపోయే సంగీతాన్ని అందించారంటూ పండగ చేసుకుంటున్నారు. కానీ, అసలు వాస్తవం అది కాదు, ఇది రాహుల్ అనే సింగర్ సృష్టించిన ఓ ప్రైవేటు ఆల్బంలోని పాట మాత్రమే!

లేబుళ్లు: ,

Regina Latest Photos







Tags: Regina cassendra , Actress regina, Nagaram movie
Re

లేబుళ్లు: ,

షాకింగ్….సింహాద్రి సినిమానే బాహుబలికి స్ఫూర్తి


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా 2003 లో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు…ఆ సినిమా సృష్టించిన చరిత్రను అందుకోవడానికి ఎన్టీఆర్ కి 13 ఏళ్ళు పట్టింది అంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

కాగా ఇప్పుడు టోటల్ ఇండియాని ఊపేస్తున్న బాహుబలిలో అసలు సిసలు ట్విస్ట్ కి కారణం సింహాద్రి సినిమా అంటే నమ్ముతారా….అవుననే అంటున్నాడు రాజమౌళి…తన సన్నిహితులతో చెబుతూ సింహాద్రి ఇంటర్వెల్ లో భూమిక ఎన్టీఆర్ ని పొడిచే సీన్ ఎంతటి షాకింగ్ గా రిపీట్ వ్యూస్ రావడానికి కారణమయ్యిందో తెలిసిందే.

అదే సీన్ ని స్ఫూర్తిగా చేసుకుని కట్టప్ప బాహుబలిని చంపే సీన్ ని రెడీ చేయించాడట జక్కన్న…ఆ సీన్ కి మూలం సింహాద్రి అని ఇప్పుడు అందరినీ షాకింగ్ కి గురిచేసింది…బాహుబలి 2 లో కట్టప్ప ఎందుకు పొడిచాడో క్లారిటీ ఇస్తాడు కాబట్టి ఆ సినిమా కోసం ఇప్పుడు అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు.

లేబుళ్లు: ,

పోరాటంతో ఆరంభం…!


కథకు ఒక్కసారి పచ్చజెండా వూపానంటే చాలు… ఇక మళ్లీ దాని గురించి ఆలోచించనంటారు బాలకృష్ణ. సెట్‌లో దర్శకుడు చెప్పింది మెరుపు వేగంతో చేసుకొంటూ వెళ్లిపోతుంటారాయన. ఇంచుమించు పూరి జగన్నాథ్‌ శైలి కూడా అంతే.

కొన్ని నెలల ముందుగానే స్క్రిప్టుని పక్కాగా సిద్ధం చేసుకొని స్పష్టతతో సెట్స్‌పైకి వెళతారు. అందుకే ఆయన సినిమాలు టంచనుగా అనుకొన్న సమయానికే విడుదలవుతుంటాయి. కొబ్బరికాయ కొట్టినరోజునే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంటారు.

బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా విడుదల తేదీనీ ప్రకటించారు. ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైన ఆ చిత్రం సెప్టెంబరు 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది. గురువారం నుంచి ఒక పోరాట ఘట్టంతో చిత్రీకరణ మొదలుపెట్టారు.

ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ నేతృత్వంలో బాలకృష్ణ, ఫైటర్లపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 21 వరకు హైదరాబాద్‌లోనే ఆ సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఆ తర్వాత కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ముగ్గురు కథా నాయికలు నటిస్తారు.

లేబుళ్లు: , ,

కాటమరాయుడు నిర్మాతల చిల్లర దంద…!!


రాను రాను సినిమాలు పూర్తిగా వ్యాపారంగా మారిపోతున్నాయి. దీనికి సరైన ఉదాహరణే ఈ సంఘటన. త్వరలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం విదుదల అవబోతుందని అందరికే తెలిసిందే. అయతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన కాష్టుమ్స్ అన్నింటినీ ఆన్ లైన్ ఆఫ్ లైన్ ద్వారా అమ్మడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. ఇటీవల కాలంలో సినిమా పరంగా, రాజకీయ పరంగా కూడా ఎలా చూసినా ఇప్పుడు హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్.
అయితే ఈ క్రేజ్ ను సొమ్ము చేసుకోవడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. ఇంకా సినిమా విడుదలే కాలేదు అప్పుడే వస్తువులను అమ్మకానికి పెట్టడం పై నెటిజన్లు సోషల్ మీడియా లో పెదవి విరుస్తున్నారు. సినిమా హిట్ అయితేనే పవన్ వాడిన వస్తువులకు క్రేజ్ పెరుగుతుంది కానీ, ఒక వేల ఫట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటనే కోణంలో ఆలోచించిన నిర్మాతలు ఈ విధంగా ప్లాన్ చేసినట్లు ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది.

లేబుళ్లు: , , ,

‘బాహుబలి 2’పై మరీ కామెడీగా లేదు!



యూ ట్యూబ్ లో “బాహుబలి 2” సృష్టించిన సంచలన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న ఇండియన్ ఫిల్మ్ రికార్డులను తిరగరాసిన “బాహుబలి 2” వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని కొత్తగా ఓ వార్త పుట్టుకొచ్చింది. మరే భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో 24 గంటల్లోనే 5 కోట్లకు పైగా వ్యూస్ ను సాధించిన “బాహుబలి 2” ట్రైలర్, ప్రపంచంలో ఇప్పటి వరకు అధ్యధిక లైక్స్ సాధించిన ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్’ను మించిపోయింది.

అవెంజర్స్ కు మొత్తమ్మీద 5.16 లక్షల లైక్స్ రాగా… బాహుబలి-2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టి, 5.57 లక్షల లైక్స్ సాధించి హాలీవుడ్ సినిమాలకు సైతం సవాల్ విసిరింది. అయితే ‘బాహుబలి’కి ఈ రేంజ్ లో వ్యూస్, లైక్స్ దక్కడంపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారని, జియో ఫ్రీ డేటా ఆఫర్ ఉండడం వలనే, ఇది సాధ్యమైందని, ‘బాహుబలి 2’ ట్రైలర్ ను జనాలు అన్ని సార్లు చూశారని తెరపైకి వచ్చిన కొత్త వాదన మరీ కామెడీగా ఉంటోంది.

ఈ వాదనలో కొంత లాజిక్ ఉండవచ్చు గానీ, అదే నిజమైతే ఒక తెలుగు సినిమా కంటే ఎక్కువ మార్కెట్ పరిధి కలిగిన బాలీవుడ్ సినిమాలకు ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్స్ రాలేకపోయాయి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బహుశా ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో హంగామా చేయడం రుచించని కొంతమంది సృష్టించిన పుకారుగానే దీనిని భావించాలి తప్ప, ఇందులో నిజంగా వాస్తవం ఉంటే ఒక్కసారి గత ఆరు నెలలుగా విడుదలైన బాలీవుడ్ సినిమాల ట్రైలర్ల జాబితాను పరిశీలించాలి.

లేబుళ్లు: , ,

కాటమరాయుడి బిగ్గెస్ట్‌ మిస్టేక్‌

 రిలీజ్‌కి అయిదారు రోజుల ముందు థియేట్రికల్‌ రిలీజ్‌ చేయడం వల్ల క్రేజ్‌ బాగా వుంటుందని, అది సద్దుమణగక ముందే సినిమా రిలీజ్‌ అయితే వసూళ్ల వర్షం కురుస్తుందని 'కాటమరాయుడు' ట్రెయిలర్‌ రిలీజ్‌ని డిలే చేస్తున్నారు. రేపు జరగబోయే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ట్రెయిలర్‌ని రిలీజ్‌ చేస్తారు. ఈ స్ట్రాటజీ ఇంతవరకు బాగానే వుంది కానీ 'బాహుబలి' ట్రెయిలర్‌ తర్వాత ఈ ట్రెయిలర్‌ వస్తోంది కనుక తప్పకుండా దానితో పోలికలు వస్తాయి.

కాటమరాయుడు సగటు మాస్‌ సినిమా కనుక ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు వుండవు. అసలే బాహుబలి ట్రెయిలర్‌ చూసిన మాయలో వున్న జనం ఇప్పుడేం చూపించినా పెదవి విరిచే అవకాశాలే ఎక్కువ. పైగా ఎప్పుడు గిల్లుదామా అని ఎదురు చూసే రాంగోపాల్‌వర్మ ఇదే అదనుగా కాటమరాయుడిపై ట్వీట్ల శరాలు కురిపించవచ్చు. కాటమరాయుడు టీజర్‌ వచ్చినపుడు ఒక్క రోజులో ఇన్ని లక్షల మంది చూసారు, రికార్డు అంటూ చెప్పుకున్నారు. కానీ బాహుబలి ట్రెయిలర్‌ని అన్ని భాషల్లో కలిపి అయిదు కోట్ల సార్లు చూసేసరికి ఇప్పుడు ఒక్క రోజులో వచ్చే లక్షల వ్యూస్‌ ఎవరికీ ఆనవు.

ట్రెయిలర్‌ రిలీజ్‌ డిలే చేయడం మాత్రం కాటమరాయుడికి రివర్స్‌ కొట్టింది. అది కూడా బాహుబలి 2 తర్వాత రెండు రోజులకి రిలీజ్‌ చేస్తుండడం మరింత ఎఫెక్ట్‌ చేస్తుంది. తమకి తెలియకుండానే ఈ మిస్టేక్‌ చేసిన కాటమరాయుడు బృందం ఈ ప్రతికూలతని అధిగమించేట్టుగా ట్రెయిలర్‌లో ఎలాంటి మసాలాలు దట్టించిందనేది చూడాల్సిందే.

లేబుళ్లు:

17, మార్చి 2017, శుక్రవారం

ఎన్టీఆర్ శిఖరం…పీక్స్ లో క్రేజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన 26 సినిమాల్లో చాలా సినిమాలు నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తిని తీసుకోచ్చినవే…కానీ వాటిలో ఎన్టీఆర్ కి నటుడిగా పీక్స్ లో క్రేజ్ తెచ్చిన అతికొద్ది సినిమాల్లో టెంపర్ సినిమా ఒకటి

రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాతో ఆల్ మోస్ట్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ రేంజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి గ్రేట్ నెస్ ఉన్న ఈ సినిమాను సౌత్ లో కానీ నార్త్ లో కానీ రీమేక్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు ఇన్ని రోజులు.

కాగా ఎట్టకేలకు రీసెంట్ గా బాజిరావ్ మస్తానీ ఫేమ్ రణవీర్ సింగ్ ఈ రీమేక్ కి సిద్ధం అయ్యాడు. కాగా ఎన్టీఆర్ యాక్టింగ్ ని రిప్లేస్ చేయగలవు అని అనుకుంటున్నావా అంటే అది కష్టం కానీ నావల్ల ఎంత అయితే అంత చేస్తా అని అంటున్నాడట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉందట.

లేబుళ్లు: ,

పవన్ బాధితులు దీక్ష మొదలెట్టారు


తప్పు చేసిన వారిని వదలనని.. అందుకోసం ఏకంగా పార్టీనే పెట్టారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాజాగా ఇప్పుడాయన కారణంగా నష్టపోయామని.. తమకు న్యాయం చేయరేంటంటూ ఆయన బాధితులు కొందరు దీక్ష షురూ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ కారణంగా తాము నష్టపోయినట్లుగా చెబుతూ.. రోడ్డు మీద టెంట్ వేసి.. న్యాయం చేయాలంటూ పవన్ ఫోటోలు పెట్టి మరీ దీక్షను షురూ చేశారు.

పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం ఏమిటన్నది అందరికి తెలిసిందే. ఎంతో హైప్ క్రియేట్ అయిన ఆ సినిమా భారీ పరాజయానికి గురైంది. దీంతో.. ఆ సినిమా మీద ఉన్న నమ్మకంతో కొన్న డిస్ట్రిబ్యూటర్స్ దారుణంగా నష్టపోయారు.

అలా నష్టపోయిన వారంతా కలిసి పవన్ సన్నిహితుల్ని కలిసి.. తమ బాధల్ని చెప్పుకున్నారట. తాము త్వరలోనే పవన్తో మరో సినిమా చేస్తామని.. దాంతో నష్టాలు పూడుస్తామని హామీ ఇచ్చారట. పవన్ తాజా చిత్రం కాటమరాయుడిని పవన్ సన్నిహితుడు శరద్ మురార్ తో చేయటం.. ఆ సినిమా విడుదలకు దగ్గర అవుతున్నా.. సర్దార్ కారణంగా నష్టపో్యిన వారికి మాత్రం హక్కులు ఇవ్వలేదు. దీంతో.. తమకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే ఒకసారి ప్రెస్మీట్ పెట్టిన బాధితులకు ఎలాంటి భరోసా లభించకపోవటంతో ఇప్పుడు ఏకంగా నిరాహార దీక్షను మొదలెట్టారు.

తాము దేవుడిగా అనుకున్న పవన్ కల్యాణ్ వల్లనే తమకు అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని వారు వాపోతున్నారు. ప్రెస్ మీట్లో పవన్ ను పల్లెత్తు మాట అనని వారు.. తాజా దీక్ష వేళ మాత్రం.  మీరే మా దేవుడు అంటున్నా పట్టించుకోని పవన్ కల్యాన్ అని ఒకపక్క.. మాట ఇచ్చి మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ప్రొడ్యూసర్ శరద్ మురార్.. పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ అంటూ ఫ్లెక్సీ పెట్టేసి దీక్షకు దిగారు. మరి.. వీరి దీక్షకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

లేబుళ్లు:

15, మార్చి 2017, బుధవారం

కల్పితాలను సృష్టించి రాసేసేముందు కనీసం ఒరిజినల్ ఇంటర్వ్యూ అయినా చూడండి ...మీడియాపై కస్సుబుస్సుమన్న కస్తూరి

మాజీ హీరోయిన్ కస్తూరి 90వ దశకంలో బోలెడంత ఫేమస్. స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు విరివిగా వచ్చేసేవి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన ఈమె.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. 

నో అనే మాట వినడం ఇష్టం లేని ఓ హీరో.. తన నుంచి ఫేవర్ కోరుకున్నాడని.. తాను ఆయనతో ఒకటే సినిమా చేయగా.. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడని కస్తూరి కామెంట్స్ చేసింది. దీంతో.. కొన్ని మీడియా సంస్థలు.. ఫలానా హీరో అంటూ.. ఓ సీనియర్ స్టార్ పై బురద చల్లడం మొదలుపెట్టేశాయి. అయితే.. తాను చెప్పిన వ్యక్తి తెలుగు హీరో అనే మాటను కస్తూరి ఎక్కడా వాడలేదు. అయినా సరే.. ఒక మీడియాలో వచ్చిన వార్తకు.. చిలవలు పలవలు అల్లేసి మరికొందరు రాయడం మొదలుపెట్టేశారు. దీనిపై కస్తూరి ఇప్పుడు స్పందించింది. "ఒక వ్యక్తి ఎవడో అబద్ధాన్ని రాస్తాడు. ఇక ప్రతీ ఒక్కరూ అదే అబద్ధాన్ని పట్టుకుని కాపీ.. పేస్ట్ చేసేస్తారు. ఇలాంటి కల్పితాలను సృష్టించి రాసేసేముందు కనీసం ఒరిజినల్ ఇంటర్వ్యూ అయినా చూడండి" అంటూ మీడియాకు సుద్దులు చెప్పింది కస్తూరి.

 తెలుగులో ఈమె గ్యాంగ్ వార్.. నిప్పు రవ్వ.. సోగ్గాడి పెళ్లాం.. మెరుపు.. చిలక్కొట్టుడు.. అన్నమయ్య.. ఆకాశవీధిలో.. డాన్ శీను చిత్రాలలో నటించింది కస్తూరి. ప్రస్తుతం యూఎస్ లో ఉంటున్న ఈమె.. తన కూతురుకు డ్యాన్స్ నేర్పించడం కోసమే ఇండియా వచ్చింది. 

లేబుళ్లు: ,

14, మార్చి 2017, మంగళవారం

అక్కడ ఎన్టీఆర్ ని టచ్ కూడా చేయలేకపోయిన మెగాస్టార్


సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎక్కడ క్రేజ్ లేదు చెప్పండి…ఏ ఇండస్ట్రీలో అయినా రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే అక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా బెదిరిపోతాయి. అలాంటి ఫాలోయింగ్ ఇండియాలోనే కాకుండా జపాన్ లాంటి బయటి దేశాలలోను సంపాదించుకున్నాడు రజినీకాంత్.

అందుకే రజినీకాంత్ సినిమాలు ఒకే సమయంలో ఇక్కడితో పాటు జపాన్ లో కూడా రిలీజ్ అవుతుంటాయి. మరి రజినీకాంత్ తరువాత జపాన్ లో ఒకే సమయంలో రిలీజ్ సినిమా ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ అనే చెప్పాలి.

 ఈ సినిమాకు టోటల్ గా అక్కడ 52 లక్షల షేర్ వచ్చినట్లు సమాచారం. రజినీకాంత్ కబాలి అక్కడ 1.42 కోట్ల షేర్ తరువాత ఎన్టీఆర్ సినిమాదే రెండో అత్యధిక షేర్ ని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా రీసెంట్ గా అక్కడ రిలీజ్ అయిన ఖైదీ150 టోటల్ గా వాష్ అవుట్ అయినట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. దాంతో అక్కడ తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ కే క్రేజ్ ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు.

లేబుళ్లు: ,

ఎన్టీఆర్ ఫస్టులుక్ వచ్చేది అప్పుడేనట…!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా షూటింగ్ లో ఈ నెల 15 నుండి పాల్గొనబోతున్నాడు. డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కే జై లవ కుశ వర్కింగ్ టైటిల్ చిత్రంలో యంగ్ టైగర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ మొదలైనప్పటికీ ఎన్టీఆర్ ఇంతవరకు ఈ షూటింగ్ లో జాయిన్ అవకుండా తన బరువు తగ్గించే పనిలో పడ్డాడు.

‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చేసింది ఎన్టీఆర్ కి… మరో చిత్రం చెయ్యడానికి. అందుకే తన బరువు తగ్గించుకుని జుట్టు పెంచుకుంటున్నాడట. జుట్టు పెంచుకుంటే మూడు వేరియేషన్ కేరెక్టర్స్ ని కవర్ చెయ్యొచ్చని డైరెక్టర్ బాబీ ఇలా సలహా ఇచ్చాడట. అయితే ఎన్టీఆర్ ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదు, అప్పుడే ఎన్టీఆర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ గురించి వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న విడుదల చెయ్యాలనే ప్లాన్ లో బాబీ అండ్ టీమ్ ఉన్నట్లు చెబుతున్నారు. మంచి స్టైలిష్ లుక్ తో ఎన్టీఆర్ ని చూపించాలని… ఆ లుక్ చూసి ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోవాలని అంటున్నారట.

మూడు పాత్రల లుక్ ని రివీల్ చేస్తారని అందులో ఒక పాత్రని పూర్తిగా చూపించి మిగిలిన రెండు పాత్రలని చూపించి చూపించినట్టు చూపిస్తారని… అసలు ఇప్పటికే ఎన్టీఆర్ ఒక లుక్ ని డైరెక్టర్ బాబీ లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి సినిమా మొదలు పెట్టి పెట్టకముందే ఇలా ఫస్ట్ లుక్ గురించి అప్పుడే ఇంత సీరియస్ గా ఆలోచించడం కొత్తగా వుంది.

బీ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా… రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్స్ గా సెట్ అయినట్టు చెబుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో గెస్ట్ రోల్ తో పాటే ఐటెం సాంగ్ లో ఆడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

లేబుళ్లు: ,

బాల‌య్య డైరెక్ట‌ర్‌తో క‌ళ్యాణ్‌రామ్‌


నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ కోసం ఇప్పటికీ ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌. టాలీవుడ్‌లో ఇటు హీరోగాను, అటు నిర్మాత‌గాను వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. నిర్మాత‌గా త‌న సినిమాల‌తో పాటు అటు ఇత‌ర హీరోల‌తోను సినిమాలు చేస్తున్నాడు.
2015లో పటాస్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన కళ్యాణ్ రామ్, తరువాత షేర్, ఇజం సినిమాలతో మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం నిర్మాతగా ఎన్టీఆర్, బాబీల కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ జై ల‌వ కుశ ) నిర్మాణంలో బిజీబిజీగా ఉన్న క‌ళ్యాణ్ తాను హీరోగా చేయ‌బోయే సినిమా కోసం ఓ మంచి టీంను సెట్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌.
క‌ళ్యాణ్ బాబాయ్ బాల‌య్య‌తో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు క్రిష్, ఈ మధ్య కళ్యాణ్ రామ్‌కు ఓ క‌థ చెప్పాడ‌ట‌. ఈ క‌థ క‌ళ్యాన్‌కు బాగా న‌చ్చింద‌ట‌. బాబాయ్ బాల‌య్య‌కు భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు తనతో సినిమాకు రెడీ అయ్యే సరికి కళ్యాణ్ రామ్ తెగ సంబరపడిపోతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

లేబుళ్లు: ,

నాని ” నేను లోక‌ల్ ” ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్‌

నేచురల్ స్టార్ ప్రభంజనానికి ఎట్టకేలకు తెరపడింది. త‌న తాజా సినిమా నేను లోక‌ల్‌తో కేరీర్‌లోనే తిరుగులేని బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సొంతం చేసుకున్నాడు. కలెక్షన్ల పరంగా కొత్త శిఖరాల్ని అందుకున్నాడు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఫుల్ రన్లో రూ.34 కోట్లకు పైగా షేర్.. రూ.58 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
అమెరికాలో మిలియన్ డాలర్ మార్కును దాటిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో సైతం రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టి తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసింది.
నైజాంలో 10.7 కోట్లు సాధించిన ఈ సినిమా, ఉత్తరాంధ్రలో 4 కోట్లు, సీడెడ్‌లో 3.9 కోట్లు సాధించింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ షేర్ 27.8 కోట్లు సాధించింది. గ్రాస్ వసూళ్లు 42.70 కోట్లు ఉన్నాయి. వరల్డ్ వైడ్ షేర్ 34.2 కోట్లు ఉంటే గ్రాస్ రూ. 58 కోట్లు ఉంది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా బ‌డ్జెట్ రూ.10 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా ఉంటే సినిమా ఏకంగా పెట్టుబ‌డి మీద మూడు రెట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది.

లేబుళ్లు: ,

ఏటీఎంలు ఇక కాయిన్ బాక్సులేనా..


దేశంలో టెలికాం విప్లవం మొదలైన కాలంలో కాయిన్ బాక్సులు అడుగడుగునా ఏర్పాటయ్యాయి. రూపాయి కాయిన్ వేస్తే చాలు ఫోన్ మాట్లాడుకునే వీలుండేది. కొన్నాళ్ల పాటు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ఇవి ఆ తరువాత సెల్ ఫోన్ల రాకతో పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఏటీఎంల పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. ఏటీఎంలకు కాలం చెల్లే రోజులు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయనిపిస్తోంది.  క్యాష్ లెస్ ఎకానమీ లక్ష్యంతో ఆన్ లైన్ ట్రాంజాక్షన్ల వైపు ప్రజలను మళ్లించడానికి ప్రభుత్వం ఏటీఎంల్లో డబ్బులు ఉంచకుండా చేస్తుందన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. నోట్ల రద్దు కష్టాలు పూర్తయినా కూడా గత 10 రోజులుగా ఏటీఎంల్లో ఎక్కడా డబ్బుల్లేక జనం మళ్లీ నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏటీఎంలకు కాలం చెల్లినట్లేనని భావిస్తున్నారు.
    
పెద్ద నోట్ల రద్దు తర్వాత విధించిన ఆంక్షలను ఆర్బీఐ సోమవారం నుంచి పూర్తిగా ఎత్తివేసినా నగదు మాత్రం దొరకడం లేదు.   వారం వారం నగదు విత్ డ్రాయల్స్ పరిమితిని ఫిబ్రవరి 24 నుంచి పెంచింది.. రూ.24 వేల నుంచి రూ.50వేలకు పెంచింది. అలానే మార్చి 13 నుంచి ఎటీఎం లలో నగదు విత్ డ్రాయల్స్ పై విధించిన ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసినట్లు ఆర్ బీఐ వెల్లడించింది. ఫిబ్రవరి లో జరిగిన రిజర్వుబ్యాంకు ద్రవ్యపరపతి సమీక్ష తర్వాత రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ఈ ప్రకటన చేశారు. జనవరి 30వ తేదీన రిజర్వుబ్యాంకు కరెంటు ఖాతాలపై ఉన్న విత్ డ్రాయల్స్ ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తి వేసింది. క్యాష్ క్రెడిట్ అకౌంట్ లు - వోవర్ డ్రాఫ్టులపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించింది. ఇలా ఆంక్షలన్నీ ఎత్తివేసినా కూడా అసలు నగదు విత్ డ్రా చేసుకోడానికి ప్రైమరీ సోర్సయిన ఏటీఎంల్లో మాత్రం డబ్బులుంచడం లేదు.
    
 కేంద్రప్రభుత్వం నవంబర్ 8వ తేదీన రూ.1000 - రూ.500 నోటును అధికారికంగా చలామణి నుంచి రద్దు చేసిన తర్వాత నగదు విత్ డ్రాయల్స్ పై పరిమితులు విధించింది. ప్రారంభంలో ఎటీఎంలలో రూ. 2500 వరకు విత్ డ్రాయల్స్ కు అనుమతించింది. అటు తర్వాత నుంచి దీన్ని రూ.4500కు పెంచింది. కాగా జనవరి నుంచి ఆర్ బీఐ ఎటీఎం విత్ డ్రాయల్స్ పరిమితిని వారానికి రెట్టింపు రూ.10000కు పెంచేసింది. అలానే కరెంటు ఖాతా విత్ డ్రాయల్స్ పరిమితిని రూ.1 లక్షకు పెంచింది. కాగా నవంబర్ లో వారం వారం బ్యాంకు ఖాతాల నుంచి విత్ డ్రాయల్స్ ను రూ.20వేల నుంచి రూ.24వేలకు పెంచింది. ఇక నుంచి నగదు విత్ డ్రాయల్స్ పై ఉన్న ఆంక్షలు పూర్తిగా తొలగిపోయినట్లే.. అని రిజర్వుబ్యాంకు చెబుతున్నా వాస్తవంగా చూస్తే ఎటీఎంలలో డబ్బు అస్సలేదు. ఆర్ బీఐ నగదు విత్ డ్రాయల్స్ పై ఆంక్షలు పూర్తిగా తొలగించినట్లు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరా ల్లోనే ఎటీఎంలలో డబ్బు ల్లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెల మొదటి తేదీ నుంచి ఇదే సీన్ కొనసాగుతోంది. హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలోనే పరిస్థితి ఇలాంటి చిన్న చిన్న పట్టణాల్లో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఆర్బీఐ నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నుంచి పరిస్థితుల్లో మార్పు వస్తుందా లేదో చూడాల్సిందే. మొత్తం రూ.12 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉందని ఆర్థిక మంత్రి జైట్లీ చెబుతున్నారు.  అలాంటప్పుడు నగదు కొరత ఎందుకొస్తున్నట్లు. దీనర్థం కేవలం ఏటీఎంలకు మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడమేనని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.

లేబుళ్లు: ,

సన్నీ కోసం ఎంత పోశారో


పూరి జగన్నాథ్ ‘రోగ్’ సినిమా మొదలుపెట్టి చాలా కాలమైంది. చాన్నాళ్ల పాటు ఆ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఏమీ లేవు. దీంతో పూరి గత సినిమాలకు వచ్చినట్లు దీనికి బజ్ ఏమీ రాలేదు. ఐతే ఓ మూడు వారాల నుంచి ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తూ సినిమాను వార్తల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుకతో జనాలందరి అటెన్షన్ రాబట్టుకోవాలని ప్లానింగ్ కొంచెం పెద్ద ఎత్తునే చేశారు. ఏకంగా సన్నీ లియోన్ నే ఈ వేడుకకు రప్పించారు. ఆమెతో డ్యాన్స్ కూడా చేయించారు. కానీ దాని వల్ల ఆశించిన ఫలితమైతే కనిపించినట్లుగా లేదు.

సన్నీ లియోన్ డ్యాన్స్ అదీ చూస్తే చాలా మామూలుగా అనిపించింది. ‘రోగ్’ సినిమా హీరోయిన్లద్దరూ కూడా స్టేజ్ మీద రచ్చ చేయడం.. ‘పూరి కనెక్ట్స్’ ద్వారా ప్రమోట్ చేస్తున్న అమ్మాయిలు కూడా ఈ వేడుకలో హైలైట్ కావడంతో వాళ్ల మధ్య సన్నీ ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. మిగతా వాళ్లందరినీ పక్కనబెట్టే సన్నీనే హైలైట్ చేసి.. ఆమెతో మరింత బాగా రిహార్సల్స్ చేయించి.. ఆమెకేదైనా హాట్ హాట్ డ్రెస్ చేసి ఉంటే కథ మరోలా ఉండేదేమో. కానీ అంత మంది మధ్య.. తన శైలికి భిన్నంగా మామూలు అమ్మాయిల్లాగే నిండుగా కప్పుకుని సన్నీ డ్యాన్స్ చేసేసరికి జనాలకు కిక్కు రాలేదు. సన్నీని తీసుకురావడం వల్ల ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణేమీ చేకూరలేదు. సన్నీ తనకు సంబంధం లేని ఒక వేడుకకు వచ్చి డ్యాన్స్ చేయాలంటే భారీ స్థాయిలో పారితోషకం తీసుకుంటుంది. ‘రోగ్’ నిర్మాత సి.ఆర్.మనోహర్ ఆమెకు భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కానీ దాని వల్ల ఆశించిన ప్రయోజనమైతే దక్కలేదన్నది ఈ వేడుక చూసన వాళ్ల మాట.

లేబుళ్లు: ,

13, మార్చి 2017, సోమవారం

దుమారం రేపుతున్న రజినీ కూతురి డ్యాన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతుళ్లిద్దరూ కూడా బహుముఖ ప్రజ్ఞశాలులే. అందులోనే పెద్దమ్మాయి ఐశ్వర్యలో చాలా కళలున్నాయి. ఆమె ట్విట్టర్ పేజీ ఓపెన్ చేస్తే రైటర్ అని.. డైరెక్టర్ అని.. క్లాసికల్ డ్యాన్సర్ అని ఉంటుంది. రచయితగా.. దర్శకురాలిగా ఆమె తనేంటో ఇప్పటికే రుజువు చేసుకుంది. తొలి సినిమా ‘3’ తేడా కొట్టినా ‘వై రాజా వై’ తో సక్సెస్ సాధించింది. ఐతే ఐశ్వర్య శాస్త్రీయ నృత్య ప్రతిభ గురించి ఇప్పటిదాకా జనాలకు తెలియదు. ఐతే తాజాగా ఆమె తన టాలెంట్ చూపించింది.

స్త్రీ పురుష సమానత్వం.. మహిళా సాధికారతకు సంబంధించి  ఐక్యరాజ్య సమితి ప్రచారకర్తగా ఉన్న ఐశ్వర్య మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భరత నాట్యం ప్రదర్శన ఇచ్చింది. ఐతే అక్కడ ఆమె డ్యాన్స్  నవ్వుల పాలైంది. భరతనాట్యంపై అవగాహన లేని వాళ్లు ఒకట్రెండు రోజులు రిహార్సల్స్ చేసి డ్యాన్స్ చేసినట్లుగా ఉంది ఆమె డ్యాన్స్.  ఒక ప్రముఖ నృత్యాకారిణి ఈ డ్యాన్స్ వీడియో షేర్ చేసి.. భరతనాట్యానికి జరిగిన అవమానం ఇదంటూ విమర్శలు గుప్పించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగానే ఐశ్వర్యపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అసలే తమిళనాట హీరోలకు యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ. ధనుష్ కు కూడా అలాంటి యాంటీ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు మంచి ఛాన్స్ దొరికింది. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఐశ్వర్య డ్యాన్స్ మీద జోకులు పేలుస్తూ.. పేరడీలు చేస్తూ ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.

లేబుళ్లు: ,

కాటమరాయుడు మోత మోగించేస్తున్నాడుగా..!!

‘కాటమరాయుడు’ సినిమా మొదలైపుడు అంతగా హైప్ లేదు. కొన్ని షూటింగ్ షెడ్యూళ్లు అయ్యాక కూడా ఊపు కనిపించలేదు. నూతన సంవత్సర కానుకగా వరుసబెట్టి పవన్ లుక్స్ రిలీజ్ చేసినపుడు కూడా రెస్పాన్స్ అంతంతమాత్రంగానే కనిపించింది. కానీ గత నెల ‘కాటమరాయుడు’ టీజర్ వచ్చాక మాత్రం సీన్ మారిపోయింది. ఉన్నట్లుండి సినిమాపై హైప్ పెరిగిపోయింది. అంతకుముందు వరకు బిజినెస్ కూడా అనుకున్నట్లుగా జరగలేదు. కానీ ఆ తర్వాత సినిమాను భారీ రేట్లకు కొన్నారు. థియేట్రికల్ బిజినెస్ అనూహ్యమైన స్థాయిలో జరిగింది. ఇప్పుడీ సినిమా సేఫ్ వెంచర్ కావాలంటే ఓపెనింగ్స్ భారీగా రావాలి. ఆల్రెడీ సినిమాపై హైప్ బాగానే ఉండగా.. దాన్ని మరింతగా పెంచే ప్రయత్నంలో పడింది ‘కాటమరాయుడు’ టీం.

పవన్ గత సినిమాల్లో వేటికీ లేనంతగా ‘కాటమరాయుడు’కు పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా కాటమరాయుడు హోర్డింగులు.. ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పబ్లిసిటీ కొంచెం పెద్ద స్థాయిలోనే నడుస్తోంది. పెద్ద కూడళ్లలో భారీ హోర్డింగులు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆల్రెడీ భారీ కటౌట్లు కూడా రెడీ అయిపోయాయి. ‘కాటమరాయుడు’ కోసం పవన్ ఎంచుకున్న లుక్.. అతడి ఆహార్యం చాలా బాగా కుదిరాయి. దీంతో ఫ్లెక్సీలు.. హోర్డింగులు భలేగా అనిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తరచుగా ‘కాటమరాయుడు’ కొత్త స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకొస్తున్నాయి. మూణ్నాలుగు రోజులకో పాట రిలీజ్ చేస్తూ ఆ రకంగా కూడా సినిమాను వార్తల్లో నిలబెడుతున్నారు. ఈ నెల 18న ప్రి రిలీజ్ ఈవెంట్ చేశాక ‘కాటమరాయుడు’పై హైప్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

లేబుళ్లు: , ,

12, మార్చి 2017, ఆదివారం

రకుల్ పాపతో ఐటెం సాంగ్





జూనియర్ ఎన్టీఆర్ మరో మూడు రోజుల్లో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభంచేయబోతున్నాడు. తన వెయిట్ కూడా తగ్గించేసుకుని మరీ ఈ మూవీకిి ప్రిపేర్ అయిపోయాడు యంగ్ టైగర్. ఇప్పుడీ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఒకట ఆసక్తికరంగా ఉంది.

బాబీ దర్శకత్వంలో.. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీకి జై లవ కుశ అనే టైటిల్ పరిశీలిస్తుండగా.. ఈ ప్రాజెక్టుకు తీసుకుంటున్న క్యాస్టింగ్ చూస్తుంటే.. ఓ ఆసక్తికరమైన విషయం తట్టడం సహజం. ఇప్పటికే ఈ సినిమాలో రాశి ఖన్నా.. నివేదాథామస్ లను హీరోయిన్ లుగా తీసుకోగా.. మరో స్టార్ హీరోయిన్ ను చిన్న పాత్రకోసం ఎంపిక చేయబోతున్నారు. ఇప్పుడీ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని భావిస్తుండగా.. వీరిద్దరి మధ్య ఓ సూపర్బ్ సాంగ్ కూడా ఉండనుందట. ఇది జనతా గ్యారేజ్ లో పక్కాలోకల్ అంటూ కాజల్ చేసిన హంగామా రేంజ్ లోనే ఉంటుందని టాక్.

జనతా గ్యారేజ్ మూవీలో కాజల్ అగర్వాల్ తో మొదటిసారిగా ఐటెం సాంగ్ చేయించి.. ఎన్టీఆర్ సెన్సేషన్ క్రిియేట్ చేసేశాడు. ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఐటెం భామగా మార్చేస్తూ.. మరో సంచలనం నమోదు చేసేందుకు యంగ్ టైగర్ ప్రిపేర్ అయిపోతున్నాడు.

లేబుళ్లు: , , ,

మహేష్ మూవీలో ఆమె డాక్టర్ అంటగా







మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో.. తెలుగు తమిళ భాషల్లో సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేసుకుంటోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇప్పుడీమె పాత్రకు సంబంధించిన ఈ ప్రధానమైన అప్డేట్ తెలియవచ్చింది.

సహజంగా మురుగదాస్ సినిమాల్లో హీరోయిన్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. సినిమా స్టోరీకి సంబంధం లేకుండా.. వేరే సెపరేట్ ట్రాక్ ఉంటుంది. మురుగ సినిమాల్లో హీరోయిన్లు పాటలకే అంకితం అన్నట్లుగా ఉంటారు. కానీ.. మహేష్ మూవీలో మాత్రం అలా కాదని తెలుస్తోంది. ఈ చిన్నదాని రోల్.. సినిమా కథలో భాగంగానే ఉంటుందట. రకుల్ ఓ డాక్టర్ పాత్ర పోషిస్తుండగా.. ఈ రోల్ కి చాలానే ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. మహేష్ ఈ మూవీలో ఇన్విస్టిగేటర్ పాత్ర పోషిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ రోల్ కూడా ప్రామిసింగ్ గా ఉంటుందని అంటున్నారు.

తెలుగు.. తమిళ భాషల్లో బైలింగ్యువల్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి.. త్వరలో టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎస్ తో ఈ టైటిల్ మొదలుకానుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ ని రివీల్ చేసి.. దానితో పాటే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు యూనిట్.

లేబుళ్లు: , , ,

ఎన్టీఆర్ పై రాశి ఖన్నా సంచలన కామెంట్స్ …!


ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘జై లవ కుశ’ మూవీలో రాశి ఖన్నా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. పేరుకి హీరోయిన్ పాత్ర అయినా ఈ సినిమా కధను మలుపు తిప్పేపాత్రను రాశి ఖన్నా పోషిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న రాశి ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ పై సంచలన కామెంట్స్ చేసింది.

ఎన్టీఆర్ పై రాశిచేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్ లో తెగ హడావిడి చేస్తూ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. మాములుగా నటీనటులు అంతా కెమెరా ముందు నటిస్తారు. కానీ ఎన్టీఆర్ జీవిస్తాడు అని చెపుతూ ఎన్టీఆర్ ఒక యాక్టర్ కాదు సైన్యం లాంటివాడు అంటూ ఆశక్తికర కామెంట్స్ చేసింది రాశి ఖన్నా.




తనకు సహకరించిన ఎన్టీర్ వ్యక్తిత్యం చూసి తాను జూనియర్ కు అభిమానిగా మారిపోయాను అని అంటోంది . అయితే ఎప్పుడు ఏ హీరోను పెద్దగా పొగుడుతూ మాట్లాడని రాశి ఇలాంటి ఆసక్తిక కామెంట్స్ జూనియర్ పై చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు..


లేబుళ్లు: , ,