ఎన్టీఆర్ పై రాశి ఖన్నా సంచలన కామెంట్స్ …!


ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘జై లవ కుశ’ మూవీలో రాశి ఖన్నా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. పేరుకి హీరోయిన్ పాత్ర అయినా ఈ సినిమా కధను మలుపు తిప్పేపాత్రను రాశి ఖన్నా పోషిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న రాశి ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ పై సంచలన కామెంట్స్ చేసింది.

ఎన్టీఆర్ పై రాశిచేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్ లో తెగ హడావిడి చేస్తూ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. మాములుగా నటీనటులు అంతా కెమెరా ముందు నటిస్తారు. కానీ ఎన్టీఆర్ జీవిస్తాడు అని చెపుతూ ఎన్టీఆర్ ఒక యాక్టర్ కాదు సైన్యం లాంటివాడు అంటూ ఆశక్తికర కామెంట్స్ చేసింది రాశి ఖన్నా.




తనకు సహకరించిన ఎన్టీర్ వ్యక్తిత్యం చూసి తాను జూనియర్ కు అభిమానిగా మారిపోయాను అని అంటోంది . అయితే ఎప్పుడు ఏ హీరోను పెద్దగా పొగుడుతూ మాట్లాడని రాశి ఇలాంటి ఆసక్తిక కామెంట్స్ జూనియర్ పై చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు..


కామెంట్‌లు