అక్కడ ఎన్టీఆర్ ని టచ్ కూడా చేయలేకపోయిన మెగాస్టార్


సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎక్కడ క్రేజ్ లేదు చెప్పండి…ఏ ఇండస్ట్రీలో అయినా రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే అక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా బెదిరిపోతాయి. అలాంటి ఫాలోయింగ్ ఇండియాలోనే కాకుండా జపాన్ లాంటి బయటి దేశాలలోను సంపాదించుకున్నాడు రజినీకాంత్.

అందుకే రజినీకాంత్ సినిమాలు ఒకే సమయంలో ఇక్కడితో పాటు జపాన్ లో కూడా రిలీజ్ అవుతుంటాయి. మరి రజినీకాంత్ తరువాత జపాన్ లో ఒకే సమయంలో రిలీజ్ సినిమా ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ అనే చెప్పాలి.

 ఈ సినిమాకు టోటల్ గా అక్కడ 52 లక్షల షేర్ వచ్చినట్లు సమాచారం. రజినీకాంత్ కబాలి అక్కడ 1.42 కోట్ల షేర్ తరువాత ఎన్టీఆర్ సినిమాదే రెండో అత్యధిక షేర్ ని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా రీసెంట్ గా అక్కడ రిలీజ్ అయిన ఖైదీ150 టోటల్ గా వాష్ అవుట్ అయినట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. దాంతో అక్కడ తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ కే క్రేజ్ ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు.

కామెంట్‌లు