నేచురల్ స్టార్ ప్రభంజనానికి ఎట్టకేలకు తెరపడింది. తన తాజా సినిమా నేను లోకల్‌తో కేరీర్‌లోనే తిరుగులేని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. కలెక్షన్ల పరంగా కొత్త శిఖరాల్ని అందుకున్నాడు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఫుల్ రన్లో రూ.34 కోట్లకు పైగా షేర్.. రూ.58 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
అమెరికాలో మిలియన్ డాలర్ మార్కును దాటిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో సైతం రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టి తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసింది.
నైజాంలో 10.7 కోట్లు సాధించిన ఈ సినిమా, ఉత్తరాంధ్రలో 4 కోట్లు, సీడెడ్‌లో 3.9 కోట్లు సాధించింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ షేర్ 27.8 కోట్లు సాధించింది. గ్రాస్ వసూళ్లు 42.70 కోట్లు ఉన్నాయి. వరల్డ్ వైడ్ షేర్ 34.2 కోట్లు ఉంటే గ్రాస్ రూ. 58 కోట్లు ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమా బడ్జెట్ రూ.10 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉంటే సినిమా ఏకంగా పెట్టుబడి మీద మూడు రెట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి