31, జనవరి 2017, మంగళవారం

పవన్‌కళ్యాణ్‌కీ ఆమెతో ప్రాబ్లమే

డిసెంబర్‌ 23న విడుదల కావాల్సిన 'నేను లోకల్‌' ఆ డేట్‌ మిస్‌ అయిపోయి, సంక్రాంతి కూడా అయిపోయిన తర్వాత తీరిగ్గా ఫిబ్రవరి 3న రిలీజ్‌ అవుతోంది. ఎప్పుడో పూర్తయిపోయిన చిత్రాన్ని ఇంత లేట్‌గా రిలీజ్‌ చేయడానికి కారణాలని వెతుకుతూ సినిమా సరిగ్గా రాలేదని, అంచేత రీషూట్లు చేసారని తేల్చింది. ఈ పుకార్లని నాని నవ్వుతూ కొట్టి పారేసాడు. 

డిసెంబర్‌ 23న విడుదల చేయాలంటే, కనీసం అందుకు ఇరవై రోజుల ముందుగా సినిమా పూర్తయిపోవాలని, కానీ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ బిజీగా వుండడం వల్ల అనుకున్న టైమ్‌కి పూర్తి చేయలేకపోయామని, అంతే తప్ప ఈ చిత్రం డిలేకి రీషూట్లు కారణం కాదని చెప్పాడు. 'నేను లోకల్‌' వరకు క్లారిటీ ఓకే కానీ కీర్తి సురేష్‌ బిజీ షెడ్యూల్స్‌ పట్ల మిగిలిన నిర్మాతలు వర్రీ అవ్వాల్సిన మేటర్‌ ఇది. ఎందుకంటే కీర్తి సురేష్‌ అటు తమిళం, ఇటు మలయాళంతో పాటు తెలుగులోను వచ్చిన ఆఫర్లన్నీ ఎడాపెడా ఓకే చేసుకుంటూ పోతోంది. 

వచ్చిన అవకాశాల్ని ఎందుకు వదులుకోవాలని అనుకుంటుందో ఏమిటో కానీ చిన్న, పెద్ద తేడా లేకుండా కొత్త సినిమాలకి సంతకం చేసేస్తోంది. దీని వల్ల ఆమెతో ఒప్పందం చేసుకున్నవాళ్లకి షెడ్యూల్స్‌ పరంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. 'నేను లోకల్‌' అంటే బడ్జెట్‌ తక్కువే కనుక, నాని సినిమాకి సీజన్‌తో పని లేదు కనుక ఓకే. కానీ రేపు పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమాకీ కీర్తి సురేష్‌ డేట్స్‌ ఇలాగే టైట్‌ అయిపోతే, అనుకున్న టైమ్‌కి రిలీజ్‌ చేయడం కష్టమేగా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కానీ, వేరొకరి దీపాన్ని గాల్లో పెట్టేసేలా ఉండకూడదు కదా! 

లేబుళ్లు: , , ,

కాబోయే శ్రీవారిని ఫేస్ బుక్ లో పెట్టిన యాంకర్..!

తెలుగు టీవీ పరిశ్రమలో సత్తా చాటి, వెండి తెరపైకి షిఫ్ట్ అయిన ప్రముఖ యాంకర్ లాస్య, ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో నటిస్తోంది. ఇలాంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. ‘జీవితంలో ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా సోల్ మెట్ తో ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌ గా ఉంది. ప్రేమ విలువైంది, పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నది’ అంటూ తన అనుభూతులను తెలియజేసింది. డిజైనర్ ఈశ్వరీ తయారు చేసిన ఎంగేజ్మెంట్ డ్రెస్ లో ఉన్న ఫోటోను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసిన లాస్య, తమ ఇద్దరి ముద్దు పేర్లతో కూడిన టాటూలను కూడా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. తనకు కాబోయే శ్రీవారు ఎవరో అని నెటిజన్లకు ఆసక్తి కలిగే విధంగా చేసిన లాస్య, చివరికి ఆ ట్విస్ట్ ను రివీల్ చేస్తూ ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది. మరాఠీకి చెందిన మంజునాధ అనే వ్యక్తిని తానూ పెళ్ళాడబోతున్నట్లుగా, ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో జంట బాగుందంటూ శుభాకాంక్షలు చెప్పడం నెటిజన్ల వంతయ్యింది.

లేబుళ్లు: ,

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జగన్ ముద్దు ఫోటో!



కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి, వైసీపీ స్థాపించిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత చేపట్టిన ‘ఓదార్పు యాత్ర’లో చేసిన అరుదైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే… అది నుదుటిపై ముద్దుపెట్టడం. సామాన్య ప్రజానీకానికి చేరువ కావాలనే తలంపుతో, తన దగ్గరకు వచ్చిన వారిని ఆప్యాయంగా అక్కరకు చేర్చుకుని, నుదుటిపై ముద్దాడే విధానం, అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా కరచాలనం, చేతులను తాకడం వంటివి చేస్తుంటారు గానీ, ఇలా ముద్దాడే సందర్భాలు లేకపోవడంతో, జగన్ మార్క్ రాజకీయంగా సదరు సన్నివేశాలు ఆవిర్భవించాయి. అయితే తాజాగా ఇది పతాక స్థాయికి చేరుకున్నట్లుగా కనపడుతోంది. ఇటీవల చేపట్టిన ఓ యాత్రలో జగన్ సాధారణంగా నుదుటిపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా, ఓ బామ్మ అవాక్కయ్యే విధంగా జగన్ నే దగ్గరికి తీసుకుని పెదాలపై ముద్దాడేసింది. పక్కన ఉన్న బాడీ గార్డులు ఆ మామ్మను లాగేయాలని ప్రయత్నించినప్పటికీ, ఉడుం పట్టుతో జగన్ ను దగ్గరకు తీసుకోవడం గమనించదగ్గ విషయం. అటు, ఇటు చేరి ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో పడింది. ఇంకేముంది… ఎవరికీ తోచిన విధంగా వారు ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తూ… సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక్కడ జగన్ స్పెషాలిటీని ప్రత్యేకించి పొగడాల్సిందే. ఆ బామ్మ అవాక్కయ్యే విధంగా ప్రవర్తించినప్పటికీ, జగన్ తన మోములో చిరునవ్వును మాత్రం అలాగే చూపిస్తుండడం విశేషం. జగన్ కే షాక్ ఇచ్చిన సదరు బామ్మ ఒక్క ముద్దుతో ‘టాక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా మారిపోయింది. బహుశా దీని తర్వాత ‘నుదుటిపై ముద్దు’ విషయంలో జగన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పడంలో సందేహం లేదనుకుంటా!

లేబుళ్లు: ,

శాతకర్ణి బాలయ్యకు ఘన సన్మానం

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శాతకర్ణి.. ఇప్పడు 50 కోట్ల షేర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. హిస్టారికల్ చిత్రాల్లోని హిస్టరీ క్రియేట్ చేశాడు గౌతమిపుత్ర శాతకర్ణి.

ఈ ఘన విజయాన్ని.. శాతకర్ణి లాంటి పాత్ర చేసి.. ఇలాంటి చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించే ధైర్యం చేసిన నందమూరి బాలకృష్ణకు సన్మానం నిర్వహించారు పారిశ్రామిక వేత్త కం ఫిలిం ఇండస్ట్రీ సన్నిహితుడు అయిన టీ సుబ్బిరామిరెడ్డి. ఈ వేడుకకు బాలకృష్ణ కుటుంబం మొత్తం హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలకృష్ణ భార్య వసుంధర.. కూతుళ్లు బ్రాహ్మణి..తేజస్వినిలు.. ఈ వేడుకలో భాగం అయ్యారు. తండ్రిని ఆహుతులు ప్రశంసల్లో ముంచెత్తుతుంటే.. ఆ కూతుళ్ల కళ్లలో కనిపించిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవని చెప్పాలి. 

ల్యాండ్ మార్క్ చిత్రాన్ని హిస్టారికల్ గా ఎంచుకోవడంలో బాలయ్య ధైర్యం చేశారని.. దీనికి కుటుంబ సభ్యుల నుచి లభించిన మద్దతు కూడా ఎంతో ఉందని పలువురు ప్రశంసించారు. ఇదే వేడుకలో దర్శకుడు క్రిష్.. ఆయన భార్య రమ్యలకు బోలెడన్ని ప్రశంసలు లభించాయి. కొత్త పెళ్లి జంట అయినా.. ఈ చిత్రం కోసం వారు పడ్డ తపన అసామాన్యం అన్నారు అతిథులు. ఎంతో కష్టపడి తమ లక్ష్యాన్ని అందుకున్న బాలయ్య-క్రిష్ లను మనసారా అభినందించారు సుబ్బిరామిరెడ్డి. 

లేబుళ్లు: ,

ఎమోషనల్ ఫోటో...అమ్మతో చైతు


అక్కినేని వారసుడిగా.. టాలీవుడ్ హీరోగా నాగచైతన్య రేంజ్ ఏంటో ఇప్పటికే అక్కినేని వారసులకు తెలుసు. గతంలో వరుసగా ఫ్లాప్స్ వచ్చినా.. ఇప్పుడు మంచి సబ్జెక్టులతో దూసుకుపోతున్నాడు. వీటన్నిటితో పాటు.. హీరోయిన్ సమంతతో లవ్ స్టోరీ కారణంగా.. గత ఆరేడు నెలలుగా వార్తల్లో తెగ నానుతున్నాడు చైతు. 

తాజాగా చైతు-సమంతల నిశ్చితార్ధం జరిగింది. ఇటు అక్కినేని కుటుంబం.. అటు సమంత ఫ్యామిలీతో పాటు.. దగ్గుబాటి కుటుంబం అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. అందరిలోకి ప్రధాన ఆకర్షణ.. చైతు తల్లి లక్ష్మి. ఈమె దగ్గుబాటి వెంకటేష్ సోదరి అనే విషయం తెలిసిందే. నాగార్జున తొలి భార్య అయిన లక్ష్మి.. తర్వాత కారణాంతరాలతో విడిపోయారు. అప్పటి నుంచి మీడియా కంటికి పెద్దగా కనిపించని ఈమె.. ఇప్పుడు కొడుకు నిశ్చితార్ధ వేడుకలో కనిపించారు. తల్లీ కొడుకులు ఆప్యాయంగా ఫోటోకు ఇచ్చిన పోజ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తల్లీకొడుకుల ఫోటోలు చాలానే ఉండొచ్చు కానీ.. పబ్లిక్ గా ఇలా వీరిద్దరూ కలిసి ఫోటోకి పోజ్ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి.

మరోవైపు.. నాగచైతన్య తన ఎంగేజ్మెంట్ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను కలిపి ఒకే పిక్ గా షేర్ చేశాడు. చెయ్-శామ్ లు.. చైతు తల్లి లక్ష్మి.. ఆమె భర్తతో పాటు ఒక ఫోటో.. నాగ్-అమల.. అఖిల్-శ్రేయాభూపాల్ లతో కలిసి దిగిన ఫోటో.. దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఈ జంట దిగిన ఫోటో. అలాగే సమంత పేరెంట్స్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు చైతు. అక్కినేని.. దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న మాట వాస్తవమే అయినా.. అందిరినీ ఇలా ఒక వేదిక పైకి తీసుకొచ్చిన సందర్భం మాత్రం చైతు-సమంతల నిశ్చితార్ధమే. 

లేబుళ్లు: ,

28, జనవరి 2017, శనివారం

ఎన్టీఆర్ అభిమానుల క్రియేటివిటీ నిజంగానే సూపర్ తెప్పిస్తున్న ఆ పాట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల క్రియేటివిటీ నిజంగానే సూపర్ అని చెప్పొచ్చు…సౌత్ టు నార్త్ ఏ హిట్ సాంగ్ వచ్చినా అందులో ఎన్టీఆర్ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎడిటింగ్ చేస్తూ ఎన్టీఆర్ వర్షన్ లు రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.


లాస్ట్ ఇయర్ కబాలి ఎన్టీఆర్ వర్షన్ ఓ రేంజ్ లో దుమ్ము రేపగా ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ నటించిన భైరవ సినిమా టైటిల్ సాంగ్ వర్లాం వర్లాం రా భైరవ అనే పాట సౌత్ ని ఒక ఊపు ఊపేస్తుంది.


కాగా వెంటనే ఆ పాటకి ఎన్టీఆర్ వర్షన్ రెడీ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెంపర్ సినిమాలో సూపర్ సీన్స్ అన్ని కలిపి సాంగ్ ని ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. అది చూసిన ఆడియన్స్ అందరికీ పూనకాలు వచ్చేస్తున్నాయి..మీరు చూసేయండి…

లేబుళ్లు:

ఫోటో స్టోరి: అమ్మా కూతుళ్ల అందాల మోత

అందాల తారగా దశాబ్దాల పాటు ఇండియన్ సినిమా స్క్రీన్ ను ఏలింది శ్రీదేవి. ఇప్పటికీ వన్నె తరగని అందంతో మిలమిలలాడ్డం ఈ సీనియర్ భామ స్పెషాలిటీ. సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినా.. వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ.. ప్రేక్షకులను శ్రీదేవి పలకరిస్తుండగా.. ఈమె ఇద్దరు కూతుళ్లూ కూడా సొగసుగత్తెలే కావడం విశేషం.

శ్రీదేవి డాటర్స్ జాన్వి కపూర్.. ఖుషీ కపూర్ లు ఇప్పటికే ఆన్ లైన్ లో తెగ ఫేమస్. పెద్ద కూతురైతే ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ చేయడంతో పాటు.. త్వరలో తెరంగేట్రానికి కూడా సిద్ధమైపోతోంది. తాజాగా ఈ అమ్మాకూతుళ్లు ముగ్గురు ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. వైట్ టాప్.. బ్లాక్ బెల్ బాటం ప్యాంట్ తో శ్రీదేవి.. సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇద్దరు కూతుళ్లు కనిపించారు. స్టైలింగ్ లో ముగ్గురు ఏ రేంజ్ లో ఒకేలా ఉంటారో చూపించేశారు.

పెద్ద కూతురైతే పొట్టి పొట్టి బట్టలతో కాలి అందాలు చూపిస్తూ తెగ రెచ్చగొట్టేస్తే.. చిన్న కూతురు ఖుషీ మాత్రం నడుం హొయలను చూపించేలా డ్రెసింగ్ చేసింది. ఏమీ చూపించకపోయినా.. శ్రీదేవి ఎవర్ గ్రీన్ గ్లామర్ అనే విషయం ఒప్పుకోవాల్సిందే. మొత్తానికి ముగ్గరూ కలిసి అందాల మోత మోగించేశారు.

లేబుళ్లు:

బాబాయ్ అబ్బాయ్ కోసం కథ సిద్దం



నిర్మాత దిల్ రాజు దగ్గర ఓ అద్భుతమైన కథ ఉందట. ఆ కథ రాసింది కేవలం రచయితనేనా...? లేక రచయిత కమ్ డైరెక్టరా? అన్నది తెలియదు కానీ, ఇప్పుడు ఆ కథనే నాగార్జున, నాగచైతన్యతో చేద్దామని ప్రతిపాదనలో ఉన్నాడట దిల్ రాజు. ఈ పాయింట్ నే నాగ ముందు ఉంచాడట. అయితే నిజానికి ఈ పవర్ ఫుల్ కథ బాలయ్య, ఎన్టీఆర్ లకు అయితే సరిగ్గా సరిపోతుందని కథ గురించి తెలిసిన వారు అంటున్న మాట. తండ్రి, కొడుకుల కథ అని, రెండు పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని, అందువలనే బాలయ్య, ఎన్టీఆర్ అయితే బాగుటుందని కథ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. కానీ ఈ కాంబినేషన్ సెట్ అవడం కష్టం కాబట్టి, బాలయ్య- మోక్షజ్ఞ చేసినా బాగుంటుందని టాక్. మరి అంత గొప్ప కథేమిటో కొంతకాలం ఆగితే తెలుస్తుంది.

లేబుళ్లు:

21, జనవరి 2017, శనివారం

ఎన్టీఆర్ ని టచ్ చేయలేను అంటున్న స్టార్ హీరో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన 26 సినిమాల్లో చాలా సినిమాలు నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తిని తీసుకోచ్చినవే…కానీ వాటిలో ఎన్టీఆర్ కి నటుడిగా పీక్స్ లో క్రేజ్ తెచ్చిన అతికొద్ది సినిమాల్లో టెంపర్ సినిమా ఒకటి.

రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాతో ఆల్ మోస్ట్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ రేంజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి గ్రేట్ నెస్ ఉన్న ఈ సినిమాను సౌత్ లో కానీ నార్త్ లో కానీ రీమేక్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు ఇన్ని రోజులు.

కాగా ఎట్టకేలకు రీసెంట్ గా బాజిరావ్ మస్తానీ ఫేమ్ రణవీర్ సింగ్ ఈ రీమేక్ కి సిద్ధం అయ్యాడు. కాగా ఎన్టీఆర్ యాక్టింగ్ ని రిప్లేస్ చేయగలవు అని అనుకుంటున్నావా అంటే అది కష్టం కానీ నావల్ల ఎంత అయితే అంత చేస్తా అని అంటున్నాడట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉందట.

లేబుళ్లు:

ఎన్టీఆర్@50.. బాలయ్య@100


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి హీరోల్లో నటరత్న నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన వందో సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఓ అద్భుత చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చేశాడు. ఇక నందమూరి హీరోల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. చేసింది 26 సినిమాలే అయినా కూడా ఎక్కువ హిట్లు, ఎక్కువ రికార్డులు కొట్టిన హీరో ఎన్టీఆర్. అయితే తాజాగా ఓ కొత్త రికార్డు నందమూరి హీరోలపై నమోదైంది. అదే ఎన్టీఆర్-50, బాలయ్య-100.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ సినిమాగా వచ్చిన నాన్నకు ప్రేమతో భారీ హిట్ అయింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. కాగా అప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా టీజర్ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ గా నిలిచింది. ఇప్పటిదాకా యాభై వేల లైకులు పొందిన మొదటి తెలుగు సినిమాగా అది రికార్డు సాధించింది. మరోపక్క నందమూరి బాలయ్య బాబు గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఏకంగా లక్ష లైకులు పొంది, లక్షల లైకులు పొందిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు సాధించింది. మొత్తానికి ఇద్దరు నందమూరి హీరోలే ఈ రికార్డులను సాధించడం అభిమానులను సంతోషపరుస్తోంది.

లేబుళ్లు: , , , , ,

20, జనవరి 2017, శుక్రవారం

లాల్ ఆడియో ఫంక్షన్ కి తారక్ వస్తున్నాడా!




ఏ సినిమా ఆడియో ఫంక్షన్ కు తనను పెద్ద మనసుతో పిలిచినా ఎట్టిపరిస్తితుల్లోనూ మిస్ కాకుండా చూసుకుంటాడు అనే పేరు ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉంది. అయితే ఇదే క్రమంలో మోహన్ లాల్ సినిమా ఆడియో ఫంక్షన్ కి కూడా అటెండ్ అవుతాడా లేదా అన్న విషయంపై మాత్రం మీమాంస ఏర్పడింది. ఇంతకూ మోహన్ లాల్ ఆడియో ఫంక్షన్ ఏమిటి అనేకదా ప్రశ్న!

విషయానికొస్తే… జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ – మోహన్ లాల్ తో కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని చెబుతుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మలయాలంలో మాత్రం భారీ ప్రమోషన్ కి నోచుకోక అనుకున్న స్థాయిలో ఆడలేదు! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా మళయాలంలో మోహన్ లాల్ హిట్ సినిమా “ఒప్పం” తెలుగులో “కనుపాప” గా విడుదల కానుంది.

అయితే.. ఈ సినిమాకు సంబందించిన ఆడియో ఫంక్షన్ ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనుందని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ పాటల వేడుకకు జూనియర్ ని చీఫ్ గెస్ట్ గా రప్పించాలని మోహన్ లాల్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో తారక్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేరా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనే చెప్పాలి! తారక్ ను పిలవాలే కానీ.. ఏమాత్రం అవకాశం ఉన్నా సినిమా కార్యక్రమాలకు రాకుండా ఉండరనేది అభిమానుల వాదన!!

లేబుళ్లు:

ఎన్టీఆర్ తో ఛాన్స్ పట్టేసిందింగా!!

టాలీవుడ్ నెక్ట్స్ జెన్ టాప్ హీరోయిన్ అయిపోయే అవకాశాలున్న భామల్లో రాశి ఖన్నా పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఈమెకి స్మాల్ మీడియం హీరోలతో తప్ప.. స్టార్ హీరోలతో మాత్రం అవకాశాలు రావడం లేదు. రాశి కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉన్నా.. ఇప్పటివరకూ ఏదైనా లోటు ఉందంటే.. అది కేవలం స్టార్ హీరోలతో చేయలేకపోవడమే.

ఇప్పుడా లోటు తీర్చే బాధ్యత తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాను ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. రవితేజ తప్ప ఇప్పటివరకూ ఆమె ఏ పెద్ద హీరోతోనూ నటించలేదు. అలాగే భారీ బడ్జెట్ మూవీస్ కూడా చేయలేదు. మొదటిసారిగా ఒక స్టార్ హీరోతో మూవీ అవకాశం రావడం.. అది కూడా టాప్ గేర్ లో ఉన్న యంగ్ టైగర్ తో సినిమా చేయనుండడంతో.. రాశి ఖన్నా ఉబ్బితబ్బిబ్బయిపోతోంది.

ఫిబ్రవరి 11నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాుండగా.. మిగిలిన ఇద్దరు హీరోయిన్లను ఈలోపలే ఫైనలైజ్ చేయనున్నారట.

లేబుళ్లు:

19, జనవరి 2017, గురువారం

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో గర్జిస్తూన్న బాలయ్య ..6 రోజుల్లో 60 కోట్లు..!!


చారిత్రిక శాతకర్ణి కథని 100 సినిమా కథగా ఎంచుకుని నటసింహం నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించాడు…కెరీర్ బెస్ట్ హిట్ ని 100 వ సినిమాతో దక్కించుకున్న బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో గర్జిస్తూ దూసుకుపోతున్నాడు.


రిలీజ్ అయిన 6 రోజుల్లోనే 60 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి సత్తా చాటుకున్న బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా దూసుకుపోతున్నాడు. 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన బాలయ్య టోటల్ వరల్డ్ వైడ్ గా 40 కోట్లకు దగ్గరయ్యాడు.


కాగా సినిమాకి ఇంకా టాక్స్ రద్దు నోటిసులు రాకపోవడ౦తో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో బాలయ్య మొత్తం టార్గెట్ 100 కోట్ల గ్రాస్ అని చెప్పొచ్చు…100 వ సినిమాతో 100 కోట్ల గ్రాస్ అందుకుంటే అది చరిత్రే అని చెప్పొచ్చు.

లేబుళ్లు:

18, జనవరి 2017, బుధవారం

‘శాతకర్ణి’ అందుకున్న మరో అరుదైన ‘రికార్డ్’



సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా, బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు తొలి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల షేర్ ను దాటి, బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా అవతరించిందని తెలుస్తోంది. మొత్తమ్మీద 60-70 కోట్ల క్లబ్ లో ‘శాతకర్ణి’ నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, అసలు ఈ సినిమాపై ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కారణమైన అంశం… ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ధియేటిరికల్ ట్రైలర్ అన్న విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదలైన నాటి నుండి ఈ సినిమాపై నమ్మకాలు ఏర్పడ్డాయి. అందుకే నెటిజన్లు ఈ ట్రైలర్ కు పట్టాభిషేకం చేస్తూ… అరుదైన రికార్డులను సొంతం చేసిన విషయం కూడా విదితమే. తాజాగా ఈ ట్రైలర్ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది.

తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు యూ ట్యూబ్ లో ‘ఒక లక్ష లైక్స్’ అందుకున్న తొలి ట్రైలర్ గా చరిత్ర సృష్టించింది. తెలుగు వాడి సత్తాను యూ ట్యూబ్ నుండే ప్రేక్షకులు తెలపడం ప్రారంభించారు అనే దానికి నిదర్శనంగా ఈ ట్రైలర్ నిలుస్తోంది. అలాగే ఇప్పటివరకు ఈ ట్రైలర్ 7 మిలియన్ క్లిక్స్ అందుకుంది. బహుశా సినిమా విడుదలైన తర్వాత ఈ ట్రైలర్ కు మరింత స్పందన వచ్చినట్లుగా కనపడుతోంది.

లేబుళ్లు:

ఎన్టీఆర్ నెక్ట్స్.. ముహూర్తం పెట్టేశారు



జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఎట్టకేలకు తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. దాదుపు మూడు నెలలు గ్యాప్ తీసుకుని దర్శకుడు బాబీతో మూవీని ఖాయం చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం కోసం.. ఇప్పటికే 'జై లవ కుశ' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తాడని.. జై.. లవ..కుశ.. ఆ రోల్స్ పేర్లని అందుకే ఈ టైటిల్ కి ఫిక్స్ అయ్యారని టాక్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రీ  ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఎన్టీఆర్ మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న యంగ్ టైగర్ 27వ సినిమాను అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి.. వీలైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లిపోయేలా ప్లాన్ చేసుకున్నారట. జై లవకుశను.. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి విడుదల చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. పీకే.. 3 ఈడియట్స్.. లగేరహో మున్నాభాయ్ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సీకే మురళీధరన్ కు కేమెరా బాధ్యతలు అప్పగిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కెరీర్ లో.. జై లవకుశ మరో మైలురాయిగా నిలిచేంతటి సబ్జెక్ట్ ఉందని తెలుస్తోంది.

లేబుళ్లు:

15, జనవరి 2017, ఆదివారం

ఎన్టీఆర్ కోసం బెస్ట్ టెక్నీషియన్స్ ను తీసుకొస్తున్న కళ్యాణ్ రామ్ !



వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తరువాతి చిత్రాన్ని దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది కథలు విని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ బాబీ చెప్పిన కథకు ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్టులో అంత విశేషమేముందనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తింది. ఈ క్రేజీ ప్రాజేతును ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.

ఎన్టీఆర్ కు ఇది 27 వ చిత్రం. ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా గొప్పగా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు కళ్యాణ్ రామ్. అందుకే సాంకేతిక విభాగంలో బెస్ట్ టెక్నీషియన్స్ ఉండేలా చూస్తున్నాడు. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నాడు. మురళీధరన్ గతంలో పీకే, త్రీ ఇడియట్స్, మొహంజొదారో వంటి భారీ స్థాయి బాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. పీకే చిత్రానికి గాను ఆయన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఎప్పుడు లాంఛ్ అవుతుంది, ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

లేబుళ్లు:

13, జనవరి 2017, శుక్రవారం

మరోకసారి ఒప్పందం చేసుకున్నా మెహన్ లాల్…

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’లో నటించారు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్. ఇందులో ఎన్టీఆర్ పెదనాన్నగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సమయంలో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడీ స్నేహంతోనే మోహన్ లాల్ సినిమాకి ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు ఎన్టీఆర్.

మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందిన ‘ఒప్పం’ చిత్రం అక్కడ భారీ వసూళ్లను సాధించింది. మోహన్ లాల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను ‘కనుపాప’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఆడియో ఫంక్షన్ కి ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారని తెలిసింది. మోహన్ లాల్ పై వున్న అభిమానంతో ఈ ఫంక్షన్ కి ఎన్టీఆర్ తప్పకుండా వస్తారనే టాక్.

లేబుళ్లు:

12, జనవరి 2017, గురువారం

గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ & రేటింగ్ - తెలుగు సినిమా చ‌రిత్ర‌లో చిర‌కాలం నిలిచే పోయే సినిమా శాత‌క‌ర్ణి


టైటిల్‌: గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి
బ్యాన‌ర్‌: హిస్టారిక‌ల్ మూవీ
న‌టీన‌టులు:యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయ శరన్, హేమమాలిని, కబీర్ బేడీ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్
మ్యూజిక్‌: చిరంతన్ భట్
ఆర్ట్‌: భూపేష్ భూపతి
పాట‌లు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
డైలాగ్స్‌: సాయిమాధవ్ బుర్ర
ఫైట్స్‌: రామ్-లక్ష్మణ్
సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు
సమర్పణ: బిబో శ్రీనివాస్
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌)
ర‌న్ టైం: 2 గంట‌ల 12 నిమిషాలు
సెన్సార్ స‌ర్టిఫికెట్‌: యూ/ఏ
రిలీజ్ డేట్‌: 12 జ‌న‌వ‌రి, 2016
తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ నాటి త‌రం న‌టుడు, న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క రామారావు వార‌సుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ టాలీవుడ్ అగ్ర హీరోల‌లో ఒక‌డిగా నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు వెండితెర‌పై హీరోగా మెరుపులు మెరిపిస్తున్నాడు. తాత‌మ్మ‌క‌ల‌తో ప్రారంభ‌మైన బాల‌య్య ప్ర‌స్థానం ఆయ‌న తాజా చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో 100వ సినిమాకు చేరువైంది. బాల‌య్య‌ వందో సినిమా అమ‌రావ‌తి రాజ‌ధానిగా అఖండ భార‌తావ‌నిని ఏకం చేసిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కింది. టాలీవుడ్‌లో గ‌మ్యం – వేదం – కృష్ణంవందే జ‌గ‌ద్గురుం – కంచె సినిమాల‌తో విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ డిఫ‌రెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారిక‌ల్ మూవీ రిలీజ్‌కు ముందే భారీ హైప్ తెచ్చుకుంది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శాత‌క‌ర్ణి ప్రేక్ష‌కుల భారీ అంచ‌నాలు ఎలా అందుకుందో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.
క‌థ‌:
ప్ర‌స్తుత న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేసుకుని పాలిస్తున్న శాత‌వాహ‌న సామ్రాజ్య యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి (యువ‌ర‌త్న బాల‌కృష్ణ‌) అఖండ భార‌తావ‌నిని ఒకేతాటి మీద‌కు తేవాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలోనే ముందుగా క‌ళ్యాణ‌దుర్గం రాజును జయిస్తాడు. వ‌రుస‌గా 29 యుద్ధాలు చేసి ఆ రాజ్యాల‌ను జ‌యించి…వారిని త‌న సామంతులుగా చేసుకుంటాడు. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణ‌భార‌త‌దేశంలో పెద్ద రాజు అయిన సౌరాష్ట్ర న‌హ‌పాలుడిని ఓడించి భార‌త్‌ను ఏకం చేయాల‌నుకుంటాడు. ఈ భారీ యుద్ధంలో శాత‌క‌ర్ణి న‌హ‌పాలుడిని ఓడించి అత‌డి అల్లుడు అయిన వృష‌భ‌నాథుడిని అక్క‌డ త‌న సామంతుడిగా చేసుకుంటాడు. భార‌తేశాన్ని గ‌తంలో పాలించిన ఎందరో గొప్ప రాజులు అయిన అశోకుడు, చంద్ర‌గుప్తుడు చేయ‌లేని ప‌నిని శాత‌క‌ర్ణి చేస్తాడు.
ఇక గ్రీకువీరుడైన అలెగ్జాండ‌ర్ టైం నుంచి భార‌త‌దేశం మీద దాడులు చేస్తున్న యువ‌నులు (గ్రీకులు) డెమిట్రియ‌స్ ఆధ్వ‌ర్యంలో భార‌త్‌మీద దండెత్తేందుకు ఎదురు చూస్తుంటారు. భార‌త్‌ను హ‌స్త‌గ‌తం చేసుకునేందుకు డెమిట్రియ‌స్ ఆధ్వ‌ర్యంలో వ‌చ్చిన గ్రీకుల‌ను చిత్తుచిత్తుగా ఓడించి భార‌త‌జాతి ఖ్యాతిని చివ‌ర‌కు ద‌శ‌దిశ‌లా శాత‌క‌ర్ణి ఎలా వ్యాపింప‌జేశాడు ? త‌న జీవిత ప్ర‌యాణంలో త‌న త‌ల్లి గౌత‌మి(హేమ‌మాలిని), భార్య వశిష్టి దేవి (శ్రియా), త‌న పిల్ల‌ల‌తో అత‌డు ఎదుర్కొన్న ప‌రిస్థితులు ఏంటి అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:
ఈ సినిమాలో క్రిష్ శాత‌క‌ర్ణి ముందుగా భార‌త్‌ను ఏకం చేసి, త‌ర్వాత గ్రీకుల‌ను ఎలా ఎదుర్కొన్నాడ‌న్న అంశాన్ని చెప్పాల‌నుకున్నాడు. సినిమా స్టార్టింగే క‌ళ్యాణ్‌దుర్గం మీద యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత మ‌రో గ‌ట్టి రాజ్య‌మైన సౌరాష్ట్ర మీద దండెత్త‌డంతో రెండో యుద్ధం చేసి, ఇండియాను ఏకం చేస్తాడు. చివ‌ర్లో గ్రీకుల యుద్ధం జ‌రుగుతుంది. భార‌త్ ఏక‌మ‌వ్వ‌డంతో పాటు మ‌న దేశానికి విదేశీ రాజ్యాల నుంచి ముప్పు త‌ప్పుతుంది. ఇదే క‌థ‌ను తాను ఎలా అయితే అనుకున్నాడో తెర‌మీద అంత‌కుమించి ప్ర‌జెంట్ చేశాడు. ఎక్క‌డ క‌థ ట్రాక్ త‌ప్పుకుండా, అన‌వ‌స‌ర విశ్లేష‌ణ‌ల‌కు పోకుండా సినిమాను విజ‌య‌వంతంగా ముగించాడు.
శాత‌క‌ర్ణి రాజుగా అత‌డి ప్ర‌స్థానం ఎలా ప్రారంభ‌మైంది అన్న దానికంటే కేవ‌లం క్రిష్ దేశాన్ని అత‌డు ఏకం చేసే అంశంమీదే ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేశాడు. అత‌డి వ్య‌క్తిగ‌త జీవితంలో త‌ల్లికి-అత‌డికి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా త‌క్కువుగా రాసుకున్నాడు. ఇక భార్యకు అత‌డికి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు త‌క్కువే అయినా అవి నీట్‌గా ఉన్నాయి. బాల‌య్య‌-శ్రేయ మ‌ధ్య ప్రేమ‌-అప్యాయ‌త‌-అనురాగం-ఆందోళ‌న‌-శృంగారం ఇలా అన్ని అంశాల‌ను ఆవిష్క‌రించాడు. ఇక రాజ‌సుయాగం చేసిన‌ప్పుడు బాల‌య్య స్త్రీ గురించి చెప్పిన డైలాగులు వ‌ర్ణించ‌లేం. యుద్ధ‌భూమికి బాల‌య్య త‌న చిన్న కుమారుడిని కూడా తీసుకెళ్లి చేసే సాహ‌సం కూడా బాగుంది. అక్క‌డ బాల‌య్య కొడుకు పులోమావి న‌హ‌పాలుడి క‌ళ్ల‌ల్లోకి ఎలాంటి భ‌యం లేకుండా చూసే సీన్ చాలా హైలెట్‌. చివ‌ర‌కు గ్రీకుల వార్ త‌ర్వాత మ‌న జాతి గొప్ప‌త‌నం గురించిన ఓ మంచి సందేశంతో సినిమాను ముగించాడు.
న‌టీన‌టులు పెర్పామెన్స్‌:
బాల‌య్య ఆరుప‌దుల వ‌య‌స్సుకు ద‌గ్గ‌ర‌వుతున్నా కూడా శాత‌క‌ర్ణి సినిమాలో అత‌డి న‌ట‌న చూస్తే బాల‌య్య‌లో ఎనర్జీ రోజు రోజుకు పెరుగుతంద‌నిపించింది. శాత‌క‌ర్ణిగా అత‌డి న‌ట‌న త‌న తండ్రి ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల‌ను గుర్తు చేసింది. బాల‌య్య యుద్ధ సన్నివేశాల్లోను, డైలాగులు చెప్ప‌డంలోను, ఇలాంటి సినిమాలు చేయ‌డంలోను మ‌రోసారి త‌న‌కు తిరుగులేదు అనిపించుకున్నాడు. దాన‌వీరశూర క‌ర్ణ సినిమాలో అభిమ‌న్యుడిగా ఆ వ‌య‌స్సులో ఎలా యుద్ధం చేశాడో..ఇప్పుడు ఈ వ‌య‌స్సులో కూడా అదే ఎన‌ర్జీ..ఇంకా చెప్పాలంటే అంత‌కుమించిన ఎనర్జీతో యుద్ధ స‌న్నివేశాల్లో న‌టించాడు.
ఇక బాల‌య్య భార్య వ‌శిష్టి దేవిగా శ్రేయ, బాల‌య్య‌కు త‌ల్లిగా మ‌హారాణి గౌత‌మిగా బాలీవుడ్ డ్రీమ్‌గ‌ర్ల్ హేమ‌మాలిని సినిమాకు వ‌న్నె తెచ్చారు. యుద్ధం ధ‌ర్మ అనే ధీటైన పాత్ర‌లో హేమ‌మాలిని న‌టిస్తే, య‌ద్ధం వ‌ద్దు భ‌ర్త శ్రేయ‌స్సే ముఖ్యం అనుకునే రోల్‌లో శ్రేయ న‌టించింది. ఇక ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిగా, అటు మ‌హారాజు భార్య‌గా శ్రేయ ఆ పాత్ర‌కు నూటికి నూరుశాతం న్యాయం చేసింది. మిగిలిన న‌టుల్లో బాల‌య్య రాజ్యంలో సైనిక సామ్రాజ్యంలో శివ‌కృష్ణ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, దూత‌గా శుభ‌లేఖ సుధాక‌ర్‌, ఇక గ్రీకు మ‌నుష్యులుగా డెమిట్రియ‌స్‌, ఎథినా రోల్‌లో చేసిన వారుగా త‌మ పాత్ర‌ల‌కు బాగా సెట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ యామినీబాల శ్రేయ‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో త‌ళుక్కుమ‌న్నారు.
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
ఈ సినిమాలో టెక్నిక‌ల్ విభాగాల‌న్ని క‌లిపి ఒకే గాటాన చెప్ప‌డం స‌రికాదు. అంత అద్భుతంగా టెక్నిక‌ల్ విభాగాలు ప‌నిచేశాయి.
సినిమాటోగ్ర‌ఫీ:
జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ గురించి ఎంత చెప్పుకున్నా…ఏమ‌ని చెప్పుకున్నా త‌క్కువే…న‌టీన‌టుల‌ను అందంగా, సీన్‌కు త‌గ్గ‌ట్టుగా క్లోజ‌ప్‌, లాంగ్ షార్ట్‌ల‌లో చూపించ‌డంలోను, యుద్ధ స‌న్నివేశాలు, సాంగ్స్, నిర్మాత‌లు పెట్టిన ప్ర‌తి రూపాయి తెర‌మీద చ‌క్క‌గా ఆవిష్కృతం అవ్వ‌డంలో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.

ఆర్ట్‌:
భూపేష్ భూప‌తి ఆర్ట్ వ‌ర్క్‌ను వ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వు. శాత‌వాహ‌న సామ్రాజ్యం, క‌ళ‌లు, శిల్పాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక‌టేమిటి సినిమాలో అన్ని సీన్ల‌లోను ఓ వైపు సీన్ల‌ను చూస్తూనే మ‌రోవైపు ఆర్ట్ వ‌ర్క్‌ను సైతం మిస్ కాకూడ‌ద‌నేంత అద్భుతంగా ఉంది. సాంగ్స్‌, సీన్లు, శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర‌ను వివ‌రిస్తూ శివ‌రాజ్‌కుమార్ చేసే సాంగ్‌లో ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్ట్ వ‌ర్క్‌ను వ‌ర్ణించ‌లేం.
మ్యూజిక్‌:
చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ మెస్మ‌రైజ్ చేసింది. పాట‌ల‌తో పాటు ఆర్ ఆర్ ప్ర‌తీసీన్‌ను ఎలివేట్ చేసింది. సినిమాలో బాల‌య్య డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు, యుద్ధ స‌న్నివేశాలు, శ్రీయ‌-బాల‌య్య మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో సీన్ల‌కు త‌గిన‌ట్టుగా ప్రేక్ష‌కుడిని సినిమాలో ఇన్వాల్ చేయ‌డంలో ఓ రేంజ్‌లో విజృంభించాడు. పాట‌ల కంటే సీన్లు, వార్ స‌న్నివేశాల్లో ఆర్ ఆర్ అదిరిపోయింది.

ఫైట్స్‌:
శాత‌క‌ర్ణిలో ఉన్న నాలుగు వార్ సన్నివేశాలే సినిమాకు హార్ట్‌. తొలి యుద్దం – న‌హ‌పాలుడు యుద్ధం-గ్రీకుల యుద్ధం అన్నీ సినిమాకు ఎక్క‌డికో తీసుకెళ్లాయి. న‌హ‌పాలుడుతో స‌ముద్రంలో చేసే యుద్ధం, న‌హ‌పాలుడు కోట‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు బాల‌య్య చేసిన విన్యాసం, చివర్లో గ్రీకుల‌తో బ్లూ మ్యాట్ మీద చేసిన భారీ యుద్ధం ఇలా ఈ యుద్ధాన్ని తీసుకున్నా మైండ్ బ్లోయింగ్ చేసేశాయి. రామ్‌-లక్ష్మ‌ణ్‌ల‌కు హ్యాట్సాఫ్‌.

డైలాగ్స్‌:
శాత‌క‌ర్ణి డైలాగ్స్ చెప్పాలంటే అద్భుతం-అత్య‌ద్భుతం ఇంకా ఏమైనా ఉంటే అదే అనుకోవాలి. బుర్రా సాయిమాధ‌వ్ రాసిన ప్ర‌తి డైలాగ్ త‌న‌లోని అత్య‌ద్భుత ప్ర‌తిభ‌కు తార్కాణంగా నిలిచాయి. వాటిని తెర‌మీద బాల‌య్య చెపుతుంటే విజిల్ వేయ‌ని ప్రేక్ష‌కుడు లేడు.
– మ‌నం క‌థ‌లు చెప్ప కూడ‌దు…మ‌న క‌థ‌లు జ‌నం చెప్పుకోవాలి
– శ‌ర‌ణం అంటే ర‌క్ష‌…ర‌ణం అంటే మ‌ర‌ణ‌శిక్ష ఏదీ కావాలి
– ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం… ఇక ఉనికిని చాటుదాం
– నేను బొట్టు పెట్టింది నా భ‌ర్త‌కు కాదు…. ఓ చ‌రిత్ర‌కు
– ఆడ‌దాని క‌డుపులో న‌లిగి న‌లిగి వెలుగు చూసిన ర‌క్త‌పు ముద్ద‌వి
– శాత‌క‌ర్ణి ఒక్క‌డు మిగిలి ఉంటే చాలు… మ‌న‌లో ఒక్క‌డు కూడా మిగ‌ల‌డు
– నా రాజ్యంలో పాలించ‌డానికి కాదు…యాచించ‌డానికి కూడా అనుమ‌తించ‌ను
– మ‌మ‌కారం..అహాంకారం రెండూ లేనివాడే నాయ‌కుడు అవుతాడు
– మ‌గ‌నాలికి గాజులు అందం…మ‌గాడికి గాయాలు అందం
– మారావు అనుకున్నా…గెలిచిన రాజ్యాలు మార్చ‌లేదు…వ‌ల‌చిన ఇల్లాలు మార్చ‌లేదు
ఇవి బుర్రా సాయిమాధ్ ఆణిముత్యం లాంటి డైలాగుల్లో కొన్ని..ఇంకా చెప్పాలంటే ఇంత‌కు మించిన డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి.
మిగిలిన విభాగాల్లో ఎడిటింగ్ కూడా సినిమాలో ఏ సీన్ క‌ట్ చేయ‌డానికి, తీసిప‌డేయానికి వీలులేనంత క్రిస్పీగా ఉంది. సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌లేదంటే ఎడిటింగ్ గ్రిప్పింగ్ అర్థ‌మ‌వుతోంది. ఇక ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మాణ విలువ‌లు ఎక్స్‌లెంట్‌. ప్ర‌తి ఫ్రేములోను వారు పెట్టిన భారీ ఖ‌ర్చు క‌న‌ప‌డింది.

క్రిష్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:
ఇప్ప‌టి వ‌ర‌కు క్రిష్ తీసిన సినిమాల‌న్నీ ఒక ఎత్తు…శాత‌క‌ర్ణి మ‌రో ఎత్తు. శాత‌క‌ర్ణి క్రిష్‌ను టాలీవుడ్ గ్రేటెస్ట్ ద‌ర్శ‌కుల జాబితాలో టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా నిల‌బెట్ట‌డంతో పాటు ఈ సినిమా గ‌తంలో తీసిన చారిత్ర‌క సినిమాల స‌ర‌స‌న తెలుగు సినిమా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోనుంది. శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి తాను ఏదైతే చెప్పాల‌నుకున్నాడో దానిని సుత్తి లేకుండా, సూటిగా త‌క్కువ టైం (2.15 గంట‌లు) లో అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్పాడు. ఈ హిస్టారిక‌ల్ స్టోరీలో కొంత‌వ‌ర‌కు సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకున్నా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం మెయిన్ ట్రాక్ త‌ప్పకుండా స‌క్సెస్ చేయ‌డంలో క్రిష్ గొప్ప‌త‌నం క‌న‌ప‌డింది. క‌థ‌, హైలెవ‌ల్ టేకింగ్‌, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ అన్ని తిరుగులేకుడా డీల్ చేశాడు.

ఫ్ల‌స్ పాయింట్స్ (+):
– బాల‌య్య చేసిన విరోచిత యుద్ధ విన్యాసాలు, డైలాగ్స్‌, న‌ట విశ్వ‌రూపం
– స్టోరీ-స్క్రీన్ ప్లే – క్రిష్ మైండ్ బ్లోయింగ్ డైరెక్ష‌న్‌
– ఆర్ట్ వ‌ర్క్‌
– యుద్ధ స‌న్నివేశాలు
– మ్యూజిక్‌
– నిర్మాణ విలువ‌లు
– సినిమాటోగ్ర‌ఫీ
– ఎడిటింగ్‌..అన్ని సాంకేతిక విభాగాలు

మైనస్ లు :

-అక్కడక్కడ తగ్గిన గ్రాఫిక్స్ వర్క్

ఫైన‌ల్‌గా….
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో చిర‌కాలం నిలిచే పోయే శాత‌క‌ర్ణి
తెలుగు జాతి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా చాటి చెప్పిన శాత‌క‌ర్ణి
ప్ర‌తి తెలుగువాడు త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన శాత‌క‌ర్ణి
గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి Tollywoodnews24.com రేటింగ్‌: 4.2/5

లేబుళ్లు:

11, జనవరి 2017, బుధవారం

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రీ-రివ్యూ.. క్రిష్, బాలయ్యకు హ్యాట్సాఫ్


సినిమా : గౌతమీపుత్ర శాతకర్ణి
నటీనటులు : బాలకృష్ణ, శ్రియా శరన్, హేమమాలిని, కబీర్ బేడీ, శివ రాజ్‌కుమార్, తదితరులు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : క్రిష్
నిర్మాతలు : సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
మ్యూజిక్ : చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వీఎస్
ఎడిటర్స్ : సూరజ్ జగ్‌తాప్, రామకృష్ణ ఆర్రం
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలయ్య చేసిన తన మైల్‌స్టోన్ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రీ.శ.1-2 శతాబ్దాలకాలం నాటి శాతవాహనుల చక్రవర్తి శాతకర్ణి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయినరోజే.. దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చిపడింది. బాలయ్య తన 100వ చిత్రం కోసం సరైన కథాంశాన్ని ఎంచుకున్నారని పాజిటివ్ రెస్పాన్స్ రావడం మొదలైంది. అందుకు తగినట్లుగానే పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్స్ రిలీజ్ అవ్వడంతో.. ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? వెయిట్ చేయాల్సిందే.

కథ :
అది క్రీ.శ.1-2 మధ్యకాలానికి చెందిన కథ. అప్పట్లో భారతదేశం ఒకతాటిపై కాకుండా చిన్నచిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉండేది. రాజులందరూ ఇతర రాజ్యాల గురించి పట్టించుకోకుండా తమ రాజ్యపాలన చేసుకుంటూ ఉంటారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న తరుణంలో.. ఆంగ్లేయులు దేశం మీద దండయాత్ర చేస్తారు. ఒక్కొక్క గణతంత్ర రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు రాజులు తమ సొంత స్వలాభాల కోసం ఆ ఆంగ్లేయులకు సామంతులవుతారు.

ఇక శాతవాహనుల రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని వాళ్లు ప్రయత్నిస్తారు. కానీ.. ఆ రాజ్య చక్రవర్తి అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అలా జరగనివ్వకుండా.. వారిపై తిరుగుబాటు చేస్తాడు. పరాయి దేశం వాళ్లని తరిమికొడదామన్న లక్ష్యంతో ముందుకు సాగుతాడు. ఇది తన ఒక్కడివల్లే సాధ్యం అవ్వదని, అందరూ కలిస్తేనే సాధ్యమవుతుందని భావించి.. గణతంత్ర రాజ్యాలుగా ఉండే భారతావనని ఒకే పాలనలోకి తీసుకొచ్చేందుకు పిలుపునిస్తాడు. అతని పిలుపు మేరకు అన్ని రాజ్యాలు కదిలొస్తాయి. దీంతో.. శాతకర్ణికి గొప్ప పేరు వస్తుంది.

ఇది సహించలేకపోయిన మరో రాజు.. శాతకర్ణికి వ్యతిరేకంగా ఆంగ్లేయులతో కలిసి వ్యూహాలు రచించడం ప్రారంభిస్తాడు. శాతకర్ణికి దగ్గరే ఉంటూ.. సీక్రెట్స్‌ని దొంగలించడమే కాకుండా, అతన్ని అంతమొందించేందుకు ప్రణాళికలు రచిస్తాడు. ఈ విషయం శాతకర్ణికి ఎలా తెలిసింది? వారి వ్యూహాల్ని ఎలా ఎదుర్కొంటాడు? దేశం కోసం ఆయన చేసిన సేవలేమిటి? చివరికి ఏమైంది? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది.

విశ్లేషణ:
చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కే సినిమాల్లో.. పెద్దపెద్ద భవంతులు, వేలాదిమంది యోధులు, కళ్లు చెదిరే లొకేషన్లు, వీరోచిత యుద్ధ సన్నివేశాలు తప్పనిసరి. ఇందుకోసం చాలా సమయమే పడుతుంది. ఎంతలేకున్నా.. సంవత్సరంపైనే అవుతుంది. కానీ.. దర్శకుడు క్రిష్ కేవలం 8 నెలల్లోనే ఈ అద్భుత కళాఖండాన్ని తెరకెక్కించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కళ్లుచెదిరే గ్రాఫిక్స్, భారీ యుద్ధ సీన్లు.. రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. అసలు ఇంత తక్కువ సమయంలో అంత అద్భుతమైన ఔట్‌పుట్ రాబట్టడంలో క్రిష్ చేసిన కృషిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అతను చెప్పినట్లుగానే.. ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఈ సినిమాని తెరకెక్కించాడు.

కథా విషయానికొస్తే.. ఈ సినిమా ప్రారంభమే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలు కూడా హత్తుకునేలా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు అమోఘంగా వున్నాయి. ముఖ్యంగా.. సముద్రంలో నావికా యుద్ధం హాలీవుడ్‌ని తలపించేలా ఉంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. ఫస్టాఫ్‌లాగే సెకండాఫ్ కూడా వీరోచిత వార్ సన్నివేశాలతో రసవత్తరంగా సాగుతుంది. మధ్యలో శాతకర్ణి, తల్లి గౌతమీ, భార్య మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ టచ్ చేస్తాయి. ఇందులో శాతకర్ణి తన చేతిలో కుమారుడ్ని పట్టుకునే చేసే యుద్ధం మరో హైలైట్. ఈ సీన్‌కి థియేటర్స్ విజిల్స్‌తో దద్దరిల్లాల్సిందే. ఇక క్లైమాక్స్ అయితే ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓ మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్‌తో కథని ముగించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

ఓవరాల్‌గా చూసుకుంటే.. ఎమోషనల్ సన్నివేశాలు కాస్ల స్లోగా సాగినట్లు అనిపిస్తాయి తప్పితే మిగతా సినిమా మొత్తం వేగంగా సాగిపోతుంది. ఈ సినిమాకి వార్ సీన్లే మేజర్ ప్లస్ పాయింట్స్. వాటిని రొటీన్ ఫార్మాట్‌లో కాకుండా తనదైన స్టైల్‌లో అద్భుతంగా తీశాడు. ఈ చిత్రానికి మరో కలిసొచ్చే అంశం.. రన్‌టైం కేవలం 2 గంటల 15 నిముషాలు మాత్రమే ఉండడం. దీంతో.. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా నడుస్తుంది. బాలయ్య తన నటనతో, క్రిష్ తన ప్రతిభతో.. ఈ సినిమాని అద్భుతంగా వచ్చేలా చేశారు.

నటీనటుల పనితీరు :
నటసింహంగా పేరుగాంచిన బాలయ్య ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారన్న విషయం అందరికీ తెలుసు. ‘శాతకర్ణి’ పాత్రలోనూ ఆయన పోతారన్న విషయం అందరికీ తెలుసు. ‘శాతకర్ణి’ పాత్రలోనూ ఆయన ఒదిగిపోయారు.. సారీ జీవించేశారు. ఈ వయసులోనూ డూప్స్ లేకుండా వార్ సన్నివేశాలు చేయడం నిజంగా గొప్ప విషయమే. ఈ పాత్రకి ఈయన సరిపోలేదని నెగెటివ్‌గా కామెంట్స్ చేసిన వారికి చెంప ఛెళ్లుమనిపించేలా బాలయ్య సమాధానం ఇచ్చారు. ఇక శాతకర్ణి సతీమణిగా శ్రియాశరన్ బాగానే నటించింది. అక్కడక్కడ అందాలను బాగానే ఆరబోసింది. బాలయ్య, శ్రియాల మధ్య కెమెస్ట్రీ కూడా అదిరింది. బాలయ్య తల్లిగా హేమమాలిని అద్భుత అభినయం కనబరిచారు. ఆ పాత్రకు ఆమె తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరేమో అన్నంతగా ఆకట్టుకున్నారు. విలన్‌గా కబీర్ బేడీ చాలా బాగా నటించాడు. ఇతర నటీనటులు తమతమ పాత్రల పరిధి మెప్పించారు.

సాంకేతిక పనితీరు :
ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతం. ఆయన కెమెరా పనితనానికి ఎన్ని మార్కులు వేసినా తక్కువ. క్రీ.శ.1-2 మధ్యకాలానికి చెందిన చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు వెండితెరపై చూపించిన తీరు అమోఘం. చిరంతన్ భట్ అందించిన సంగీతం చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి మరో ప్రాణం పోసింది. ఎడిటింగ్ బాగుంది. సాయిబాబు, రాజీవ్ రెడ్డిల నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు.

ఇక క్రిష్ గురించి మాట్లాడితే.. అతను ఎంచుకున్న కథని వెండితెరపై ఎగ్జిక్యూట్ చేయడంలో నూటికి నూరు శాతం పాసయ్యాడు. ఇలాంటి భారీ చిత్రాన్ని కేవలం 8 నెలల్లో అద్భుతమైన ఔట్‌పుట్‌తో కంప్లీట్ చేయడం నిజంగా గర్వించదగ్గర విషయం.

ఇలాంటి ప్రాజెక్ట్‌ని అతను డీల్ చేసిన విధానానికి ఎంత ప్రశంసించినా తక్కువే. ఆల్రెడీ టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరుగాంచిన క్రిష్.. ఈ సినిమాతో అందనంత స్థాయికి ఎదిగిపోయాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ఫైనల్ వర్డ్ : ఈ చిత్రం చరిత్ర తిరిగరాయాలని, తెలుగువారు గర్వపడేలా చేయాలని cinemaTelugu.com సైట్ ఆశిస్తూ.. gautamiputra satakarni pre review rating : 4/5

లేబుళ్లు: ,

ఎన్టీఆర్…ది బెస్ట్ హ్యూమన్….!!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన మంచితనాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. స్నేహం కోసం దేనికైనా రెడీ అనే ఎన్టీఆర్ ఈ సారి రానా కోసం ముందుకొచ్చాడు. రానా, తాప్సీలు హీరో, హీరోయిన్లుగా 1971 యుద్ధ నేపథ్యంలో ‘ఘాజీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. పివిపి ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ఆ సినిమాకు కాస్త ఎక్కువ బడ్జెట్టే అయింది. అందుకే సినిమాకు మైలేజ్ తీసుకురావడం కోసం ఎవరైనా ఓ స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నారు.

వెంకటేష్‌తో సహా కొంతమంది స్టార్స్‌ని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే చివరికి ఎన్టీఆర్ ఒకె చెప్పడంతో ‘ఘాజీ’ టీం ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. రీసెంట్‌గా రామానాయుడు డబ్బింగ్ స్టూడియోలోనే వాయిస్ ఓవర్ చెప్పేశాడు ఎన్టీఆర్. సినిమా ప్రారంభంలోనే ఇండియ పాకిస్తాన్ మధ్య వచ్చిన యుద్ధాల గురించి చెప్తూ ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తుందని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ పివిపితో సహా రానా, తాప్సీలు కూడా ఎన్టీఆర్ మంచితనాన్ని మనఃస్ఫూర్తిగా అభినందించారు. ఘాజీలాంటి ఓ వాస్తవ కథకు ఎన్టీఆర్ వాయిస్ హెల్ప్ అవుతుంనడంలో సందేహం లేదు. 1971లో విశాఖ తీరాన పాకిస్తాన్ సబ్‌మెరైన్‌కి, ఇండియా సబ్‌మెరైన్‌కి మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

లేబుళ్లు:

10, జనవరి 2017, మంగళవారం

శాతకర్ణిలో హాట్ యాంకర్ కూడా



గౌతమిపుత్ర శాతకర్ణిలో హీరోయిన్ గా.. శాతకర్ణి భార్య వశిష్టీ దేవిగా శ్రియా శరణ్ నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ మూవీలో హాట్ యాంకర్ అనసూయకు ప్లేస్ ఎలా.. ఇలాంటి చారిత్రక చిత్రంలో ఆమె పాత్ర ఏంటి అనే అనుమానాలు వస్తున్నాయా? బాలయ్య వందో మూవీలో అనసూయకు కూడా భాగం ఉందన్న మాట నూటికి నూరు పాళ్లు వాస్తవం.

కాకపోతే.. ఈ సినిమాలో ఆమె కనిపించదు. అనసూయ జస్ట్ తన వాయిస్ ను వినిపిస్తుందంతే. గౌతమిపుత్ర శాతకర్ణిలో.. ఇండో-గ్రీక్ యోధురాలు పాత్రను డచ్ మోడల్ ఫరా కరిమి నటించింది. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పాల్సిందిగా.. క్రిష్ అడిగాడు. బాలయ్య వందో సినిమాలో తాను భాగం అయ్యే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడం ఇష్టం లేని అనసూయ.. వెంటనే ఓకే చెప్పేసింది. మూవీలో ఈ పాత్ర 15 నిమిషాల పాటు ఉన్నా.. మూవీని టర్న్ చేసే రోల్ అంటోంది అనసూయ.

నిజానికి అనసూయకు డబ్బింగ్ చెప్పడం కొత్తేం కాదు. వేదం చిత్రంలో దీక్షాసేథ్ కు కూడా అనసూయే డబ్బింగ్ చెప్పిందట. అయితే.. యాంకరింగ్ కెరీర్ లో బిజీగా ఉండడంతో అటువైపు వెళ్లలేదట. కానీ ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి రూపంలో.. బాలయ్య సినిమా కోసం మళ్లీ క్రిష్ నుంచే అభ్యర్ధన వస్తే కాదనలేక పోయానని చెప్పింది అనసూయ.

లేబుళ్లు:

ఖైదీ గురించి బాలయ్య ఏమన్నారంటే..



బాలయ్య న వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకు.. ఇంకా పట్టుమని 36 గంటల టైం ఉందంతే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ స్క్రీనింగ్స్ తో.. విపరీతమైన హైప్ పెరిగిపోతోంది. మరోవైపు శాతకర్ణి మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్స్ ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహం అందిస్తున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య తెగ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేవలం తన సినిమా గురించే కాకుండా.. పోటాపోటీగా రిలీజ్ అవుతున్న మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150పై కూడా స్పందించారు బాలయ్య.

'నాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత ముఖ్యమో.. చిరంజీవికి ఖైదీ నంబర్ 150 కూడా అంతే. రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాలని.. రెండూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి విందు భోజనం కావాలని ఆశిస్తున్నా' అన్నారు బాలకృష్ణ. సంక్రాంతికి రెండు మూడు సినిమాలు పోటీ పడ్డం ఎప్పుడూ జరుగుతుండేదే అని.. ఇందులో కొత్త ఏమీ లేదని.. కాంపిటీషన్ పై సింపుల్ గా తేల్చేశారు నందమూరి బాలకృష్ణ

ఇప్పటికే ఖైదీ నంబర్ 150 ప్రీరిలీజ్ ఈవెంట్లో.. గౌతమిపుత్ర శాతకర్ణి విజయం సాధించాలని.. మంచి సినిమాను ఆదరించాలని చిరు అండ్ టీం విజ్ఞప్తి చేసిన విషయం తెలసిందే. ఇంత పోటీగా సినిమా రిలీజ్ చేసుకుంటూ కూడా.. ఇద్దరి సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్న ఈ ఇద్దరు బడా హీరోలు.. ఏ స్థాయి స్నేహితులో.. ఈ ఇన్సిడెంట్స్ నిరూపించేస్తున్నాయి కదూ.

లేబుళ్లు:

ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ ఖాతాలో మ‌రో కొత్త రికార్డు


టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు 2016 సంవ‌త్స‌రం ఓ రేంజ్ లో కలిసొచ్చింది. ఎన్టీఆర్ గ‌త యేడాది నటించిన ‘నాన్నకి ప్రేమతో’ .. ‘జనతా గ్యారేజ్’ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. నాన్న‌కు ప్రేమ‌తో ఎన్టీఆర్ కేరీర్‌లో ఫ‌స్ట్ టైం రూ.50 కోట్ల షేర్ రాబ‌ట్టిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కితే, జ‌న‌తా గ్యారేజ్ రూ.83 కోట్ల షేర్ రాబ‌ట్టి, ఎన్టీఆర్ కేరీర్‌లోనే ఆల్ టైం హ‌య్య‌స్ట్ షేర్ రాబ‌ట్టిన సినిమాగాను, ఇటు టాలీవుడ్‌లో ఆల్ టైం టాప్‌-3 హ‌య్య‌స్ట్ వ‌సూళ్ల సినిమాగాను రికార్డుల‌కు ఎక్కింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేసిన ‘జనతా గ్యారేజ్’ ఇంకా రికార్డులను దక్కించుకుంటూనే ఉంది. 2016 లో మోస్ట్ వాచ్డ్ తెలుగు మూవీగా అరుదైన ఘనతను ఈ సినిమా దక్కించుకుంది. తెలుగులో ఎక్కువమంది టీవీలో చూసిన చిత్రంగా ‘జనతా గ్యారేజ్’ నిలిచింది.
ఈ విష‌యాన్ని టీవీ ఆడియన్స్ మోనటిరింగ్ ఏజన్సీ అయిన బీ ఏ ఆర్ సీ ఇండియా వారు ఈ విషయాన్ని ప్రకటించారు. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌-నిత్యామీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

లేబుళ్లు:

9, జనవరి 2017, సోమవారం

మహాభారతంపై రాజమౌళి మరోసారి..


మహాభారత కథను తెరకెక్కించడం తన చిరకాల వాంఛ అని మరోసారి నొక్కి వక్కాణించాడు రాజమౌళి. దీంతో పాటు ‘బాహుబలి’కి సంబంధించిన అనుభవాలపై సౌత్ కాంక్లేవ్ 2017 కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జక్కన్న. అక్కడ రాజమౌళి చేసిన కొన్ని ముఖ్యమైన కామెంట్లు ఇవీ..

‘‘సినిమాకు సంబంధించి నేనేదైనా విజువలైజ్ చేస్తే ముందు నాకది ఎగ్జైటింగ్ గా అనిపించాలి. ప్రేక్షకుల సంగతి తర్వాత’’

‘‘30 ఏళ్ల తర్వాత కూడా జనాలు బాహుబలి ప్రభావాన్ని గుర్తుంచుకోవాలన్నది నా కోరిక’’

‘‘ఒక దర్శకుడిగా నా సినిమా విజువల్స్ విషయంలో ఏ ఒక్క సందర్భంలోనూ నేను కాంప్రమైజ్ కాను’’

‘‘మహాభారత కథను ఇంతకుముందెన్నడూ చూడనంత భారీ స్థాయిలో తీయాలన్నది నా చిరకాల వాంఛ’’

‘‘మహాభారత కథలోంచి ఒక పాత్ర తీసుకున్నా.. ఒక ఉపకథను ఎంచుకున్నా అది నన్ను ఎంతగానో కదిలిస్తుంది’’

‘‘ఒరిజినాలిటీ విషయంలో నాకు పెద్దగా క్రెడిట్స్ రావు. అమర్ చిత్ర కథల నుంచే నేను ఎక్కువగా స్ఫూర్తి పొందాను’’

‘‘భాష ఒక బంధనం అని నేనెప్పుడూ భావించను. విజువల్సే సరైన కథను.. ఎమోషన్లను చెబుతాయి’’

‘‘ఫలానా ప్రాంతం వాళ్లు ఫలానా జానర్ సినిమాలే చూస్తారు అనే అభిప్రాయానికి నేను పూర్తి వ్యతిరేకిని’’

‘‘బాహుబలి-2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా ఎగ్జైటింగా ఎదురు చూస్తున్నా’’

‘‘బాహుబలి లాంటి సినిమా చేయడానికి ముందు నా సినిమాలన్నింటి నుంచి నేను ఎంతో నేర్చుకుంటూ వచ్చాను. అవే నన్ను ఇంత భారీ సినిమా తీసేలా చేశాయి’’

లేబుళ్లు: ,

8, జనవరి 2017, ఆదివారం

రానా సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్


జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంతే తప్ప బయటి హీరోలెవ్వరి కోసం మాట సాయం చేయలేదు. తొలిసారి తారక్ ఆ పని చేయబోతున్నట్లు సమాచారం. దగ్గుబాటి రానా కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఘాజీ’ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని తెలిసింది. పీవీపీ సినిమా తెరకెక్కిస్తున్న ‘ఘాజి’ హిందీ.. తెలుగు.. తమిళ భాషల్లో తెరకెక్కింది. హిందీలో ఈ చిత్రానికి లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగు వెర్షన్ కోసం ఎన్టీఆర్ ను సంప్రదించగా అతను ఓకే అన్నట్లు సమాచారం.

ఈ తరం హీరోల్లో డిక్షన్ విషయానికి వస్తే ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. కాబట్టి ‘ఘాజీ’ లాంటి ప్రెస్టీజియస్ మూవీకి అతను వాయిస్ ఇస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించి అతణ్ని సంప్రదించారట. ఎన్టీఆర్ కూడా అభ్యంతర పెట్టకుండా ఒప్పుకున్నాడు. తమిళ వెర్షన్ కోసం సూర్య లేదా ఇంకెవరైనా ప్రముఖ నటుడితో వాయిస్ ఇప్పించాలని ట్రై చేస్తున్నాడు పీవీపీ. ఇండియాలో తెరకెక్కుతున్న తొలి సబ్ మెరైన్ వార్ మూవీ ‘ఘాజీ’. 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అప్పటి పరిస్థితులపై ఓ పుస్తకం రాసిన సంకల్ప్ రెడ్డి అనే కుర్రాడే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఫిబ్రవరిలో 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. రానాతో పాటు ఓంపురి.. తాప్సి ఇందులో కీలక పాత్రలు పోషించారు.

లేబుళ్లు:

బాలయ్య బిడ్డతో పాటు గుర్రంపై నుంచి పడితే..



‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అంత సులువేం కాదు. అందులోనూ ఇలాంటి సినిమాను 79 వర్కింగ్ డేస్ లో పూర్తి చేశారంటూ ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య ఈ వయసులో ఇలాంటి సినిమాను అంత వేగంగా పూర్తి చేయగలిగారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సినిమా కోసం బాలయ్య పడ్డ కష్టం ఎలాంటిదో ఆడియో వేడుకలో క్రిష్ వివరంగా చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయాలు కూడా అయ్యాయట. అందులోనూ ఒక పసిబిడ్డను చేతబట్టుకుని యుద్ధంలో పాల్గొనే సన్నివేశంలో బాలయ్య గుర్రం మీది నుంచి పడ్డాడని.. ఆ సందర్భంగా ఆ బిడ్డకు చిన్న గాయం కూడా కాకుండా బాలయ్య ఎంతో నేర్పుగా వ్యవహరించాడని క్రిష్ వెల్లడించాడు.

‘‘ఓ ఘట్టంలో గౌతమిపుత్ర శాతకర్ణి తన బిడ్డ పులోమావిని తీసుకుని యుద్ధానికి బయల్దేరతాడు. ఆ సన్నివేశాన్ని చిత్రీస్తున్నప్పుడు.. చుట్టూ అగ్నిగోళాలు మండుతూ ఉంటాయి. గుర్రం కాస్త ముందుకెళ్లాక అగ్ని గోళాలు ఒకవైపున మాత్రమే పేలడం మొదలుపెట్టాయి. రెండోవైపు ఆగిపోవడంతో ముందుకెళ్లాల్సిన గుర్రం పక్కకి తిరిగింది. దీంతో బాలకృష్ణ గుర్రం మీది నుంచి పసివాడితో సహా కిందపడిపోయారు. అయినా బిడ్డకు ప్రమాదం జరగకుండా భద్రంగా ఒడిసిపట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా తన గురించి పట్టించుకోకుండా.. ‘బిడ్డకేం కాలేదు కదా..’ అని ఆందోళన చెందారు. కేవలం అర గంట విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగుకి వచ్చేశారు. రెట్టించిన ఉత్సాహంతో యుద్ధ సన్నివేశంలో నటించారు. ఈ సంఘటన మొరాకోలో జరిగింది. ఇదంతా చూసిన విదేశీయులు మీ హీరో రియల్ హీరో అంటూ మెచ్చుకున్నారు’’ అని క్రిష్ తెలిపాడు.

లేబుళ్లు:

7, జనవరి 2017, శనివారం

శాత‌క‌ర్ణి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. సినిమాపై ఉన్న భారీ హైప్ దృష్ట్యా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ బాల‌య్య కేరీర్‌లోనే అత్య‌ధికంగా జ‌రిగింది. బాల‌య్య సినిమాల్లో లెజెండ్ సినిమా మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా రూ.45 కోట్ల షేర్ రాబట్టింది. కానీ శాత‌క‌ర్ణి సినిమాకు ఏకంగా రూ.55 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.
శాత‌క‌ర్ణి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్ :
నైజాం : 9 కోట్లు
సీడెడ్-ఉత్తరాంధ్ర : 12.5 కోట్లు
గుంటూరు-కృష్ణా : 7.7 కోట్లు
ఈస్ట్ : 3.2 కోట్లు
వెస్ట్ : 2.8 కోట్లు
నెల్లూరు : 2 కోట్లు
———————————–
ఏపీ+ తెలంగాణ = 37.2 కోట్లు
———————————–
కర్నాటక : 3.8 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 4 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 1.8 కోట్లు
———————————————-
టోట‌ల్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ 46.8 కోట్లు
———————————————-
ఓవ‌రాల్‌గా శాత‌క‌ర్ణి టోట‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 46.8 కోట్లు జ‌రిగింది. ఇక శాత‌క‌ర్ణి రూ.50 కోట్లు సాధిస్తే బ‌య్య‌ర్లు, నిర్మాత‌లు లాభాల్లోకి వ‌చ్చేస్తారు.ఇక ఈ సినిమాకు వినోద‌ప‌న్ను ఏపీ, తెలంగాణ‌లో మిన‌హాయింపు ఉంది. ఇది కూడా సినిమాకు బాగా క‌లిసి రానుంది. ఓవ‌రాల్‌గా శాత‌క‌ర్ణి రూ.50 కోట్ల షేర్‌, రూ.80 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంది.



లేబుళ్లు:

6, జనవరి 2017, శుక్రవారం

కొత్త కథ తో రాబోతున్న ఎన్టీఆర్



బాబీ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరో గా ఒక చిత్రం రూపొందబోతుంది అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ చిత్రం తో పటు ఎన్టీఆర్ మరొక చిత్రం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు.ఎన్టీఆర్ ఇప్పటివరకు 'టెంపర్' , 'నాన్నకు ప్రేమతో' , 'జనతా గ్యారేజ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.ఇప్పుడు బాబీ దర్శకత్వం లో రాబోతున్న సినిమా తో పటు ఎన్టీఆర్ మరొక చిత్రానికి ఓకే చేసాడు.తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందబోతున్న చిత్రం లో నటించేందుకు ఎన్టీఆర్ ఓకే చేసారు.

దర్శకుడు ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ రెండు చిత్రాల తరువాత ఎన్టీఆర్ విక్రమ్ దర్శకత్వం లో మరొక చిత్రానికి సైన్ చేసాడు.కానీ, విక్రమ్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా లో ఎన్టీఆర్ 2018 లో పాల్గొనబోతున్నారు.

లేబుళ్లు:

2, జనవరి 2017, సోమవారం

శాత‌క‌ర్ణి ఫ‌స్ట్ ప్రీమియ‌ర్ షో ఎక్కడో తెలుసా?


బాల‌య్య 100వ సినిమా శాత‌క‌ర్ణి అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 5న సెన్సార్‌కు రెడీ అవుతోంది. ఇక సినిమా రిలీజ్ డేట్‌గా 12న ఎనౌన్స్ చేసేశారు చిత్ర నిర్మాత‌లు. శాత‌క‌ర్ణి ఆడియో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. ట్రైల‌ర్ కూడా యునానిమ‌స్ హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో నంద‌మూరి అభిమానుల‌తో పాటు సినీ జ‌నాలంద‌రూ శాత‌క‌ర్ణి కోసం వెయిట్ చేస్తున్నారు.
చాలా మంది శాత‌క‌ర్ణి ఫ‌స్ట్ షో చూసేయాల‌ని ఆతృత‌తో కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే శాత‌క‌ర్ణిని ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు ప్ర‌త్యేక షో వేసి చూపించాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. వీరి ఇద్ద‌రికి ఉన్న టైం బిజీ దృష్ట్యా వీరికి వేర్వేరుగానే స్పెష‌ల్ షోలు వేయ‌నున్నారు. ఇక ఓవ‌ర్సీస్‌లో 11నే ప్రీమియ‌ర్ల‌కు ప్లాన్ చేస్తున్నారు.
ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల కంటే ముందుగానే శాత‌క‌ర్ణి స్పెష‌ల్ షో ఏపీ సీఎం చంద్ర‌బాబు కోసం వేస్తున్న‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబు కోసం ముందుగా అమ‌రావ‌తిలో షో వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అమ‌రావ‌తిలో త‌న‌కు సినిమా చూపించ‌మ‌ని చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా చిత్ర‌బృందాన్ని కోర‌డంతో క్రిష్ అండ్ టీమ్ ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది.
శాత‌వాహ‌నుడు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చేసుకుని పాలించారు. ఈ క్ర‌మంలోనే బాబు ఆ సెంటిమెంట్ దృష్ట్యా ఇక్క‌డే శాత‌క‌ర్ణి ప్రీమియ‌ర్ షో చూస్తార‌ట‌. ఇక ఈ షోకు డేట్ అండ్ టైం ఆయ‌నే ఫిక్స్ చేస్తార‌ట‌.

లేబుళ్లు: