ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జగన్ ముద్దు ఫోటో!

కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి, వైసీపీ స్థాపించిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత చేపట్టిన ‘ఓదార్పు యాత్ర’లో చేసిన అరుదైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే… అది నుదుటిపై ముద్దుపెట్టడం. సామాన్య ప్రజానీకానికి చేరువ కావాలనే తలంపుతో, తన దగ్గరకు వచ్చిన వారిని ఆప్యాయంగా అక్కరకు చేర్చుకుని, నుదుటిపై ముద్దాడే విధానం, అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా కరచాలనం, చేతులను తాకడం వంటివి చేస్తుంటారు గానీ, ఇలా ముద్దాడే సందర్భాలు లేకపోవడంతో, జగన్ మార్క్ రాజకీయంగా సదరు సన్నివేశాలు ఆవిర్భవించాయి. అయితే తాజాగా ఇది పతాక స్థాయికి చేరుకున్నట్లుగా కనపడుతోంది. ఇటీవల చేపట్టిన ఓ యాత్రలో జగన్ సాధారణంగా నుదుటిపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా, ఓ బామ్మ అవాక్కయ్యే విధంగా జగన్ నే దగ్గరికి తీసుకుని పెదాలపై ముద్దాడేసింది. పక్కన ఉన్న బాడీ గార్డులు ఆ మామ్మను లాగేయాలని ప్రయత్నించినప్పటికీ, ఉడుం పట్టుతో జగన్ ను దగ్గరకు తీసుకోవడం గమనించదగ్గ విషయం. అటు, ఇటు చేరి ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో పడింది. ఇంకేముంది… ఎవరికీ తోచిన విధంగా వారు ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తూ… సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక్కడ జగన్ స్పెషాలిటీని ప్రత్యేకించి పొగడాల్సిందే. ఆ బామ్మ అవాక్కయ్యే విధంగా ప్రవర్తించినప్పటికీ, జగన్ తన మోములో చిరునవ్వును మాత్రం అలాగే చూపిస్తుండడం విశేషం. జగన్ కే షాక్ ఇచ్చిన సదరు బామ్మ ఒక్క ముద్దుతో ‘టాక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా మారిపోయింది. బహుశా దీని తర్వాత ‘నుదుటిపై ముద్దు’ విషయంలో జగన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పడంలో సందేహం లేదనుకుంటా!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి