నిర్మాత దిల్ రాజు దగ్గర ఓ అద్భుతమైన కథ ఉందట. ఆ కథ రాసింది కేవలం రచయితనేనా...? లేక రచయిత కమ్ డైరెక్టరా? అన్నది తెలియదు కానీ, ఇప్పుడు ఆ కథనే నాగార్జున, నాగచైతన్యతో చేద్దామని ప్రతిపాదనలో ఉన్నాడట దిల్ రాజు. ఈ పాయింట్ నే నాగ ముందు ఉంచాడట. అయితే నిజానికి ఈ పవర్ ఫుల్ కథ బాలయ్య, ఎన్టీఆర్ లకు అయితే సరిగ్గా సరిపోతుందని కథ గురించి తెలిసిన వారు అంటున్న మాట. తండ్రి, కొడుకుల కథ అని, రెండు పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని, అందువలనే బాలయ్య, ఎన్టీఆర్ అయితే బాగుటుందని కథ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. కానీ ఈ కాంబినేషన్ సెట్ అవడం కష్టం కాబట్టి, బాలయ్య- మోక్షజ్ఞ చేసినా బాగుంటుందని టాక్. మరి అంత గొప్ప కథేమిటో కొంతకాలం ఆగితే తెలుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి