లాల్ ఆడియో ఫంక్షన్ కి తారక్ వస్తున్నాడా!




ఏ సినిమా ఆడియో ఫంక్షన్ కు తనను పెద్ద మనసుతో పిలిచినా ఎట్టిపరిస్తితుల్లోనూ మిస్ కాకుండా చూసుకుంటాడు అనే పేరు ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉంది. అయితే ఇదే క్రమంలో మోహన్ లాల్ సినిమా ఆడియో ఫంక్షన్ కి కూడా అటెండ్ అవుతాడా లేదా అన్న విషయంపై మాత్రం మీమాంస ఏర్పడింది. ఇంతకూ మోహన్ లాల్ ఆడియో ఫంక్షన్ ఏమిటి అనేకదా ప్రశ్న!

విషయానికొస్తే… జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ – మోహన్ లాల్ తో కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని చెబుతుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మలయాలంలో మాత్రం భారీ ప్రమోషన్ కి నోచుకోక అనుకున్న స్థాయిలో ఆడలేదు! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా మళయాలంలో మోహన్ లాల్ హిట్ సినిమా “ఒప్పం” తెలుగులో “కనుపాప” గా విడుదల కానుంది.

అయితే.. ఈ సినిమాకు సంబందించిన ఆడియో ఫంక్షన్ ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనుందని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ పాటల వేడుకకు జూనియర్ ని చీఫ్ గెస్ట్ గా రప్పించాలని మోహన్ లాల్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో తారక్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేరా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనే చెప్పాలి! తారక్ ను పిలవాలే కానీ.. ఏమాత్రం అవకాశం ఉన్నా సినిమా కార్యక్రమాలకు రాకుండా ఉండరనేది అభిమానుల వాదన!!

కామెంట్‌లు