Telugu Cinema
Stay updated with the freshest Telugu news, Tollywood movie buzz, and political insights. Your go-to source for all things Telugu cinema and current affairs.
13, అక్టోబర్ 2017, శుక్రవారం
10, అక్టోబర్ 2017, మంగళవారం
‘జై’ తొక్కుడుకు దద్దరిల్లిన యూట్యూబ్..!!
'టెంపర్’ సినిమా దగ్గరనుంచి యూట్యూబ్ మీద దండయాత్ర ప్రారంభించిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్.. సినిమా సినిమాకి సరికొత్త మైల్‌స్టోన్స్ క్రియేట్ చేస్తూ తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ల టీజర్, ట్రైలర్స్‌తో వరుసగా 5 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసి.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ‘జై లవకుశ’తో టాలీవుడ్లోనే ఎవ్వరూ సాధించని తిరుగులేని రికార్డ్‌ని తారక్ సొంతం చేసుకున్నాడు.
చేసిన టీజర్‌కి ఏ రేంజులో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అతి తక్కువ సమయంలోనే 1M, 5M, 10M (M-మిలియన్) మార్కుల్ని క్రాస్ చేసేసి.. ఆ టీజర్ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ టీజర్ మరో రేర్ ఫీట్ అందుకుంది. ఏకంగా 19 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసేసింది. తెలుగులో ఏ సినిమా టీజర్ ఈ ఘనత సాధించలేదు. నవయుగ రావణుడిగా తారక్ తన నటవిశ్వరూపం చూపించడంతో నెటిజన్లు ఆ వీడియోకి ఫిదా అయిపోయి ఎగబడటంతో.. ఆ టీజర్ ఇలా యూట్యూబ్ మీద దండయాత్ర చేసి చరిత్ర సృష్టించింది. ఇక ఫీట్ అందుకున్న తొలి తెలుగు హీరోగా తారక్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇదిలావుండగా.. ఈ చిత్రం ఇటు వసూళ్ల పరంగానూ ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద 16 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.131 కోట్లు గ్రాస్, రూ.77 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. విశేషం ఏమిటంటే.. బరిలో వున్న ‘స్పైడర్’, ‘మహానుభావుడు’ సినిమాలకంటే అత్యధిక వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది.
లేబుళ్లు: Jr NTR news
పవన్ కళ్యాణ్ కు కొడుకు పుట్టాడు
తన మాజీ భార్య రేణు దేశాయ్ ద్వారా పవన్ కళ్యాణ్ కు ఆల్రెడీ అకీరా మరియు ఆద్య అంటూ ఇద్దరు సంతానం ఉన్నారు. ఆ తరువాత ఆయన ఆస్ర్టేలియాకు చెందిన రష్యన్ వనిత అన్నా లెజినోవాను పెళ్ళిచేసుకున్నారు పవన్. ఈ జోడీకి ఆల్రెడీ పొలేనా అనే మూడేళ్ల కూతురు ఉంది. ఈ మధ్యన ఈ పిల్ల పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల దగ్గర కూడా కనిపిస్తోంది. అలాగే అన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంట జరిగే ఫంక్షన్లలో దర్శమిస్తున్నారు. ఇప్పుడు వీరికి ఒక మగబిడ్డ జన్మించడం మెగా కుటుంబంలో మరో వేడుకలా మారిందనే చెప్పాలి.
ఇక సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందుతున్న ''అజ్ఞాతవాసి'' షూటింగులో ఉన్నారు. త్వరలోనే ఆయన పాటల షూటింగ్ నిమిత్తం యురోప్ వెళుతున్నారు.
లేబుళ్లు: Paean kalyan son
శృతి హాసన్ ఇజ్జత్ తీసిన హీరో
అందాల భామ శ్రుతి హాసన్ ఇజ్జత్ తీసిపడేసాడు కన్నడ హీరో జగ్గేష్. శ్రుతి హాసన్ అసలు అందంగా ఉండదని , మేకప్ తీసేస్తే ఆమెని చూసి జడుసుకోవడం ఖాయమని అంత చండాలంగా ఉంటుందని ఆమెని మించిన అందగత్తెలు కర్ణాటకలో చాలామంది ఉన్నారని కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా శ్రుతి హాసన్ లాంటి పొగరుఉన్న వాళ్ల కోసం వెంటపడటం మా కన్నడ చిత్ర దర్శక నిర్మాతల పొరపాటు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రుతి హాసన్ ఇజ్జత్ తీసేసాడు జగ్గేష్.
ఈ హీరో కి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా........ కన్నడ సినిమాలో శ్రుతి హాసన్ ని హీరోయిన్ గా ఎంపిక చేశామని నిర్మాతలు ప్రకటించగా వెంటనే స్పందించి న శ్రుతి నేను ఏ కన్నడ సినిమాలో కూడా నటించడం లేదు అంటూ ట్వీట్ చేయడమే ఈ వివాదానికి కారణం. అసలే సినిమాలు లేని శ్రుతి వస్తున్న అవకాశాలను వదులుకుంటుండగా , శ్రుతి హాసన్ ట్వీట్ తో రగిలిపోయిన జగ్గేష్ శ్రుతి ని మించిన అందగత్తె లు కర్ణాటక లో చాలామంది ఉన్నారని .....అసలు శ్రుతి ని మేకప్ లేకుండా చూడలేమని అతిగా మాట్లాడాడు జగ్గేష్.
లేబుళ్లు: Telugu gossips
6, అక్టోబర్ 2017, శుక్రవారం
లీకైన పిక్ పై బతిమాలుతున్న కొరటాల..
దర్శకుడు కొరటాల శివ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఒక సిట్యుయేషన్ డిఫరెంట్ యాంగిల్ నుంచి చూడగలగడమే కాదు.. చూపిస్తాడు కూడా. గతంలో ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ కు రీషూట్స్ చేస్తున్నారనే టాక్ వచ్చినపుడు.. ఏ సినిమాకి అయినా రీషూట్ చేస్తున్నారంటే.. అది మంచి విషయమేనంటూ.. జనాల ఆలోచన యాంగిల్ మార్చేశాడు.
ఇప్పుడు అదే కొరటాల శివ ఒక విషయంలో డిస్టర్బ్ అయాడు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న భరత్ అనే నేను మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి మహేష్ బాబు స్టిల్ ఒకటి ఆన్ లైన్ లో లీక్ అయింది. ఇది కొరటాలను బాగా డిస్టర్బ్ చేసింది. దయచేసి ఆన్ లైన్ లో ఎవరూ ఈ ఫోటోను తిరిగి షేర్ చేయవద్దని.. అభిమానులు కూడా ఇది పక్కాగా ఫాలో కావాలని విన్నవించాడు. మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు తాము ఎంతో శ్రమిస్తున్నట్లుగా చెప్పిన కొరటాల.. లీక్ విషయంలో జనాలను బాగానే బతిమిలాడుకున్నాడు. ప్రస్తుతం ఈ లీక్ ఎక్కడి నుంచి జరిగిందనే విషయంపై టీం మల్లగుల్లాలు పడుతోంది.
ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలుసుకుంటే.. ఫ్యూచర్ లో అడ్డుకట్ట వేయవచ్చని వారి ఆలోచన. ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ చిన్నపాటి లింక్ దొరికితే డొంకంతా కదిల్చేసే ఆన్ లైన్ మీడియా రోజుల్లో.. ఇలా ఒక లీక్ ను ఇకపై షేర్ చేయకండి అని కొరటాల అడగడం విచిత్రమే కానీ.. దీన్ని పాటించే వాళ్లు ఎవరైనా ఉంటారా అన్నదే అసలు పాయింట్.





