12, నవంబర్ 2017, ఆదివారం

బాబుల కోసం స్వాతి కష్టపడుతోంది


టాలీవుడ్ బుల్లి తెర నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు వచ్చిన వారిలో కలర్స్ స్వాతి అని అందరికి తెలిసిన విషయమే. తెలుగు హీరోయిన్ అయినా ఇతర భాషల్లో కూడా సినిమాలను బాగానే చేసింది. ఇక తెలుగులో కుర్ర హీరోతో కొన్ని సినిమాల్లో నటించినా పరభాషా నటీనటుల గ్లామర్ షోలు అలాగే నార్త్ భామల డామినేషన్ ఎక్కువైపోవడంతో స్వాతి పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. పైగా అవకాశాల కోసం గ్లామర్ గీతను కూడా ఎప్పుడు దాటలేదు. కేవలం తనకి వచ్చిన అవకాశాల్లో మంచి సినిమాలను ఎంచుకుంటూ..కెరీర్ ను అలా  నెట్టుకొస్తోంది.

ప్రస్తుతం స్వాతి తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. లండన్ బాబులు అనే సినిమా ప్రమోషన్ కోసం స్వాతి వైజాగ్ లోని కాలేజీలను చుట్టేస్తోంది. రోజుకొక కాలేజ్ ని ఎంచుకొని చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ ని తనదైన శైలిలో చేస్తోందట. అమ్మడికి మాటలతో ఆకట్టుకోవడం కొత్తేమి కాదు. అయితే కొత్త బాబు అయిన హీరోను.. హిట్టు కోసం పరితపిస్తున్న దర్శకుడిని.. అలాగే నిర్మాత మారుతి బాబును నిలబెట్టాలంటే.. ఈ సినిమాకు స్వాతి ప్రమోషన్లే కీలకం. దానికి తగ్గట్లు స్వాతి కూడా వీరికోసం బాగానే కష్టపడుతోంది. 

ఇక లండన్ బాబులు సినిమా విషయనికి వస్తే..తమిళ్  ఆండవన్ కట్టలాయ్ సినిమాకి రీమేక్ గా వస్తోంది. మారుతి నిర్మినించిన ఈ సినిమాకు బి.చిన్నికృష్ణ దర్శకత్వం వహించాడు. అయితే సినిమాను చిత్ర యూనిట్ త్వరలో రిలీజ్ చేయలనుకుంటోంది. స్వాతి తో పాటు రక్షిత్ - ప్రియదర్శి అలాగే కమెడియన్ ధన్ రాజ్ కూడా సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం అందరు కలిసి సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. మరి ఎంత వరకు సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.

లేబుళ్లు:

11, నవంబర్ 2017, శనివారం

ట్రైలర్: ఊరమాస్ బాలకృష్ణుడు



ఎప్పుడూ కాన్సెప్టులూ కాన్సెప్టులూ అంటూ తిరిగే నారా రోహిత్.. చాలా రోజుల తరువాత ఒక నిజమైన కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? తన బాడీని బాగా తగ్గించేసి.. సిక్స్ ప్యాక్ తరహాలో తీర్చిదిద్దేసి.. అప్పుడు మనోడు ఫక్తు మిర్చి మసాలా సినిమా తీస్తే మాత్రం.. వెంటనూ ఊరమాస్ హీరో అయిపోవడం ఖాయం అని ఎప్పటినుండో సినిమా వర్గాలు అంటూనే ఉన్నారు. చూస్తుంటే ఇప్పుడు ''బాలకృష్ణుడు'' సినిమాతో అదే పని చేస్తున్నట్లు ఉన్నాడు. 

పవన్ మల్లెల అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ''బాలకృష్ణుడు'' సినిమాలో ఒక చిలిపి మాస్ హీరోగా నటిస్తున్నాడు నారా రోహిత్. ట్రైలర్ చూస్తే.. రెజీనాతో మనోడు పండించిన రొమాన్స్.. కత్తిలాంటి ఫైట్స్.. అలాగే కమెడియన్ పృధ్వీ కాంబినేషన్లో వచ్చిన సీన్లు అదిరిపోయాయ్. ఊర మాస్ హీరోగా తన స్థాయిని చాటుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో రోహిత్ కామెడీ టైమింగ్ కూడా అదిరింది. అయితే ఇదొక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాపులో సాగే యాక్షన్ కథ. అందుకే ట్రైలర్ చివర్లో శ్రీనివాస్ రెడ్డి వాయిస్ లో.. మంచి ఫ్యాక్షన్ సినిమా చూసి చాలా కాలమైంది అనే లైన్ కూడా సింబాలిక్ గా చెప్పించారు. అయితే అక్కడ మాసిన గెడ్డంలో కృష్ణుడి గెటప్ వేశాడు చూడండి.. అబ్బో రోహిత్ అక్కడ భలే ఉన్నాడు. 


నిర్మాత మహేంద్ర పెట్టిన ఖర్చు.. మణిశర్మ మ్యూజిక్.. సినిమా బాగా ప్లస్సనే చెప్పాలి. ఏ సినిమాలూ లేని టైములో వచ్చేసి.. ఇలాంటి మాస్ సినిమాలతో పెద్ద హిట్టు కొట్టేసే ఛాన్సులు అనేకం ఉంటాయి. చూస్తుంటే రాబోయే రెండు మూడు వారాల్లో రోహిత్ కూడా అదే చేస్తాడేమో అనిపిస్తోంది. 

లేబుళ్లు: ,

5, నవంబర్ 2017, ఆదివారం

'జక్కన్' శిష్యులు...అరడజను అపజయాలు!






బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో జక్కన్న...ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేశాడు. ఏ గురువుకైనా తమ శిష్యులు రాణించినపుడే గొప్ప పేరు వస్తుంది. అయితే రాజమౌళికి మాత్రం ఈ విషయంలో నిరాశే ఎదురవుతోంది. జక్కన్న దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసినవారు మాత్రం తమ గురువు పేరు నిలబెట్టలేకపోతున్నారు. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు డైరెక్టర్లుగా మారి తీసిన 6 సినిమాలు డిజాస్టర్లయ్యాయి. ఈ విషయం రాజమౌళిని కలవరపెడుతోంది. తాజాగా రాజమౌళి శిష్యుడు పళని దర్శకత్వం వహించిన ఏంజెల్ చిత్రం మిక్సీడ్  టాక్ ను సొంతం చేసుకుంది.







ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన పళని...సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఏంజెల్ ను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరఅంత గొప్పగా లేదు . హెబ్బా  పటేల్ లీడ్ రోల్  పోషించిన ఏంజెల్ చిత్రం మిక్సీడ్  టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం కష్టం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా రాజమౌళి శిష్యులు తీసిన కొన్ని సినిమాలు అపజయాన్ని మూటగట్టుకున్నాయి. వి. విజయేంద్రప్రసాద్ కథను అందించిన జాగ్వార్ చిత్రానికి రాజమౌళి అసిస్టెంట్ మహదేవన్ తెరకెక్కించాడు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ ఆ సినిమాతో తెరంగేట్రం చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా గత ఏడాది విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలింది. అదేవిధంగా జక్కన్న అసిస్టెంట్లు....జగదీశ్ తలశిల(లచ్చిందేవికి ఓ లెక్కుంది) త్రికోటి(దిక్కులు చూడకు రామయ్య) డీఎస్ కణ్ణన్(సారాయి వీర్రాజు) కరుణ కుమార్(ద్రోణ) వంటి యువ దర్శకుల తొలి చిత్రాలు భారీ డిజాస్టర్ లు కావడం రాజమౌళిని కలవరపెడుతోంది. మరి రాబోయే కాలంలో జక్కన్న పేరును నిలబెట్టేలా ఆయన శిష్యులు భారీ హిట్ చిత్రాన్ని తెరకెక్కించి గురుదక్షిణ చెల్లిస్తారేమో వేచి చూడాలి!

3, నవంబర్ 2017, శుక్రవారం

బాలయ్య కాస్ట్యూమ్ సెంటిమెంట్


గుడిలో ఉండే పూజరికి ఏ రేంజ్ లో ఆచారాలపై పద్దతులపై సెంటిమెంట్ ఉంటుందో తెలియదు గాని సినిమా ఇండస్ట్రీలో మాత్రం చాలా వరకు సెంటిమెంట్స్ ఉంటాయనే చెప్పాలి. టైటిల్ విషయం నుంచి సినిమా ఎండింగ్ షూటింగ్ వరకు వీలైనంత వరకు సినిమా వాళ్లు సెంటిమెంట్ ని  ఫాలో అవుతారు. మనిషికి ఎదో ఒక నమ్మకం గట్టిగా ఉంటేనే ముందుకు వెళ్లగలడు. సినిమాల్లో పనిచేసేవారు కూడా కొంచెం నమ్మకాల బాటలో నడవకుండా ఉండలేరు. 

ఇక అసలు విషయంలోకి వస్తే టాలీవుడ్ స్టార్ హీరో  బాలకృష్ణ కూడా సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతారు. పద్ధతులను ఆయన అస్సలు మిస్ అవ్వరు. ఆయనకి దైవ భక్తి కూడా చాలా ఎక్కువే అని అందరికి తెలిసిన విషయమే. సెంటిమెంట్స్ విషయంలో అయితే బాలయ్య బాబు ఏ మాత్రం తేడా రానివ్వరు. తేడా వస్తే ఆ రోజు చేసేపని క్యాన్సిల్ చేసుకుంటారట. ముఖ్యంగా బాలయ్య  కాస్ట్యూమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని  తెలుస్తోంది. ప్రతి గురువారం ఆయన కొత్త కాస్ట్యూమ్ ని దరించడానికి అస్సలు ఇష్టపడరట. గత 15 ఏళ్ల నుంచే ఆయన ఈ రూల్ ని మరచిపోకుండా పాటిస్తున్నారాని ఆయన సన్నిహిత కాస్ట్యూమ్ డిజైనర్ ద్వారా తెలిసింది. 

ఆయన టైమ్ టేబుల్ ని కరెక్ట్ గా ఫాలో అవుతారు. షూటింగ్ కి అరగంట ముందే వచ్చి ఆ తర్వాత అవసరమైతే ఎక్కువ సేపు వర్క్ చేయడానికి ఇష్టపడతారట. అయితే ఈ క్రమంలో అనుకోకుండా గురువారం కొత్త కాస్ట్యూమ్ ని ధరిస్తే వెంటనే షూటింగ్ క్యాన్సిల్ అనేస్తారట. మరి ఎమర్జెన్సీ ఉంటే ఎలా సర్ అంటే..అందుకు ఒక సెంటిమెంట్ ఐడియా ని కూడా బాలయ్య పెట్టుకున్నారట. గురువారం వేసుకోవాల్సిన కొత్త కాస్ట్యూమ్ ని బుధవారం రోజు ఇస్తే ఒక అరగంట పాటు వేసుకుంటే అది ఓల్డ్ అయిపోతుంది కదా.. సో ఆ విధంగా బాలయ్య తన గురువారం సెంటిమెంట్ ని క్లియర్ గా ఫాలో అవుతారని తెలుస్తోంది.

అది చూస్తే మహేష్ బాబు కుళ్లుకుంటాడు... ఎన్టీఆర్ లారీ అక్షింతలు చల్లుతాడు...


  • తీయబోయే చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తీస్తున్నారని అనుకున్నారేమోగానీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌ను వాడారు. లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ... ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే 100 రెట్లు ఎక్స్‌టార్డినరీ స్క్రీన్ ప్రెజెన్స్ వుందనీ, ఆయన్ని చూస్తే ప్రిన్స్ మహేష్ బాబు సైతం కుళ్లుకుంటారని ట్వీట్ చేశారు. 




లక్ష్మీస్ వీరగ్రంథంలో వీరగంధం పాత్రలో కేతిరెడ్డి నటిస్తే చిత్రం బ్లాక్‌బస్టర్ ఖాయమవుతుందని వర్మ పేర్కొన్నారు. వీపు సుందరితో కేతిరెడ్డి నటిస్తుంటే దాన్ని చూసి స్వర్గీయ ఎన్టీఆర్ సైతం ఉబ్బితబ్బిబ్బయి ఓ లారీడు అక్షింతలు తీసుకుని వచ్చి ఆయనపై చల్లుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరికను ఓ స్థాయిలో ఎత్తేశారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్రాన్ని వాడుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాహుబలి అనీ, ఆయన చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురుస్తుందని వెల్లడించారు. వ్యవహారం చూస్తుంటే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంపై కుళ్లుకుంటున్నట్లు కనబడటం లేదూ...?