31, ఆగస్టు 2016, బుధవారం

తెలుగమ్మాయికి జాకీచాన్ పక్కన ఛాన్స్?



శోభిత ధూళిపాళ్ల.. ఈ పేరు చూస్తేనే ఈమె తెలుగమ్మాయి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగమ్మాయిలు హీరోయిన్లు కావడానికి ఇష్టపడరని.. వాళ్లకు మొహమాటం ఎక్కువని.. యాక్టింగ్ మీద అంత దృష్టి ఉండదని అంటారు కానీ.. శోభిత అందుకు మినహాయింపు. ఆమెకు నటన మీద ఆసక్తి ఉంది. అందం ఉంది. అనురాగ్ కశ్యప్ లాంటి పెద్ద దర్శకుడిని మెప్పించి.. ‘రమణ్ రాఘవ్ 2.0’లో అవకాశం దక్కించుకున్న శోభిత.. ఆ సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ పక్కన ఆమెకు హీరోయిన్ గా అవకాశం దక్కిందని చర్చించుకుంటోంది బాలీవుడ్.

ఈ మధ్య జాకీ చాన్ ఇండియన్ హీరోయిన్ల మీద బాగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మల్లికా శరావత్ తో ‘ది మిత్’ సినిమా చేసిన జాకీ.. తాజాగా ‘కుంగ్ ఫూ యోగా’లో దిశా పటాని.. అమైరా దస్తూర్ లతో జత కట్టాడు. దీని తర్వాత జాకీ చేయబోయే కొత్త సినిమాకు కూడా ఇండియన్ హీరోయిన్నే కోరుకున్నాడట. ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్లు శోభితతో పాటు తిలోత్తమ అనే మరో అమ్మాయిని కూడా ఆడిషన్ చేయగా.. శోభితనే ఎక్కువ మార్కులు కొట్టేసినట్లు సమాచారం. ఆమెకే ఈ సినిమాలో అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. జాకీ చాన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ తో నటిస్తే శోభిత కెరీరే మారిపోవడం ఖాయం. బాలీవుడ్లోనూ ఆమెకు అవకాశాలు మరింత పెరుగుతాయి. మరి ఆమెకు ఈ అవకాశం కన్ఫమ్ అవుతుందో లేదో చూడాలి.


లేబుళ్లు: , ,

బెంగుళూరు అంతటా ఎన్టీఆర్ గర్జన



అవును జనతా గ్యారేజ్ ఫీవర్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కన్నడ రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఒక రేంజ్ లో ఉంది …దానికి నిదర్శనమే అక్కడ ప్రదర్శితమవుతున్న బెనిఫిట్ షోలు. మాకు అందిన సమాచారం ప్రకారం 16+ ధియేటర్ లలో బెంగుళూరు లో బెనిఫిట్ షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఒకటి రెండు అంటే అనుకోవచ్చు కానీ పదహారు ని మించి అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ తారక్ క్రేజ్ ఏవిధంగా ఉందో.
బళ్లారి లో అయితే ఏకంగా పెద్ద పెద్ద తోరణాలు కట్టేశారు.
బెంగుళూరులో ప్రదర్శితమవుతున్న బెనిఫిట్ షోల వివరాలు మీరు క్రింద చూడవచ్చు.


Janathagarage having Highest Benefits show in bangalore (16+)
Urvashi – 6.05 am
Srinivasa S.G.palya- 6am
Radhakrishna- 7.30am
Chandrodaya- 5am
Tirumala- 5am
Lakshmi- 6am
Venkateshwara- 7am
BHOMIKA- 7am
Sandhya- 4am
Mukunda- 7am
Manasa- 4am
Murali gokula- 7:30am
Sri vajreshawari- 7:30am
Vaishnavi – 7am
Innovative multiplex- 8am
Rajarajeshwari-7.30am
And 2 or 3 theaters to be added.
and all the multiplexes showing at 8.30Am before regular timings.





●Thank u For ur Support NTR Fans

లేబుళ్లు: , ,

30, ఆగస్టు 2016, మంగళవారం

మార్పుకు కారణం చెబుతున్న ఎన్టీఆర్



యంగ్ టైగర్ ఈ మధ్య బాగా మారిపోయాడు. ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు చూస్తుంటేనే ఈ విషయం అర్ధమైపోతుంది. గతంలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉండే జూనియర్.. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడమే కాదు.. వాటితో సూపర్ సక్సెస్ లు కూడా సాధించేస్తున్నాడు. టెంపర్ తో మొదలయ్యి.. నాన్నకు ప్రేమతో భారీ హిట్ తర్వాత.. ఇప్పుడు జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ పై కన్నేసేశాడు. 

మరి ఇంతగా మారిపోవడానికి కారణమేంటంటే... 'మార్పు అనేది ఒక సంఘటన వచ్చేది కాదు. నాన్నకు ప్రేమతో ముందు చాలానే సినిమాలు చేసినా.. అటు కలెక్షన్స్ పరంగాను.. ఇటు యాక్టింగ్ పరంగాను శాటిస్ఫై చేయలేకపోయాయి. నెంబర్ గేమ్స్ లాంటివి ఇష్టం ఉన్నా లేకపోయినా.. అందులోనే ఉన్నపుడు రిసీవ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు చేస్తున్న సినిమాలపై మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా' అంటున్నాడు ఎన్టీఆర్. అలాగే తను చేసే పాత్రలను కలకాలం గుర్తు పెట్టుకోవడం అనేది.. తన ఇష్ట ప్రకారం కంటే.. ఆడియన్స్ టేస్ట్ అనుసరించి ఉంటుందని.. కెరీర్ చివరకు వచ్చే నాటికి.. జనాలు తన సినిమాల్లో ఎన్నింటిని గుర్తు పెట్టుకుంటారో చెప్పలేనని అంటున్నాడు ఎన్టీఆర్.

'యాక్టింగ్ అంటే ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. సినిమాలో ఓ సన్నిహితుడు మరణించే సీన్ ఉంటే.. ఏం ఊహించుకుని యాక్ట్ చేయాలి. రియల్ లైఫ్ లో అలాంటివాటిని ఊహించలేం కదా. గుండె లోతుత్లోంచి నవ్వాలి.. ఏడవాలి అని ఎవరికి నేర్పించగలం' అని ప్రశ్నించిన జూనియర్.. ఓ పరిస్థితిని విని అర్ధం చేసుకుని దాన్ని ప్రదర్శించగలగడమే యాక్టింగ్ అంటే అని చెప్పాడు. 


లేబుళ్లు:

టాలీవుడ్ పాత రికార్డులు “గజగజ”



యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన క్రేజ్ కి తగ్గట్లు ఇప్పటివరకు గర్జించలేదు….సింహాద్రి తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో గర్జించాలి అనుకున్నా అలాంటి కథ ఎన్టీఆర్ కి దొరకలేదు. ఇన్నాళ్ళకి ఆ కోరిక తీరబోతుంది అంటూ జనతాగ్యారేజ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అందరూ.


దానికి తగ్గట్లే ఎన్టీఆర్ తన క్రేజ్ పవర్ ని చూపిస్తూ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యాడు. తనకున్న మాస్ పవర్ ఎలాంటిదో రికార్డులతో చూపిస్తానని చెబుతున్నాడు ఎన్టీఆర్. సోషల్ మీడియాలో అన్ని రికార్డులను తన పేరిట పెట్టుకున్నాడు ఎన్టీఆర్.

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా అలాగే రఫ్ఫాడి౦చాలని చూస్తున్న ఎన్టీఆర్ ని చూసి పాత రికార్డులకి మోత మ్రోగిపోవడం ఖాయమని చెబుతున్నారు.



లేబుళ్లు: ,

జనతా గ్యారేజ్ లో కాంపిటీషన్ లేదు



ఇప్పటివరకు అందరూ ''జనతా గ్యారేజ్'' సినిమాతో ఇతర సినిమాలేవైనా కాంపిటీట్ అవుతాయా అనే విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. కాకపోతే ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంది. అదంతా చూస్తుంటే.. ఒకరికి ఒకరు చాలా కాంపిటీటివ్ అయిపోయే ఛాన్సుంది. ఇలాంటి విషయాల గురించి జనతా టీమ్ అయిన ఎన్టీఆర్.. కొరటాల శివ.. సమంత.. ఏమంటున్నారంటే..

''దొరికిన పాత్రలో పెర్ఫామ్ చేయడానికి బోలెడంత స్కోప్ ఉన్నప్పుడు.. ఇక ఒకరికి ఒకరు మధ్యన కాంపిటీషన్ ఏముంటుంది? మోహన్ లాల్ గారు కంప్లీట్ యాక్టర్ మాత్రమే కాదు.. కంప్లీట్ హ్యుమన్ బీయింగ్ కూడా. ఉన్నదాంట్లో తృప్తి పొందడంలో ఆయన చాలా హ్యాపీ మ్యాన్. అలాగే ఇతర యాక్టర్లందరూ కూడా.. ఎవరికివారు ఇరగదీశారు'' అన్నాడు ఎన్టీఆర్. ఇంతకీ సినిమాలో అసలు ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ క్యాస్టింగ్ ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు కొరటాల శివ సమాధానం చెప్పాడు. ''నేను కథ రాసేటప్పుడే ఇది ఎన్టీఆర్ కు అనుకున్నాను. అలాగే మోహన్ లాల్ పాత్రకు కూడా ఆయన్నే అనుకుని రాశాను. కొచిన్ వెళ్ళి కథ చెప్పగానే ఆయన ఓకే చేశారు. అసలు ఈ రెండు క్యారక్టర్లకూ వేరే ఆల్టర్నేటివ్ అనుకోలేదు'' అంటున్నారు కొరటాల. 

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ టైములో.. ఎన్టీఆర్ మోహన్ లాల్ ను 'లాలెటన్' అని పిలిస్తే.. ఆయనేమో మనోడిని 'అన్నా' అని పిలిచేవారట. ఇదే నాకు అతి పెద్ద షాకింగ్ థింగ్ అంటున్నాడు కొరటాల. సెప్టెంబర్ 1న ''జనతా గ్యారేజ్'' సినిమా ధియేటర్లలోకి వస్తోంది. 


లేబుళ్లు: , ,

యుద్దం మానేసి క్రికెట్ ఆడుతున్న బాహుబలి



ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో యుద్దం సీన్లను మొత్తంగా ముగించేయాలని ప్లాన్ చేశాడు జక్కన్న రాజమౌళి. ఆ తరువాత కొంత టాకీ పార్టు.. కొన్ని ఇతర యాక్షన సన్నివేశాలతో సెప్టెంబర్ నెలాఖరుకు ''బాహుబలిః ది కంక్లూజన్'' షూటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేయాలనేదే ఆలోచనంతా. అయితే చాలాసార్లు వాన దేవుడు జక్కన్న ప్లాన్లకు అంతరాయం కలిగిస్తున్నాడు. 

మొన్నామధ్యన హైదరాబాద్ అంతా మబ్బుల మయం కావడంతో.. ఏకంగా పెద్ద పెద్ద లైట్లతో సన్ లైట్ సృష్టించుకుని మరీ షూటింగ్ కానిచ్చేశారు. ఇప్పుడైతే యుద్దం సీన్లు కాబట్టి.. వాన పడుతుంటే షూటింగ్ కష్టమే. ఈరోజుతో యుద్దం సన్నివేశాలను తీయడం ముగించేయాలి. బాహుబలి 2 క్లయ్ మ్యాక్స్ లో జరిగే యుద్దానికి ఇవాళే ఆఖరి రోజు. అయితే ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో ఫుల్లుగా వాన పడుతుండటంతో.. షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. కాని బాహుబలి 2 టీమ్ మాత్రం.. షూటింగ్ ఆగిపోయినా కూడా.. ఆ వానలో క్రికెట్ ఆడేస్తున్నారు. 

మరి యుద్దం సీన్లు ఎలాగో షూట్ చేయడంలేదు.. కనీసం క్రికెట్ అయినా ఆడాలిగా అంటున్నాడు రాజమౌళి. 2017లో ఏప్రియల్ 28న బాహుబలి 2 రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. సో.. షూటింగ్ ఒకటి అరా లేటైనా కూడా.. టైముకు సినిమాను మాత్రం ఆందించేస్తారట. అది సంగతి. 


లేబుళ్లు: , ,

‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షో టికెట్ రేటు ఎంతో తెలుసా ?



యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ క్రేజు మామూలుగా లేదు. ఇప్పటికే ఈ ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాకేసింది. జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచీ ఈ చిత్రంపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఈ మధ్యనే విడుదలైన పాటలు కూడా బాగుండటం టీజర్ అదరగొట్టడంతో తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తొలిరోజు సినిమా చూడ్డం కంటే... బెనిఫిట్ చూసెయ్యాలన్న ఆరాటంతో అభిమానులు ఆత్రంగా ఉన్నారు. 31వ తేదీ అర్ధరాత్రి 1 గంటకూ - 4 గంటలకూ... రెండు బెనిఫిట్ షోలు వేసేందుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరిగిపోయాయి. చాలాచోట్ల టిక్కెట్లు అమ్మకాలు కూడా అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో తారక్ క్రేజు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. కానీ పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా జనగా గ్యారేజ్ బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు పోటీపడుతుండటం విశేషం.

చెన్నైలో ఎన్టీఆర్ కి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. జనతా గ్యారేజ్ బెనిఫిట్ టిక్కెట్ల కోసం వీరంతా పోటీ పడ్డారు. చెన్నైలోని ఎస్.ఆర్.ఎం. యూనివర్శిటీలో టిక్కెట్లు వేలం వేశారు. తెలుగుదేశం పార్టీ చెన్నై యువసేన విభాగం ఈ టిక్కెట్ల వేలాన్ని నిర్వహించింది. దీన్లో అత్యధికంగా తొలి టికెట్ను రూ. 31000కు ఒక అభిమాని సొంతం చేసుకున్నాడు. రెండో టికెట్ ధర రూ. 17500 పలికింది. మూడో టికెట్ వెల రూ. 13000కు వెళ్లింది. ఇలా అభిమానులు పోటీపడి టిక్కెట్లను సొంతం చేసుకున్నారు. జనతా గ్యారేజ్ ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ - బాహుబలిని దాటేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు.



లేబుళ్లు: ,

దేవుడా!! కబాలి డైరక్టర్ తో మళ్ళీ రజనీ



కబాలి.. రీసెంట్ టైమ్ లో దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. బాలీవుడ్ సినిమాలకు కూడా చేతకాని వీలుకానంత స్థాయిలో హైప్ వచ్చేసింది. ఇదంతా కేవలం ఒకే ఒక టీజర్ చేసిన మాయ. రజినీకాంత్ ని బాషా తర్వాత మరోసారి పవర్ఫుల్ డాన్ గా చూపించబోతున్నారన్న ఒక్క టాక్ తో.. విపరీతమైన అంచనాల మధ్య ధియేటర్లలోకి వచ్చింది కబాలి. తీరా రిజల్ట్ ఏంటో మాత్రం అందరికీ తెలిసిందే. 

ఇప్పుడు కబాలి డైరెక్టర్  పా రంజిత్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ మరో సినిమా చేయనున్నారనే విషయం ఫైనల్ అయిపోయింది. 'వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై మా నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నా'  అంటూ ఓ చిన్న వీడియో షేర్ చేశాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. హీరో సూపర్ స్టార్ రజినీ.. డైరెక్టెడ్ బై పా రంజిత్.. అందులో ఉన్న మ్యాటర్ అదే. స్వయంగా రజినీ అల్లుడు అనౌన్స్ చేశాక డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. రోబో సీక్వెల్ 2.0 తర్వాత సూపర్ స్టార్ చేయబోయే సినిమా పా రంజిత్ తోనే అని ఫిక్స్ అయిపోవచ్చు.

కబాలి లాంటి స్లో నెరేషన్ తో సినిమా ఇచ్చిన రంజిత్ తో మరోసారి రజినీ సినిమా అంటే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ.. కనీసం ఈ మాత్రమైనా అంచనాలు క్రియేట్ చేసి.. వసూళ్లను సీనియర్ డైరెక్టర్లు సాధించలేకపోయారు. కుర్రాడైనా ఈ విషయంలో సక్సెస్ అయిన పా రంజిత్ కే.. రజినీకాంత్ మరోసారి మొగ్గారనే విషయం అర్ధమవుతోంది. అన్నట్లు ఓ మాట చెప్పుకోవాలి.. కబాలి తమిళ్ వెర్షన్ ని హిట్ అనే అనాలి.


లేబుళ్లు: , ,

పక్కన మిల్కీ ఉంటే ఎవరైనా నలుపేలే



మిల్కీ బ్యూటీ తమన్నా తెల్లని పాల నురుగు దేహంతో నిగనిగలాడిపోతూ ఉంటుంది. వరుస ఆఫర్స్ రావడానికి.. టీనేజ్ లోనే క్రేజీ హీరోయిన్ అయిపోవడానికి.. ట్యాలెంట్ కి తోడు.. అమ్మడి స్కిన్ కలర్ కూడా కారణమే. అయితే.. ఇప్పుడీ భామ నల్లనయ్య అని ఫ్యాన్స్ పిలుచుకునే కోలీవుడ్ హీరో విశాల్ తో జత కట్టింది.సూరజ్ దర్శకత్వంలో తెరకెక్తున్న కత్తి సాందాయ్ లో తొలిసారిగా విశాల్- తమన్నాల జంట కనువిందు చేయబోతోంది. తెలుగులో ఒక్కడొచ్చాడు అనే టైటిల్ పై ఈ మూవీ రిలీజ్ కానుండగా.. అటు తమిళ్ తో పాటు.. ఇటు తెలుగులోనూ పబ్లిసిటీ పనులు మొదలుపెట్టేశారు. ఇంకా షూటింగ్ జరుగుతూ ఉండగానే ప్రచారం చేసేస్తుండడం విశేషం.

ఇందులో భాగంగా.. 'నే కొంచెం నలుపులే.. నువ్ కొంచెం తెలుపులే' అంటూ సాగే పాటకు సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. నేను నలుపు అని హీరో పాడేస్తుండడం ఆశ్చర్యకరమే అయినా.. మిల్కీ పక్కన ఎవరైనా నల్లగానే అనిపించేస్తారు లెండి. అంతటి వైట్ బ్యూటీ ఈమె. అందుకే చాలా సార్లు ఈమె ఫేస్ కి కాసింత బ్లాక్ టోన్ వేసి షూటింగ్ చేయాల్సి వస్తుందట. లేకపోతే లైటింగ్ కూడా సెట్ కానంత వైట్ కలర్ లో ఉంటుందీ భామ. అయినాసరే తనకు తానే ఇలా 'నేను నలుపు' అంటూ పాటలు పాడటం విశాల్ కే చెల్లింది. కలరేముందిలే.. విశాల్ చాలా హ్యండ్సమ్ హంక్ అనేది వేరే చెప్పక్కర్లేదు. అందుకే అమ్మాయిల్లో కూడా మనోడికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 


లేబుళ్లు: ,

ఈ డైలాగ్స్ చాలు ‘జనతా గ్యారేజ్ ‘ కుమ్మేయడానికి



ఈ డైలాగ్స్ చాలు ‘జనతా గ్యారేజ్ ‘ కుమ్మేయడానికి


టాలీవుడ్ యంగ్ హీరోల్లో డైలాగ్స్ చెప్పడం లో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అది సినిమాల్లోనైనా , స్టేజి ఫైనేనా ప్రస్తుతం నటిస్తున్న జనతా గ్యారేజ్ కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ బయటకు వచ్చి తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ డైలాగ్స్ విన్న వారు ఇవి చాలు జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేయడానికి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నారు..ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్ వెయ్యండి..

* ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ.. భయం వేస్తే తోడుగా నడిచే నాన్నా లేకపోతే..
ఎలా ఉంటుందో నాకు తెలుసు.. మనిషికి అంతకు మించిన నరకం ఉండదు.

* లక్ష్మణ రేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోడానికి నేను లక్ష్మణుడిని కాదురా..
లక్ష సముద్రాలనైనా దాటి.. ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి దూకే ఆంజినేయుడిని..

* విజయవాడ కృష్ణ బ్యారేజ్‌ను, బెంజ్ సర్కిల్‌లో నా జనతా గ్యారేజ్‌ని ఎవ్వడు టచ్ చేయలేడూ..
చేద్దాం అన్న ఆలోచన వచ్చినా చంపేస్తా…

* అన్న గ్యారేజ్‌లో రిపేర్లే కాదు.. అమ్మాయిల హార్టుల రికవరిలు కూడా చేసేస్తాడు..

* ఈ గ్యారేజ్ జోలికి వస్తే.. ఒక్కొక్కడి బాడీలు కృష్ణ బ్యారేజ్‌లో తేలుతాయి..

♡ సెప్టెంబర్ 1 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


లేబుళ్లు: ,

మధ్యప్రదేశ్‌ కు వెళ్ళిన బాలయ్య.. ఎందుకో తెలుసా ?


నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ కోసం మధ్యప్రదేశ్‌ వెళ్ళారు బలయ్యా. 18 రోజులపాటు అక్కడ షూటింగ్‌ జరుపుతారు. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తదితరులు పాల్గొంటున్నారు.

తెలుగుజాతి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రారాజు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవితం ఆదారంగా ఈ సినిమా రుపొందుతుంది. మొన్న హైద‌రాబాద్‌లో భారీ యుద్ద‌నౌక నౌక ఎసెట్‌ను వేసి యాక్ష‌న్ సన్నీవేశాల‌ను చిత్రీక‌రించారు. అలాగే జార్జియాలో ఈ షెడ్యూల్ లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే స‌న్నివేశాల‌ను 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరించారు. అంత‌కు ముందుకు మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు సీజీ వ‌ర్క్స్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సంక్రాంతి కానుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


లేబుళ్లు: ,

టికెట్ కౌంటర్: గ్యారేజ్ కోసం వెయింటింగ్



చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాకపోవడంతో.. ఈ వారం బాక్సాఫీస్ వెలవెలబోయింది. అప్పటికే విడుదలై అంతో ఇంతో టాక్ తెచ్చుకున్న సినిమాలు తప్ప మిగిలిన వాటికి కాసులు రాలలేదు. పైగా ఈ గురువారం ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ థియేటర్లలోకి వస్తుండడంతో.. రిలీజ్ ల విషయంలో చిన్న నిర్మాతలు కూడా ధైర్యం చేయలేకపోయారు. 

1) పెళ్లిచూపులు: వరుసగా వచ్చిన సినిమాలన్నీ టపా కట్టేస్తుండడంతో.. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అయిన పెళ్లి చూపులు టాప్ రేంజ్ లో నిలబడింది. ఏ సెంటర్లలో ఇప్పటికీ పెళ్లి చూపులు చిత్రానికి ఫుల్స్ పడుతుండడం విశేషం.

2) శ్రీరస్తు శుభమస్తు: ఫ్యామిలీ మూవీ.. గీతా ఆర్ట్స్ నిర్మాణం.. హైప్ పెరగకుండా కంటెంట్ కి తగినట్లుగా పబ్లిసిటీ.. అన్నీ కలిసి శ్రీరస్తు చిత్రాన్ని సక్సెస్ చేశాయి. దాదాపు అన్ని సెంటర్లలోను ఇంకా మంచి షేర్స్ వస్తున్నాయి.

3) 100 డేస్ ఆఫ్ లవ్: నిత్యా మీనన్.. దుల్కర్ సల్మాన్ ల జంట కుర్రకారును బాగానే ఆకట్టుకుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఓకే బంగారం సక్సెస్ సాధించడం.. ప్లస్ పాయింట్. డబ్బింగ్ సినిమా అయినా చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. 

4) బాబు బంగారం: రెండో వారాంతం వరకూ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించిన బాబుబంగారం.. ఇప్పుడు బాగా డల్ అయిపోయాడు. కొన్ని ఏరియాల్లో బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వచ్చినా.. ఎక్కువ ఏరియాల్లో పరిస్థితి దారుణంగానే ఉంది. భారీ నష్టాలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. 

5) ఏ ఫ్లయింగ్ జాట్: టైగర్ ష్రాఫ్ నటించిన ఫ్లయింగ్ జాట్ కు.. విపరీతమైన విమర్శలు దక్కాయి. అయితే.. తొలి వారాంతంలో మల్టీప్లెక్స్ లలో మాత్రం ఈ సినిమా బాగానే ఫేర్ చేసింది. 

మొత్తం మీద ఈ వారం బాక్సాఫీస్ దగ్గర టికెట్ కౌంటర్లు జనతా గ్యారేజ్ కోసం వెయింటింగ్ చేస్తున్నట్లే పరిస్థితి కనిపించింది. 


లేబుళ్లు: , ,

29, ఆగస్టు 2016, సోమవారం

శాతకర్ణి గురించి ఆమె ఎగ్జైట్ అయిపోయింది



గౌతమీపుత్ర శాతకర్ణి కొత్త షెడ్యూల్ ఈ రోజే ఆరంభమవుతోంది. ఈ షెడ్యూల్లోనే అలనాటి బాలీవుడ్ తార హేమమాలిని ‘శాతకర్ణి’ సెట్లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలో ఆమె బాలయ్య తల్లి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమమాలిని చాలా ఎగ్జైట్ అయిపోయింది. ఇలాంటి సినిమాలో తాను నటిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందంటూ ఆమె ట్వీట్లు చేసింది.

‘‘తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో ‘గౌతమి’గా నటిస్తుండటం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. ఇది శాతవాహనుల పాలన నేపథ్యంలో సాగే సినిమా. తొలి శతాబ్దంలో ఇండియా మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన ఆంధ్రా (ప్రస్తుతం తెలంగాణ) రాజు శాతకర్ణి గురించి స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన తల్లి స్ఫూర్తితోనే శాతకర్ణి ఇదంతా సాధించినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి తల్లి పాత్రలో నేను కనిపించబోతున్నాను’’ అని హేమమాలిని ట్విట్టర్లో పేర్కొంది.

ఇక ఈ సినిమాలో హేమమాలినితో పాటు హాలీవుడ్ స్థాయిలో మంచి గుర్తింపున్న బాలీవుడ్ నటుడు కబీర్ బేడి విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. బాలయ్య సరసన శ్రియ కథానాయికగా నటిస్తుండగా.. ఆయన తనయుడు నందమూరి మోక్షజ్న కూడా ఓ చిన్న పాత్రలో తళుక్కుమంటాడని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు క్రిష్.


లేబుళ్లు: ,

రిలయన్స్ దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్



జియో పేరుతో 4జీ సేవల మార్కెట్ లోకి వస్తూనే కలకలం రేకెత్తిస్తున్న రిలయన్స్ దెబ్బకు బడా సంస్థలు దిగివస్తున్నాయి. మొబైల్ సేవల రంగంలో ప్రథమ స్థానంలో ఉండటమే కాదు.. చార్జీల వసూళ్లలో కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తుందనే ఆరోపణ ఉన్న ఎయిర్ టెల్ తాజాగా తన దూకుడు తగ్గించుకుంది. రిలయెన్స్ జియో ఫ్రీ ఆయుధాన్ని తట్టుకునేందుకు తమ కస్టమర్లకు ఎయిర్ టెల్ ఓ  భారీ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.51 కే వన్ జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను ఎయిర్ టెల్ కస్టమర్లకు అందిస్తోంది. రిలయెన్స్ ధాటిని తట్టుకునేందుకు ఇప్పుడీ కొత్త ఆఫర్ తెరమీదకు తెచ్చింది.

అయితే 4జీ డేటాను భారీగా తగ్గించే క్రమంలో కూడా ఎయర్ టెల్ ట్విస్ట్ మొదలుపెట్టింది. ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకున్న వారికి ఈ స్వల్ప నూతన ప్లాన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రూ.1498 ప్లాన్ లో 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు. 12 నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది. మరో ఆసక్తికరమైన ఆఫర్ ను కూడా ఎయిర్ టెల్ ప్రకటించింది. రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు


లేబుళ్లు: ,

గోపీచంద్ కొత్తలుక్ ఇదేనా ?



హీరో గోపీచంద్ మాంఛి జోరుమీదున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన “ఆక్సీజన్” రిలీజ్ కి రెడీగా ఉంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు గోపీ. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరో గా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

హీరోల పవర్ చూపించడంలో సంపత్ నందిని ప్రత్యేక శైలి. తాజా చిత్రంలోనూ గోపీచంద్ ని సరికొత్త లుక్ లో చూపించబోతున్నాడంట. ఈ మధ్య సాఫ్ట్ గా కనిపించిన గోపీచంద్ ని గెడ్డంతో ఊరమాస్ గా చూపించబోతున్నట్టు వినికిడి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ ని తెరకెక్కించే పయత్నంలో ఉన్నాడు సంపత్. మొత్తానికి.. కొత్తలుక్ గోపీచంద్ పవర్ చూపించబోతున్నాడన్న మాట.


లేబుళ్లు:

‘జనతా గ్యారేజ్’ కి ఆ నలుగురే హైలైట్..



ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా భారీ థియేటర్స్ లలో తెలుగు, తమిళం, మలయాళ భాషలలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

ప్రధానంగా ఈ చిత్రానికి ఆ నలుగురు హైలైట్ అని తెలుస్తుంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే..మొదట ఎన్టీఆర్..టెంపర్ , నాన్నకు ప్రేమతో వంటి వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రం లో సరికొత్తగా కనిపిస్తుండడం. అలాగే మిర్చి , శ్రీమంతుడు వంటి చిత్రాలతో తన సత్తా ఏంటో చూపించడమే కాదు సోషల్ మెసేజ్ కథ ను కమర్షిల్ చిత్రంగా కూడా తీయచ్చని తెలిపిన కొరటాల శివ.

ఇక మూడో వ్యక్తి మోహన్ లాల్. చాల కాలం తర్వాత మోహన్ లాల్ తెలుగు చిత్రం లో కనిపించడం , అలాగే సొంత డబ్బింగ్ చెప్పడం హైలైట్. మలయాళం లో మోహన్ లాల్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు , ఇప్పుడు జనతా లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండడం తో మలయాళం లో ఎన్టీఆర్ కు ప్లస్ కానుంది.

ఇక చివరగా దేవి శ్రీ..ఎన్టీఆర్ కు ఇటు కొరటాల కు వీరిద్దరికి దేవి శ్రీ హిట్ కాంబినేషన్ అని అందరి తెలుసు. తన మ్యాజిక్ మ్యూజిక్ తో జనతా విడుదల కు ముందే సూపర్ హిట్ చేసి తన రాకింగ్ మ్యూజిక్ ఏంటో మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించాడు. ఇలా మొత్తం ఈ నలుగురు సినిమాకు నాల్గు పిల్లర్లు గా చెప్పవచ్చు.


లేబుళ్లు: ,

3 మిలియన్ డాలర్ల ఫై కన్నేసిన ఎన్టీఆర్ !



ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ తో సినిమా కు భారీగా అంచనాలు పెంచిసిన ఎన్టీఆర్ , ఇప్పుడు ప్రీమియర్ షోల విషయంలో అంచనాలు పెంచేస్తున్నాడు. సెప్టెంబర్ 1 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31 న అత్యధిక థియేటర్స్ లలో ప్రీమియర్ షో లు వేసి రికార్డ్స్ బ్రేక్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.

ఓవర్సీస్ లలో టెంపర్ తో 1 మిలియన్ , నాన్నకు ప్రేమతో 2.5 మిలియన్ మార్క్ కొట్టేసిన ఎన్టీఆర్ , జనతా తో 3 మిలియన్ డాలర్ల ను అధిగమించాలని చూస్తున్నాడట. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ల సైతం ఎన్టీఆర్ ఆ మార్క్ దాటేస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారట. తెలుగు , తమిళ్ , మలయాళం భాషలలో రిలీజ్ కాబోతుండడం తో ఓవర్సీస్ కలెక్షన్స్ ఇప్పటివరకు ఎన్టీఆర్ చిత్రాలు వసూళ్లు చేసినవాటికి రెట్టింపు ఉంటాయని చెపుతున్నారు. మరి ఎన్టీఆర్ ఏ మేరకు వసూళ్లు సాధిస్తాడా చూడాలి.


లేబుళ్లు: ,

నాగ్ బర్త్ డే.. స్వీటీ ఇచ్చిన గిఫ్ట్ ఎంటో తెలుసా ?



ముద్దుగుమ్మ అనుష్క, నాగార్జునల బంధం ప్రత్యేకమైనది అని చెబుతుంటారు. నాగ్ అంటే స్వీటీకి చచ్చేంత ఇష్టం. ఆయన ప్రతి సినిమాలోనూ పైసా కూడా తీసుకోకుండా నటించేందుకు కూడా స్వీటీ సిద్ధమే. ఎందుకంటే.. ? స్వీటీకి లైఫ్ ఇచ్చింది నాగే నట. స్వీటీ ఫస్ట్ చిత్రం నాగ్ “సూపర్”తోనే ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వీటీ హాట్ హాట్ గా కనిపించింది. ఇక, అప్పటి నుంచి స్వీటీకి బ్యాక్ బోన్ గా నిలిచాడట నాగ్.

నాగ్-స్వీటీల మధ్య అదేదో ఉందని.. రకరకాలు కథనాలు వచ్చాయి. ఇవేవీ కూడా పట్టించుకొని స్వీటీ.. నాగ్ నాకు చాలా ప్రత్యేకం. నాకు మంచి స్నేహితుడు అని చెబుతూ ఉంటుంది. ఇక, నాగ్ మాత్రం తన ప్రతి సినిమాలో స్వీటీ ఉండాలనే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఊపిరి’ చిత్రంలో స్వీటీ స్పెషల్ రోల్ లో మెరిసింది. నాగ్ తాజా భక్తిరస చిత్రం ‘నమో: వెంకటేశయా’లోనూ కృష్ణమ్మగా కనిపించనుంది స్వీటీ.

అయితే, నాగ్ అంటే మహా ఇష్టపడే స్వీటీ.. నాగ్ ప్రతి పుట్టినరోజుకి సర్పైజ్ గిఫ్ట్ ఇస్తుందట. ఈరోజు ఆగస్ట్ 29 నాగ్ పుట్టినరోజు. మరీ.. ఈసారి.. నాగ్ కి స్వీటి గిఫ్ట్ ఏమీ ఇచ్చిందనే ఆసక్తి నెలకొంది. అదేంటన్నది తెలుసుకోవాలని ఈరోజు సోషల్ మీడియాలో అనుష్క ని తెగ ఫాలో అవుతున్నారు
నెటిజర్లు. ఆ గిఫ్ట్ ఏంటో ఏ ఫేస్ బుక్ నో, ట్విట్టర్ ఖాతా ద్వారానే స్వీటీ చెబుతుందని ఆశపడుతున్నారు. బహుశా.. ఈసారి పర్సనల్ గిఫ్ట్.. అదేనండీ.. చెప్పుకోలేని గిఫ్ట్ ఏమైనా ఇచ్చి ఉంటుందనే గుసగుసలు వినబడుతున్నాయి.


లేబుళ్లు: ,

‘ జనతా గ్యారేజ్ ‘ ప్రీమియర్ షో కోసం వెయిట్ చేస్తున్న స్టార్స్..?



ఇప్పుడు ఎక్కడ చూసిన , ఏ నోటా విన్న ఒకే ఒక మాట అదే జనతా గ్యారేజ్…జనతా గ్యారేజ్..జనతా గ్యారేజ్. అసలు ఈ జనతా గ్యారేజ్ లో ఏముంది అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. కేవలం ఎన్టీఆర్ అభిమానులే కాదు తెలుగు , తమిళ , మలయాళ ఇండస్ట్రీ లోని అగ్ర హీరోలు సైతం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ లోని యాంగ్ హీరోలు ఈ చిత్ర ప్రీమియర్ షో కోసం జనతా టీం తో మాట్లాడడం ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 1 న రిలీజ్ అవుతుండగా ఓ రోజు ముందు అంటే ఆగస్ట్ 31 నాడే ఈ ప్రీమియర్ షో హైదరాబాద్, ఓవర్సీస్ లలో వేయబోతున్నారు. వరుస హిట్స్ తో ఎన్టీఆర్ జోష్ మీద ఉండడం , అలాగే శ్రీమంతుడు చిత్రం తో అందరి చూపు తన ఫై పడేలా మార్క్ సంపాదించుకున్న కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం కావడం తో ఇంకాస్త ఈ సినిమా ఫై అంచనాలు పెంచుకున్నారు.

ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ చిత్ర ప్రీమియర్ షో ను మెగా హీరోలతో పాటు కళ్యాణ్ రామ్ , రాజీవ్ కనకాల , రోలర్ రఘు , వివి వినాయక్ , సుకుమార్ , దిల్ రాజు, దేవి శ్రీ లతో పాటు చిత్రం లో నటించిన నటి నటులు కూడా ఈ షో కు రాబోతున్నారని తెలుస్తుంది.


లేబుళ్లు: , ,

ప‌వ‌న్ కళ్యాణ్ కాళ్లు, చేతులు విరగొట్టి లోపల వేస్తారు



తిరుపతి లో రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన సభ పెట్టి ఏపీ ప్రత్యేక హొదా విషయం ఫై కేంద్రాన్ని , ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగం లో పవన్ చేసిన వాఖ్యల ఫై తెలుగు దేశం ఎంపీలు నిప్పులు చెరుగుతుండగా , తాజాగా టీడీపీ రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంకటేశ్ తీవ్ర‌స్థాయిలో పవన్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప‌వ‌న్ కళ్యాణ్ ఇప్ప‌టికైనా త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాలని, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పవన్ ఏమి చేస్తున్నాడు..నిద్ర పోతున్నాడంటూ విమ‌ర్శించారు. సడెన్ గా నిద్ర లేచి ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాల‌న‌డం ఆయ‌న‌ అవివేకానికి నిద‌ర్శ‌నమ‌ని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కాళ్లు, చేతులు విర‌గ్గొట్టించేవార‌ని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు టిజి. మరి ఈ వాఖ్యల ఫై జనసేన కార్య కర్తలు , పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.


లేబుళ్లు: ,

ఉదయభాను ని ఇన్సల్ట్ చేసిన సింగర్



టాప్ యాంకర్ ఉదయభాను దాదాపు ఓ ఏడాదిగా ఎక్కడా కనిపించకపోయే సరికి.. యూఎస్ వెళ్లిపోయిందని.. యాంకరింగ్ కి దూరమైపోయిందని రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే తను ప్నెగ్నెంట్ కావడంతోనే బ్రేక్ తీసుకన్నట్లు ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు ఇండస్ట్రీలో స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయని.. అయితే పరిశ్రమలో ఫ్రెండ్స్ మాత్రం తక్కువే అంటున్న ఈమె.. ఓ సింగర్ తనను అవమానించిన సంఘటన గురించి వివరించింది.

యూఎస్ లో ఓ ప్రాగ్రామ్ చేసినపుడు.. ఓ ఫేమస్ టాలీవుడ్ సింగర్ ఉదయభానును అవమానించిందట. సదరు సింగర్ ను స్టేజ్ మీదకు పిలిచేటపుడు ఉదయభాను ఆమె గురించి ఎంతో గొప్పగా చెప్పేదట. కానీ ఆఖరి రోజున మాత్రం.. సదరు సింగర్ తనే ముందు స్టేజ్ పైకి వెళ్లి.. తరువాత ఉదయభానును పిలుస్తానని చెప్పిందట.

Download Freeb Ultimate Android app and Earn free Recharge Dowmload now

''అందరినీ స్టేజ్ మీదకు పిలిచినా.. నన్ను మాత్రం పిలువలేదు. చివరకు యాంకర్స్ మీద ఒక కమెడియన్ గ్యాంగ్ ఏదో స్కిట్ వేశారు. అప్పుడు వాళ్ళు నన్ను స్టేజీ మీదకు పిలిచారు. ఇంతలో ఆ సింగర్ తరుపున వచ్చిన ఆర్కెస్ర్టా వారు.. నేను స్టేజెక్కుతుండగా ఒక నీరసం ట్యూన్ ను బ్యాగ్రౌండ్ లో ప్లే చేసి ఇంకా ఇన్సల్ట్ చేశారు'' అని చెప్పింది. ''ఆ సమయంలో నేనే స్టేజ్ పైకి వెళ్లి.. మళ్లీ మళ్లీ నాకు అమెరికా రావాలని లేదు అని చెప్పాను. అంతే కాదు.. మీరే ఇండియా రండి. అక్కడ మీకోసం ఓ వ్యక్తి ఎదురుచూస్తున్నారు. ఆమె మీ అమ్మ'' అని నేను అనడంతో ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. అప్పుడా సింగర్ ''నిన్ను పిలుద్దామనే అనకుంటున్నా.. అంటూ ఏవోవో చెప్పింది. నేను పట్టించుకోలేదు''  అని చెప్పింది ఉదయభాను.

మొత్తానికి ఇటువంటి ఇన్సల్టులో తన లైఫ్ లో చాలానే ఉన్నాయట. అందుకే ఇండస్ర్టీ బయట తనకు చాలామంది స్నేహితులు ఉన్నారు కాని.. ఇండస్ర్టీలో మాత్రం లేరట.


లేబుళ్లు: ,

గ్యారేజ్ కోసం సమంత వచ్చిందోచ్



యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన జనతా గ్యారేజ్ లో సమంతనే మెయిన్ హీరోయిన్. అయినా సరే.. ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు యూనిట్ తో జతయిపోయింది. మొదట దర్శకుడు హీరోతో కలిసి ఓ స్పెషల్ వీడియోలో పాల్గొనిందని టాక్. ఇక ఇవాల్టి నుంచి శామ్స్ స్టైల్ లో ఇండివిడ్యువల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేయనుందని తెలుస్తోంది. తను నటించే సినిమాకి సమంత ప్రచారం చేసిందంటే.. అది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతందనే టాక్ ఉంది.

Download Freeb Ultimate Android app -Earn Unlimited Free recharge App Download now

అయితే.. జనతా గ్రారేజ్ కి పబ్లిసిటీ చేయించే వరకూ చాలా  అలా ఇప్పుడు తనను ఏమడిగినా చెబుతుంది కానీ.. ఒక్క ఆ ఒక్కడి అడక్కు అంతే. ఇకపోతే యజూజువల్ తన గ్లామరస్ ఫ్యాషన్ లుక్ తో సమంత ఇంటర్యూలలో కూడా చితక్కొట్టేస్తోంది. వాటే హాటీ యార్!!


లేబుళ్లు: ,

28, ఆగస్టు 2016, ఆదివారం

ఫొటోస్: ఆదా శర్మ ఫోటో షూట్ , Adah Sharma photoshoot



 





చందమామకు ఎన్టీఆర్ అయినా ఇస్తాడా!?



ఓ ఏడాది క్రితం టాలీవుడ్ చందమామ కాజల్ కెరీర్ బాగా స్లో అయిపోయిందని అనుకుంటున్న టైమ్. ఆ సమయంలో కాజల్ కు రెండు భారీ ఆఫర్స్ వచ్చాయి. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం చేసే ఛాన్స్ అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించే అవకాశం రెండోది. కానీ ఈ రెండు సినిమాలు అమ్మడికి నిరాశే మిగిల్చాయి. 

ఇప్పుడు మళ్లీ ఓ భారీ చిత్రంలో కనిపిస్తోంది కాజల్ అగర్వాల్. మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ లో చిందేసింది కాజల్. కెరీర్ లో మొదటిసారిగా ఐటెమ్ సాంగ్ కూడా చేసేసింది. మాస్ సాంగ్స్ లో కనిపించడం ఈమెకు కొత్తేమీ కాదు కానీ.. ఇలా ఓ ఐటెమ్ భామగా నటించడం మాత్రం కొత్తే. అయితే.. ఈ మూవీ ద్వారా కొత్త ఇమేజ్ తో పాటు సక్సెస్ ని కూడా సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతోంది చందమామ.

పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబులు ఈమె కెరీర్ కి బ్రేక్ ఇవ్వలేకపోయినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా సక్సెస్ అందిస్తాడా అన్నదే ప్రస్తుతానికి అసలైన ప్రశ్న. ఒకవేళ జనతా గ్యారేజ్ మూవీ.. దానిలో అమ్మడి పాట క్లిక్ అయితే మాత్రం.. ఇక చందమామకు మళ్లీ క్రేజ్ స్టార్ట్ అయిపోతుంది. 


లేబుళ్లు: ,

నా అభిమానులు మితి మీరరు : తారక్



తన అభిమానులెవరూ హద్దులు దాటుతారని తాను భావించట్లేదని.. అలా హద్దులు దాటే అభిమానం తనకు వద్దని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. ముందు దేశం.. ఆ తర్వాత కన్నవాళ్లు.. భార్యా పిల్లలు.. శ్రేయోభిలాషులు అని.. వాళ్లందరి తర్వాతే అభిమాన నటుడి గురించి ఆలోచించాలని ఎన్టీఆర్ చెప్పాడు. ఇటీవల అభిమానుల మధ్య గొడవలో వినోద్ రాయల్ అనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హత్యకు గురైన నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

 ‘‘నేను అభిమానులందరికీ చెప్పేదొకటే.. మితిమీరిన అభిమానం వద్దు. అలాంటి అభిమానం చూపించాలంటే చూపించండి. ముందుగా నువ్వు పుట్టిన దేశం.. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులు.. ఆపై భార్య పిల్లలు.. మిమ్మల్ని ప్రేమించే శ్రేయోభిలాషులు.. వీళ్ల మీద అభిమానం చూపించండి. ఆ తరువాత అభిమాన నటుడిని ప్రేమించండి. క్రాస్ రోడ్స్ లోకి వచ్చి ఎవరిని ఎంచుకోవాలి అంటే.. ముందు దేశం.. ఆ తర్వాత తల్లిదండ్రులు.. భార్యాపిల్లలు.. శ్రేయోభిలాషులు.. అభిమాన నటుడు చివరనే ఉంటాడు. నా అభిమానులకే కాదు.. అందరు హీరోల అభిమానులకూ నేను ఇచ్చే సందేశం ఇదే. మా హీరోలందరం ఐక్యంగానే ఉంటాం. మా మధ్య గొడవలకు సంబంధించిన ఎన్ని సంఘటనలున్నాయో చెప్పండి. మరి అభిమానుల్లో ఎందుకీ గొడవలు. అభిమానం సినిమా వరకే ఉంచండి. రెండు గంటల సినిమా విషయంలో ప్రాణాలు తీసుకునేలా గొడవలు అవసరం లేదు. నా అభిమానులెవరూ ఇలా మితిమీరి ప్రవర్తిస్తారని అనుకోను. అలా ప్రవర్తించేవాళ్లు ఎవరైనా ఉంటే నా అభిమానులుగా ఉండొద్దు’’ అని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.


లేబుళ్లు: ,