గోపీచంద్ కొత్తలుక్ ఇదేనా ?



హీరో గోపీచంద్ మాంఛి జోరుమీదున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన “ఆక్సీజన్” రిలీజ్ కి రెడీగా ఉంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు గోపీ. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరో గా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

హీరోల పవర్ చూపించడంలో సంపత్ నందిని ప్రత్యేక శైలి. తాజా చిత్రంలోనూ గోపీచంద్ ని సరికొత్త లుక్ లో చూపించబోతున్నాడంట. ఈ మధ్య సాఫ్ట్ గా కనిపించిన గోపీచంద్ ని గెడ్డంతో ఊరమాస్ గా చూపించబోతున్నట్టు వినికిడి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ ని తెరకెక్కించే పయత్నంలో ఉన్నాడు సంపత్. మొత్తానికి.. కొత్తలుక్ గోపీచంద్ పవర్ చూపించబోతున్నాడన్న మాట.


కామెంట్‌లు