30, ఏప్రిల్ 2017, ఆదివారం

ఎన్టీఆర్ నవరత్న ఆయిల్ యాడ్ ఎవ్రీథింగ్ స్పెషల్

ntr-navaratna-oio


టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రకటనల్లో కనిపించడం కొత్తేమే కాదు. ఎప్పటి నుంచో ఉన్న ఈ ట్రెండ్ ఇప్పుడు కాస్త ఎక్కువైందంతే. కొన్ని బ్రాండ్స్ అయితే.. ఒకే హీరోను తమకు పర్మనెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా కంటిన్యూ చేసేస్తున్నాయి కూడా. అలాంటి వాటిలో ఎన్టీఆర్ చేసే నవరత్న ఆయిల్ బ్రాండ్ కూడా ఒకటి.

యంగ్ టైగర్ పై ఇప్పుడీ కంపెనీ కొత్త యాడ్ రూపొందించింది. గతంలో కూడా జూనియర్ ఈ కంపెనీ ప్రకటనల్లో చేశాడు కానీ.. ఈ సారి రూపొందించిన యాడ్ ఎవ్రీథింగ్ స్పెషల్ గా ఉంది. యాడ్ లో ''కూల్ రాజా''గా దర్శనం ఇవ్వడం నుంచి.. డ్యాన్స్ చేయడం.. పాట పాడడం కూడా తనే చేసేశాడు ఎన్టీఆర్. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. వాటివలనే ఈ యాడ్ కు చాలా కొత్త ఊపు వచ్చేసింది. అంటే ఇటువంటి గెటప్ గతంలో బృందావనం సినిమా కోసం వేశాడు కాని.. అప్పుడు కృష్ణుడుగా చెప్పారు.. ఇప్పుడు మాత్రం కూల్ రాజా అంటున్నారు. అది కథ.

ఇక సినిమాల విషయానికి వస్తే.. జై లవ కుశ చిత్రానికి బ్రేక్ ఇచ్చి బాహుబలి2ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. మే 6 నుంచి జై లవ కుశ కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

లేబుళ్లు:

23, ఏప్రిల్ 2017, ఆదివారం

జై జై జై లవకుశ..!

jai-lavakusa-movie-updates

ఎన్టీఆర్‌ కొంత కాలంగా తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించే కథల్నే ఎంచుకొంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘జై లవకుశ’ కూడా అందులో భాగమే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో ఎన్టీఆర్‌, రాశీ ఖన్నాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులోని ఓ పాత్రలో ఎన్టీఆర్‌ లవకుమార్‌ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో సందడి చేస్తారని సమాచారం. మరో పాత్రలో ఓ ప్రత్యేకమైన వేషధారణతో కనిపించనున్నారు.

ఆ పాత్ర కోసం విదేశీ సాంకేతిక నిపుణుల సహాయం కూడా తీసుకొంటున్నారు. మిగిలిన ఆ మూడో పాత్ర ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవలే టైటిల్‌ లోగోని విడుదల చేశారు. ఆ లోగోతోనే చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూచాయగా సంకేతాలు పంపారు. మే నెలలో గుజరాత్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.


బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘జై లవ కుశ’ షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందులో ఒక కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నాతో ఎన్టీఆర్ పెళ్లి జరగనుంది. ఇందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను వేదికగా చేసుకున్నారు. ఇక్కడి దేవాలయం షూటింగులకు కూడా ప్రసిద్ధి. తరచుగా అక్కడ తెలుగు సినిమాల షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సిటీకి దూరంగా ఏ హడావుడి లేకుండా షూటింగ్ చేసుకోవడానికి వీలుంటుంది ఇక్కడ.

ఆలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చేయడానికి చిలుకూరు దేవాలయాన్ని మంచి వేదికగా భావిస్తారు సినిమా వాళ్లు. ఇప్పుడక్కడ ‘జై లవ కుశ’లోని పెళ్లి సన్నివేశం తీస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రకు రాశి జోడీగా నటిస్తోంది. మరో పాత్రకు నివేదా థామస్ కథానాయిక. మూడో పాత్రకు హీరోయిన్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ఈ సినిమాలో ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి హీరో ఫ్రెండుగా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

లేబుళ్లు:

18, ఏప్రిల్ 2017, మంగళవారం

జక్కన్నకు షాక్.. వెయ్యి కోట్లతో వేరే మహాభారతం

sharook-khan-mahabaratham


మహాభారతం.. రాజమౌళి కలల సినిమా. ఎప్పటికైనా భారతీయ వెండితెరపై ఎవ్వరూ చూపించని విధంగా మహాభారతాన్ని ఆవిష్కరించాలని కలలు కంటున్నాడు రాజమౌళి. ఐతే ఈ సినిమా ఎప్పుడు అని అడిగితే మాత్రం.. నాకింకా అనుభవం రాలేదు.. పదేళ్ల తర్వాత చూద్దాం అంటున్నాడు జక్కన్న. గత కొన్నేళ్లుగా ఇదే మాట అంటున్నాడు. ఈ మధ్య కూడా అదే చెప్పాడు. ఐతే జక్కన్న ఈ మాటలు చెబుతుండగానే.. మరోవైపు వేరే మహాభారతాలకు రంగం సిద్ధమైపోతోంది. షారుఖ్ ఖాన్ ఓ విదేశీ సంస్థతో కలిసి ‘మహాభారతం’ సినిమా తీసే ఆలోచన చేస్తుండగా.. ఈలోపే యూఈఏకి చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ వచ్చే ఏడాదే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది.

రూ.1000 కోట్లతో ‘మహాభారతం’ సినిమాను తెరకెక్కించనున్నట్లు నిర్మాత బీఆర్ శెట్టి అధికారికంగా ప్రకటించడం విశేషం. ఈ చిత్రాన్ని 2018 సెప్టెంబర్లో మొదలుపెడతారట. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2020లో విడుదలవుతుంది. 90 రోజుల వ్యవధిలో రెండు సినిమాలూ విడుదలవుతాయి. శ్రీకుమార్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. భీష్ముడి దృక్కోణంలో మహాభారతం ఆధారంగా ‘రండమూలం’ అనే నవల రాసిన వాసుదేవ్ మీనన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చనున్నాడు. భారతీయ ప్రముఖ నటీనటులతో పాటు కొందరు హాలీవుడ్ యాక్టర్స్ ను కూడా ఈ సినిమాలో నటింపజేస్తారట. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తారట. హిందీ.. తమిళం.. మలయాళం.. తెలుగు.. ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం పలు భారతీయ భాషల్లోనూ అనువాదమవుతుందని వెల్లడించారు. మరి ఇంత భారీగా ఓ మహాభారతం తెరకెక్కాక మళ్లీ జక్కన్న మహాభారతం ఎలా తీస్తాడు.. ఆ సినిమాకు ప్రేక్షకుల్ని ఎలా ఆకర్షిస్తాడు?

లేబుళ్లు:

12, ఏప్రిల్ 2017, బుధవారం

బాహుబలి 2 చూడాలంటే జేబుకు చిల్లు తప్పదు




మరో రెండు వారాల్లో రానున్న బాహుబలి 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేమికులు. ఆ మేరకు ఫస్ట్ డే నే చూసేందుకు ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు బిజీ గా ఉన్నారు. ఆర్కా మీడియా నిర్మించిన ఈ మూవీ మీద దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ నడుస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. టికెట్ల కోసం అప్పుడే లాబీయింగ్ కూడా కొన్ని చోట్ల మొదలు పెట్టేసారు. ఎన్ని థియేటర్లు వేసినా సరిపోయేలా లేదు పరిస్థితి చూస్తుంటే. స్క్రీన్లు తక్కువగా ఉండే బి సి సెంటర్స్ లో పరిస్థితి అదుపు తప్పడం ఖాయం అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే దానికి తగ్గ సన్నాహాలతో సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఈ సినిమాని బెనిఫిట్ షో లేదా ఫస్ట్ డే చూసే తీరాలి అని దీక్ష బూనిన వాళ్ళు కొట్లలో ఉన్నారు. 27 అర్ధ రాత్రి నుంచే జాతర మొదలు పెట్టేందుకు ప్రభాస్ ఫాన్స్ కూడా సకలం సిద్ధం చేసుకుంటున్నారు. కాని మొదటి రోజు ఈ సినిమాని చూడాలని కలలు కంటున్నా సగటు సినిమా ప్రేమికులు, మధ్య తరగతి జీవులు మాత్రం షాక్ అయ్యే న్యూస్ ఒకటి వచ్చింది.
బాహుబలి 2 విడుదలైన తొలి వారం టికెట్ ధర కౌంటర్ లోనే 200 రూపాయలు ఉండేలా ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా సైడ్ రెవిన్యూ అధికారులకు ఆ మేరకు అనధికార ఉత్తర్వులు అందాయని తెలిసింది. అంటే నేరుగా కౌంటర్ లో కొనాలన్నా భారీ మొత్తం సమర్పించుకోక తప్పదు. కౌంటర్ రేట్ ఇంత ఉంటే ఇక బ్లాకు లో ఎంత ఉండొచ్చో ఊహించుకుంటేనే భయం వేస్తోందని అంటున్నారు ప్రేక్షకులు. కనీసం 700 రూపాయలు మొదలు వెయ్యి, పదిహేను వందల దాకా టికెట్ రేట్ ఎగబాకే అవకాశం ఉంది. ప్రభుత్వం భారీ సినిమాల పట్ల ఉదాసీనంగా ఉండటం వరకు బాగానే ఉందని, అలాగే పెద్ద మాఫియా గా మారిన బ్లాకు టికెట్ల దందా నియంత్రించే చర్యలు చేపడితే బాగుంటుంది అని కోరుతున్నారు ఫాన్స్. మన అమాయకత్వం కాని ఈ గోడు పట్టించుకునేదెవ్వరు. సినిమా కావాలా వెయ్యి కొట్టు లేదా ఒక వారం ఆగు అంటూ నడుపుతున్న తీరు చూస్తుంటే జనం పైరసీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారో అర్థమవుతుంది.

లేబుళ్లు:

రాజమౌళి నెక్ట్స్ మూవీ హీరో ఎవరో తెలుసా ?

SS Rajamouli Upcoming Movie After Baahubali 2





SS Rajamouli Upcoming Movie After Baahubali 2 

లేబుళ్లు:

10, ఏప్రిల్ 2017, సోమవారం

బాల‌య్య‌ను-నాగార్జునను క‌లిపింది ఎవ‌రు..!

"balayya-nagarjuna"


టాలీవుడ్‌లో స్టార్ హీరోలు యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ అక్కినేని నాగార్జున మ‌ధ్య గ‌త రెండేళ్లుగా స‌రైన సంబంధాలు లేవు. వీరిద్ద‌రు ఎప్పుడు ఒకే వేదిక మీద‌కు వ‌స్తారా ? ఎప్పుడు క‌లుస్తారా ? అని టాలీవుడ్ సినీజ‌నాల‌తో పాటు ఈ ఇద్ద‌రు హీరోల అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేశారు. ఎట్ట‌కేల‌కు టీఎస్సార్ అవార్డుల వేడుకలో మాత్రం ఈ ఇద్ద‌రూ క‌లిశారు. చేతులు క‌లిపారు.
నాగ్ అయితే బాల‌య్య‌తో త‌న‌కు విబేధాలు ఉన్నాయ‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని..అవ‌న్నీ పుకార్లే అని కొట్టిప‌డేశాడు.
ఒకప్పుడు తమ తండ్రుల స్నేహం తాలూకు వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి సాగిన నాగ్-బాలయ్యల మధ్య ఎక్కడ తేడా కొట్టిందో ఏమో కానీ.. గత కొన్నేళ్లుగా ఇద్దరూ దూరం దూరంగా ఉంటున్నారు.
వీరిద్ద‌రి విబేధాలు ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే మంచిది కాద‌న్న ఉద్దేశంతో టీఎస్సార్‌తో పాటు మోహ‌న్‌బాబు మ‌రికొంద‌రు సినీపెద్ద‌లు వీరి మ‌ధ్య అపోహలు లేకుండా చేశార‌ట‌. దీంతో నాగ్‌-బాల‌య్య త‌మ విబేధాలు ప‌క్క‌న పెట్టేసి క‌లిసిపోయార‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. అది అస‌లు సంగ‌తి.

లేబుళ్లు: , ,

8, ఏప్రిల్ 2017, శనివారం

ఎన్టీఆర్ కి విలన్ ఎవరో తెలిస్తే షాక్..!

"jai-lava-kusa-movie-news"


తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. గత రెండు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ కి గోల్డెన్ టైమ్ నడుస్తుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యార్ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయం సాధించాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మొదటి సారి ఫుల్ లెన్త్ నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోయే ఎన్టీఆర్ కి మరో విలన్ కూడా ఉన్నాడట.

ఇంతకీ ఆ విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. కన్నడంలో యాక్షన్ హిరోగా పేరు తెచ్చుకున్న దునియా విజయ్. ఈ పేరు చెప్పగానే ‘మాస్తిగుడి’ సినిమా షూటింగ్‌ గుర్తుకు వస్తుంది. అవును ఆ మద్య ‘మాస్తిగుడి’ సినిమా షూటింగ్‌లో ఇద్దరు స్టంట్ మాన్ లు నీటిలో గల్లంతయ్యారు..తర్వాత చనిపోయారు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మాస్తిగుడి సినిమాలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే సీన్‌ను రియల్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేసి రెండు నిండు ప్రాణాలు బలికొన్న విషయంలో దునియా విజయ్, ఆయన సినిమా యూనిట్ పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది.

కట్ చేస్తే ఇప్పుడు బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ కి విలన్ గా దునియా విజయ్ ని తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉందని అంటున్నారు..జనతా గ్యారేజ్ తో మళియాళంలో ఎన్టీఆర్ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కన్నడ చిత్ర రంగంలో కూడా తన సత్తా ఏంటో చాటేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. అదే పరిచయాలతో దునియా విజయ్ ని తన సినిమాలో విలన్ గా నటింప చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైను ఫ్యాన్ మాత్రం ఎన్టీఆర్ కి ఈ నిషేధిత హీరోనే తారక్‌కు దొరికాడా..? అని నందమూరి ఒకింత గుబులు చెందుతున్నారు.

లేబుళ్లు:

5, ఏప్రిల్ 2017, బుధవారం

జూనియర్ ఎన్టీఆర్ ఆన్ టార్గెట్..!

ntr-jailavalusa

బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాపై ట్రేడ్ వర్గాల్లో బజ్ బాగా ఉంది. దీనికి ఒక కారణం సక్సెస్ లలో మునిగి తేలుతున్న జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కాగా, మరొకటి… ఈ సినిమాలో జూనియర్ ఓ డిఫరెంట్ లుక్ లో అద్భుతంగా కనిపించబోతున్నారన్న టాక్ తో ఈ సినిమాపై ఒక్కసారిగా క్రేజ్ ఏర్పడింది. దానికి అనుగుణంగానే ఇటీవల ఓ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి, సోషల్ మీడియాలో సందడి చేసాయి. 
ఇక, టైటిల్ విషయానికి వచ్చే సరికి, ముందుగా అందిన సమాచారం ప్రకారమే… “జై లవకుశ” అనే నామకరణంతో శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పండగ శుభాకాంక్షలు చెప్తూ యంగ్ విడుదల చేసిన మోషన్ పిక్చర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆలాగే ఈ మోషన్ పిక్చర్ ద్వారా తన ఫ్యాన్స్ కు మరో తీపికబురును కూడా అందజేశాడు జూనియర్.

 ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమాను ఎలాంటి ఆలస్యం చేయకుండా, ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం తీసుకోవడంతో అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో అన్న సందేహం సినీ జనాల్లో కూడా వ్యక్తమయ్యింది. అయితే అందులో మరో సందేహానికి ఆస్కారం లేకుండా… 2017 విడుదల అని చిత్ర యూనిట్ స్పష్టం చేయడంతో, ఈ ఏడాదిలోనే యంగ్ టైగర్ ‘ట్రిపుల్ యాక్షన్’ చూపించబోతున్నారు. 


బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాపై ట్రేడ్ వర్గాల్లో బజ్ బాగా ఉంది. దీనికి ఒక కారణం సక్సెస్ లలో మునిగి తేలుతున్న జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కాగా, మరొకటి… ఈ సినిమాలో జూనియర్ ఓ డిఫరెంట్ లుక్ లో అద్భుతంగా కనిపించబోతున్నారన్న టాక్ తో ఈ సినిమాపై ఒక్కసారిగా క్రేజ్ ఏర్పడింది. దానికి అనుగుణంగానే ఇటీవల ఓ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి, సోషల్ మీడియాలో సందడి చేసాయి. ఇక, టైటిల్ విషయానికి వచ్చే సరికి, ముందుగా అందిన సమాచారం ప్రకారమే… “జై లవకుశ” అనే నామకరణంతో శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పండగ శుభాకాంక్షలు చెప్తూ యంగ్ విడుదల చేసిన మోషన్ పిక్చర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆలాగే ఈ మోషన్ పిక్చర్ ద్వారా తన ఫ్యాన్స్ కు మరో తీపికబురును కూడా అందజేశాడు జూనియర్. ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమాను ఎలాంటి ఆలస్యం చేయకుండా, ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం తీసుకోవడంతో అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో అన్న సందేహం సినీ జనాల్లో కూడా వ్యక్తమయ్యింది. అయితే అందులో మరో సందేహానికి ఆస్కారం లేకుండా… 2017 విడుదల అని చిత్ర యూనిట్ స్పష్టం చేయడంతో, ఈ ఏడాదిలోనే యంగ్ టైగర్ ‘ట్రిపుల్ యాక్షన్’ చూపించబోతున్నారు.

లేబుళ్లు:

లేటెస్ట్ “బాహుబలి 2” కధ వింటారా?

baahubali-the-conclusion-story

వినుడు వినుడు ఈ రామాయణ గాధ వినుడీ మనసారా…’ అన్న పాట శ్రీరామనవమి రోజు ప్రతి పందిట్లో వినిపించేదే. అయితే సోషల్ మీడియాకు మాత్రం ‘గాధ’ కాదు గానీ, ఓ ‘కధ’ వచ్చింది. ‘బాహుబలి 2’కు సంబంధించి ప్రతి రెండు, మూడు రోజులకొక కొత్త కధ ప్రత్యక్షం కావడం పరిపాటిగా మారింది. “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్న సమాధానం ‘బాహుబలి కన్ క్లూజన్’ లో లభించనుంది. దీనిపై ఫుల్ క్లారిటీ వుంది. అయితే ఈ లోపున ఎవరి అంచనాలు వారికున్న నేపధ్యంలో… తాజాగా ఓ కధ హల్చల్ చేస్తోంది. మీరూ చదవండి… 

ఒక సందర్భంలో ఎదురైన గిరిజన రాజు కుమార్తె దేవసేనతో బాహుబలి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. రాజ్యకాంక్ష బలంగా ఉన్న భల్లాలదేవ సోదరుడిని అడ్డు తొలగించుకునేందుకు కుయుక్తితో అతని ప్రేమను ప్రోత్సహిస్తాడు. కానీ, మాహిష్మతి సామ్రాజ్యంలోకి వచ్చేందుకు దేవసేన నిరాకరిస్తుంది. దీంతో రాజ్యకాంక్ష లేని బాహుబలి రాజ్యాన్ని వదిలి అడవిబాట పడతాడు. దీంతో బాహుబలిని ప్రోత్సహిస్తున్న భల్లాలదేవ, వారి ప్రేమ గురించి తల్లికి లేనిపోనివి కల్పించి చెబుతుంటాడు. దీంతో రాజ్యాధికారం నెమ్మదిగా హస్తగతం చేసుకుంటాడు. 

అప్పటి నుంచి బాహుబలిని అంతమొందించడమే భల్లాలదేవ లక్ష్యంగా మారిపోతుంది. తను నమ్మిన బంటులతో మాహిష్మతి రాజ్యంలో అరాచకాలు చేయిస్తుంటాడు. అవన్నీ బాహుబలి అండతో ఆటవిక సైన్యం చేస్తోందని ప్రచారం చేయిస్తాడు. దీనిని రాజమాత సులువుగా నమ్మేలా చేస్తాడు. దీంతో బాహుబలిని తక్షణం తన వద్దకు రావాలని ఆర్డర్ వేస్తుంది. అయితే బాహుబలికి ఆ వార్త చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ క్రమంలో మాహిష్మతి సైన్యం భల్లాలదేవ ఆదేశాలతో ఆటవికులపై దాడులు చేస్తుంది. అంతే కాకుండా గిరిజన స్త్రీలను చెరబడుతుంది. 

వీటిని శివగామికి తెలియకుండా భల్లాలదేవ జాగ్రత్తలు తీసుకుంటూ బందిపోటు దాడులు అధికమయ్యాయని, మాహిష్మతి ప్రజలు ప్రశాంతంగా బతకలేకపోతున్నారని శివగామికి నూరిపోస్తుంటాడు. దీంతో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయని భావించిన శివగామి బాహుబలిని బంధించి తేవాలని ఆదేశిస్తుంది. భల్లాలదేవుడు కోరుకున్న ఆదేశాలు రావడంతో బాహుబలిపై దండయాత్రకు బయలు దేరుతాడు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న బాహుబలి, తన భార్య దేవసేనతో కలిసి భల్లాలదేవతో పోరాటానికి బయల్దేరుతాడు.

 ఈ సమయంలో చోటుచేసుకున్న సంభాషణతో భల్లాలదేవుడి వెంట వచ్చిన సైన్యంలో కొంత చీలిక వస్తుంది. దీంతో యుద్ధం ప్రారంభమవుతుంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్న సమయంలో కోటకు కాపలాగా ఉన్న కట్టప్పను రాజమాత యుద్ధభూమికి పంపుతుంది. బాహుబలిని బంధించి లేదా అంతమొందించి రమ్మని ఆదేశిస్తుంది. కట్టప్ప యుద్ధ భూమికి వెళ్లే సమయానికి భల్లాలదేవ ఓటమి అంచున ఉంటాడు.

 దీంతో బాహుబలిని కట్టప్ప వెనక నుంచి బల్లెంతో పొడిచి చంపుతాడు. మరో వైపు దేవసేన జరిగినదంతా రాజమాత శివగామికి చెబుతుంది. దీంతో బాహుబలిని పొట్టన బెట్టుకున్నందుకు క్షోభపడుతుంది. ఈ క్రమంలో కోడలు గర్భవతి అని తెలిసి కోటలోనే ఉండమంటుంది. ప్రసవ సమయంలో అక్కడి వారి కుట్రలు పసిగట్టిన శివగామి బాహుబలి కొడుకుని తీసుకుని పారిపోతుంది. తరువాత జరిగిన కథను ‘బాహుబలి: ద బిగెనింగ్’ సినిమాలో రాజమౌళి చూపించిన సంగతి తెలిసిందే. ఈ కథకు గ్రాఫిక్స్ ను ఊహించుకోగలిగితే సినిమా చూసినట్టే ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమో కాదో గానీ కాస్త సోషల్ మీడియాలో ‘టైం పాస్’కు మాత్రం మస్తుగా ఉపయోగపడుతోంది.

లేబుళ్లు:

బాలయ్యతో మళ్లీ శ్రియ?

sraya-saran-heroine-for-balakrishna-101-movie

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించేందుకు యూనిట్ సిద్ధమవుతున్నారు. తొలి షెడ్యూల్ లో ఒక హీరోయిన్ ముస్కాన్ తో కలిసి యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించాడు దర్శకుడు పూరీ.

ముగ్గురు హీరోయిన్స్ ఉండే ఈ మూవీలో.. ఇప్పుడు రెండో హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. ఒక హీరోయిన్ గా శ్రియా శరణ్ ను ఫిక్స్ చేశారని అంటున్నారు. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో నటించిన శ్రియ.. మంచి నటనతో తన ట్యాలెంట్ చూపించింది. అభినయానికి తన అందాన్ని కూడా కలబోసే శ్రియ.. ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈమెతో మాటామంతీ కూడా పూర్తయ్యాయని.. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయచ్చని అంటున్నారు. 

మూడో హీరోయిన్ విషయంలో కూడా మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చేయనుందట. ఛార్మీ ఈ పాత్రను పోషిస్తుందని ఇప్పటికే ఓ టాక్ ఉంది కానీ.. కొత్తమ్మాయితో చేయించే ప్రయత్నాలు చేస్తున్నాడట పూరీ. హైద్రాబాద్ పరిసరాల్లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో దాదాపు కోటిన్నర ఖర్చుతో నిర్మించిన కాలనీ అండ్ మార్కెట్ సెట్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.


TAGS: Sriya Saran, Balakrishna 101st Movie

లేబుళ్లు:

ఎన్టీఆర్ జై లవ కుశ టైటిల్ లోగో

లేబుళ్లు: ,

భావన ప్రశ్నలకు సమాధానాలేవి?

bhavana-kidnap-news

తనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై హీరోయిన్ భావన నోరు విప్పింది. ఒక సినిమా హీరోయిన్ ను లొకేషన్ కు తీసుకెళ్లే డ్రైవర్ ఇంతటి దారుణానికి తెగబడతాడా? తెగబడగలడా? అంత ధైర్యం అతనికి ఎవరు? ఎలా? ఎక్కడ? ఎప్పుడు? ఇచ్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ డ్రైవర్ వెనుక ఎవరున్నారు? అన్న దానికి తన వద్ద సమాధానం లేదని, తన శత్రువులే ఈ పని చేయించారా? అంటే వారే అనడం లేదని కూడా తెలిపింది. కేవలం డబ్బు కోసమే ఇంత పని చేశారా? అంటే జరిగిన ఘటనకు డబ్బుకు ఎక్కడా పొంతన లేకుండా ఉందని భావన తన మదిలో ఉన్న సందేహాలను చెప్పుకొచ్చింది. జరిగిన ఘటనపై తనకు కొన్న అనుమానాలు, ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయని, వాటికి తనకు సంతృప్తికరమైన సమాధానం కావాలని డిమాండ్ చేసింది. సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారని చెప్పిన భావన, తనకు సినీ పరిశ్రమలో శాశ్వత మిత్రులు, శత్రువులు కూడా ఉన్నారని చెప్పింది. తన శత్రువులకు ఎప్పటికీ తాను క్షమాపణలు చెప్పనని స్పష్టం చేసిన భావన, ఇలా తనకు జరిగినది భవిష్యత్తులో మళ్లీ ఇంకా ఎవరికైనా జరగొచ్చని అభిప్రాయపడింది. ఇవాళ తాను బయటపడి మాట్లాడితేనే, రేపు మరొకరు ధైర్యం చేయగలరని, జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించగలరని తెలిపింది. ఒకవేళ ఇలాంటి ఘటనలు ఎవరికైనా జరిగితే దాచుకోకుండా మాట్లాడాలని సూచనలు చేసింది. నేరస్తులు తప్పించుకునే అవకాశం ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి? అని అడిగింది. తనకు జరిగిన అన్యాయాన్ని దాచి ఉంటే అది కేవలం 10 మందికి మాత్రమే తెలిసి ఉండేదని, అయితే అలా దాయడం వల్ల ఇంత ధైర్యంగా తలెత్తి మాట్లాడే అవకాశం ఉండేది కాదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఏదో తప్పు చేశానన్న భావనతో రాత్రుల్లో నిద్రలేకుండా పట్టి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన దానిపై పోరాడుతున్నాను కనుకే తను ధైర్యంగా నిద్రపోగలుగుతున్నానని భావన చెప్పింది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తనకు పక్కా ప్రణాళిక ఉందని భావన తెలిపింది.


లేబుళ్లు:

హైద్రాబాద్ అమీ చిందులకు రెడీనా

amy-jackson-ipl



మన దేశంలో ఏటేటా జరిగే అతి పెద్ద క్రీడా సంబరం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ లో జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అదిరిపోయే రేంజ్ లో జరగనుండగా.. ప్రతీ ఏడు మాదిరిగానే ఈ సారి కూడా బాలీవుడ్ సెలబ్రిటీ డ్యాన్స్ తో ఈ సారి వేడుకలకు అదిరిపోయే ఆరంభం ఇవ్వనున్నారు.

గతేడాది బాలీవుడ్ కత్తి కత్రినా కైఫ్ తో చిందులు వేయించిన ఐపీఎల్ నిర్వాహకులు ఈసారి హైద్రాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఉత్సవానికి లండన్ బ్యూటీ అమీ జాక్సన్ ను ఆహ్వానించారు. ఇక్కడ పలు బాలీవుడ్ సాంగ్స్ తోపాటు ఐపీఎల్ థీమ్ సాంగ్ కు అదిరిపోయే డ్యాన్సులు చేయనుంది అమీ. 'అమీ జాక్సన్ ఈసారి వేడుకల్లో స్పెషల్ గా పెర్ఫామ్ చేయనుండగా.. పలువురు లోకల్ బ్యూటీస్ కూడా కనిపించనున్నారు' అంటూ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వర్గాలు ధృవీకరించాయి.

ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ ప్రారంభోత్సవంలో పెర్ఫామ్ చేయడం.. తనకు దక్కిన అరుదైన అవకాశం అంటోంది అమీ జాక్సన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రజినీకాంత్ మూవీ.. రోబో సీక్వెల్ 2.0 చిత్రంలో నటిస్తున్న అమీ.. ఎవడు చిత్రంలో మెగాపవర్ స్టార్ తో జోడీ కట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైపోయింది.

లేబుళ్లు:

బయ్యర్లకు ఇప్పుడైనా జ్నానోదయమవుతుందా?

katamarayudu-buyers-loss



ఒక పెద్ద సినిమాకు భారీ నష్టాలు వస్తే.. నిర్మాతలు ఏదో రకంగా వారి నష్టాల్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తుంటారు. నష్టాల్లో కొంత మొత్తాన్ని భరిస్తూ.. రివర్స్ చెల్లింపులు చేయడమో లేదంటే తర్వాతి సినిమాను అదే బయ్యర్లకు కొంచెం తక్కువకు అమ్మడమో చేస్తారు. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దారుణమైన నష్టాలు మిగిల్చినపుడు.. బయ్యర్లను ఆదుకోవడానికే పవన్ అండ్ కో ‘కాటమరాయుడు’ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా మీద హైప్ కూడా పెద్దగా లేకపోవడంతో తక్కువ రేట్లకే సినిమాను అమ్మేలాగా కూడా కనిపించారు. కానీ టీజర్ రిలీజయ్యాక కథ మారిపోయింది. సినిమాకు హైప్ పెరిగిపోయింది. దాంతో పాటే నిర్మాత ఆలోచన మారిపోయింది.

పాత మాటలు పక్కకెళ్లాయి. కొత్తగా బిజినెస్ లెక్కలు తెరమీదికి వచ్చాయి. పవన్ సినిమా అనగానే అత్యుత్సాహం ప్రదర్శించే బయ్యర్లు కూడా వేలం వెర్రిగా సినిమాను కొనేశారు. ఒకరు ఐదు కోట్లంటే.. ఇంకొకరు ఏడు కోట్లని.. మరొకరు పది కోట్లని.. ఇలా పోటీతో ఇష్టానుసారం రేట్లు పెంచేయడంతో ఎప్పట్లాగే భారీ రేట్లకు సినిమాను అమ్మేశారు. గత అనుభావాల దృష్ట్యా కొంచెం టెంప్టేషన్ తగ్గించుకుని ఉంటే.. ‘కాటమరాయుడు’ రేట్లు కొంచెం హద్దుల్లోనే ఉండేవి. కానీ అత్యాశ.. అత్యుత్సాహం ప్రదర్శించడంతో రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు సినిమా చూస్తే కనీసం పాతిక కోట్లు నష్టం మిగిల్చేలా ఉంది. బయ్యర్ల పరిస్థితేంటి అంటే లాభాలొస్తే నిర్మాతకు వాటా ఇస్తారా.. మరి నష్టాలొచ్చినపుడు ఎందుకు అడుగుతారు అన్న లాజిక్ తెరమీదికి వస్తుందేమో.

కానీ అంతంత భారీ నష్టాలు వస్తున్నపుడు.. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేసి భారీగా ఆదాయం మిగుల్చుకున్న నిర్మాత-హీరో కొంతలో కొంతైనా నష్టాల్ని భర్తీ చేయడం.. మానవతా దృక్పథంతో నిండా మునిగిన బయ్యర్లను ఆదుకోవడం సమంజసం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ పవన్-శరత్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు. ‘సర్దార్’ బయ్యర్లను పవన్ పట్టించుకోకపోవడం చూస్తే ‘కాటమరాయుడు’ బయ్యర్ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. చివరగా తేలిందేమంటే.. బయ్యర్లు వాళ్ల జాగ్రత్తలో వాళ్లుండాలి. తేడా వస్తే పవన్ ఉన్నాడులే అన్న భరోసా వదిలేయాలి. అయినకాడికి డబ్బులు పెట్టి వేలం వెర్రిగా సినిమాను కొనే అలవాటు మానుకుని కాస్త జాగ్రత్త పాటిస్తే మంచిది.

లేబుళ్లు:

‘సుచిలీక్స్’ సుచిత్ర దొరికింది!

suchitra-karthik-suchileaks

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో గాయని సుచిత్ర కార్తీక్ సృష్టించిన సంచలనం మరొకరు సృష్టించలేదని చెప్పడంలో సందేహం లేదు. కొన్ని గంటల పాటు కోలీవుడ్ వర్గాలను దడదడలాడించిన సుచిత్ర, ఆ తర్వాత ఒక్కసారిగా కనుమరుగయ్యారు. ట్విట్టర్ ఖాతా డిలీట్ కావడం ఒక వైపు, అదే రోజు ఒక మీడియా సంస్థతో తన భర్త నుండి విడాకులు తీసుకుంటున్నాని చెప్పడం మరో వైపు, సుచిత్ర మానసిక రోగంతో బాధపడుతోందని భర్త కార్తీక్ చెప్పడం ఇంకో వైపు… ఇలా అన్ని చిక్కుముడులతో సుచిత్ర ఎక్కడుందో అన్న ఆచూకి ఎవరికీ అంతుచిక్కలేదు.

దీంతో ఇటీవల సుచిత్ర కిడ్నాప్ కు గురయ్యిందని, దీని వెనుక కోలీవుడ్ ప్రముఖులు కొందరు ఉన్నారని పుకార్లు షికారు చేసాయి. కానీ, తాజాగా సుచిత్ర భర్త కార్తీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సుచిత్ర ప్రత్యక్షం కావడంతో, కిడ్నాప్ కు గురి కాలేదన్న విషయంపై స్పష్టత వచ్చినట్లయ్యింది. ‘తాను కొత్త కామెడీ స్పెషల్ ను రాస్తున్నట్లు, దీనిని 2017 సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నట్లుగా చెప్పిక కార్తీక్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో సుచిత్ర పుస్తకం చదువుతూ కనిపించడంతో సుచిత్ర ట్విస్ట్ వీడినట్లయ్యింది.

ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉంటున్నారని, అంతకుముందు కార్తీక్ చెప్పినట్లుగా వైద్యం నిమిత్తం సుచిత్ర అక్కడే ఉందని, అలాగే విడాకులంటూ చెప్పిన విషయం కూడా ప్రస్తుతం సర్దుమణిగిందని, ఈ చిన్న వీడియో ద్వారా స్పష్టమైంది. దీంతో సుచిత్ర వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే భావించవచ్చు. అయితే సంచలనం సృష్టించిన “సుచిలీక్స్” గురించి ఎదురుచూసిన నెటిజన్లకు మాత్రం నిరుత్సాహం తప్పేలా లేదు. మొత్తానికి ఇక ‘సుచిలీక్స్’కు శుభంకార్డు పడినట్లే డిక్లేర్ చేయవచ్చు.

లేబుళ్లు:

మరో సంచలనానికి సిద్ధమవుతోన్న జియో!

reliance-jio-channels-vs-airtel-tv-channels

టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిల‌య‌న్స్ జియో ఇక డీటీహెచ్ సర్వీసు స్పేస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. 360 పైగా ఛానల్స్ ను జియో టీవీ ఆఫర్ చేయనుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వాటిలో 50 హెచ్‌డీ ఛానల్స్ కూడా ఉండడం మరింత స్పెషల్ గా మారింది. జియో డీటీహెచ్ లకు సంబంధించిన సెటప్ బాక్స్ ఇమేజ్ లు ప్రస్తుతం వెబ్ ప్రపంచంలో సందడి చేస్తున్నాయి. వాటిపై జియో ముద్ర‌లు కూడా ఉండడంతో త్వరలోనే ప్రజల వద్దకు చేరుతున్నాయన్న సమాచారం అందుతోంది.

దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ సెటప్ బాక్స్ ల ఫ్రంట్ లో యూఎస్‌బీ పోర్టు, స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్, హెచ్డీఎంఐ, వీడియో, ఆడియో అవుట్ పుట్ ఉన్నాయి. ప్ర‌స్తుతం ఉన్న సెటప్ బాక్స్‌ ల కంటే ఈ జియో సేవ‌లు ఎంతో అత్యాధునిక‌మైన‌విగా, కేవలం వాయిస్ తోనే ఛానల్స్ ను సెర్చ్ చేసుకోవ‌చ్చ‌ట‌. హీరో, హీరోయిన్ పేరు చెబితే చాలు, వారి సినిమాలు ఏ ఛానల్ లో వస్తాయో తెలిసిపోతుంద‌ట‌. డీటీహెచ్ విభాగంలోనూ త‌క్కువ‌ రేట్ల‌కే సేవ‌లు అందిస్తూ జియో మ‌రో సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈ స‌ర్వీసుల‌ను మొద‌ట‌ ముంబయిలో ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది‌. అలాగే ఈ ఏడాది నాటికి దేశమంతా విస్తరించే విధంగా సంచలన నిర్ణయం త్వరలోనే అధికారికంగా వెలువరించవచ్చని టాక్. ఇక ధర విషయానికి వస్తే… టెలికాం రంగంలో జియో సిమ్ ల మాదిరే, ఈ సెటప్ బాక్స్ కేవలం 450 రూపాయలకు విక్రయించనుండగా, తొలి ఆరు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా మార్కెట్ లో ఉన్న ధరల కంటే 50 శాతం తక్కువకే జియో ఛార్జ్ చేసే విధంగా సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.


లేబుళ్లు:

4, ఏప్రిల్ 2017, మంగళవారం

ఎన్టీఆర్ విశ్వరూపం చూపించేస్తాడా

Ntr-negative-role-ntr27

పాత్రలతో ప్రయోగాలు చేయడం అనే ట్రెండ్ చాలా క్రితం ఉండేది. కుంటి.. గుడ్డి.. మూగ పాత్రలు కూడా లీడ్ రోల్స్ లో వచ్చేవి. కానీ సినిమాలకు కమర్షియల్ హంగులు జోడయ్యాక ఇలాంటివి కనిపించడం మానేశాయి. ఛేంజ్ అంతా హెయిర్ స్టైల్స్.. సిక్స్ ప్యాక్స్.. గెడ్డం లుక్స్ కి పరిమితం అయిపోయింది. మళ్లీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్నట్లుగా కనిపిస్తోంది. 

వయసు మీరిన పాత్రలు చేయడంతో పాటు.. ఏదో ఒక లోపం ఉన్న అంగవికలురుగా నటించేందుకు కూడా వెనకాడ్డం లేదు హీరోలు. సుకుమార్ మూవీలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. అంధగాడులో రాజ్ తరుణ్.. రాజా ది గ్రేట్ లో రవితేజ పూర్తిగా అంధుడి పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ ట్రెండ్ ఎన్టీఆర్ వరకూ పాకేసింది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో జై లవ కుశ అనే చిత్రంలో యంగ్ టైగర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జై పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని.. సినిమాకి ఇదే విలన్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు ఈ పాత్రకు నత్తి కూడా ఉంటుందట. అసలే నెగిటివ్ రోల్.. అందులోనే ఆవేశం చూపించే పాత్ర.. దీనికితోడు మ్యానరిజంగా నత్తిని కూడా తగిలించి.. ఎన్టీఆర్ విశ్వరూపం చూపించేస్తాడని అంటున్నారు.



లేబుళ్లు:

అనసూయ బూతులు అధరహో

anasuya-jockpot-show

విన్నర్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది అనసూయ. అంతకుముందు ఎందరో టాప్ రేంజ్ హీరోయిన్స్ కూడా ఐటెం గర్ల్ ముద్రకు పెద్దగా ఫీలవ్వలేదు కానీ అనసూయ మాత్రం గింజుకుని అల్లాడిపోయింది. ఐటెం అంటే ఏదో పెద్ద బూతు అన్నట్టుగా…ఐటెం గర్ల్ అని పిలవొద్దని తనకు తోచిన నీతులు చెప్పేసింది. జబర్ధస్త్‌తో బుల్లితెరపై కూడా సిల్క్ స్మిత రేంజ్‌లో రెచ్చిపోవచ్చని నిరూపించిన అనసూయ ఐటెం గర్ల్ అంటేనే హర్టయ్యేంత సున్నితంగా మారిపోయిందా అని చాలా మంది భావించారు. కానీ ఆ ఐటెంని కూడా పబ్లిసిటీ కోసం వాడేసుకోవాలనుకుంది అనసూయ. అందుకే తనకు తోచిన మాటలను నీతులుగా చెప్పేసింది. బూతుల మార్గం మాత్రం వదలనని తాజాగా వచ్చిన జెమినీ టీవీ వారి ప్రోగ్రాం ప్రోమో నిరూపించింది.
జెమినీ టీవీ వారి కోసం జాక్ పాట్ అన్న ఓ ప్రోగ్రాం చేస్తోంది అనసూయ. తనను దక్కించుకోవడమే చాలా పెద్ద జాక్ పాట్ అనే రేంజ్‌లో అనసూయ వయ్యారాలు ఉంటాయనుకోండి. ఇప్పుడు తాజా ఎపిసోడ్‌లో అంతకుమంచి అనే రేంజ్‌లో రెచ్చిపోయింది అనసూయ. పేకాట, మందు కాదు….తనను చూస్తే చాలు కిక్ ఎక్కేస్తుంది అని నడుముని ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేసింది. ఆ సీన్ చూస్తే రాఘవేంద్రరావు కూడా టెంప్ట్ అయ్యేలానే ఉంది. ఇక ‘నాది పడుకుంటుంది………నీది లేస్తుంది………’ అంటూ ఓ మేల్ ఆర్టిస్ట్ కొట్టిన డైలాగ్‌కి అనసూయ ఎక్స్‌పెషన్స్…డైలాగ్స్…అబ్బో అధరహో. ఈ దెబ్బతో టీవీ ప్రోగ్రాములను కూడా రికార్డింగ్ డ్యాన్సులు, బూతు పంచాంగాల స్థాయికి దిగజార్చే ప్రయత్నంలో మాత్రం అనసూయ అండ్ కో ఫుల్ బిజీగా ఉన్నారని మాత్రం చెప్పొచ్చు. ఇక ఈ దరిద్రాలను చూసి తరించాలో…తన్ని తరిమేయాలా అన్నది మాత్రం ప్రేక్షకుల ఇష్టం.


లేబుళ్లు:

ఎయిర్‌పోర్ట్‌లో కాలకేయుడికి ఏమి జరిగిందంటే

baahubali-prabhakar

నటుడు ప్రభాకర్ అంటే జనాలు గుర్తు పట్టకపోవచ్చు కానీ.. కాలకేయ ప్రభాకర్ అంటే మాత్రం పరిచయాలు అక్కర్లేదు. ఈ పాత్రతో మామూలు గుర్తింపు సంపాదించలేదు ప్రభాకర్. దీని కంటే ముందు ‘మర్యాద రామన్న’లో బైర్రెడ్డి పాత్రతో ప్రభాకర్‌కు నటుడిగా లైఫ్ ఇచ్చింది కూడా రాజమౌళే. 

అందుకే ఆయన పేరెత్తగానే చాలా ఎమోషనల్ అయిపోతుంటాడు ప్రభాకర్. రాజమౌళి మీద అభిమానంతో తన పెద్ద కొడుక్కి ఆయన పేరు కూడా పెట్టుకున్నాడట ప్రభాకర్. ఇక ఊరూ పేరూ లేని తనకు రాజమౌళి సినిమాల వల్ల వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ అయ్యాడు ప్రభాకర్.

‘‘నటన అంటే ఏంటో తెలియని నాకు ‘మర్యాద రామన్న’ లాంటి సినిమాలో కీలకమైన పాత్ర ఇచ్చి నాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టారు రాజమౌళి గారు. ఇక కాలకేయ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చిపెట్టారు. ఉత్తరాదిన కూడా నాకు గుర్తింపు వచ్చింది. ఎక్కడికెళ్లినా నన్ను ప్రభాకర్ అని పిలవట్లేదు. కాలకేయ వచ్చాడు అంటున్నారు. 

ఓ రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పాస్ పోర్ట్ టైం అయిపోయింది.. అనుమతించమని చెప్పారు. ఐతే నేను సినిమా నటుడినని.. బాహుబలి సినిమాలో కాలకేయుడిగా నటించింది నేనేనని యూట్యూబ్ వీడియో తీసి చూపించాను. వెంటనే అధికారులు నన్ను అనుమతించారు. ఐతే నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏదంటే మాత్రం కాలకేయ కాదు ‘మర్యాద రామన్న’లోని బైర్రెడ్డి పాత్రే అంటాను. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. ఆ సినిమాతో నా జీవితాన్ని మలుపు తిప్పారు రాజమౌళి. అందుకే ఆయన.. ఆయన భార్య రమ పేర్లు కలిసొచ్చేలా నా పెద్ద కొడుక్కి శ్రీరాం రాజమౌళి అని పేరు పెట్టుకున్నా’’ అని ప్రభాకర్ తెలిపాడు. 

లేబుళ్లు:

చెలియా హీరోయిన్ కి పెళ్లయిపోయిందనే విషయం తెలుసా

aditi-rao-hyder-divorced

అదితి రావు హైదరి దశాబ్ద కాలంగా హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. హైద్రాబాదీనే అయినా.. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో చేయలేదు కానీ.. బాలీవుడ్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత కాట్రు వెలియిదాయ్ అనే మూవీతో మళ్లీ తమిళ్ లో అడుగు పెడుతుండగా.. ఇదే చిత్రాన్ని చెలియా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది.

అయితే.. ఈ బ్యూటీకి ఇప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తక్కువ మందికే తెలుసు. అడిగినా కూడా ఆ ఒక్కటీ తప్ప అన్నట్లుగా తప్పించుకోవడం ఈ భామకు అలవాటు. పెళ్లి మాత్రమే కాదు.. ఇప్పటికే అదితి విడాకులు కూడా తీసేసుకుంది. 2009లో సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అదితి. ఇతను గతంలో ఇన్ కం ట్యాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసి.. ఇప్పుడు తను కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోకే ఎంటర్ అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఈ ఇద్దరు 2013లో  విడాకులు తీసేసుకున్నారు. 

విడాకుల తర్వాత ఇద్దరి కెరీర్ ఊపందుకోవడం విశేషం. సినిమాల్లో అదితి తెగ బిజీ అయిపోగా.. ప్రస్తుతం మణిరత్నం సినిమాతో అద్భుతమైన ఆఫర్ వచ్చింది. సంజయ్ దత్ మూవీ భూమిలోను.. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిలో కూడా నటించేస్తుండడంతో.. వీటి రిలీజ్ తర్వాత స్టార్ గా మారిపోవడం ఖాయం అనే అంచనాలున్నాయి.

లేబుళ్లు:

అవును.. నాకు పొగరెక్కువే

nayanathara

మిగతా హీరోయిన్లకు చాలా భిన్నంగా ఉంటుంది నయనతార. తన సినిమాలు వేటినీ కూడా ఆమె ప్రమోట్ చేయదు. ఎప్పుడైనా ఇంటర్వ్యూలిచ్చినా.. మొహం మీద కొట్టినట్లు జవాబులు చెబుతూ ఉంటుంది. నయనతో పని చేసిన వాళ్లు కూడా ఆమెకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని అంటుంటారు. మొత్తంగా నయనతార ఒక పొగరుబోతు అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. తన మీద వచ్చే విమర్శలు.. ఆరోపణల గురించి నయన్ స్వయంగా స్పందించింది.

ఔను.. నేను పొగరుబోతునే అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐతే తనకు పొగరు అనే విషయంలో కండిషన్స్ అప్లై అంటోంది నయన్. తనను తక్కువగా చూసేవాళ్ల విషయంలో మాత్రమే తాను పొగరు చూపిస్తానని ఆమె అంది. సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించడం అంత సులువు కాదని.. అందుకోసం తాను చాలా కష్టపడుతున్నానని.. మొదట్లో సినీ పరిశ్రమ గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల కథల ఎంపికలో.. అందాల ప్రదర్శన విషయంలో పొరపాట్లు చేసి వుండొచ్చని.. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నానని నయన్ చెప్పింది. ఇది చూసి నయనతారకి పొగరెక్కువని అంటున్నారని.. కానీ తన పొగరుకి అర్థం ఏంటో తనకు మాత్రమే తెలుసని ఆమె అంది.

తన సినిమాల్ని ప్రమోట్ చేయకపోవడంపై నయన్ స్పందిస్తూ.. ప్రమోషన్ విషయంలో అయినా.. డేట్స్ విషయంలో అయినా తాను ముందే దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేస్తానని చెప్పింది. తనతో సినిమాలు చేసిన వాళ్లెవ్వరూ తన మీద విమర్శలు చేయలేదని.. కొందరు మాత్రం కావాలనే దుష్ప్రచారం చేస్తారని ఆమె చెప్పింది.

లేబుళ్లు:

ఎన్టీఆర్ చిత్రానికి దక్కిన గొప్ప గౌరవం

ntr-temper-movie-english-novel

ఇప్పటివరకు ఇండస్ట్రీలో నవలల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం చూశాం. కాని ఈ సారి వినూత్నంగా ఓ సినిమా కథ నవలా రూపంలోకి మారనుందని అంటున్నారు. మరి ఆ గౌరవం మన తెలుగు సినిమాకి దక్కడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం టెంపర్. వక్కతం వంశీ ఈ చిత్రానికి కథని అందించాడు. టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ దయ పాత్రలో కనిపించగా ఈ మూవీ జూనియర్ ఇమేజ్ ని మరింత పెంచింది. లక్ పరంగా ఈ సినిమా ఎన్టీఆర్ కి చాలా కలిసొచ్చింది. టెంపర్ తర్వాత జూనియర్ చేసిన నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాలు భారీ విజయం సాధించాయి. కట్ చేస్తే టెంపర్ సినిమా కథ త్వరలో ఆంగ్ల నవలా రూపంలో పాఠకుల ముందుకి రానుందట. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన హారీ పోట్టర్ సిరీస్ ను పబ్లిష్ చేసిన బ్లూమ్స్ బెర్రీ సంస్థ టెంపర్ సినిమా కథకి నవలా రూపం ఇచ్చేందుకు సిద్ధమైందట. వీలైనంత త్వరలోనే ఈ నావెల్ ను మన ముందుకు తీసుకు రానున్నారు.

Tags:- TEMPER , NOVEL , PURI JAGANNATH ,JR NTR , VAKKANTHAM VAMSHI , పూరీ , వక్కంతం వంశీ , టెంపర్ , నావెల్ ,

లేబుళ్లు:

ఎన్టీఆర్ 27 తాజా వార్త... ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'జై లవకుశ' టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. రాశిఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హంసా నందిని ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. తాజా వార్తల ప్రకారం సమంతను లీడ్ రోల్ కోసం తీసుకున్నారని సమాచారమ్. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి సంబంధించిన లోగో ని ఏప్రిల్ 5న ఉదయం 09.30 కి శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ విషయం బయటికి పొక్కగానే ఎన్టీఆర్ అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి, ట్విన్ బ్రదర్స్ గా అలరించనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలోని నెగటివ్ షేడ్ క్యారెక్టర్ కోసం సిలికాన్ మాస్క్ వాడబోతున్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్ లవకుమార్ గా మరో పాత్రలో అలరించబోతున్నాడు. తండ్రి పాత్ర చేయబోతున్నాడు కాబట్టి, ఆ గెటప్ ఎలా ఉంటుందో తెలియల్సి ఉంది. 'జై లవకుశ' చిత్రం స్టోరీ చాలా పవర్ ఫుల్ గా, డిఫరెంట్ గా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో... ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాతో సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

లేబుళ్లు:

రోజా అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు


ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన రోజా.. ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయారు. రాజకీయ నాయకురాలిగా వేదికలపై స్పీచ్ లు దంచేస్తూ.. జబర్దస్త్ లాంటి కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నా.. వాటిని ఖాతరు చేయకుండా కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఆమె.. రీసెంట్ గా ఉగాది స్పెషల్ గా ఓ ఛానల్ ప్రసారమైన కార్యక్రమంలో డ్యాన్స్ లో కూడా అలరించడం విశేషం.

చాలా రోజులుగా తన నవ్వులతోనే కార్యక్రమాలను నడిపిస్తున్న రోజా.. కొంతకాలం క్రితం రచ్చబండ అంటూ కుటుంబ సమస్యల ఇతివృత్తాన్ని కూడా డీల్ చేస్తున్నారు. కానీ ఈ ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో మాత్రం.. చాలా ఏళ్ల తర్వాత రోజా డ్యాన్స్ చూసే అవకాశం అభిమానులకు చిక్కింది. అది కూడా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ నంబర్ 150లోని  అమ్మడు డ్యాన్స్ కుమ్ముడు సాంగ్ కు డ్యాన్స్ చేశారు రోజా. అది కూడా శేఖర్ మాస్టర్ మాస్టర్ తో కలిసి డ్యాన్స్ చేసేశారు రోజా. 

దేవిశ్రీ ప్రసాద్ అందించిన అమ్మడు కుమ్ముడు పాటుకు రోజా చేసిన డ్యాన్స్.. పర్ఫెక్ట్ గా ఒరిజినల్ కు ఇమిటేషన్ అయినా.. రోజా స్టైల్ స్పెషల్ టచ్ లు.. ఫీలింగ్స్ కారణంగా మరింత అందం వచ్చేసింది. 44 సంవత్సరాల వయసులో రోజా ఇంత ఈజ్ తో డ్యాన్స్ చేయగలగడం చూస్తే.. ఆమెలో ట్యాలెంట్ ఇప్పటికీ ఏ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదని అనిపించడం ఖాయం.




లేబుళ్లు:

3, ఏప్రిల్ 2017, సోమవారం

ఆ హీరోయిన్ ని కూడా పడుకోమన్నారట

parvathi-malayalam-heroine

ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు నిర్భయంగా సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం గురించి మీడియాకు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మళయాళ హీరోయిన్ పార్వతి కూడా చేరారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిజమే. అది బాగా విస్తరించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మళయాళ పరిశ్రమకి చెందిన ఓ దర్శకుడు.. ఓ హీరో పడుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారు. అయితే, తాను అందుకు ఒప్పుకోలేదుని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
2006 లో మళయాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పార్వతీ మీనన్. మళయాలంతో పాటు తమిళ చిత్రాల్లో నటించింది. మళయాలంలో వచ్చిన “బెంగుళూరు డేస్” సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇండస్ట్రీలోని చీకటి కోణంపై పార్వతీ మీనన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యంగ్, సీనియర్ హీరోయిన్స్ సైతం కాస్టింగ్ కౌచ్ కి గురవుతున్నారన్న విషయం స్పష్టమైంది. అయితే, ఇండస్ట్రీలోని చీకటి కోణం గురించి మాట్లాడుతున్న హీరోయిన్స్.. పడుకోమని పిలిచిన దర్శక-నిర్మాతలు, హీరోల పేర్లు మాత్రం బయటపెట్టడం లేదు.

లేబుళ్లు:

విశాల్ దుమ్ముదులిపేశాడుగా.

vishal-wins-producer-council-elections

తెలుగువాడైన తమిళ హీరో.. మరోసారి దుమ్ముదులిపాడు. రెండేళ్ల కిందట నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ సహా ఉద్ధండుల్ని ఢీకొట్టి జయకేతనం ఎగుర వేసిన విశాల్.. ఈసారి తమిళ నిర్మాతల మండలిని సవాల్ చేసి గెలిచాడు. ఏడాది కిందట నిర్మాతల మండలిపై వారిపై ఘాటు విమర్శలతో రణరంగంలోకి దిగిన విశాల్.. ఇప్పుడు మండలి ఎన్నికల్లో తిరుగులేని విజయంతో రియల్ హీరో అనిపించుకున్నాడు.

ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి లేట్ నైట్ ఫలితాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడిగా విశాల్ ఎన్నికయ్యాడు. మొత్తం 1059 ఓట్లు పోలవగా.. విశాల్ 478 ఓట్లతో జయకేతనం ఎగురవేశాడు. రాధాకృష్ణన్ 333 ఓట్లతో రెండో స్థానం సాధించాడు. కేఆర్ అనే మరో అభ్యర్థి 220కి పైగా ఓట్లు సంపాదించాడు.

మిగతా రెండు వర్గాల్లో పాత తరం నిర్మాతలే ఎక్కువగా ఉండగా.. గత దశాబ్ద కాలంలో నిర్మాతలైన యువతరం అంతా విశాల్ వైపు నిలిచింది. ఈ ఎన్నికల్లో విశాల్ వర్గానికే చెందిన ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికవడం విశేషం. మొత్తం పదవుల్లో కేవలం ఒక్కటి మాత్రమే వేరే వర్గానికి వెళ్లింది. మిగతా పదవులన్నింట్లోనూ విశాల్ టీమే విజయం సాధించడం విశేషం. నడిగర్ సంఘం మ్యాజిక్‌నే నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ రిపీట్ చేసి హీరో అయిపోయాడు విశాల్. 

లేబుళ్లు:

తారక్‌ రాముడి సెంటిమెంట్…!

srntr-jrntr-ramudu

టెంపర్ సినిమా నుంచీ కూడా తన సినిమాల ప్లానింగ్ మొత్తం మార్చేశాడు తారక్. చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఆలోచనల్లో కూడా పూర్తి క్లారిటీతో ఉంటున్నాడు. ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్‌లో కూడా టెంపర్ సినిమా టైం నుంచే చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. అంతా కూడా భార్య ప్రణతి ప్రభావం అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మొత్తం నందమూరి ఫ్యామిలీని కలుపుకుపోయే ప్రయత్నంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ హరికృష్ణ ఫ్యామిలీతో మాత్రం పూర్తిగా కలిసిపోయాడు తారక్.
ఇప్పుడిక తాత నందమూరి తారక రామారావు బేనర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌ని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమా లోగో లాంఛ్ కోసం ఎన్టీఆర్ ఎంచుకున్న డేట్, టైం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఉన్న రాముడిసెంటిమెంట్ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఈ విషయంలో తారక్‌కి కూడా సేం సెంటిమెంట్ ఉందట. అందుకే ఏరి కోరి మరీ బాలల రామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తన 27వ సినిమా టైటిల్ లోగో రిలీజ్ కార్యక్రమాన్ని కూడా రాముడి సెంటిమెంట్‌తో ఏప్రిల్ 5వ తేదీన ఉదయం పది గంటల ముఫ్ఫై నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు ఈ ముహూర్తం గురించే సినిమా ఇండస్ట్రీలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్‌ కూడా తన సినిమాల ముహూర్తాలు శ్రీరామనవమికి వచ్చేలా చాలా సార్లు ప్లాన్ చేశాడు. ఇప్పుడు తాత బాటలోనే మనవడు కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆలోచను, అభిరుచుల విషయంలో మాత్రం తాతకు తగ్గ మనవడే అనిపిస్తున్నాడు ఎన్టీఆర్. అయినా ఆ తారక రాముడి సెంటిమెంట్‌ని ఉపయోగించుకునే విషయంలో ఎన్టీఆర్ కంటే అర్హత ఉన్నవాళ్ళు ఎవరున్నారు?

లేబుళ్లు:

స్పైడర్ లుక్ ఇరగదీస్తోంది

mahesh-spyder-first-look

స్పై-డర్.. గత కొన్ని గంటలుగా దక్షిణాది సినీ పరిశ్రమ ఈ పదం గురించే మాట్లాడుకుంటోంది. ఇందుకు కారణం.. మహేష్ బాబు కొత్త సినిమాకు ఇదే టైటిల్ ని ఫిక్స్ చేశారనే టాక్ గుప్పుమనడమే. ఇంతకు ముందే ఈ టైటిల్ వినిపించినా.. నిర్మాతలు స్పై-డర్ ను రిజిస్ట్రేషన్ చేయించడంతోనే హంగామా మొదలైపోయింది.

మరి మహేష్ సినిమా టైటిల్ గురించి తెలిశాక.. సూపర్ స్టార్ వీరాభిమానులు ఊరుకుంటారా.. తమ తెలివితేటలకు టెక్నాలజీని జోడించి పోస్టర్లను కూడా తయారు చేసి నెట్ లో పెట్టేస్తున్నారు. వీటిలో ఒకటి అయితే.. నిజంగా ఆ సినిమా యూనిట్ రిలీజ్ చేశారా అన్నంత నమ్మశక్యంగా ఉంది. మెరూన్ కలర్ షర్ట్.. బ్లూ సాఫ్ట్ జీన్స్.. డార్క్ గ్రీన్ జాకెట్ తో మహేష్ నడుచుకుంటూ వస్తుంటే.. వెనకాల మహేష్ పరుగుపెడుతున్నట్లుగా ఉన్న నీడ కనిపిస్తుంది. స్పై-డర్ టైటిల్ ని కూడా స్పైడర్ మ్యాన్ థీమ్ కి దగ్గరగా డిజైన్ చేసి.. మొత్తం పోస్టర్ ను అదే థీమ్ తో నింపేశారు.

ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే అయినా.. ఇంటర్నెట్ లో ఇప్పుడు వైరల్ అయిపోయింది. దీనికే ఇంత క్రేజ్ వస్తే.. నిజంగా రిలీజ్ అయ్యాక అప్పుడు ఎంత ట్రెండింగ్ అవుతుందో.. టీజర్ ఎన్నేసి రికార్డులు సృష్టించనుందో ఆలోచించాలంటేనే.. బాగా ఎగ్జైటింగ్ గా అనిపించడం లేదూ!

లేబుళ్లు: , ,

జూనియర్ ఎన్టీఆర్ తో ఆ ఇద్దరి పార్టీ !!

ntr-rana-akhil-iifa

జూనియర్ ఎన్టీఆర్ తో పార్టీ అంటే ఓ రేంజ్ లో ఎంజాయ్మెంట్ ఉంటుందని టాక్. తను ఓ స్టార్ అనే విషయాన్ని  పట్టించుకోకుండా అందరితో కలిసి ఎంజాయ్ చేసేయడం.. ఇంకా చెప్పాలంటే అందరికీ మించి హంగామా చేసేయడం యంగ్ టైగర్ స్పెషాలిటీ. ఇప్పుడు అలాంటిదే ఓ పార్టీ పిక్ ఇంటర్నెట్ లో హంగామా చేస్తోంది. 

దగ్గుబాటి రానా.. అక్కినేని అఖిల్ లతో కలిసి రీసెంట్ గా ఓ పార్టీలో పాల్గొన్నాడు ఎన్టీఆర్.  పార్టీలో ముగ్గురూ కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పార్టీ తర్వాత ముగ్గురూ కలిసి ఓ ఫోటోకి ఫోజ్ ఇవ్వగా.. రానా-అఖిల్ ల భుజాలపై దాదాపుగా ఎక్కేశాడు ఎన్టీఆర్. ఇలా ఎన్టీఆర్ ఫోటోలకు చిక్కడం బాగా అరుదు. అందుకే ఈ పిక్ వైరల్ గా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇంతకీ ఈ పార్టీ ఎక్కడిది అనే డౌట్ రావడం సహజం. రీసెంట్ గా ఐఫా ఉత్సవం జరిగింది కదా. ఆ వేడుక తర్వాత జరిగినదే ఈ పార్టీ. 

ఈ ఐఫా వేడుకల్లో ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు దగ్గుబాటి రానా ఈ ఉత్సవాన్ని హోస్ట్ చేయడం విశేషం. అఖిల్ విషయంలో కూడా స్పెషాలిటీ ఉంది. చాలా వారాల తర్వాత అఖిల్ తొలిసారిగా ఐఫా వేడుకల్లోనే పబ్లిక్ కి దర్శనం ఇవ్వగా.. తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో కూడా అలరించేశాడు. 

లేబుళ్లు: , ,

2, ఏప్రిల్ 2017, ఆదివారం

మూడు భాషల్లో ప్రభాస్ ఇరగదీయబోతున్నాడు గా.!


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి ది కంక్లూజన్' తర్వాత చేయబోయే సినిమా కన్ ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి సినిమా ని యు.వి.క్రియేషన్స్ నిర్మించనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిపోయింది. షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ చిత్రం టీజర్ ని 'బాహుబలి ది కంక్లూజన్' చిత్రంతో అటాచ్ చేయబోతున్నారట. 'బాహుబలి 2' ఎక్కువ స్ర్కీన్స్ లో విడుదలవుతుంది కాబట్టి, ప్రభాస్, సుజిత్ మూవీ టీజర్ కి ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇది ప్రభాస్, సుజిత్ సినిమా బిజినెస్ కి బాగా వర్కవుట్ అవుతుంది. అందుకే ఇలా ప్లాన్ చేసారట. ఇదిలా ఉంటే...

యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో' టైటిల్ రిజిస్టర్ చేసారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కనుంది కాబట్టి, ఒకే టైటిల్ ని తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్ కి పెట్టాలని డిసైడ్ అయ్యారట. అందుకే 'సాహో' టైటిల్ ని కన్ ఫార్మ్ చేయాలనుకుంటున్నారని సమాచారమ్. 'బాహుబలి' తో ప్రభాస్ కి వచ్చిన ఇమేజ్ కి సరిపడా ఈ టైటిల్ ఉందని చెప్పొచ్చు.




లేబుళ్లు: , , ,

మహేష్ పాటను వాడుకోబోతున్న అఖిల్...!


అక్కినేని అఖిల్ హీరోగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం 'జున్ను', 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక' టైటిల్స్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. నాగార్జున మేనల్లుడు, మేనకోడలు సుమంత్, సుప్రియ బ్యానర్ యస్.యస్.క్రియేషన్స్ పై ఈ టైటిల్స్ ని రిజిస్టర్ చేసారు. దాంతో ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని అఖిల్ సినిమాకి వాడబోతున్నారని జనాలు చెప్పుకుంటున్నారు.

మహేష్ బాబు హీరోగా రూపొందిన 'మురారి' చిత్రంలో 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక...' అనే లిరిక్ తో సాగే పాట చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడీ పాటలోని లిరిక్ ని అఖిల్ సినిమా టైటిల్ కోసం వాడటం విశేషం. ఇక 'జున్ను' టైటిల్ ని రిజిస్టర్ చేయించడానికి కూడా కారణం ఉందట. సినిమాలో హీరోయిన్ నిక్ నేమ్ 'జున్ను' అట. మరి ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారోగానీ, మొత్తంమీద లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని ఈ టైటిల్స్ ని బట్టి ఊహించవచ్చు.












లేబుళ్లు: , , ,

బాహుబలి స్టంట్ చేస్తూ ప్రమాదవసస్తూ చనిపోయిన యువకుడు





Please friends Dont try these types of stunts for selfies and videos 

to upload in Facebook, whatsapp, Instagram and dont end your life

Young boy died during doing stunts.

Tags: watch the telugu movies reviews, telugu movies, telugu movies latest news, telugu movies videos, moviesgossips, telugu movies gossips, telugu movies trailers, telugu movie trailers, latest movies gossips, telugu audio launch, telugu heroine gossips, telugu cinema gossips, telugu cinema news, recent telugu movies reviews, tollywood news, kollywood news, bollywood news, tollywood gossips, tollywood movie news, kollywood movie news, bollywood movie news, tolllywood movie gossips jabardasth comedy show,jabardasth comedy show latest episode 2016,jabardasth comedy show latest episode,jabardasth latest episode,jabardasth 2017,jabardasth comedy show latest episode 2017,jabardasth hyper aadi,jabardasth promo,jabardasth hyper aadi skits,jabardasth sudigali sudheer skits,jabardasth,jabardasth aadi,jabardasth aadi performance,jabardasth aadi skits,jabardasth adhi,jabardasth aadi latest episode,jabardasth apparao,
jabardasth adhire abhi best skits,jabardasth aadi comedy show,jabardasth abhi skits,jabardasth apparao best performance,a jabardasth comedy show latest episode,jabardasth best comedy skits,jabardasth bullet bhaskar skits,jabardasth best skits ever,jabardasth bullet bhaskar,jabardasth bhaskar,jabardasth bloopers,jabardasth best,jabardasth bhaskar skits,jabardasth best skits,jabardasth balakrishna ram gopal varma,jabardasth comedy,jabardasth comedy show hyper aadi,jabardasth comedy show 2017,jabardasth comedy show promo,jabardasth comedy show sudigali sudheer episodes,jabardasth chammak chandra comedy,jabardasth dhanraj,jabardasth dasara episode,jabardasth durga rao,jabardasth dhanraj skits,telugu movies reviews, telugu movies, telugu movies latest news, telugu movies videos, moviesgossips, telugu movies gossips, telugu movies trailers, telugu movie trailers, latest movies gossips, telugu audio launch, telugu heroine gossips, telugu cinema gossips, telugu cinema news, recent telugu movies reviews, tollywood news, kollywood news, bollywood news, tollywood gossips, tollywood movie news, kollywood movie news, bollywood movie news, tolllywood movie gossips,guru review,guru movie

లేబుళ్లు: , ,

కన్ఫామ్.. మహేష్ కి ఆ టైటిలే..క్లారిటీ.!


మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న మూవీపై.. కనీసం ఇంకా ఫస్ట్ లుక్ ఇవ్వడం లేదెందుకు? సూపర్ స్టార్ అభిమానులను చాలా నెలల నుంచి తొలిచేస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం.. ఇంకా టైటిల్ విషయంలో ఓ క్లారిటీ రాలేదనే సంగతి గతంలోనే చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఆ ఒక్క అడ్డంకి తొలగిపోయిందని ఫిక్స్ అయిపోవచ్చు. 

మహేష్ మూవీ నిర్మాతలు ఎన్ వీ ప్రసాద్.. టాగూర్ మధు.. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో కొత్త టైటిల్ రిజిస్టర్ చేయించారు. అదేమీ ఇప్పటి వరకూ వినిపించని పేరు కాదు. గత కొన్ని వారాలుగా మీడియాలో నానున్నతున్న స్పైడర్ టైటిల్ కే ఫిక్స్ అయిపోయారు. దాన్నే కొంచెం మార్చి.. స్పై-డర్ అని రిజిస్టర్ చేయించారు నిర్మాతలు. ఒక్క తెలుగు భాషలోనే కాదు.. మలయాళం.. హిందీ భాషలకు కూడా స్పై-డర్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించేయడంతో.. ఇదే టైటిల్ ని ఖాయం చేసేసినట్లు భావించచ్చు. ఇంకా అధికారికంగా ప్రకటించడం ఒక్కటే పెండింగ్.

టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చేయడంతో.. ఇక ఫస్ట్ లుక్.. టీజర్ ల కోసం జనాలు ఎదురుచూసేయచ్చు. ఇప్పటికే లండన్ లో సిద్ధం చేయించిన టీజర్ సిద్ధంగా ఉండడంతో.. శ్రీరామ నవమి రోజున రెండింటినీ విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా మహేష్ రాముడు బాగానే అచ్చొచ్చాడు. రామ రామ రామ రామ అంటూ శ్రీమంతుడులో ఓ పాట కూడా పాడుకున్నాడు మహేష్. 


Tags: Telugu News, Telugu Cinema News, Telugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie Reviews, Tollywood Film Reviews,

లేబుళ్లు: , , ,