మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న మూవీపై.. కనీసం ఇంకా ఫస్ట్ లుక్ ఇవ్వడం లేదెందుకు? సూపర్ స్టార్ అభిమానులను చాలా నెలల నుంచి తొలిచేస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం.. ఇంకా టైటిల్ విషయంలో ఓ క్లారిటీ రాలేదనే సంగతి గతంలోనే చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఆ ఒక్క అడ్డంకి తొలగిపోయిందని ఫిక్స్ అయిపోవచ్చు.
మహేష్ మూవీ నిర్మాతలు ఎన్ వీ ప్రసాద్.. టాగూర్ మధు.. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో కొత్త టైటిల్ రిజిస్టర్ చేయించారు. అదేమీ ఇప్పటి వరకూ వినిపించని పేరు కాదు. గత కొన్ని వారాలుగా మీడియాలో నానున్నతున్న స్పైడర్ టైటిల్ కే ఫిక్స్ అయిపోయారు. దాన్నే కొంచెం మార్చి.. స్పై-డర్ అని రిజిస్టర్ చేయించారు నిర్మాతలు. ఒక్క తెలుగు భాషలోనే కాదు.. మలయాళం.. హిందీ భాషలకు కూడా స్పై-డర్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించేయడంతో.. ఇదే టైటిల్ ని ఖాయం చేసేసినట్లు భావించచ్చు. ఇంకా అధికారికంగా ప్రకటించడం ఒక్కటే పెండింగ్.
టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చేయడంతో.. ఇక ఫస్ట్ లుక్.. టీజర్ ల కోసం జనాలు ఎదురుచూసేయచ్చు. ఇప్పటికే లండన్ లో సిద్ధం చేయించిన టీజర్ సిద్ధంగా ఉండడంతో.. శ్రీరామ నవమి రోజున రెండింటినీ విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా మహేష్ రాముడు బాగానే అచ్చొచ్చాడు. రామ రామ రామ రామ అంటూ శ్రీమంతుడులో ఓ పాట కూడా పాడుకున్నాడు మహేష్.
Tags: Telugu News, Telugu Cinema News, Telugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie Reviews, Tollywood Film Reviews,

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి