యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి ది కంక్లూజన్' తర్వాత చేయబోయే సినిమా కన్ ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి సినిమా ని యు.వి.క్రియేషన్స్ నిర్మించనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిపోయింది. షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ చిత్రం టీజర్ ని 'బాహుబలి ది కంక్లూజన్' చిత్రంతో అటాచ్ చేయబోతున్నారట. 'బాహుబలి 2' ఎక్కువ స్ర్కీన్స్ లో విడుదలవుతుంది కాబట్టి, ప్రభాస్, సుజిత్ మూవీ టీజర్ కి ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇది ప్రభాస్, సుజిత్ సినిమా బిజినెస్ కి బాగా వర్కవుట్ అవుతుంది. అందుకే ఇలా ప్లాన్ చేసారట. ఇదిలా ఉంటే...
యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో' టైటిల్ రిజిస్టర్ చేసారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కనుంది కాబట్టి, ఒకే టైటిల్ ని తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్ కి పెట్టాలని డిసైడ్ అయ్యారట. అందుకే 'సాహో' టైటిల్ ని కన్ ఫార్మ్ చేయాలనుకుంటున్నారని సమాచారమ్. 'బాహుబలి' తో ప్రభాస్ కి వచ్చిన ఇమేజ్ కి సరిపడా ఈ టైటిల్ ఉందని చెప్పొచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి