మహేష్ పాటను వాడుకోబోతున్న అఖిల్...!


అక్కినేని అఖిల్ హీరోగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం 'జున్ను', 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక' టైటిల్స్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. నాగార్జున మేనల్లుడు, మేనకోడలు సుమంత్, సుప్రియ బ్యానర్ యస్.యస్.క్రియేషన్స్ పై ఈ టైటిల్స్ ని రిజిస్టర్ చేసారు. దాంతో ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని అఖిల్ సినిమాకి వాడబోతున్నారని జనాలు చెప్పుకుంటున్నారు.

మహేష్ బాబు హీరోగా రూపొందిన 'మురారి' చిత్రంలో 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక...' అనే లిరిక్ తో సాగే పాట చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడీ పాటలోని లిరిక్ ని అఖిల్ సినిమా టైటిల్ కోసం వాడటం విశేషం. ఇక 'జున్ను' టైటిల్ ని రిజిస్టర్ చేయించడానికి కూడా కారణం ఉందట. సినిమాలో హీరోయిన్ నిక్ నేమ్ 'జున్ను' అట. మరి ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారోగానీ, మొత్తంమీద లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని ఈ టైటిల్స్ ని బట్టి ఊహించవచ్చు.












కామెంట్‌లు