31, జులై 2016, ఆదివారం

ప్రభాస్ కొత్త రేంజ్ రోవర్ కారు రేటు ఎంతో తెలుసా..?


యుంగ్ రెబెల్ స్టార్ రెండేళ్లుగా గుర్రాలతో స్వారీ చేసి బోర్ కొట్టినట్లు ఉంది. అందుకే మార్కెట్ లో ఏ కొత్త కార్ వస్తే దాని గురించి తెలుసుకొని కొనడం స్టార్ట్ చేస్తున్నాడు. తాజాగా రూ. 2.82 కోట్ల విలువైన కొత్త రేంజ్ రోవర్ కారును కొన్నాడు.

దీనికి సంబంధించిన రిజిస్టర్ కోసం నిన్న ఖైరతాబాద్ లోని ఆర్ టి ఏ ఆఫీస్ కు వచ్చి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసాడు. ప్రభాస్ రాకను తెలుసుకొని భారీ స్థాయిలో అభిమానులు చేరుకొని ప్రభాస్ జై జై లు పలికారు.


లేబుళ్లు:

30, జులై 2016, శనివారం

మనసున్న యంగ్ టైగర్…!


టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలతోనే కాదు, తన మంచి మనసుతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు.నాగార్జున అనే క్యాన్సర్ పేషెంట్ ని పరామర్శించేందుకు స్వయంగా వెళ్లాడు తారక్.

గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన నాగార్జున క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.తన ఆఖరి కోరికగా తనకెంతో ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ ని కలవాలని కలలు కన్నాడు.అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే నాగార్జునని కలిసేందుకు వెళ్లి, పరామర్శించి కొంత డబ్బుసాయాన్ని సైతం అందించాడు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో జనతాగ్యారేజ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా డబ్బింగ్,షూటింగ్స్ లో బిజీగా ఉండి కూడ తన అభిమానికోసం ఇలా కదిలి వెళ్లడం తన మంచి మనసుకు అద్దం పడుతోందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.


లేబుళ్లు:

ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం అంటున్న యంగ్ హీరో


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం క్రేజ్ పీక్స్ లో ఉన్న విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్ళలో ఇలాంటి క్రేజ్ ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు అలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ క్రేజ్ కి ఫ్లాట్ అవ్వని హీరో లేరనే చెప్పాలి.



ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ కం డాన్సర్ లలో ఎన్టీఆర్ ముందు ఉంటాడన్నది అందరి భావన. ఇప్పుడు ఇదే మాట అంటున్నాడు యంగ్ హీరో నాగాషౌర్య. తాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్ ని అని చెబుతున్నాడు.

ప్రస్తుతం మెగా డాటర్ నీహారికతో ఒకమనసు సినిమా చేసిన నాగాషౌర్య ఆ సినిమా ప్రమోషన్ లో తను ఎన్టీఆర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మరోసారి చెప్పాడు. ఎన్టీఆర్ తో పాటు ఏజ్ పెరుగుతున్న అందం తగ్గని నాగార్జున అంటే కూడా చాలా ఇష్టమని అంటున్నాడు ఈ యంగ్ హీరో.

6 

For more watch here
6 రోజులు.. 320 కోట్లు !

లేబుళ్లు:

మహేష్ బాబు ఆ సెంటిమెంట్ ను వదలడం లేదు


టాప్ హీరో సినిమా ఓపెనింగ్ అంటే అట్టహాసంగా జ‌రుగుతుంటుంది. హీరో, ద‌ర్శకుడు, సాంకేతిక నిపుణులూ పూజా కార్యక్రమాల‌లో పాల్గొంటారు. హీరోపై క్లాప్ కొడ‌తారు. అదేం సెంటిమెంటో… మ‌హేష్ బాబు సినిమాకి ఇదంతా రివ‌ర్స్‌లో ఉంటుంది. ఓపెనింగ్ కి మ‌హేష్ ఎప్పుడూ రాడు. అదే అత‌ని సెంటిమెంట్‌. మ‌హేష్ లేకుండానే అత‌ని సినిమా ప్రారంభం అయిపోతుంది. ఈ సెంటిమెంట్‌ని త‌న కొత్త సినిమాకీ కొన‌సాగించాడు మ‌హేష్‌.

మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా ముహూర్తం జరుపుకుంది. అన్నపూర్ణ స్టూడియో లో దేవుడి ఫోటోలపై తీసిన తొలి సీన్ కు డైరక్టర్ మురగదాస్ కెమేరా స్విచ్ ఆన్ చేసారు. ఎప్పటిలాగే సెంటిమెంట్ ప్రకారం మహేష్ బాబు తొలి రోజు షూటింగ్ కు రాలేదు. ఆగస్టు 13 వరకు తొలి షెడ్యూలు ను ప్లాన్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ మ్యూజిక్ అందిస్తునాడు.


లేబుళ్లు:

స్పాటెడ్: బికినీ టాపులో కాజల్



కాజల్ అగర్వాల్ టాలీవుడ్ కి చందమామ. గ్లామరస్ డోస్ బాగానే మెయింటెయిన్ చేసినా.. ఎప్పుడూ పెద్దగా హద్దులు దాటినట్లు కనిపించదు. కానీ ఇప్పుడామె కెరీర్ క్లిష్టమైన స్టేజ్ కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఏ సినిమాకి ఈమె ఫస్ట్ ఆప్షన్ కావడం లేదు. వేరే ఎవరో కాదన్నవో.. ఆయా కాంబినేషన్లు సెట్ కాకపోతేనో.. అప్పుడు కాజల్ కి ఆఫర్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ పరిస్థితి బాగానే అర్ధం చేసుకున్న కాజల్.. ఇప్పుడు గ్లామర్ డోస్ ని విపరీతంగా పెంచేందుకు రెడీ అయిపోయినట్లు కనిపిస్తోంది. 

కోలీవుడ్ హీరో జీవాకి జంటగా కావలై వేండాం అనే మూవీ చేస్తోంది కాజల్. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన స్పాట్ పిక్చర్ ఒకటి ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఓ పూల్ లో కాజల్ బికినీ వేసుకుని.. దానిపై ట్రాన్స్ పరెంట్ కవర్ తో కనిపిస్తుంది. ఆమె అందాల వంక జీవా చూస్తున్నట్లుగా ఆ ఫోటో ఉంటుంది కానీ.. ఇక్కడ కాజల్ బికినీ గురించే చెప్పుకోవాలి. సినిమాలో కూడా ఆ పైన వైట్ ట్రాన్స్ పరెంట్ వేర్ ని అలాగే ఉంచుతుందా? లేక దాన్ని తీసేసి కేవలం బికినీతో కనిపిస్తుందా అనేది మాత్రం ఇప్పటికి క్వశ్చన్ మార్కే.

అయినా ఇలా సోకుల ప్రదర్శనలో హద్దులు మార్చుకోబట్టే.. తల57గా పిలుస్తున్న అజిత్ మూవీలో ఛాన్స్ పట్టేసిందనే టాక్ ఉంది. కెరీర్ ఎండింగ్ అనుకుంటే.. భారీ ఆఫర్స్ బాగానే పట్టేస్తున్న కాజల్ అగర్వాల్ ని ఇకపై బికినీలో చూసేందుకు కూడా ఫ్యాన్స్ రెడీ అయిపోవచ్చు. 


లేబుళ్లు:

ఆర్టీఏ ఆఫీసులో బాహుబలి ప్రత్యక్షం


బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయి కూడా భారీగా ఫేమస్ అయిన హీరో ప్రభాస్. ప్రభాస్ కెరీర్ బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అని రెండు భాగాలుగా చుడాలి అంటే అది అతిశయోకి కాదు! ఆ సినిమా విడుదలైనప్పటి నుంచీ ఈ మధ్య్కాలంలో ఏ హీరోకి రానిస్థాయి గుర్తింపు ప్రభాస్ సొంతమైంది. ఈ స్థాయి ప్రభాస్ శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి ఖైరతాబాద్ లో కనిపించారు. అలా అని ఏ షూటింగ్ కోసమో కాదండోయ్... కొత్తగా కొనుగోలు రేంజ్ రోవర్ రిజిస్ట్రేషన్ కోసం!

ప్రభాస్ రూ.2.82 కోట్ల ఖరీదైన తన కొత్త రేంజ్ రోవర్ కారుతో ఖైరతాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. తన ఈ రేంజ్ రోవర్ రిజిస్ట్రేషన్ కోసం శుక్రవారం ఉదయం ఖైరతాబద్ ఆర్టీఏ కార్యాలనికి వచ్చిన ప్రభాస్ కాసేపు హల్ చల్ చేశారు. అక్కడున్న అధికారులతో కాసేపు ముచ్చటించిన ప్రభాస్... రూ.5 వేలు ఫీజు చెల్లించి ‘టీఎస్ 09 ఈఎన్ 7567’ నంబర్తో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

కాగా కొన్నాళ్ల క్రితం ప్రబాస్ రేంజ్ రోవర్ కారును బుక్ చేసుకోగా... ఆ కంపెనీ అనుకోనికారణాలవల్ల ఆ మోడల్ ను ప్రభాస్ కు అనుకున్న సమయంలో అందించలేకపోయింది. దాంతో ఆ కంపెనీ రూల్స్ ప్రకారం ఈ కొత్త కారును ఇచ్చేవరకూ మరో కారును ఫ్రీగా ఇచ్చి వాడుకోమన్న సంగతి తెలిసిందే.


లేబుళ్లు: , , , , ,

29, జులై 2016, శుక్రవారం

సురేష్ బాబు కు వెన్నుపోటు పొడుస్తున్న అల్లు బ్యాచ్..

సురేష్ బాబు కు వెన్నుపోటు పొడుస్తున్న అల్లు బ్యాచ్..


టాలీవుడ్ ఇండస్ట్రీ ని నాలుగు పెద్ద తలకాయలు ఏలుతూ , మిగతా వాళ్లని తొక్కేస్తున్నారనే వాదన ఎప్పటినుండో వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ నలుగురు కాస్త ముగ్గురయ్యారనే వార్త వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకరు సురేష్ బాబు. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ ను నడిపిస్తూ , ఆంధ్రా , సీడెడ్ ఏరియాల్లో కొన్ని వందల థియేటర్స్ ను మెంటైన్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు సీన్ మారిందట. ఇంతకాలం తన వెంట ఉన్నవారే ఇప్పుడు తనకు వెన్నుపోటు పొడుస్తుండడం తట్టుకోలేకపోతున్నాడనే వార్త ఫిలిం సర్కిల్ లో వినపడుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాతలు ఎవరు అంటే అల్లు అరవింద్, దిల్‌రాజ్, యూవీ క్రియేషన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి సురేష్ బాబు తొక్కేస్తున్నారట. రెండేళ్ల కిందటి వరకు దిల్‌రాజుకి ఒక్క వైజాగ్‌లో మాత్రమే ఆఫీస్ ఉండేది. యూవీ క్రియేషన్స్ వారు గుంటూరుకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటూ ఆ ప్రాంతంపై మంచి పట్టు తెచ్చుకున్నారు. వీరిద్దరికీ అల్లు అరవింద్ జత కలిసి తన బిజినెస్ మైండ్ తో ఆంధ్రా, సీడెడ్‌లోని థియేటర్లన్నీ తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు.

దీంతో సురేష్ బాబు చేతులో ఉన్న థియేటర్స్ అన్ని ఇప్పుడు ఈ ముగ్గురి చేతులోకి పోవడం తో ఏం చేయాలో తెలియక అయోమయం లో ఉన్నాడు. దీంతో సురేష్ బాబు పెద్దగా సినిమాలు నిర్మించడం మానేశాడు. అప్పుడప్పుడూ కొన్ని సినిమాలను పంపిణీ చేద్దామని చూస్తూన్నా, అల్లు అరవింద్ బ్యాచ్ అంతా కలిసి సురేష్ బాబు చేతికి రాకుండా చేస్తున్నారట. దీంతో నా వెంట తీరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచారని తన అనుకున్న వారి దగ్గర చెప్పుకొని బాధపడుతున్నాడట.

లేబుళ్లు:

కట్టప్ప వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు..


కట్టప్ప ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. బాహుబలి చిత్రం తో రాజమౌళి కి ఎంత పేరు వచ్చిందో దానికి రెట్టింపు పేరు కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్ కు వచ్చింది. కట్టప్ప కు సంబంధించిన ఎన్నో గేమ్స్ ఆన్లైన్ లో దర్శనం ఇచ్చాయంటే అతని పాత్ర కు ఎంత పేరు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా బాహుబలి లోని కట్టప్ప సీన్ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో లో సత్య రాజ్ నటించిన చిత్రానికి సంబంధించిన వీడియో తో కట్టప్ప సీన్ మార్ఫింగ్ చేసి నెట్ లో వదిలారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ తెగ షేర్ చేస్తా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో ఫై లుక్ వెయ్యండి.


click here to see video

లేబుళ్లు:

రివ్యూ : జక్కన్న – నిలబెట్టుకున్నాడు


టైటిల్ : జక్కన్న (2016)
స్టార్ కాస్ట్ : సునీల్ , మన్నార్ చోప్రా, సప్త గిరి , పృద్వి
డైరెక్టర్ : వంశీ కృష్ణ ఆకెళ్ళ
ప్రొడ్యూసర్స్ : ఆర్పీఏ క్రియేషన్స్
మ్యూజిక్ : దినేష్
విడుదల తేది : 29 జూలై, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : జక్కన్న – నిలబెట్టుకున్నాడు
కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న సునీల్ , ఆ తర్వాత వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్నాడు. ఈ నేపథ్యం లో తనకు ఓ మంచి హిట్ ఇచ్చిన రాజమౌళి పేరు పెట్టుకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు జక్కన్న గా వచ్చాడు. వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం లో ప్రేమ కథ చిత్రం వంటి సూపర్ హిట్ ఇచ్చిన ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. సునీల్ కు జత గా మన్నార్ చోప్రా నటించింది. మరి ఈ చిత్రమైన సునీల్ ను గట్టెక్కించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి గణేష్ (సునీల్ ). ఇతనికి హెల్ప్ చేసినవారికి తిరిగి హెల్ప్ చేస్తుంటాడు. ఈ క్రమం లో వైజాగ్ సిటీకి డాన్ అయినా భైరాగి , గణేష్ చిన్నతనం లో హెల్ప్ చేస్తాడు. దీంతో అతడిని కలవడానికి వైజాగ్ వెళ్ళతాడు. అతడో పెద్ద రౌడీ అని తెలుసుకొని అతడిని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఈ లోపు భైరాగి చెల్లెలు సహస్ర (మన్నారా చోప్రా) గణేష్ ని లవ్ చేయడం మొదలు పెడుతుంది. మరి భైరాగి మారతాడా..? సహస్ర ప్రేమకు ఒకే చెపుతాడా ..? అనేది మిగతా స్టోరీ.

ప్లస్ :

సునీల్
సప్తగిరి & పృథ్వీ కామెడీ ట్రాక్
క్లైమాక్స్
స్క్రీన్ప్లే

మైనస్ :

కధలో డ్రాగింగ్
ఊహించగలిగిన కథ
మ్యూజిక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

మరోసారి సునీల్ తనదయిన కామెడీ & యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక డాన్స్ లలో మరో సారి చిరును తలపించాడు. అలాగే మన్నార్ చోప్రా తన అందచందాలతో ఆకట్టుకుంది. మొదటిసినిమా కావడం తో కాస్త నటనలో అక్కడక్కడా తడబడింది. సప్తగిరి . 30 ఇయర్స్ పృద్వి ఇద్దరు థియేటర్ లో నవ్వులు పూయించారు. వీరి కామెడీ సినిమా కు మరింత హెల్ప్ అయ్యింది. విలన్‌గా నటించిన కబీర్ సింగ్ కూడా బాగానే నటించాడు.

సాంకేతిక విభాగం :

రక్ష చిత్రం తో భయపెట్టిన వంశీ కృష్ణ ఆకెళ్ళ , జక్కన్న లో మాత్రం కామెడీ తో అందరిని ఆకట్టుకున్నాడు. అక్కడక్కడ కాస్త కథ డ్రాగ్ అయినా కానీ ప్రేక్షకులను 2: 30 గంటలు థియేటర్ లో కూర్చుపెట్టడం లో సక్సెస్ అయ్యాడు. దినేష్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. సి. రాం ప్రసాద్ అందించిన సినిమాటోగ్రాఫర్ బాగుంది. ఆర్పీఏ క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి

చివరిగా :

ఓవరాల్ గా సునీల్ మళ్లీ గాడిలో పడతాడు అని జక్కన్న తో చెప్పచ్చు. గత వారం కబాలి తో డిస్పాయింట్ అయినా ప్రేక్షకులు జక్కన్న తో హ్యాపీ కావొచ్చు. టైం పాస్ కామెడీ ఫామిలీ ఎంటర్టైనర్ ఎంచుకొని సునీల్ హిట్ కొట్టాడు.


లేబుళ్లు:

ఈ డైలాగ్స్ చాలు ‘జనతా గ్యారేజ్ ‘ కుమ్మేయడానికి



టాలీవుడ్ యంగ్ హీరోల్లో డైలాగ్స్ చెప్పడం లో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అది సినిమాల్లోనైనా , స్టేజి ఫైనేనా ప్రస్తుతం నటిస్తున్న జనతా గ్యారేజ్ కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ బయటకు వచ్చి తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ డైలాగ్స్ విన్న వారు ఇవి చాలు జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేయడానికి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నారు..ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్ వెయ్యండి..

* ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ.. భయం వేస్తే తోడుగా నడిచే నాన్నా లేకపోతే..
ఎలా ఉంటుందో నాకు తెలుసు.. మనిషికి అంతకు మించిన నరకం ఉండదు.

* లక్ష్మణ రేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోడానికి నేను లక్ష్మణుడిని కాదురా..
లక్ష సముద్రాలనైనా దాటి.. ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి దూకే ఆంజినేయుడిని..

* విజయవాడ కృష్ణ బ్యారేజ్‌ను, బెంజ్ సర్కిల్‌లో నా జనతా గ్యారేజ్‌ని ఎవ్వడు టచ్ చేయలేడూ..
చేద్దాం అన్న ఆలోచన వచ్చినా చంపేస్తా…

* అన్న గ్యారేజ్‌లో రిపేర్లే కాదు.. అమ్మాయిల హార్టుల రికవరిలు కూడా చేసేస్తాడు..

* ఈ గ్యారేజ్ జోలికి వస్తే.. ఒక్కొక్కడి బాడీలు కృష్ణ బ్యారేజ్‌లో తేలుతాయి..

ఇక అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సంబంధించిన ఆడియో విడుదల కార్య క్రమం జరుపుకుని సెప్టెంబర్ 2 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

లేబుళ్లు:

Janatha Garage Satellite Rights Sold To MAA TV


Young Tiger Jr NTR’s ‘Janatha Garage’ is creating waves in the film industry with the latest news that the film’s satellite rights have been sold for a fancy price. The makers are happy to reveal that the leading broadcasting network MAA TV has brought the satellite rights of the film Janatha Garage for a whopping amount of RS 12.5 crores inclusive of the service tax. This is really the highest price for any of NTR’s previous films and the producers are very happy with the deal. This price is for Telugu version alone and the makers are yet to close the deal for Malayalam version.

Mythri Movie Makers are the producers behind the film. Koratala Siva is the director of the film. Mohanlal plays an important role. The film is going to release on 2nd September. The audio is expected to come out on August 12th.

లేబుళ్లు:

తమ్మూకి షాక్ : గ్యారేజ్ లో ‘కాజల్ ఐటమ్’ సాంగ్ !


న్టీఆర్ ఐటమ్ భామ మారింది. ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న “జనతా గ్యారేజ్”లో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశాడు దర్శకుడు కొరటాల. ఈ సాంగ్ లో మిల్కీబ్యూటీ తమన్నాతో అదిరిపోయే స్టెప్పులు వేయించనున్నాడు. ఇందుకు గానూ తమ్మూ రూ. 50లక్షలు పుచ్చుకొంది. ఇప్పటికే ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా కానిచ్చేశారు. భలేగొచ్చింది.. అనే ప్రచారం జరిగింది. తాజాగా, ఇదంతా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. గ్యారేజ్ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనున్నది నిజమే. కానీ.. ఆ సాంగ్ లో తమ్మూ చిందేయడం లేదు. ఎన్టీఆర్ ఐటమ్ భామగా కాజల్ ని తీసుకొన్నారు. ‘టెంపర్’ సినిమాలో ఎన్టీఆర్-కాజల్ జోడీ అదిరిపోయింది. అందుకే గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ తో హీటెక్కించేందుకు ఓకే చెప్పేసింది కాజల్. పైగా.. చాలా తక్కువ రేటుకి ఎన్టీఆర్ ఐటమ్ గా మారేందుకు ఒప్పేసుకుందట.

ఇదిలావుండగా.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావొస్తోన్న జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. మైతీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


లేబుళ్లు:

28, జులై 2016, గురువారం

NTR creates sensation


Star hero NTR is known for creating sensation with his acting skills and star power. But this time he had created sensation with a different skill set. NTR had won ‘Star as Singing Sensation’ Award in
the Mirchi Music Awards South.

Though many heroes had tried singing songs earlier just to be different or thrill fans and audience, NTR is the first hero to win an award in singing category. NTR had sung “I wanna follow follow you..’
song in his hit movie ‘Nannaku Prematho’. The song was a super hit. He also sang a song for Kannada star Puneeth Raj Kumar’s movie. He was given ‘Star as Singing Sensation’ award keeping in view his
performance in both these songs.

Now it has to be seen whether NTR will sing more songs to thrill his audience, with the energy given by Mirchi Music award.



లేబుళ్లు:

జనతాగ్యారేజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై భారీ బెట్టింగ్ జరుగుతుంది



బెట్టింగ్…మొన్నటివరకు క్రికెట్ లోనే ఈ మాటలు మనం ఎక్కువగా వింటూ వచ్చాం కానీ ఇప్పుడు సినిమాల్లో కూడా ఈ బెట్టింగ్ లు మొదలు అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొందరు సినిమాల కలెక్షన్స్ పై కూడా బెట్టింగులు వేసుకుంటున్నారట.

ఇవేవో డబ్బుల కోసం అనుకోకండి…మాములుగా మాట్లాడుకునేలాగే జరిగే బెట్టింగ్ అన్నమాట..ఈ ఇయర్ తెలుగు సినిమాల్లో తొలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమాగా పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ 21.40 కోట్లతో రికార్డు సాధించింది.

ఈ రికార్డును బ్రేక్ చేసే సత్తా మహేష్ బ్రహ్మోత్సవంలో ఉందీ అనుకున్నా ఆ సినిమా తీవ్రంగా నిరాశపరచడంతో ఇప్పుడు మరో క్రేజీ మూవీ జనతాగ్యారేజ్ పై అందరికళ్ళు పడ్డాయి. ఈ ఇయర్ భారీ పోటిలో అనుకున్న విధంగా రిలీజ్ ని సొంతం చేసుకోకపోయినా తొలిరోజు 12.60 కోట్ల వసూళ్లు సాధించాడు ఎన్టీఆర్. మరి ఇప్పుడు ముందే ఫుల్లుగా ప్రిపేర్ అయి వస్తున్న జనతాగ్యారేజ్ రిలీజ్ రోజున గబ్బర్ సింగ్ సీక్వెల్ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.


లేబుళ్లు:

26, జులై 2016, మంగళవారం

105-డిగ్రీల జ్వరంతోనూ 70 సెకన్ల నాన్ స్టాప్ ఫ్లోర్ డాన్స్ చేసిన ఎన్టీఆర్


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే టాకీ పార్ట్ పూర్తి చేసుచేశాడు. ప్రస్తుతం హైదరాబాదు తిరిగి వచ్చిన ఎన్టీఆర్ షూటింగ్ లో ఓ హై ఓల్టేజ్ సాంగ్ షూటింగ్ లో పాల్గొనగా సడెన్ గా ఫీవర్ అటాక్ అయిందట.


కాగా ఎన్టీఆర్ కి అనుకోకుండా హై ఫీవర్ 



రావడంతో పాటు అది 105 డిగ్రీలకు పాకడంతో యూనిట్ అంతా షూటింగ్ కాన్సిల్ చేయాల్సిందేనా అనుకుంటున్న సమయంలో తన జ్వరాన్ని లెక్క చేయని ఎన్టీఆర్ అలాగే సాంగ్ షూట్ లో పాల్గొన్నాడు.

సుమారు 70 సెకన్ల నాన్ స్టాప్ సింగిల్ షూట్ లో ఫ్లోర్ డాన్స్ మొత్తం చేసిన ఎన్టీఆర్ ఎక్కడా గ్రేస్ మిస్ కాకుండా చూసుకుని శెభాష్ అనిపించుకున్నాడట. ఈ నెల చివరికన్నా షూటింగ్ పూర్తి కాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 2 న రిలీజ్ కాబోతుంది.








లేబుళ్లు:

అల్లు అర్జున్ ‘నైట్..’ బిజినెస్


సినీ హీరోలు రెండు చేతుల సంపాదించడం కామన్ గా మరిపోయింది. ఇప్పుడు ఓ మెట్టెక్క్సి మూడు చేతుల సంపాదించడం మొదలెట్టేశారు. ఓ వైపు సినిమాలు. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్లుగా, ఇంకోవైపు బిజినెస్. బాలీవుడ్ స్టార్ హీరోలు స్పోర్ట్స్ పై ఫోకస్ చేశారు. టాలీవుడ్ స్టార్స్ లలో నాగార్జున హోటల్స్, రవితేజ ఇన్వెస్టుమెంట్స్, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ ఇలా పెడుతూంటే… స్టయిలీస్టార్ అల్లు అల్లు అర్జున్ ఏకంగా ‘నైట్..’ వ్యాపారం మొదలెట్టాడు. అదేనండీ.. నైట్ క్లబ్ బిజినెస్. ‘ఎమ్ కిచెన్, కేదార్ శెలగం శెట్టి’వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో కలిసి నైట్ క్లబ్ లను ప్రారంబించబోతున్నాడట బన్నీ. తొలుత దిన్ని హైదరబాద్ లో పెట్టి తర్వాత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెల 26న ఓ పెద్ద పార్టీ అరేంజ్ చేసి ఈ నైట్ క్లబ్ వివరాలను వెల్లడిస్తాడట స్టయిలీస్ స్టార్.

లేబుళ్లు:

పవన్ – మహేష్ లను దూమపానం తో పోల్చిన సంపూర్నేష్


హృదయ కాలేయం చిత్రం తో హీరోగా టాలీవుడ్ కు ఇంట్రీ ఇచ్చిన సంపూర్నేష్ బాబు , తనకంటూ ఓ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే చిత్రం తో రాబోతున్నాడు. కాగా ఈ చిన్న హీరో ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్లను కౌంటర్ వేసే స్థాయికి వచ్చి విమర్శల పాలయ్యాడు. ఇటీవల రజనీకాంత్ నటించిన కబాలి గత శుక్రవారం రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యం లో సంపూర్నేష్ ఆ చిత్రం ఫై సెటైర్ వేసాడు. ఒక్క రజని చిత్రానికే కాదు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ల చిత్రాలు కూడా వదిలిపెట్టలేదు..

ఇంతకీ అటువంటి సెటైర్ వేసాడంటే ” ”ఈ 2016 కి ఏమైంది ఓ పక్క పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ , మహేష్ బ్రహ్మోత్సవం ఇప్పుడు రజని కబాలి కూడా నోరు మెదపలేదు …………..ఈ నిర్లక్ష్య ధోరణి కి కొబ్బరిమట్ట పాడాలి చరమగీతం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు నువ్వెంత..నీ స్థాయి ఎంత..నీ రేంజ్ కి పవన్ , మహేష్ లను అనే స్థాయా అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఆగ్రహానికి సంపూ క్షేమపణలు చెపుతాడో చూడాలి మరి.


లేబుళ్లు: ,

ఫ్యాన్స్ వల్ల పరువు పోతుంది అంటున్న నాగబాబు..?


మెగా ఫ్యాన్స్ కు ఎప్పుడు అండగా ఉండే మెగా బ్రదర్ నాగబాబు , ఈ మధ్య ఫ్యాన్స్ ఫై ఫైర్ అవుతున్నాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానుల ఫై పబ్లిక్ గా మండిపడ్డ నాగబాబు , ఈసారి మెగా అభిమానుల ఫై తీవ్ర స్థాయి లో మండి పడ్డాడని తెలుస్తుంది.

నాగబాబు ఇంతలా కోపం తెచ్చుకోవడానికి కారణం..ఈ మధ్య మెగా అభిమానులు తమ హీరోల సినిమాలు వస్తే వాటి పబ్లి సిటీ కోసం తమ సొంత డబ్బును ఖర్చు పెడుతున్నారట, అంతే కాదు అప్పులు చేసి మరి తమ హీరోల సినిమాలను ప్రమోట్ చేయడం ఫై నాగబాబు ఫైర్ అయ్యాడు.

ఇక ముందు అలాంటి తప్పులు చేయకూడదని, మీ డబ్బు పంపిస్తే చెయ్యండి తప్ప మీ సొంత డబ్బు ఇలా ఖర్చు చేయదకొడదాని , ఇలా చేయడం వల్ల మీ తల్లిదండ్రుల దగ్గర మా పరువు పోతోందని ఇకపై అలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట . సడెన్ గా నాగబాబు ఇలా వార్నింగ్ ఇచ్చాడంటే వచ్చే నెల చిరంజీవి పుట్టిన రోజు ఉన్న విషయం తెలిసిందే.


లేబుళ్లు: ,

25, జులై 2016, సోమవారం

థియేటర్ లో జనతాగ్యారేజ్ టీసర్ కి రెస్పాన్స్ పీక్స్ అంటే పీక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 26 వ సినిమా జనతాగ్యారేజ్ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోకే పరిమితం అవ్వలేదు. కర్ణాటక మరియు కేరళలోనూ ఇప్పుడు సినిమా హాట్ ఫేవరేట్ అయింది. 2016 సెకెండాఫ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది జనతాగ్యారేజ్.


కాగా సినిమా పోస్ట్ పోన్ అయినా ఆ ఇంపాక్ట్ పూర్తిగా నెగటివ్ కాకుండా జాగ్రత్త పడ్డ టీం ఇప్పుడు సినిమా క్రేజ్ ని తిరిగి ఎంజాయ్ చేస్తుంది. తెలుగుతో పాటు మలయాళంలోనూ రిలీజ్ అవ్వబోతున్న జనతాగ్యారేజ్ రీసెంట్ గా టీసర్ ని మలయాళంలో థియేటర్లో ప్రదర్శించారు.

అది ఎవరి సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి సినిమాతో కేరళలో మొత్తం రిలీజ్ అయిన థియేటర్స్ లో ప్రదర్శించగా అక్కడ రెస్పాన్స్ పీక్స్ లో వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్ కం చెబుతూ అందరూ మోహన్ లాల్ కి ఇచ్చే రెస్పెక్ట్ ని ఎన్టీఆర్ కి కూడా ఇచ్చారట.

మలయాళ వర్షన్ లో కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉండటం వల్ల అదీ మోహన్ లాల్ దే అవ్వడం వల్ల రెస్పాన్స్ మరింత క్రేజీగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. కబాలితో పాటు జనతాగ్యారేజ్ ని కేరళ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మోహన్ లాల్ ఈ సినిమాతో అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు ఎన్టీఆర్ కి కూడా మంచి బ్రేక్ ఇచ్చేలా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట.


లేబుళ్లు:

ఒక్క బాలయ్యకి తప్ప అందరికీ హ్యాండిచ్చిన నయనతార


నటి నయనతారకు అదేం అలవాటో తెలీదు కానీ.. ఈ అమ్మడు ఇప్పటివరకు తాను నటించిన ఏ తెలుగు సినిమానీ ప్రమోట్ చేసిందిలేదు. అంతెందుకు.. గ్రాండ్‌గా నిర్వహించే ఆడియో వేడుకలకు కూడా ఆమె అటెంట్ అవ్వదు. ఒక్క సినిమాకి తప్ప.. మరే మూవీ ఆడియో లాంచ్‌కి ఈమె రాలేదు. ఇందుకు సరైన కారణం తెలీదు కానీ.. ఇలా హాజరుకాకపోవడం పట్ల మాత్రం యూనిట్‌తోపాటు ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ‘బాబు బంగారం’ ఆడియో వేడుకకి ఈమె హాజరు కాకపోవడంతో.. మళ్ళీ ఆమె టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

సాధారణంగా జరిగే ఆడియో ఈవెంట్లలో హీరోయిన్లే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. వీరిలా హాజరు కావడం వల్ల యూనిట్, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేయడమే కాదు.. ఆయా భామల క్రేజ్ కూడా పెరుగుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే.. వాళ్ళకే లాభం. అయినా కూడా నయన ఇలాంటి ఈవెంట్లకు హాజరవ్వదు. గతంలో కొన్ని ఆడియో ఈవెంట్లకు ఈమె అటెండ్ కాకపోవడంతో ఫ్యాన్సే కాదు.. ఆయా సినిమాల యూనిట్స్ కూడా మండిపడ్డాయి. అంతెందుకు.. స్వయంగా రామానాయుడు లాంటి పెద్దాయనే ఓసారి నయనతారను ఉద్దేశించి గట్టిగానే విమర్శలు గుప్పించారు. తమ బేనర్లో తీసిన ‘తులసి’ ఆడియో వేడుకకు నయన్ రాకపోవడంపై స్పందిస్తూ.. పరోక్షంగా ఆమెకు కౌంటర్ ఇచ్చారు. అయినా నయనలో ఏ మార్పూ లేదు. ఆదివారం (24-07-2016) రాత్రి జరిగిన ‘బాబు బంగారం’ ఆడియో వేడుకకైనా నయన వస్తుందని భావించారు కానీ.. ఈసారి కూడా ఆమె హ్యాండ్ ఇవ్వడంతో వెంకీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఒక్క బాలయ్యకి మాత్రం ఈమె హ్యాండ్ ఇవ్వలేదు.

తెలుగులో పదికి పైగా సినిమాలు చేసిన నయన.. ఒక్క ‘శ్రీరామరాజ్యం’ ఆడియో వేడుకకు మాత్రమే వచ్చింది. ఆ సినిమాకు రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉందిలెండి. తనకున్న సెక్సీ ఇమేజ్‌ను పట్టించుకోకుండా సీత పాత్ర ఇచ్చి.. తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను అందించినందుకు బాపుగారికి కృతజ్ఞత చెప్పుకోవడం కోసమే ఆమె హాజరయ్యింది. ఇలా ఈ విధంగా ఒక్క బాలయ్యకు నయనతారను తన ఆడియో వేడుకలో చూసే అదృష్టం దక్కిందన్నమాట.


లేబుళ్లు:

మైక్రోమ్యాక్స్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్..


ప్రముఖ సంస్థ మైక్రోమ్యాక్స్ తాజాగా ఓ నూతన ‘ఇగ్నైట్ ఎల్‌పీక్యూ61’ పేరిట సరికొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ.18,990 లకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. దీని ఫీచర్ల ఫై ఓ లుక్ వేస్తే..

* 14 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1366 X 768 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* క్వాడ్‌కోర్ ఇంటెల్ పెంటియం ప్రాసెస‌ర్‌
* 4 జీబీ ర్యామ్‌, 1 టీబీ హార్డ్ డిస్క్‌, విండోస్ 10 ఓఎస్‌
* 1 మెగాపిక్స‌ల్ వెబ్‌క్యామ్‌, డ్యుయ‌ల్ స్పీక‌ర్స్‌, వైఫై, బ్లూటూత్ 4.0
* యూఎస్‌బీ 3.0 పోర్ట్స్‌, మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్‌, ల్యాన్ పోర్ట్‌,
* 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఫీచ‌ర్లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.


లేబుళ్లు:

ఇంజినీరింగ్ చేయాలనుకునే స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్


ఇంజినీరింగ్, ఫార్మా కోర్స్ లు చేయాలనుకునే విద్యార్థులకు తీపి కబురు తెలియజేసారు రాష్ట్ర ఎంసెట్ కన్వీనర్. తెలంగాణ రాష్ట్రం లో ఇంజినీరింగ్, ఫార్మా సీట్లకు ఆప్షన్ల గడువు ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ నెల 28న రాత్రి 10 గంటల వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 29న తుదివిడత సీట్ల కేటాయింపు చేస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31లోగా కాలేజీలో చేరాలని సూచించారు.

లేబుళ్లు:

ఎక్కడ చూసిన జనతాగ్యారేజ్ హవానే

‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ కున్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చిన్న వయసులోనే హై రేంజ్ మాస్ ఆడియన్స్ ఆదరణ పొందిన హీరోగా జూనియర్ నిలిచారు. అయితే ఒక్కసారి వచ్చిన ఆ ‘మాస్’ స్టార్ డం తర్వాత కాలంలో జూనియర్ కే మైనస్ అయ్యాయి.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ ఇటీవల క్లాస్ బాట పట్టారు. అయితే తాజాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులకు తన మాస్ రేంజ్ ఏంటో చూపించడానికి జూనియర్ సిద్ధమవుతున్నారు. ‘జనతా గ్యారేజ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ మెకానిక్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో మెకానిక్ లుగా ఉన్న జూనియర్ అభిమానులు తమ షెడ్ల పేర్లను ‘జనతా గ్యారేజ్’లుగా మార్చుకుంటున్నారు. తాజాగా అలాంటి షెడ్లలో ఒకటైన ‘జనతా గ్యారేజ్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. జూలై 6వ తేదీన ‘ఈద్’ సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కానున్న నేపధ్యంలో ఇలాంటి ఫోటోలు అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

లేబుళ్లు:

24, జులై 2016, ఆదివారం

సెప్టెంబర్ చివర్లో మొదలుకాబోతున్న యంగ్ టైగర్ సరికొత్త సంచలనం


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో ఓ గుర్తింపు ఉంది, తన సినిమాల్లో ఎక్కువ ఎక్స్ పెరిమెంట్లు చేసిన తొలి హీరో అని చెప్పొచ్చు, చేసిన 25 సినిమాల్లో ఎవ్వరూ చేయని పాత్రలను కొన్ని ఎన్టీఆర్ చేసి మెప్పించాడు.


కాగా ఇప్పుడు మరో కొత్త పాత్రకి సిద్ధం


అవుతున్న యంగ్ టైగర్ ఆ సినిమాను మొదలుపెట్టడానికి ఇప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడట. కెరీర్ లో తొలిసారిగా ఓ థ్రిల్లర్ లో నటించబోతున్నాడు యంగ్ టైగర్.

వక్కంతం వంశీ లాంటి టాలెంటెడ్ స్టొరీ రైటర్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ ని ఇప్పటివరకు ఎవ్వరూ చూపించనంత కొత్తగా చూపించాలని ఫిక్స్ అయిన వంశీ ఇందులో అది చేసి చూపించబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ చివర్లో సెట్స్ పైకి వెళ్లి సమ్మర్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


లేబుళ్లు:

ఎన్టీఆర్ లేడీ ఫాలోయింగ్ కేకో కేక

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కెరీర్ మొదటి నుండీ మాస్ లోనే భారీ క్రేజ్ ఉంది, మిగతా హీరోలు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమాలు చేసి టాప్ స్టార్స్ అయితే ఎన్టీఆర్ కి మాత్రం కేవలం మాస్ ఫాలోయింగ్ తోనే స్టార్ స్టేటస్ అయ్యింది.

కానీ ప్రతీసారి మాస్ సినిమాలు చేయడం అంతమంచిది కాదని తెలుసుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో అన్ని వర్గాలకు చేరువ అయ్యాడు. ఇప్పుడు మిగిలిఉన్న లేడీ ఫాలోయింగ్ ని కూడా సొంతం చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు.

లేటెస్ట్ గా జనతాగ్యారేజ్ సెట్స్ లో లేడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ తో ఫోటోగ్రాఫ్ కోసం బారులు తీరగా వారిలో కొందరికి ఎన్టీఆర్ తో ఫోటో దిగే చాన్స్ దక్కింది. ఎన్టీఆర్ అంటే మాకు చాలా ఇష్టమని చెబుతున్నారు ఆ ఫ్యాన్స్. సినిమా రిలీజ్ కాకుండానే ఇలా ఉంటే రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ కి ఎంత ఫాలోయింగ్ పెరుగుతుందో అని అంతా అనుకుంటున్నారు.


లేబుళ్లు:

కలం పట్టిన పవన్ : సినిమా మళ్లీ ప్లాప్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” కోసం కలం పట్టిన విషయం తెలిసిందే. పవన్ సొంతంగా సర్థార్ స్క్రిప్టు వర్క్ చేశాడు. తీరా ‘సర్థార్’ రిలీజై ప్లాప్ సినిమాగా తేలింది. సర్థార్ – గబ్బర్ సింగ్ పరాజయానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని సినీ విమర్శకులు ఆరోపించారు. ఇప్పుడు మరోసారి పవన్ కలం పట్టాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి స్క్రిప్టుని రెడీ చేసే పనిలో పడ్డాడు పవన్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నాడు. ఇదో ఫ్యాక్షనిస్టు ప్రేమకథ అని చెబుతున్నారు. టైటిల్ ‘కడప కింగ్’ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కూడా పవన్ స్క్రిప్టు అందించడంతో.. సెట్స్ పైకి వెళ్లక ముందే సెంటిమెంట్ పరంగా.. ఈ సినిమా కూడా ప్లాప్ అనే స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడీ న్యూస్ పవన్ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. మరికొందరు మాత్రం ఈసారి పవన్ స్క్రిప్ట్ కి పదనుపెడుతున్నాడు. ఈసారి పవన్ స్క్రిప్టు, సినిమా రెండూ హిట్టే అని చెప్పుకొంటున్నారు. చివరికి పవన్ సినిమా ఫలితం ఏమొస్తుందో చూడాలి.

లేబుళ్లు:

బ్రేకప్ : భర్తతో విడాకులకు రెడీ అయిన అమలాపాల్

ముద్దుగుమ్మ అమలాపాల్ ప్రేమ-పెళ్లి వ్యవహారం గురించి తెలిసిందే. దర్శకుడు ఎఎల్ విజయ్ తో దాదాపు మూడేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నారు. విజయ్ దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లో అమలాపాల్ హీరోయిగా చేసింది. విజయ్ హిందూ, అమలాపాల్ క్రిస్టియన్.. అయినా పెద్దలని ఒప్పించి జూన్ 12, 2014న వీరిద్దరు ఒక్కటయ్యారు. ఓ సంవత్సరం పాటు అన్యోన్యంగా సాగిన.. వీరి దాంపత్య జీవితం ఆ తర్వాత.. మనస్పర్థలు చోటు చేసుకొని.. యేడాది కాలంగా దూరంగానే ఉంటున్నట్టు సమాచారమ్. తాజాగా, విజయ్ తో విడిపోవాలనే నిర్ణయానికి అమలా వచ్చినట్టు సమాచారమ్.

లేబుళ్లు:

సునీత భర్త గురించి సంచలన వాఖ్యలు..


తన స్వీట్ వాయిస్ తో పాటల ప్రపంచంలో విహరించే సునీత పర్శనల్ లైఫ్ గొప్పగా ఏమీ లేదంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె విడాకులకు తీసుకోన్నట్లు వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సునీత ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి సంచలన వాఖ్యలు చేసింది.. సునీత ఏమన్నదో ఆమె మాటల్లోనే…

మోసం చేసే లక్షణం నా భార్తకు ఉండటం వలన దూరం పెట్టాల్సి వచ్చింది. మనుషులు మారతారేమో అని ఎదురు చూశాను.. మారలేదు. నేను విడాకులు తీసుకున్నానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. విడి విడిగా ఉంటున్నాం. ఒకప్పుడైతే.. భర్త గురించి చెప్పేదాన్ని కాదేమో. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే నా సహనాన్ని పీక్స్‌లో పరీక్షించాడు. ఎవరికీ తెలియకుండా ఎంత ఏడ్చానో నాకే తెలుసు. ‘తిన్నావా.. ఏ సినిమా చూశావ్? ఎలా ఉన్నావ్?’ అని కొడుక్కి ఫోన్ చేసి, మాట్లాడతాడు. ఫైనాన్షియల్‌గా కాకపోయినా పిల్లాడికి ఏ కాలేజ్  మంచిది? ఏం చేస్తే మంచిది?.. ఇవన్నీ మాత్రం పట్టించుకోడు.

రీసెంట్‌గా నా భర్తతో మాట్లాడాను. ‘ఎందుకిలా?.. డబ్బుల గురించి వదిలెయ్. బాధ్యత తీసుకో. పిల్లాడు పెద్ద చదువులకు వెళుతున్నాడు. గెడైన్స్ ఇవ్వు’ అన్నాను. ‘నాకంటే నీకు బాగా తెలుసు కదమ్మా’ అన్నాడు. తప్పించుకునే తత్వం అది. ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది ‘నీకు నేను ఉన్నాను’ అనే నమ్మకం. పక్కన ఉంటూనే దారుణంగా మోసం చేశాడు. ఏ మనిషికైనా మారడానికి కాస్త టైం ఇవ్వాలి. ఎక్కువ టైమ్ ఇచ్చి చూశాను కాబట్టి.. ఇప్పుడు అతని గురించి ఓపెన్‌గా మాట్లాడా.

నా భర్త వల్లే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నానని కూడా వార్తలు వచ్చాయి. నాకు ఒక్క పైసా అప్పు చేసే అలవాటు లేదు. ఉంటే తింటాను. లేకపోతే లేదు. నా డిగ్నిటీని వదులుకునే పనులు ఏ రోజూ చేయలేదు. చేయను. అలాంటిది సునీత ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉందని చెప్పి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. ‘సునీత నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి లేదు. వారం రోజులుగా హాస్పిటల్‌లో ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అని చెప్పుకున్నవాడు విడాకులు ఎందుకు ఇవ్వడం లేదు అని సునీత ప్రశ్నించింది.


లేబుళ్లు:

కబాలిని టొరంటోలో డౌన్‌లోడ్‌ చేయబోతే..

సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు పండగరోజుగా ఆయన హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు కనివినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా, ఆ క్రేజ్ ఏ స్థాయిదో ఋజువుచేస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది.


 కలెక్షన్స్‌తో ‘కబాలి’ మొదటిరోజు రికార్డు సృష్టించింది. వైపు రజనీ సినిమాపై ఎప్పటిలాగే జోక్స్‌, ఛలోక్తులు ఆన్‌లైన్‌లో వీరవిహారం చేస్తున్నాయి. ట్విట్టర్‌ను చక్కిలిగింతల్లో ముంచెత్తుతున్న ఆ క్రేజీ జోక్స్ మీకోసం..

’కబాలి సినిమాను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. వెంటనే టోరంటో అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది. సిస్టం ఫార్మెట్‌ అయిపోయింది. వై-ఫై క్రాష్ అయింది. సమీపంలో ఉన్న ఎయిర్‌టెల్ టవర్ మాయమైంది’  

’మీ అక్రమంగా రజనీకాంత్ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేస్తే.. ఓ వైరస్ బయటకొచ్చి మీ చెంపఛెళ్లుమనిపిస్తుంది. మిమ్మల్ని వెంటనే పట్టుకెళ్లి రజనీ సినిమా నడుస్తున్న థియేటర్‌లో పడేస్తుంది’

‘అందరి సినిమాలు మొదట విడుదలై తర్వాత టోరంటోలో లీకవ్వుతాయి. కానీ రజనీ సినిమా టోరంటోలో లీకైన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది’.


లేబుళ్లు:

పైసా తీసుకోకుండా సినిమా చేస్తున్న హీరో ఎన్టీఆర్ గ్రేట్..!!

సాదారణంగా ఒక్క హిట్ పడ్డ హీరో అయినా ఇంకెవరైనా తమ తరువాత సినిమాకు ఓ రేంజ్ లో చార్జ్ చేస్తారు. అదే రెండు హిట్లు పడితే ఇక వారి రెమ్యునరేషన్ చుక్కలో అంచులలో ఉంటుంది. కానీ యంగ్ టైగర్ లాంటి స్టార్ హీరో టెంపర్-నాన్నకుప్రేమతో లాంటి రెండు వరుస హిట్లు పడ్డాక కూడా ఇప్పుడు చేస్తున్న జనతాగ్యారేజ్ సినిమాకు పైసా కూడా చార్జ్ చేయడం లేదు.


మిర్చి-శ్రీమంతుడు లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్టు 12 న రిలీజ్ చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ ఇద్దరు పైసా కూడా తీసుకోకుండా సినిమాకి పని చేస్తున్నారట. దానికి బదులు సినిమాకు వచ్చే కలెక్షన్స్ లో వాటా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. దాంతో సినిమా మొత్తం 30 కోట్లలోపు బడ్జెట్ లోనే పూర్తి కాబోతుంది.టాలీవుడ్ హీరోలు అందరూ ఎన్టీఆర్ రూట్ ని ఫాలో అయితే ఇలా బడ్జెట్ భాదలు డిసాస్టర్ భాదలు తక్కువ అవుతాయి.


లేబుళ్లు:

ఎన్టీఆర్, తమన్నాలపై దేవి దుమ్ములేపే ఐటెం.. ఫ్యాన్స్‌కి పండగే!




రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడంటే ఆ సినిమా స‌గం విజ‌యం ఖాయం అనే భావ‌న ఉంది. ఇక దేవి అందించే పాట‌ల‌న్ని ఒక ఎత్తు అయితే…ఐటెం సాంగ్ మ‌రో ఎత్తు. ఇప్ప‌టికే చాలా సినిమాల‌లో ఐటెం సాంగ్ ల‌ను ఇర‌గ‌దీశాడు. తాజాగా ఆయ‌న సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా జ‌న‌తాగ్యారేజ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం కూడా ఓ అదిరిపోయే బీట్ తో ఐటెం సాంగ్ ని ఇచ్చాడని తెలుస్తోంది. కొత్త టైప్ సౌండ్ ట్రాక్ తో డీఎస్పీ ఇచ్చిన బీట్ విన్న యంగ్ టైర్ ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ విపరీతంగా ఎగ్జైట్ అయ్యారట. తమ సినిమాలో ఈ మ్యూజిక్ ని కచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిందే అనే రేంజ్ లో డీఎస్పీ మరిపించేశాడని అంటున్నారు. ఈ ఐటెం సాంగ్ లో ఎన్టీఆర్..మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో చిందులేయ‌నున్నాడ‌ట‌.

గ‌తంలో ఎన్టీఆర్‌తో త‌మ్మూ ఊస‌ర‌వెల్లి సినిమాలో ఆన్‌స్ర్కీన్ రొమాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గ్యారేజ్‌లో మ‌రోసారి ఆడిపాడేందుకు రెడీ అవుతోంది. గ‌తంలో అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ తో అలరించిన ఈ బ్యూటి ఇప్పుడు జనతా గ్యారేజ్ కు మరింత గ్లామర్ యాడ్ చేయనుంది.

లేబుళ్లు:

కబాలి ఫస్ట్ డే కలెక్షన్స్.. రూ.64కోట్లు !


ఎన్నో అంచనాల మధ్య రిలీజైన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ‘కబాలి’.. ఊసురుమనిపించింది. కానీ.. కలెకషన్ల మాత్రం ఆగలేదు. కబాలికి భారీ పెనింగ్స్ దక్కాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 64కోట్లుగా తేలింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 17కోట్లు. తమిళ్ లో రూ. 19కోట్లు. యూఎస్, కెనడ లలో ప్రీమియర్ షోల ద్వారా రూ. 13కోట్లు, హిందీలో రూ. 7కోట్లు. ఓవర్సీస్ లో రూ. 8 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది కబాలి. ఫస్ట్ కలెక్షన్స్ లో పెద్దగా తేడా వచ్చే అవకాశమేమీ ఉండదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. టాక్ తో పనిలేకుండా రజనీ సినిమాని ఓసారి చూసేయాలని ప్రేక్షకులు ఫిక్సయిపోయినట్టున్నారు.

లేబుళ్లు:

పవన్ కళ్యాణ్ కు మరో రేణుదేశాయ్ దొరికిందా..?


పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో ఇప్పటికి వరకు తనతో నటించిన హీరోయిన్ తో మరోసారి జోడి కట్టలేదు. ఒక్క రేణు దేశాయ్ తో తప్ప. అలాంటిది ఇప్పుడు ఇదివరకే తన పక్కన నటించిన హీరోయిన్ కి మరోసారి నటించే అవకాశం ఇవ్వడం తో మరోసారి పవన్ కు రేణు దేశాయ్ దొరికింది అనే కామెంట్స్ వేస్తున్నారు. అసలు స్టోరీ ఏంటి అంటే..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ ఫైకి వెళ్లనుంది.

కాగా ఈ చిత్రం లో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తుందని నిర్మాత శరత్ మరార్ ప్రకటించడం తో , ఇప్పటి వరకు పవన్ తన సినీ కెరీర్ లో మాజీ భార్య రేణుదేశాయ్ మినహా మారే హీరోయిన్ తోను రెండవసారి జోడి కట్టలేదు.అలాంటిది శృతి తో కట్టడం తో పవన్ కు మరో రేణు దొరికింది అని కామెంట్స్ వేస్తున్నారు.


లేబుళ్లు:

అనుష్క కోసం.. ఎన్టీఆర్ విల‌న్ ?


అనుష్క లీడ్ రోల్ తెరకెక్కుతోన్న చిత్రం “భాగమతి”. ఆశోక్ ద‌ర్శ‌కుడు. యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. ఇందులో ఎన్టీఆర్ విల‌న్ నటించనున్నాడు. అదేనండీ.. ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్”లో విలన్ గా నటిస్తున్నాడు ఉన్నిముకుందన్. ఇప్పుడీ విలన్ అనుష్క భాగమతిలో కథానాయకుడిగా ఎంపికయ్యాడు. భాగమతి హీరో కోసం చాలా పేర్లుని పరిశీలించిన చిత్రబృందం చివరికి ఎన్టీఆర్ విల‌న్ నే హీరోగా తీసుకొన్నారు. ఆగస్టు 14 నుంచి ముకుందన్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

లేబుళ్లు:

స్టూడెంట్ పుట్టినరోజు కానుకగా పడక సుఖాన్ని పంచిన టీచర్


ఏది మంచో, ఏది చెడో నేర్పించాల్సిన కొంత మంది గురువులు ఈ మధ్య శృంగార పాఠాలు నేర్పించి వారిని పక్క దారి పట్టిస్తున్నారు. ఇది చాలనట్లు ఏకంగా వారితోనే పడక సుఖాన్ని పంచుకుంటు గురువుల పేరు ను చెడకొడుతున్నారు..

ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా అమెరికా లో జరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఓ టీచర్ తన దగ్గర చదవు నేర్చుకునే స్టూడెంట్ పుట్టిన రోజు కానుకగా అతడితో పడక సుఖాన్ని పంచి వార్తల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళ్తే

లూయిస్ బర్గ్ ఏరియా హై స్కూల్ లో చదువుకునే అన్నదమ్ములలోఒకరిది పుట్టినరోజు కావడం తో తన సోదరుడికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బావుంటుందని రెండో సోదరుడు ఫేస్ బుక్ ద్వారా టీచర్ ను అడగగా అందుకు ఆమె ఇచ్చిన సలహా ఏమిటంటే.. పుట్టినరోజు కానుకగా మీ సోదరుడి తో శృంగారం లో పాల్గొంటానని చెప్పింది. అంతేకాదు రెండు వేర్వేరు సందర్భాలలో 17, 15 ఏళ్ల వయస్సు ఉన్న ఆ సోదరులతో శృంగారం లో పాల్గొంది. ఈ విషయం కాస్త బయటకు తెలియడం తో రంగం లోకి దిగిన పోలీసులు సదరు టీచర్ ని అరెస్ట్ చేసి జైల్ కు తరలించారు.


లేబుళ్లు:

Janatha Garage Promotional Video Song Exclusive


Janatha Garage promotional song

Mr.Sambangi Productions in association with A1 Dimension Frames
Music : Kesava Kiran
Lyrics : Kishore Babu Sambangi
Singers : Singer Revanth Kumar and Princy Teju Priya
Rap : Kesava Kiran
Cinematographer : Avinash Sunny
Choreographer : Vijay Kumar
Art : Vamc Gudavalli
Editing : CarthiC & Sai - CS Cuts Karthik Kilaparthi Sai Kiran Muddam
Assistant DOP: Rakesh Pal

Watch & Enjoy Thalaiva NTR Fans
#JanathaGarage Promptional Song



లేబుళ్లు:

23, జులై 2016, శనివారం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ “జనతాగ్యారేజ్” లేటెస్ట్ అప్ డేట్

మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో నికార్సయిన మాస్ సినిమా చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధం అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ సింహాద్రిని మరిపించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో ఆ కోరికని తీర్చుకోవాలి అనుకుంటున్నాడు.




ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో 90% షూటింగ్ పూర్తి అయిందట. సినిమాలో ఇంకా బ్యాలెన్స్ ఉన్నవల్లా 3 పాటలు మరియు చివరి హై ఓల్టేజ్ ఫైట్ సీన్స్ మాత్రమే నట. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి అవ్వడంతో మొదట సాంగ్స్ షూట్ చేయబోతున్నారట.

తరువాత మిగిలిన ఫైట్ సీన్స్ ని షూట్ చేస్తే సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారని అంటున్నారు. ఈ పనులన్నీ జులై 28 లోపు అయిపోతాయట. ఆగస్టు 2 వ వారంలో  సినిమా ఆడియోని రిలీజ్ చేసి సెప్టెంబర్ 2 న వరల్డ్ వైడ్ గా సినిమాను అత్యంత భారీస్థాయిలో రిలీజ్ కాబోతుంది.

లేబుళ్లు:

స్క్రిప్ట్ ను విసిరేసిన నాగార్జున… కారణం ఏంటో?


ఈ మద్య నాగార్జున డిప్రెషన్ లో ఉన్నట్టున్నాడు. తనయుల లవ్ స్టోరీలు నాగ్ కి తలనొప్పియా మారాయేమో అనుకుంటున్నారు. తాజాగా, నాగ్ స్క్రిప్ట్ ని గాల్లో విసిరేయడం షాక్ కి గురిచేసింది. ఏ దర్శకుడికో మూడినట్టే అనుకున్నారు. ఇదేదో పర్శనల్ మేటర్ కాదు. ‘నిర్మలా కాన్వెంట్’సినిమా గురించి. శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త టీజర్ విడుదలైయింది. ఈ టీజర్ ని నాగార్జున పై కట్ చేశారు. “షూటింగ్ జరుగుతున్న సమయంలో నాగార్జున కు స్క్రిప్ట్ పేపర్ల అందిస్తే అవి గాలిలోకి విసిరేసే సీన్” ని టీజర్ గా కట్ చేశారు. నాగ్ ఇలా స్క్రిప్ట్ పేపర్లని గాలో విసిరేయడానికి కారణమేంటి.. ? అది కూడా నాగ్ నే చెబుతాడట. స్క్రిప్ట్ విసిరివేతపై నాగ్ క్లారిటీ ఏమిస్తాడనేది ఆసక్తిగా మారింది.


లేబుళ్లు:

హీరోయిన్ మనుసు దోచిన కేటీఆర్‌..


వెండి తెర ఫై హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే మరోపక్క మేము సైతం అనే ప్రోగ్రామ్ తో కష్టాలలో ఉన్న వారిని ఆదుకుంటూ బాగా పాపులర్ అయిన మంచు లక్ష్మి , తాజాగా తెలంగాణ ఐటీ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఫై ప్రశంసలు జల్లు కురిపించింది. “నాతో సహా ఎవరి పుట్టిన రోజులకు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయరాదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంచు లక్ష్మి స్పందించింది. కేటీఆర్ లాంటి లీడర్లు ఎంతో మంది తెలుగు రాష్ట్రాలకు అవసరమన్నారు.

లేబుళ్లు:

జక్కన్న ఎన్టీఆర్ తో మొదలెట్టాడు…ఇప్పుడు కొడుకు కూడా….



ఇప్పుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ కూడా ఎన్టీఆర్ తోనే తన కెరీర్ ని మొదలుపెట్టాలని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడట. ఇన్నాళ్ళు తండ్రికి హెల్ప్ గా ఉంటూనే తెరవెనుక పనులతో బిజీగా ఉన్న కార్తీకేయ ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు.

అది ఎన్టీఆర్ తోనే మొదలుపెట్టి తన తండ్రి అడుగుజాడల్లో నడవాలి అని అనుకుంటున్నాడు కార్తీకేయ. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం కథ రాసుకుంటున్న కార్తీకేయ త్వరలోనే ఎన్టీఆర్ కి ఆ కథని వినిపించబోతున్నాడట. మరి ఎన్టీఆర్ ముందు జక్కన్నతో చేస్తాడా లేక జక్కన్న తనయుడితో చేస్తాడో చూడాలి.

లేబుళ్లు: