పవన్ – మహేష్ లను దూమపానం తో పోల్చిన సంపూర్నేష్


హృదయ కాలేయం చిత్రం తో హీరోగా టాలీవుడ్ కు ఇంట్రీ ఇచ్చిన సంపూర్నేష్ బాబు , తనకంటూ ఓ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే చిత్రం తో రాబోతున్నాడు. కాగా ఈ చిన్న హీరో ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్లను కౌంటర్ వేసే స్థాయికి వచ్చి విమర్శల పాలయ్యాడు. ఇటీవల రజనీకాంత్ నటించిన కబాలి గత శుక్రవారం రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యం లో సంపూర్నేష్ ఆ చిత్రం ఫై సెటైర్ వేసాడు. ఒక్క రజని చిత్రానికే కాదు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ల చిత్రాలు కూడా వదిలిపెట్టలేదు..

ఇంతకీ అటువంటి సెటైర్ వేసాడంటే ” ”ఈ 2016 కి ఏమైంది ఓ పక్క పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ , మహేష్ బ్రహ్మోత్సవం ఇప్పుడు రజని కబాలి కూడా నోరు మెదపలేదు …………..ఈ నిర్లక్ష్య ధోరణి కి కొబ్బరిమట్ట పాడాలి చరమగీతం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు నువ్వెంత..నీ స్థాయి ఎంత..నీ రేంజ్ కి పవన్ , మహేష్ లను అనే స్థాయా అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఆగ్రహానికి సంపూ క్షేమపణలు చెపుతాడో చూడాలి మరి.


కామెంట్‌లు