అనుష్క కోసం.. ఎన్టీఆర్ విల‌న్ ?


అనుష్క లీడ్ రోల్ తెరకెక్కుతోన్న చిత్రం “భాగమతి”. ఆశోక్ ద‌ర్శ‌కుడు. యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. ఇందులో ఎన్టీఆర్ విల‌న్ నటించనున్నాడు. అదేనండీ.. ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్”లో విలన్ గా నటిస్తున్నాడు ఉన్నిముకుందన్. ఇప్పుడీ విలన్ అనుష్క భాగమతిలో కథానాయకుడిగా ఎంపికయ్యాడు. భాగమతి హీరో కోసం చాలా పేర్లుని పరిశీలించిన చిత్రబృందం చివరికి ఎన్టీఆర్ విల‌న్ నే హీరోగా తీసుకొన్నారు. ఆగస్టు 14 నుంచి ముకుందన్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

కామెంట్‌లు