సునీత భర్త గురించి సంచలన వాఖ్యలు..


తన స్వీట్ వాయిస్ తో పాటల ప్రపంచంలో విహరించే సునీత పర్శనల్ లైఫ్ గొప్పగా ఏమీ లేదంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె విడాకులకు తీసుకోన్నట్లు వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సునీత ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి సంచలన వాఖ్యలు చేసింది.. సునీత ఏమన్నదో ఆమె మాటల్లోనే…

మోసం చేసే లక్షణం నా భార్తకు ఉండటం వలన దూరం పెట్టాల్సి వచ్చింది. మనుషులు మారతారేమో అని ఎదురు చూశాను.. మారలేదు. నేను విడాకులు తీసుకున్నానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. విడి విడిగా ఉంటున్నాం. ఒకప్పుడైతే.. భర్త గురించి చెప్పేదాన్ని కాదేమో. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే నా సహనాన్ని పీక్స్‌లో పరీక్షించాడు. ఎవరికీ తెలియకుండా ఎంత ఏడ్చానో నాకే తెలుసు. ‘తిన్నావా.. ఏ సినిమా చూశావ్? ఎలా ఉన్నావ్?’ అని కొడుక్కి ఫోన్ చేసి, మాట్లాడతాడు. ఫైనాన్షియల్‌గా కాకపోయినా పిల్లాడికి ఏ కాలేజ్  మంచిది? ఏం చేస్తే మంచిది?.. ఇవన్నీ మాత్రం పట్టించుకోడు.

రీసెంట్‌గా నా భర్తతో మాట్లాడాను. ‘ఎందుకిలా?.. డబ్బుల గురించి వదిలెయ్. బాధ్యత తీసుకో. పిల్లాడు పెద్ద చదువులకు వెళుతున్నాడు. గెడైన్స్ ఇవ్వు’ అన్నాను. ‘నాకంటే నీకు బాగా తెలుసు కదమ్మా’ అన్నాడు. తప్పించుకునే తత్వం అది. ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది ‘నీకు నేను ఉన్నాను’ అనే నమ్మకం. పక్కన ఉంటూనే దారుణంగా మోసం చేశాడు. ఏ మనిషికైనా మారడానికి కాస్త టైం ఇవ్వాలి. ఎక్కువ టైమ్ ఇచ్చి చూశాను కాబట్టి.. ఇప్పుడు అతని గురించి ఓపెన్‌గా మాట్లాడా.

నా భర్త వల్లే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నానని కూడా వార్తలు వచ్చాయి. నాకు ఒక్క పైసా అప్పు చేసే అలవాటు లేదు. ఉంటే తింటాను. లేకపోతే లేదు. నా డిగ్నిటీని వదులుకునే పనులు ఏ రోజూ చేయలేదు. చేయను. అలాంటిది సునీత ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉందని చెప్పి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. ‘సునీత నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి లేదు. వారం రోజులుగా హాస్పిటల్‌లో ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అని చెప్పుకున్నవాడు విడాకులు ఎందుకు ఇవ్వడం లేదు అని సునీత ప్రశ్నించింది.


కామెంట్‌లు