కబాలి ఫస్ట్ డే కలెక్షన్స్.. రూ.64కోట్లు !


ఎన్నో అంచనాల మధ్య రిలీజైన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ‘కబాలి’.. ఊసురుమనిపించింది. కానీ.. కలెకషన్ల మాత్రం ఆగలేదు. కబాలికి భారీ పెనింగ్స్ దక్కాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 64కోట్లుగా తేలింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 17కోట్లు. తమిళ్ లో రూ. 19కోట్లు. యూఎస్, కెనడ లలో ప్రీమియర్ షోల ద్వారా రూ. 13కోట్లు, హిందీలో రూ. 7కోట్లు. ఓవర్సీస్ లో రూ. 8 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది కబాలి. ఫస్ట్ కలెక్షన్స్ లో పెద్దగా తేడా వచ్చే అవకాశమేమీ ఉండదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. టాక్ తో పనిలేకుండా రజనీ సినిమాని ఓసారి చూసేయాలని ప్రేక్షకులు ఫిక్సయిపోయినట్టున్నారు.

కామెంట్‌లు