ఇంజినీరింగ్, ఫార్మా కోర్స్ లు చేయాలనుకునే విద్యార్థులకు తీపి కబురు తెలియజేసారు రాష్ట్ర ఎంసెట్ కన్వీనర్. తెలంగాణ రాష్ట్రం లో ఇంజినీరింగ్, ఫార్మా సీట్లకు ఆప్షన్ల గడువు ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ నెల 28న రాత్రి 10 గంటల వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 29న తుదివిడత సీట్ల కేటాయింపు చేస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31లోగా కాలేజీలో చేరాలని సూచించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి