అల్లు అర్జున్ ‘నైట్..’ బిజినెస్


సినీ హీరోలు రెండు చేతుల సంపాదించడం కామన్ గా మరిపోయింది. ఇప్పుడు ఓ మెట్టెక్క్సి మూడు చేతుల సంపాదించడం మొదలెట్టేశారు. ఓ వైపు సినిమాలు. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్లుగా, ఇంకోవైపు బిజినెస్. బాలీవుడ్ స్టార్ హీరోలు స్పోర్ట్స్ పై ఫోకస్ చేశారు. టాలీవుడ్ స్టార్స్ లలో నాగార్జున హోటల్స్, రవితేజ ఇన్వెస్టుమెంట్స్, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ ఇలా పెడుతూంటే… స్టయిలీస్టార్ అల్లు అల్లు అర్జున్ ఏకంగా ‘నైట్..’ వ్యాపారం మొదలెట్టాడు. అదేనండీ.. నైట్ క్లబ్ బిజినెస్. ‘ఎమ్ కిచెన్, కేదార్ శెలగం శెట్టి’వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో కలిసి నైట్ క్లబ్ లను ప్రారంబించబోతున్నాడట బన్నీ. తొలుత దిన్ని హైదరబాద్ లో పెట్టి తర్వాత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెల 26న ఓ పెద్ద పార్టీ అరేంజ్ చేసి ఈ నైట్ క్లబ్ వివరాలను వెల్లడిస్తాడట స్టయిలీస్ స్టార్.

కామెంట్‌లు