కబాలిని టొరంటోలో డౌన్‌లోడ్‌ చేయబోతే..

సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు పండగరోజుగా ఆయన హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు కనివినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా, ఆ క్రేజ్ ఏ స్థాయిదో ఋజువుచేస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది.


 కలెక్షన్స్‌తో ‘కబాలి’ మొదటిరోజు రికార్డు సృష్టించింది. వైపు రజనీ సినిమాపై ఎప్పటిలాగే జోక్స్‌, ఛలోక్తులు ఆన్‌లైన్‌లో వీరవిహారం చేస్తున్నాయి. ట్విట్టర్‌ను చక్కిలిగింతల్లో ముంచెత్తుతున్న ఆ క్రేజీ జోక్స్ మీకోసం..

’కబాలి సినిమాను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. వెంటనే టోరంటో అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది. సిస్టం ఫార్మెట్‌ అయిపోయింది. వై-ఫై క్రాష్ అయింది. సమీపంలో ఉన్న ఎయిర్‌టెల్ టవర్ మాయమైంది’  

’మీ అక్రమంగా రజనీకాంత్ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేస్తే.. ఓ వైరస్ బయటకొచ్చి మీ చెంపఛెళ్లుమనిపిస్తుంది. మిమ్మల్ని వెంటనే పట్టుకెళ్లి రజనీ సినిమా నడుస్తున్న థియేటర్‌లో పడేస్తుంది’

‘అందరి సినిమాలు మొదట విడుదలై తర్వాత టోరంటోలో లీకవ్వుతాయి. కానీ రజనీ సినిమా టోరంటోలో లీకైన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది’.


కామెంట్‌లు