మహేష్ బాబు ఆ సెంటిమెంట్ ను వదలడం లేదు


టాప్ హీరో సినిమా ఓపెనింగ్ అంటే అట్టహాసంగా జ‌రుగుతుంటుంది. హీరో, ద‌ర్శకుడు, సాంకేతిక నిపుణులూ పూజా కార్యక్రమాల‌లో పాల్గొంటారు. హీరోపై క్లాప్ కొడ‌తారు. అదేం సెంటిమెంటో… మ‌హేష్ బాబు సినిమాకి ఇదంతా రివ‌ర్స్‌లో ఉంటుంది. ఓపెనింగ్ కి మ‌హేష్ ఎప్పుడూ రాడు. అదే అత‌ని సెంటిమెంట్‌. మ‌హేష్ లేకుండానే అత‌ని సినిమా ప్రారంభం అయిపోతుంది. ఈ సెంటిమెంట్‌ని త‌న కొత్త సినిమాకీ కొన‌సాగించాడు మ‌హేష్‌.

మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా ముహూర్తం జరుపుకుంది. అన్నపూర్ణ స్టూడియో లో దేవుడి ఫోటోలపై తీసిన తొలి సీన్ కు డైరక్టర్ మురగదాస్ కెమేరా స్విచ్ ఆన్ చేసారు. ఎప్పటిలాగే సెంటిమెంట్ ప్రకారం మహేష్ బాబు తొలి రోజు షూటింగ్ కు రాలేదు. ఆగస్టు 13 వరకు తొలి షెడ్యూలు ను ప్లాన్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ మ్యూజిక్ అందిస్తునాడు.


కామెంట్‌లు