న్టీఆర్ ఐటమ్ భామ మారింది. ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న “జనతా గ్యారేజ్”లో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశాడు దర్శకుడు కొరటాల. ఈ సాంగ్ లో మిల్కీబ్యూటీ తమన్నాతో అదిరిపోయే స్టెప్పులు వేయించనున్నాడు. ఇందుకు గానూ తమ్మూ రూ. 50లక్షలు పుచ్చుకొంది. ఇప్పటికే ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా కానిచ్చేశారు. భలేగొచ్చింది.. అనే ప్రచారం జరిగింది. తాజాగా, ఇదంతా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. గ్యారేజ్ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనున్నది నిజమే. కానీ.. ఆ సాంగ్ లో తమ్మూ చిందేయడం లేదు. ఎన్టీఆర్ ఐటమ్ భామగా కాజల్ ని తీసుకొన్నారు. ‘టెంపర్’ సినిమాలో ఎన్టీఆర్-కాజల్ జోడీ అదిరిపోయింది. అందుకే గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ తో హీటెక్కించేందుకు ఓకే చెప్పేసింది కాజల్. పైగా.. చాలా తక్కువ రేటుకి ఎన్టీఆర్ ఐటమ్ గా మారేందుకు ఒప్పేసుకుందట.
ఇదిలావుండగా.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావొస్తోన్న జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. మైతీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి