ఈ మద్య నాగార్జున డిప్రెషన్ లో ఉన్నట్టున్నాడు. తనయుల లవ్ స్టోరీలు నాగ్ కి తలనొప్పియా మారాయేమో అనుకుంటున్నారు. తాజాగా, నాగ్ స్క్రిప్ట్ ని గాల్లో విసిరేయడం షాక్ కి గురిచేసింది. ఏ దర్శకుడికో మూడినట్టే అనుకున్నారు. ఇదేదో పర్శనల్ మేటర్ కాదు. ‘నిర్మలా కాన్వెంట్’సినిమా గురించి. శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త టీజర్ విడుదలైయింది. ఈ టీజర్ ని నాగార్జున పై కట్ చేశారు. “షూటింగ్ జరుగుతున్న సమయంలో నాగార్జున కు స్క్రిప్ట్ పేపర్ల అందిస్తే అవి గాలిలోకి విసిరేసే సీన్” ని టీజర్ గా కట్ చేశారు. నాగ్ ఇలా స్క్రిప్ట్ పేపర్లని గాలో విసిరేయడానికి కారణమేంటి.. ? అది కూడా నాగ్ నే చెబుతాడట. స్క్రిప్ట్ విసిరివేతపై నాగ్ క్లారిటీ ఏమిస్తాడనేది ఆసక్తిగా మారింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి