థియేటర్ లో జనతాగ్యారేజ్ టీసర్ కి రెస్పాన్స్ పీక్స్ అంటే పీక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 26 వ సినిమా జనతాగ్యారేజ్ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోకే పరిమితం అవ్వలేదు. కర్ణాటక మరియు కేరళలోనూ ఇప్పుడు సినిమా హాట్ ఫేవరేట్ అయింది. 2016 సెకెండాఫ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది జనతాగ్యారేజ్.


కాగా సినిమా పోస్ట్ పోన్ అయినా ఆ ఇంపాక్ట్ పూర్తిగా నెగటివ్ కాకుండా జాగ్రత్త పడ్డ టీం ఇప్పుడు సినిమా క్రేజ్ ని తిరిగి ఎంజాయ్ చేస్తుంది. తెలుగుతో పాటు మలయాళంలోనూ రిలీజ్ అవ్వబోతున్న జనతాగ్యారేజ్ రీసెంట్ గా టీసర్ ని మలయాళంలో థియేటర్లో ప్రదర్శించారు.

అది ఎవరి సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి సినిమాతో కేరళలో మొత్తం రిలీజ్ అయిన థియేటర్స్ లో ప్రదర్శించగా అక్కడ రెస్పాన్స్ పీక్స్ లో వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్ కం చెబుతూ అందరూ మోహన్ లాల్ కి ఇచ్చే రెస్పెక్ట్ ని ఎన్టీఆర్ కి కూడా ఇచ్చారట.

మలయాళ వర్షన్ లో కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉండటం వల్ల అదీ మోహన్ లాల్ దే అవ్వడం వల్ల రెస్పాన్స్ మరింత క్రేజీగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. కబాలితో పాటు జనతాగ్యారేజ్ ని కేరళ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మోహన్ లాల్ ఈ సినిమాతో అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు ఎన్టీఆర్ కి కూడా మంచి బ్రేక్ ఇచ్చేలా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట.


కామెంట్‌లు