29, సెప్టెంబర్ 2016, గురువారం

బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి తిరుగులేని క్రేజ్ !!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ లోను క్రేజ్ వచ్చేసింది. ఇక కర్ణాటకలో అయితే సౌత్ లో ఏ స్టార్ హీరోకి కూడా లేనంత క్రేజ్ వచ్చేసింది. ఇక బాలీవుడ్ లోను ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ ఉందని ఇదివరకు అక్కడ ఎన్టీఆర్ సినిమాలు సృష్టించిన రికార్డులు చెబుతున్నాయి.

కాగా రీసెంట్ గా మరోసారి అక్కడ తన క్రేజ్ పవర్ ఏంటో చూపించాడు ఎన్టీఆర్…..ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయిన టెంపర్ సినిమా ఈ మధ్యనే అక్కడ డబ్ అయింది. కాగా రిలీజ్ అయిన మూడు నెలల్లో అక్కడ 10 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుని షాక్ ఇచ్చింది ఈ సినిమా.


ఈ మధ్యకాలంలో అక్కడ ఎక్కువ సార్లు డబ్ అయిన సినిమాల్లో టెంపర్ ఒకటి. దాదాపు 4 చానెల్స్ లో రెండేసి సార్లు అప్లోడ్ అయిన టెంపర్ అన్ని సార్లు రికార్డు స్థాయి వ్యూస్ ని దక్కించుకుంది. అయితే ఈసారి ఏకంగా 10 మిలియన్ వ్యూస్ రావడంతో ఎన్టీఆర్ రియల్ స్టార్ పవర్ ఇది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.


Read more news in English : Fans are Eagerly waiting to See NTR and Rajamouli work together

More news at : http://www.tollywoodnews24.com

లేబుళ్లు:

కాజల్ డిమాండ్ మామూలుగా లేదుగా..



రెండేళ్లు వెనక్కి వెళ్తే కాజల్ అగర్వాల్ పనైపోయిందని తేల్చేశారు విశ్లేషకులు. అప్పటికి ఆమె చేతిలో ఒకటీ అరా అవకాశాలే ఉన్నాయి. పైగా గ్లామర్ కూడా కొంచెం దెబ్బ తిన్నట్లు కనిపించింది. తన గురించి నెగెటివ్ ప్రచారం జరుగుతుండగానే పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల సరసన అవకాశాలు దక్కించుకుంది కాజల్. తమిళం..హిందీ భాషల్లోనూ ఆమెకు మంచి అవకాశాలే దక్కాయి. ఇంతలో సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం సినిమాలు డిజాస్టర్లు కావడంతో మళ్లీ ఆమె గురించి నెగెటివ్ ప్రచారం మొదలైంది. అయినా కాజల్ ఊపేమీ తగ్గలేదు. ఈ మధ్యే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ తో ఓ ఊపు ఊపేసిన చందమామ.. మంచి మంచి అవకాశాలే అందుకుంటోంది.

ఆల్రెడీ అజిత్ సరసన ఓ సినిమాకు కమిటైన కాజల్.. డేట్లు సర్దుబాటు చేయలేక విక్రమ్ తో సినిమాను వదులుకుంది. లేటెస్టుగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం. తుపాకి.. జిల్లా లాంటి సినిమాలతో విజయ్ కు లక్కీ హీరోయిన్ అనిపించుకున్న కాజల్.. అతడితో మూడోసారి జత కట్టబోతోందట. ప్రస్తుతం భరతన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు విజయ్. కీర్తి సురేష్ కథానాయిక. అది అతడికి 60వ సినిమా. దీని తర్వాత తనకు ‘తెరి’ లాంటి హిట్టిచ్చిన అట్లీతో మరో సినిమా చేయబోతున్నాడు విజయ్. ఈ సినిమాకు కాజల్ దాదాపుగా ఫైనలైజ్ అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి మన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం.

Tags:  Kajal Agarwal, Actress Kajal Agarwal, Telugu News

లేబుళ్లు: ,

28, సెప్టెంబర్ 2016, బుధవారం

మహేశ్..త్రివిక్రమ్.. అక్టోబర్ లో షూటింగ్



మహేష్- త్రివిక్రమ్ లది క్రేజీ కాంబినేషన్. అతడు .. ఖలేజా .. లాంటి క్రేజీ సినిమాలు వచ్చాయి వీరి కలయికలో. ఇప్పుడు మూడో సినిమా కూడా సిద్దం కానుంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే దీనికి ఇంకా సమయం పడుతుంది. అయితే ఈలోగా త్రివిక్రమ్- మహేష్ కలసి ఓ షూటింగ్ లో పాల్గొంటారు. ఇది ఓ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్.

ఇటివలే ఓ ఆన్ లైన్ టికెటింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు మహేష్ బాబు. వాళ్ల కోసం ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఆ యాడ్ కోసం త్రివిక్రమ్ పేరు సూచించాడు మహేష్. ఇదివరకు కూడా మహేష్ చేసిన చాలా యాడ్స్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మరోసారి వీరిద్దరు జతకట్టారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ యాడ్ షూటింగ్ వుంటుంది.

ప్రస్తుతం మహేష్ , మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కధానాయిక. హారిష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి టాప్ సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ఠాగూర్ పనిచేస్తున్నారు. చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.


లేబుళ్లు:

మహేష్ రికార్డ్‌ని బద్దలుకొట్టిన ఎన్టీఆర్


యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ ద్వారా సంచలనాలే సృష్టిస్తున్నాడు. స్టార్ హీరోలు తమ ఖాతాలో లిఖించుకున్న అరుదైన రికార్డుల్ని ఒక్కొక్కటిగా బద్దలుకొడుతూ వస్తున్నాడు. అందులో ఎక్కువగా.. మహేష్‌కి సంబంధించిన రికార్డులే బద్దలయ్యాయి. ఇప్పటికే ‘బాహుబలి’ తర్వాత అతి తక్కువ రోజుల్లో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిన ‘శ్రీమంతుడు’ రికార్డ్‌ని కేవలం మూడురోజుల్లోనే ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. అలాగే.. అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో.. ఈ సునామీ ముందు ఇదివరకు ‘శ్రీమంతుడు’తో మహేష్ క్రియేట్ చేసిన రికార్డ్‌ని కొట్టుకుపోయింది. ఇక ఓవర్సీస్‌లోనూ మహేష్‌కి సాధ్యంకాని ఓ రికార్డ్‌ని క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు తాజాగా ప్రిన్స్‌కి సంబంధించిన మరో రికార్డ్‌ని యంగ్‌టైగర్ బద్దలుకొట్టాడు.

Read In English : “JANATHA GARAGE” BREAKS ANOTHER RECORD
మహేష్‌కి సాధ్యం కాని ఓ రికార్డ్‌ని ఎన్టీఆర్ క్రియేట్ చేశాడు. ‘గ్యారేజ్’ సినిమా ప్రీమియర్స్ ద్వారా $560K కలెక్ట్ చేసింది. ఈ దెబ్బకు.. మహేష్ ‘బ్రహ్మోత్సవం’ $556 కలెక్ట్ చేసిన రికార్డ్ అడ్రస్ లేకుండా పోయింది. రీసెంట్‌గా మరో రికార్డ్‌ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మహేష్, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఓవర్సీస్‌లో టోటల్ రన్‌టైంలో $ 1,635,300 (10. 95 కోట్లు) కలెక్ట్ చేసింది. ఆరోజుల్లో అంతమొత్తం రావడం విశేషం. అయితే.. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’తోపాటు ఇతర సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టేశాయి. ఇప్పుడు ‘గ్యారేజ్’ ద్వారా ఎన్టీఆర్ ఆ మూవీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ‘జనతా గ్యారేజ్’ ఇప్పటివరకు $ 1,800,000 (12 .06 కోట్లు) కలెక్ట్ చేసింది. దీంతో.. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో ‘గ్యారేజ్’ ఆరవ స్థానంలో నిలిచింది.

లేబుళ్లు:

జనతాగ్యారేజ్ అనే పేరు ఎంత పాపులర్ అయిందంటే ..ఇది చూడండి


యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఓ రెండేళ్ళ క్రితం ఒక్క హిట్ పడితే చాలు అన్న ఆశలతో ఉన్న వాళ్లకి వరుసగా మూడు హిట్లు ఇచ్చి ఎన్టీఆర్ ఓ రేంజ్ లో బూస్టప్ ఇచ్చాడు. టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో పూర్తిగా ఒకదానికోటి సంబంధం లేని స్టొరీలతో రెచ్చిపోయాడు యంగ్ టైగర్.

కాగా పూర్తి మాస్ మూవీ చేస్తున్నాడు అనుకున్న జనతాగ్యారేజ్ కూడా మరో ప్రయోగాత్మక సినిమాగానే మిగిలింది. అయినా కూడా ప్రేక్షకులను అలరించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకోవడమే ఆడియన్స్ లోను భారీ ఇంపాక్ట్ ని  క్రియేట్ చేసింది జనతాగ్యారేజ్.

సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి జనతాగ్యారేజ్ అనే పేరు ఎంత పాపులర్ అయిందంటే మెకానిక్ షెడ్స్ నుండి వినాయక విగ్రహాలు, కొన్ని కాలనీలు ఇలా అన్ని చోట్లా జనతాగ్యారేజ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. లేటెస్ట్ గా హోటల్స్ కి ఫుట్ ఫాత్ షోరూమ్లకు కూడా జనతాగ్యారేజ్ పేరు వచ్చేలా పెట్టుకుంటున్నారు.


చింతపల్లి ఏజెన్సీలో బాహబలి తండ్రి!


బాహుబలి చిత్రంలో తొలి సన్నివేశం చాలామందికి గుర్తుండే ఉంటుంది. తాను నీట్లో మునిగిపోతూ బిడ్డను ఒక చేత్తో రమ్యకృష్ణ పైకెత్తి పట్టుకునే సన్నివేశం గుండెకి హత్తుకునేలా ఉంటుంది. బిడ్డ కోసం తల్లి చేసిన సాహసాన్ని తెరమీద చూసి కళ్లు చెమర్చాం. నిజ జీవితంలో అలాంటి ఘటనే మనకు ఎదురైతే.. ఒక చిన్నారిని  కాపాడుకోవడం కోసం సరిగ్గా ఇలాంటి సాహసమే చేశాడు ఓ తండ్రి. తన చిన్నారికి వాగు దాటించడం కోసం ఆ తండ్రి పడ్డ అవస్థ అంతాఇంతా కాదు.


విశాఖపట్నం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే వాగులూ వంకలూ పొంగి పొరలుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోతాయి. ఎక్కడికి వెళ్లాలన్నా నీరు దాటి వెళ్లాల్సిన పరిస్థితి. మామూలు రోజుల్లోనే గిరిజనులు వాగులు దాటుతూ ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. వర్షాలు పడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చింతపల్లి మండలంలో కుడుముసారి గ్రామ ప్రజలు పక్కనున్న ఊరికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. అయితే మామూలుగానే ఈ వాగులో నిత్యం నీళ్లు ఉంటాయి. వర్షాకాలం వస్తే దాదాపు 20 అడుగుల ఎత్తులో వాగు ప్రవహిస్తూ ఉంటుంది.

ఈ మధ్య వర్షాలు తీవ్రంగా కురవడంతో వాగు ఉద్ధృతి కూడా తీవ్రంగానే ఉంది. ఆ గ్రామానికి చెందిన సత్తిబాబుకి ఏడాది కుమార్తె ఉంది. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. దాంతో తన బాబాయి సాయంతో చిన్నారిని అతి కష్టమ్మీద వాగు దాటించి అవతలి ఊరికి చికిత్సకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందిన చిన్నారికి జ్వరం తగ్గింది. మళ్లీ తిరిగి తన గ్రామానికి వస్తూ ఇదిగో ఇలా... తలపై బిడ్డను పెట్టుకుని తాను నీట్లో మునుగుతూ అతి జాగ్రత్తగా వాగును దాటాడు. బిడ్డ కోసం తండ్రి చేస్తున్న సాహసాన్ని గమనించిన ఓ ఉపాధ్యాయుడు తన స్మార్ట్ ఫోన్ తో ఈ చిత్రాలను క్లిక్ మనిపించాడు. బిడ్డ కోసం బాహుబలి సాహసం చేసిన తండ్రి సత్తిబాబుకి హ్యాట్సాఫ్. కనీసం ఈ ఫొటో అయినా పాలకుల్ని కదిలిస్తే... ఆ వాగు మీద వంతెన పడుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.


Tags: Baahubali Scene, Chintapalli Forest, telugu NEws

లేబుళ్లు:

ప్రేమమ్ చూసి హాయిగా ఇంటికెళుతున్నా


టాలీవుడ్ దసరా రిలీజ్ లలో ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిస్తున్న సినిమాల్లో ప్రేమమ్ ఒకటి. రీమేక్ మూవీ అయినా సరే.. కాంబినేషన్ల కారణంగా ఈ మూవీకి  బోలెడంత బజ్ వచ్చేసింది. నాగ చైతన్య హీరోగా నటించడమే తెలుగు ప్రేమమ్ కి అన్నిటికంటే ప్లస్ అవుతోంది. ప్రస్తుతం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి.. టాలీవుడ్ మన్మథుడి సపోర్ట్ వచ్చేసింది. 

రీసెంట్ గా తండ్రి నాగార్జనకు.. స్పెషల్ షో వేయించి మరీ తన ప్రేమమ్ ను చూపించాడు చైతు. సినిమా మొత్తం నాగ్ ఎంజాయ్ చేశారని.. ప్రతీ ఫ్రేమ్ ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నారని తెలుస్తోంది. ప్రదర్శన పూర్తవగానే ప్రతీ ఒక్కరినీ అభినందించిన నాగ్.. చైతు ఖాతాలో సూపర్ హిట్ ఖాయమని కామెంట్ చేశారని టాక్. తన సంతోషాన్ని అంతటితో ఆపేయకుండా.. అభమానులతో కూడా పంచుకున్నారు నాగార్జున. 'ఇప్పుడే తెలుగు ప్రేమ్ ను చూసా. చాలా సంతోషంగా ఇంటికి వెళుతున్నా' అంటూ ట్వీట్ పెట్టారు నాగార్జున. 

నాగ్ నుంచి వచ్చిన పాజిటివ్ రియాక్షన్ చూశాక.. హీరో నాగ చైతన్య- దర్శకుడు చందూమొండేటిలలో ఉన్న కొద్దిపాటి టెన్షన్ కూడా తొలగిపోయిందని తెలుస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మలతో చైతు ప్రేమమ్.. దసరా సీజన్లో హిట్టు కొట్టడం ఖాయమంటున్నారు సినీ జనాలు. 


లేబుళ్లు:

అల్లరి నరేష్ కు ఆడపిల్ల పుట్టింది


బహుశా టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ దశ తిరిగే టైమొచ్చినట్లుంది. కలిసొచ్చే కాలమొస్తే నడిచొస్తే మహాలక్ష్మి ఇంటికొచ్చినట్లు.. ఇప్పుడు అల్లరి నరేష్ తండ్రయ్యాడు. పండంటి ఆడపిల్లకు ఆయన సతీమణి విరూప జన్మనిచ్చింది. 

గత సంవత్సరం మే 29న చెన్నయ్ కు చెందిన ఆర్కిటెక్ట్ విరూపను పెళ్ళిచేసుకున్నాడు నరేష్. ఈ నవ దంపతులకు ఈరోజు మధ్యాహ్నం ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ లో పండంటి ఆడపిల్ల జన్మించింది. ఈ విషయం తెలియేజేసిన నరేష్ ''భూమ్మీద బ్రతికున్న అత్యంత లక్కీ అండ్ హ్యాపీ మ్యాన్ నేను. పండంటి ఆడపిల్ల జన్మించడం అంటే అద్భుతమే'' అంటూ సెలవిచ్చాడు. మొత్తానికి మనోడి ఆనందానికి హద్దుల్లేవు. 

టాలీవుడ్ యువ హీరోలందరూ ఒక్కొక్కరు వరుసగా పెళ్ళిళ్లు చేసుకోవడమే కాదు.. ఇలా వరుసగా తండ్రులు కూడా అవుతున్నారు. ఎనీవే.. కంగ్రాట్స్ నరేష్ అండ్ విరూప. 


లేబుళ్లు:

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

ప్రేమమ్ సెన్సార్ రిపోర్ట్..!!



నాగ‌చైత‌న్య కొత్త సినిమా ప్రేమ‌మ్‌. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రుతిహాసన్‌, మడొన్నా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్స్. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.

ఇటీవల విడుదల చేసిన ట్రయిలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మలయాళం సూపర్ హిట్ ప్రేమ‌మ్‌ కు రిమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. మలయాళం సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.

అన్నట్టు.. ఈ చిత్రంలో హీరో వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారు. అలాగే నాగార్జున ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. నాగార్జున వాయిస్ ఓవర్ తోనే ఈ సినిమాలో పాత్రలు పరిచయం అవుతాయని సమాచారం. అక్టోబర్ 7 ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.


లేబుళ్లు:

ఎన్టీఆర్‌లో ఈ రేంజ్ రైటర్ ఉన్నాడా



మాట్లాడడం అనే కళలో ఎన్టీఆర్ ఎప్పుడో మాస్టర్ డిగ్రీ చేసేసినట్టు ఉన్నాడు. ఇప్పటి వరకూ సిినిమాల్లోనే ఎన్టీఆర్ డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చూశాం. 2009లో పొలిటికల్ తెరపై దుమ్ము రేపిన ఎన్టీఆర్‌ని కూడా చూసేశాం అనుకోండి. ఇప్పుడు ట్విట్టర్‌లో మాత్రం అంతకుమించి అనే రేంజ్‌లో అదరగొట్టాడు ఎన్టీఆర్. ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 15 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురష్కరించుకుని రాజమౌళి పైన ప్రశంశల వర్షం కురిపించాడు ఎన్టీఆర్. అయితే జక్కన్న ప్రశంశించడం కోసం ఎన్టీఆర్ ఫ్రేం చేసిన పదాలు, వాటి పొందిక మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్‌లో ఈ రేంజ్ రైటర్ ఉన్నాడా అని అనిపించేలా ఉంది. ఓ సందర్భంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడిన సుకుమార్  సినిమాల విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ చాలా క్లాస్ పర్సన్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ట్వీట్లను స్టడీ చేస్తే ఆ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది. జక్కన్నను ప్రశంశిస్తూనే చిన్న సెంటిమెంట్ టచ్‌ని కూడా ఇచ్చిన విధానం అయితే చాలా మందిని ఇంప్రెస్ చేస్తోంది.

15 లాంగ్ ఇయర్స్ః మొదటి సినిమా డైరెక్టర్ స్థాయి నుంచి భారతదేశం గర్వించదగ్గ స్థాయికి జక్కన్న ఎదిగిన వైనం అద్భుతమనే రేంజ్‌లో చెప్పాడు ఎన్టీఆర్.

15లాంగ్ ఇయర్స్ః బట్ ఇప్పటికీ అలాగే ఉన్న ఒక విషయం ఏంటంటే స్టూడెంట్ నంబర్ 1తో స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్.

15 లాంగ్ ఇయర్స్ః 19 సంవత్సరాల టీనేజర్ స్థాయి నుంచి ఈ రోజు తండ్రి స్థానానికి ఎదిగిన వైనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని మాంచి సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చాడు ఎన్టీఆర్.

                  ఈ ట్వీట్స్‌లో జక్కన్న ప్రశంశించిన వైనం, ఆ తర్వాత ఫ్రెండ్షిప్‌ని గుర్తు చేసుకున్న విదానంతో పాటు తాను టీనేజర్ నుంచి తండ్రిగా ఎదగడాన్ని ఎన్టీఆర్ ప్రస్తావించిన విధానం చూస్తుంటే ఎన్టీఆర్‌లో ఏ రేంజ్‌ రైటర్ ఉన్నాడో అర్థం కావడం లేదు. బిగుసుకుపోయి ఉండాలి, నా ఇమేజ్ మెయింటైన్ చేయాలి లాంటి శషభిషలు ఏమీ లేకుండా చాలా ఓపెన్‌గా, ఎక్స్‌ప్రెసివ్‌గా, ఎమోషనల్‌గా ఉన్న విధానం అయితే అందరూ అభినందించాల్సిందే. ఎమోషన్స్‌కి, బంధాలు, స్నేహం, అభిమానానికి ఎన్టీఆర్ ఇచ్చే గౌరవం నుంచి కూడా చాలా మంది చాలా నేర్చుకోవాలి.


లేబుళ్లు:

ఆ డైలాగ్ చెప్పాలంటే బాలయ్యకే సాధ్యం!


తింటే గారెలు తినాలి వింటే ఎన్టీవోడి డైలాగులు వినాలని నాటి జనరేషన్ తెలుగు ప్రేక్షకుడు అనుకునేవాడు. తెలుగు సినీ పరిశ్రమను ఏలిన నందమూరి తారక రామారావు చేయని పౌరాణిక పాత్ర అంటూ బహుశా ఏదీ మిలిగి ఉండదు. ఎన్టీఆర్ డైలాగు చెబితే ఎలా ఉంటుందో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. క్లిష్టమైన సమాసాలున్నా కష్టమైన సంస్కృత పదాలున్నా లెంగ్త్ ఎన్ని పేజీలున్నా సింగిల్ టేక్ లో అనర్గళంగా డైలాగులు చెప్పేయడం అన్నగారికే సాధ్యం! ఇక నేటితరం టాప్ హీరోల విషయానికొస్తే భారీ డైలాగులు అనగానే అందరికీ గుర్తొచ్చేది బాలయ్యే. రాజసం పౌరుషం ఉట్టిపడేలా డైలాగులు చెప్పే దమ్మున్న నేటి నటుల్లో బాలయ్య నంబర్ వన్ అనడంలో సందేహం ఉండదు!

ఏవైనా సభలూ ఇతర కార్యక్రమాలకు బాలకృష్ణ వస్తే ఆయన ఏదో ఒక భారీ డైలాగు చెప్తే బాగుండు అని అభిమానులు ఎదురుచూస్తారు. తాజాగా విమానంలో ప్రయానిస్తుండగా బాలయ్య ఓ భారీ డైలాగు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. విమానంలో బాలయ్య పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడు పౌరాణిక చిత్రాలను ఐప్యాడ్ లో చూస్తూ ఉన్నాడు. అతడిని బాలయ్య గమనించారు. దాంతో అతడు కూడా బాలయ్యను మర్యాదపూర్వకంగా పలకరించి... సరదాగా ఒక డైలాగు చెబుతారా సార్ అని అడగ్గానే బాలయ్య ఒప్పుకున్నారు.

మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలోని ఒక భారీ డైలాగులును గుక్కతిప్పుకోకుండా... ఒక పక్క ప్లే అవుతున్న ఆ చిత్రం క్లిప్పింగ్ తో ఏమాత్రం నాన్ సింక్ కాకుండా పక్కా టైమింగ్ లో బాలయ్య చెప్పేశారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియో ఇదిగో ఇలా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. డైలాగులు చెప్పడంలో బాలయ్యకు బాలయ్యే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు.

లేబుళ్లు:

26, సెప్టెంబర్ 2016, సోమవారం

ఎన్టీఆర్ ని మెచ్చుకున్నా శ్రీకాంత్



యంగ్ టైగర్ ఎన్టీఆర్….ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరు. కెరీర్ లో చాలాకాలం సరైన హిట్స్ లేక స్టార్ హీరోల రేసులో వెనక పడ్డ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా మూడు సూపర్ సక్సెస్ ల తరువాత టాప్ 3 బిగ్గెస్ట్ స్టార్స్ లిస్టులో చోటు దక్కించుకున్నాడు.

కాగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ ని మెచ్చుకొని వారు లేరని చెప్పొచ్చు. తాజాగా సీనియర్ హీరో అయిన శ్రీకాంత్ ఎన్టీఆర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తన కొడుకు కూడా ఎన్టీఆర్ లా కావాలి అని కోరుకుంటున్నాడట. ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా పైకి వచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రమే అని అంటున్నాడు శ్రీకాంత్.

మిగిలిన హీరోలు సపోర్ట్ తో లాంచ్ అవ్వగా ఎన్టీఆర్ మాత్రమే సోలోగా ఎంటర్ అయ్యి తనకు తాను మాస్ హీరోగా ఎస్టాబ్లేష్ అయ్యాడని…ఇప్పుడు కోట్లమంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడని మెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ తన కొడుక్కే కాదు…ఏ సపోర్ట్ లేకుండా పైకి వచ్చే ప్రతీ ఒక్కరికి ఆదర్శం అని మెచ్చుకున్నాడు శ్రీకాంత్.


లేబుళ్లు:

యంగ్ టైగర్ నిజంగా తోపు….




రెండేళ్ళ క్రితం వరకు ఒక్క హిట్ పడితే చాలు అని అభిమానులు ఇటు ఎన్టీఆర్ కోరుకున్న పరిస్థితి నుండి ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ డిపెండెంట్ హీరోగా నిలిచే స్థాయికి ఎదిగిన వైనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే సొంతం అని చెప్పొచ్చు.

కెరీర్ లో ఎన్నో ఎత్తుఫల్లాల నడుమ రెండేళ్లలో అద్వితీయంగా తన కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఈ ఇయర్ రేర్ రికార్డులతో ఆల్ టైం రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఒక్క ఏడాదిలో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు ఎన్టీఆర్.

నాన్నకుప్రేమతో మొత్తంగా 82 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా జనతాగ్యారేజ్ ఇప్పటివరకు 140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దాంతో ఎన్టీఆర్ ఖాతాలో 220 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఇయర్ మాత్రమే కాదు టాలీవుడ్ చరిత్రలో ఒక్క బాహుబలిని మినహాయిస్తే మరే సినిమా కానీ హీరో కానీ ఒక ఏడాదిలో ఈ రికార్డును అందుకోలేదు.


Like Us On Facebook

లేబుళ్లు:

లాస్యతో పెళ్ళి చేసినందుకు థ్యాంక్స్ -రాజ్ తరుణ్


యంగ్ హీరో రాజ్ తరుణ్.. బుల్లితెర యాంకర్ లాస్య పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఒకటి రెండు పేపర్లకు సంబంధించిన వెబ్ ఎడిషన్స్ లో కూడా ఈ వార్త రావడంతో.. చాలామంది ఈ గాసిప్పును నిజమే అనే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో అయితే రాజ్ తరుణ్-లాస్య సీక్రెట్ మ్యారేజ్ అంటూ ఈ న్యూస్ తెగ షేర్ అయిపోయింది. ఇప్పుడీ అంశంపై రాజ్ తరుణ్ పక్కా క్లారిటీ ఇచ్చేశాడు. 

నేను లాస్య పెళ్లి చేసుకున్నామనే రూమర్ పై క్లారిటీ అంటూ తన వివరణను పోస్ట్ చేశాడు రాజ్ తరుణ్. 'సభకు నమస్కారం.. నా సంబంధం లేకుండా.. నా ప్రమేయం లేకుండా.. కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్ లో ఒకే ఒక్కసారి కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు' అంటూ కాస్త వెటకారంతో ఓపెన్ లెటర్ మొదలుపెట్టిన రాజ్ తరుణ్.. తర్వాత అసలు సంగతిని కూడా రాసుకొచ్చాడు. 

'వెటకారానికి సారి. కానీ ఇలాంటి ఫన్నీ రూమర్లపై నాకు ఇంతకంటే ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. నాకు కనీసం మరో మూడేళ్లవరకూ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నేను ఇప్పుడు ఏ బంధంలోకి వెళ్లే పరిస్థితి లేదు. నేను పెళ్లి చేసుకున్నపుడు అందరికీ తెలియచేస్తాను. ఆధారం లేని రూమర్ అయినా.. నా కోసం కొంత సమయం కేటాయించిన అందరికీ కృతజ్ఞతలు. మరోవైపు అసలీ ఈ రూమర్ గురించి ఏం తెలీకుండా చదివిన వారికి సారీ(టైమ్ వేస్ట్ చేసినందుకు)- థాంక్యూ - రాజ్ తరుణ్' అంటూ క్లియర్ కట్ గా చెప్పేశాడు ఈ కుర్ర హీరో.


Like Us On Facebook

లేబుళ్లు: ,

ఎన్టీఆర్ ‘ఇజం’ వాయిస్


పూరీ జ‌గ‌న్నాథ్ – కళ్యాణ్ రామ్ కలయికలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఇజం’. ఇందులో ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడనే ప్రచారం జరిగింది. త్వరలోనే తారక్ పై సీన్స్ చిత్రీకరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తారక్ ‘ఇజం’లో గెస్ట్ రోల్ లో మెరిసేందుకు తిరస్కరించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. పూరి, కళ్యాణ్ ఎంత కన్విన్స్ చేసినా తారక్ వినలేదట. ఇద్ద‌రం క‌లిసి న‌టిస్తున్న‌ప్పుడు సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలుంటాయ‌ని.. వాటికి త‌గ్గ క‌థ‌లో న‌టిస్తే బాగుంటుంది. కానీ, చిన్న రోల్‌లో చేస్తే సినిమాకు ఏం ఉప‌యోగం ఉండ‌ద‌ని తారక్ పూరి, కళ్యాణ్ లని క‌న్విన్స్ చేసినట్టు తెలుస్తోంది. తారక్ చెప్పింది కూడా నిజమేనని కళ్యాణ్ కామ్ అయిపోయినట్టు తెలుస్తోంది. కాకపోతే, ‘ఇజం’లో తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడంట. ఇక, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కలసి నటించే చిత్రం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన కథ దొరికితే.. ఈ నందమూరి మల్టీస్టారర్ పట్టాలెక్క అవకాశాలున్నాయ్. మరి.. నందమూరి మల్టీస్టారర్ ని తయారు చేసే దర్శకుడు ఎవరన్నది చూడాలి. దీంతో సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ మాత్ర‌మే తీసుకున్నార‌ని చెబుతున్నారు.

లేబుళ్లు: ,

బాలయ్య సాయం పిలుపు..


నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది. తాజాగా, మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసున్న చిత్రబృందం హైదరాబాద్ చేరుకొంది. అయితే, బాలయ్య హైదరాబాద్ చేరుకోగానే ప్రజా ప్రతినిథిగా ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తాజా వర్షాలపై ఆరా తీశారు. వ రద బాధితులకి తమ వంతుగా సహాయం అందించాలని అభిమానులకి పులుపునిచ్చారు. ‘ప్రియ‌మైన అభిమానులారా.. మ‌నం అంతా ఏక‌మై హైద‌రాబాద్, గుంటూరు ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న వ‌ర్ష బాధితుల‌ను ఆదుకోవాల‌ని’ సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు బాలయ్య. మరి.. బాలయ్య పిలుపుతో నందమూరి అభిమానులు ఏ మేరకు వరద బాదితులని ఆదుకుంటారన్నది చూడాలి.

ఇక, బాలయ్య ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. మిగితా భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులనీ మొదలెట్టేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. అన్నట్టు.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు దసరా కానుకగా శాతకర్ణి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.


లేబుళ్లు: ,

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఇండియన్ సినిమాల్లో జనతాగ్యారేజ్ మూడో బిగ్గెస్ట్ హిట్



2016 ఇండియన్ సినిమాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి…ఏ ఇండస్ట్రీని తీసుకున్నా సూపర్ డూపర్ హిట్లు కొడతాయి అనుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడగా కొన్ని అనుకోని హిట్స్ అదరగొట్టినా అవి భారీ విజయాలుగా మాత్రం మారలేకపోయాయి. అలాంటి ఇండియన్ సినిమాను కొన్ని సినిమాలు పరువు కోల్పోకుండా కాపాడాయి.
మరింత చదవండి »

లేబుళ్లు:

ఒక్క సీన్ కోసమే బాహుబలికి నెల రోజులు



బాహుబలి ది కంక్లూజన్.. టాలీవుడ్ తో పాటు.. దేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా ఇది. బాహుబలి మొదటి భాగంతో 600 కోట్ల వసూళ్లను సాధించగా.. ఈ రెండో పార్ట్ ఏకంగా 1000 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకునేందుకు.. రాజమౌళి తో పాటు.. ప్రభాస్ కూడా చాలానే కష్టపడుతున్నాడు. 

బాహుబలి దిం కంక్లూజన్ క్లైమాక్స్ లో వచ్చే ఓ సన్నివేశం.. భారీ యాక్షన్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఈ ఒక్క సీన్.. మొత్తం రెండు భాగాలకు హైలైట్ గా నిలుస్తుందనే బాహుబలి యూనిట్ నమ్ముతోంది. అందుకే ఈ సీన్ పై బోలెడంత కసరత్తు చేసి పిక్చరైజ్ చేస్తున్నారు. అందరి కంటే ఎక్కువగా రెబల్ స్టార్ ప్రభాస్ కష్టపడాల్సి వస్తోంది. ఈ ఒక్క సీన్ కోసమే.. నెల రోజులకు పైగా ప్రత్యేకంగా ట్రైనింగ్ అయ్యాడట ప్రభాస్. ఇప్పుడా ట్రైనింగ్ పూర్తయిందని.. త్వరలో ఆ సన్నివేశాన్ని కూడా పిక్చరైజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

బాహుబలి 2 విషయంలో రాజమౌళి-ప్రభాస్ లు ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదనే విషయం.. ఈ ఒక్క సీన్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే అర్ధమవుతుంది. ఇక అక్టోబర్ చివరినాటికల్లా బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ను పూర్తి చేసేయనున్నాడు జక్కన్న. 2017 ఏప్రిల్ 28న బాహుబలి చివరి భాగం రిలీజ్ కానుందనే సంగతి గతంలోనే ప్రకటించేశారు. 


లేబుళ్లు:

22, సెప్టెంబర్ 2016, గురువారం

నాని మీద ఎంత భరోసా అంటే..



నేచురల్ స్టార్ నాని మామూలు ఫామ్‌లో లేడు ఇప్పుడు. 15 నెలల వ్యవధిలో నాలుగు హిట్లు కొట్టిన హీరో అతను. ఇప్పుడు ఆరో హిట్టు కోసం 'మజ్ను'గా వస్తున్నాడు. ఈ శుక్రవారమే 'మజ్ను' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని ట్రాక్ రికార్డు.. ఆసక్తికరంగా ఉన్న మజ్ను ట్రైలర్ ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు పెట్టుకునేలా చేశాయి. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. రూ.15 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అమెరికాలో మాత్రమే 'మజ్ను' హక్కుల్ని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.

నాని సినిమాలన్నీ కూడా అమెరికాలో చాలా బాగా ఆడుతున్నాయి. 'ఎవడే సుబ్రమణ్యం' తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ గ్రాసరే కానీ.. అమెరికాలో మంచి వసూళ్లు సాధించింది. ఇక భలే భలే మగాడివోయ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా 1.5 మిలియన్ క్లబ్బుకు చేరువగా వెళ్లింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ.. జెంటిల్ మన్ కూడా చెరో 8 లక్షల డాలర్లకు పైగా వసూలు చేశాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా బయ్యర్ మంచి రేటు పెట్టాడు. నాని సినిమా అనగానే అక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. స్టార్ హీరోల సినిమాల మాదిరి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి 'మజ్ను' ఈజీగా హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెడుతుందని భరోసాతో ఉన్నారు. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన 'మజ్ను'లో నాని అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర పోషిస్తున్నాడు. అతడి సరసన కొత్తమ్మాయిలు అను ఇమ్మాన్యుయెల్, ప్రియశ్రీ నటించారు. జెమిని కిరణ్ నిర్మాత. గోపీసుందర్ సంగీతాన్నందించాడు.

లేబుళ్లు:

జనతాగ్యారేజ్ జోరు ఆగేలా లేదు



బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కి మరో మంచి రోజులా సాగింది జనతాగ్యారేజ్ 21 వ రోజు కలెక్షన్స్….వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను భారీగా కురిసినా జనతాగ్యారేజ్ కలెక్షన్స్ మాత్రం స్టడీగానే సాగాయి…మరీ లాస్ట్ రెండు రోజుల్లో వచ్చినట్లు కలెక్షన్స్ రాకున్నా ఓవరాల్ గా మాత్రం సాటిస్ఫాక్షన్ కలెక్షన్స్ తో రోజుని ముగించింది జనతాగ్యారేజ్.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంమీద 41 లక్షల షేర్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్…మిగిలిన ఏరియాల్లో 6 లక్షల షేర్ దాకా వసూల్ చేసినట్లు అంచనా…చారిత్రిక 80 కోట్ల మార్క్ ని ఈ కలెక్షన్స్ తో క్రాస్ అయిన జనతాగ్యారేజ్ జోరు 85 కోట్లు అందుకునేదాకా ఆగేలా లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.

నైజాంలో తొలిసారిగా ఫుల్ కమాండింగ్ పొజిషన్ లో ఉన్న ఎన్టీఆర్ కి జనతాగ్యారేజ్ క్రేజ్ పెంచుకునే అద్బుతమైన అవకాశాన్ని ఇచ్చింది..దాంతో అక్కడ 20 కోట్లు అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు ఇప్పుడు. ఇక సీడెడ్ లో ఎలాగూ టాప్ 3 ప్లేస్ కొట్టేసిన ఎన్టీఆర్ మగధీరని బీట్ చేసి టాప్ 2 కి రావాలి అని ఆశ పడుతున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో.




లేబుళ్లు:

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ విద్వంసం!!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ విడుదల అయ్యి 20 రోజులు పూర్తి చేసుకుంది…బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో 82కోట్లకు చేరువ అవుతున్న జనతాగ్యారేజ్ మూడో వర్కింగ్ డేస్ లోను ఎలాంటి డ్రాప్స్ లేకుండా కలెక్షన్స్ సాగుతున్నాయి.

వైజాగ్ లో సినిమాకి పోటి లేకుండా పోయింది. వైజాగ్ మొత్తంమీద నిన్న దాదాపు 65% ఆక్యూపెన్సీ ఉన్నట్లు లెక్కేస్తున్నారు. ఇక సీడెడ్ లో మగధీర కలెక్షన్స్ ని దాటడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎన్టీఆర్ ఆ మార్క్ కి మరో 2 కోట్ల దూరంలో ఉన్నాడు.

మొత్తంమీద 20 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్ టోటల్ వరల్డ్ వైడ్ గా 80.56 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే శ్రీమంతుడు టోటల్ రన్ షేర్ 87 కోట్లను దాటేయడం పెద్ద కష్టం కాదు అంటున్నారు.



లేబుళ్లు:

17, సెప్టెంబర్ 2016, శనివారం

మూడో వారంలో జనతాగ్యారేజ్ టార్గెట్ ఇదే!!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ ఎన్టీఆర్ 13 ఎల్లా కలని నిజం చేస్తూ జనతాగ్యారేజ్ ఇండస్ట్రీలో చాలా రికార్డులను తాన ఖాతాలో వేసుకుంది. కాగా తొలి వారంలో 65 కోట్ల షేర్ ని వసూల్ చేసిన జనతాగ్యారేజ్ రెండో వారంలో మరో 10 కోట్లు వసూల్ చేసి 75 కోట్ల మార్క్ ని అందుకుంది.

ఇక మూడో వారంలో అడుగుపెట్టిన జనతాగ్యారేజ్ నయా టార్గెట్ ని ఫిక్స్ అయ్యింది. ఈ టోటల్ మూడో వారంలో జనతాగ్యారేజ్ 10 కోట్లవరకు కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కొత్త సినిమాలు కూడా పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకుల మొదటి చాయిస్ జనతాగ్యారేజ్ మాత్రమే.

దాంతో ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు. జనతాగ్యారేజ్ కనుక ఈ మార్క్ ని అందుకుంటే మొత్తంగా 85 కోట్లకు చేరుకుంది. ఇక మిగిలిన రన్ లో ఎన్ని వస్తే శ్రీమంతుడు 87 కోట్లకు అంత చేరువ అవుతుంది. మరి జనతాగ్యారేజ్ ఎంతదూరం వెళుతుందో చూడాలి.

లేబుళ్లు:

పంజా గుట్ట రోడ్డు పైన దర్శకేంద్రుడు ఏంచేశాడో తెలుసా?



హైద్రాబాద్ ని ఈ రోజు భారీ వాన ముంచేసింది. సాయింత్రం ఎడతెరిపి లేకుండా రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే వుంది. వర్షం ధాటికి హైదరాబాద్ లో విపరీతమైన ట్రాఫిక్ జామ్. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని వాహన దారులు నానా పాట్లు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా బలయ్యాడు. పంజా గుట్ట ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంట సేపు ఆయన వాహనం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. ఇక ముందుకు కదిలే వీలు లేకపోవడం తో రాఘవేంద్ర రావు కారు దిగి… ఆ వర్షం లో నడుచుకుంటూ వెళ్లిపోయారట. దారిలో రాఘవేంద్రరావు ని గుర్తుపట్టిన కొందరు లిఫ్ట్ ఆఫర్ చేశారు కూడా. చివరికి ఓ బైక్ ని ఆపి లిఫ్ట్ అడిగి.. సినీ మాక్స్ లోని తన ఆఫీస్ వరకూ వెళ్లాల్సి వచ్చింది. ఇంత హడావిడిలోనూ కొంతమంది ఫోటోల కోసం వెంట పడడం విశేషం. మొత్తానికి హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ లో ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో దర్శకేంద్రుడికి తెలిసొచ్చిందన్న మాట.

లేబుళ్లు:

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఎన్టీఆర్ టాలీవుడ్ హిస్టరీలో ఒకే ఒక్కడు!!



సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఓ కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ట్రెండ్ మారిపోయింది అని మనవాళ్ళు తెగ రాసేస్తూ ఉంటారు కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే కేటగిరీలోకి వస్తూ ఉంటాయి. చాలా సార్లు పొగడ్తలుగానే మిగిలిపోతూ ఉంటాయి. మరి ట్రెండ్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఒక కొత్త హీరోయిజం అంటే ఎలా ఉంటుంది?

జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్‌లో చాలా మంది చాలా మాటలు మాట్లాడేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ అయితే మాస్ సినిమాలను ఇక నుంచి కొరటాల శివకు ముందు ….కొరటాల శివ తర్వాత అని అంటారని చెప్పుకొచ్చాడు. అది కొంత వరకూ నిజం కూడా. అలాగే స్టార్ హీరోలు కథలో భాగమయ్యే విషయంలో కూడా ఇక నుంచీ ఎన్టీఆర్‌కి ముందు..ఎన్టీఆర్‌కి తర్వాత అని అంటారు. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన సినిమాల విషయం పక్కన పెడితే జనతా గ్యారేజ్‌లో మాత్రం కంప్లీట్‌గా కొత్తగా కనిపించాడు. కొత్తగా యాక్ట్ చేశాడు. ఒక తెలుగు సినిమా స్టార్ హీరోలాగా ఎక్కడా చేయలేదు.

                    మామూలుగా తెలుగు స్టార్ హీరో సినిమా అంటే ఎలా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకూ సినిమా అంతా హీరోనే కనిపిస్తాడు. సీన్ బిగినింగ్, ఎండింగ్ కూడా హీరోపైనే ఉంటుంది. పైగా దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు కూడా. కానీ జనతా గ్యారేజ్‌లో మాత్రం ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించాడు. నిజాయితీగా చెప్పాలంటే కంప్లీట్ నటుడిగా కనిపించాడు. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఎన్టీఆర్ కనిపించలేదు. ఆనంద్ క్యారెక్టర్ మాత్రమే కనిపించింది. కథలో భాగమయ్యాడు. క్యారెక్టర్‌కి జీవం పోశాడు. నిజానికి సినిమా అంతా తానే కనిపించాలని, తన స్టార్ ఢం కోసం సీన్స్ ఉండాలని ఎన్టీఆర్ పట్టుబట్టి ఉంటే కొరటాల శివ కూడా కాంప్రమైజ్ అయి ఉండేవాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘జనతా గ్యారేజ్’ సినిమానే హీరో అవ్వాలనుకున్నాడు. నిజానికి ఎన్టీఆర్ స్టార్ ఢం కోసం కథను మార్చి ఉంటే ‘జనతా గ్యారేజ్’ కూడా రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమానే అయి ఉండేది. అలా కాకుండా జనతా గ్యారేజ్ కథ బ్రతకాలి, నేను ఆనంద్ క్యారెక్టర్‌కి జీవం పోయాలి అని ఎన్టీఆర్ అనుకున్నాడు కాబట్టే ‘జనతా’ సినిమా చాలా ఫ్రెష్‌గా కనిపించింది. కొత్తగా కూడా అనిపించింది. సినిమాలో కొరటాల శివ చేసిన కొన్ని తప్పులు ఉన్నప్పటికీ ఆ కొత్తదనం నచ్చే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో టాప్ ఫైవ్‌లో జనతా గ్యారేజ్ చోటు దక్కిందుకుంది.

                     కథ మొత్తం తన చుట్టే తిరగాలి, తన స్టార్ ఢం బాగా హైలైట్ అయి కనిపించాలి అని అనుకోకుండా కథలో భాగమవ్వాలి అని, ఓ క్యారెక్టర్‌ని అద్భుతంగా పండించిన టాప్ రేంజ్ స్టార్ హీరో తెలుగు వరకూ చూసుకుంటే ఎన్టీఆర్ ఒక్కడే. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనో, దశాబ్ధాల క్రితమో ఇలా జరిగి ఉండొచ్చేమో కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటి సారిగా, సోలో హీరోగా యాక్ట్ చేసిన సినిమాలో, ఇలా క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన నటుడు ఎన్టీఆర్ ఒక్కడే. ఇకపైన కూడా ఇలాంటి సినిమాలు తన నుంచి చాలా వస్తాయని ఎన్టీఆర్ చెప్పాడు. హిందీలో అమీర్ ఖాన్‌లాంటి హీరోలు ఉన్నారేమో కానీ తెలుగులో మాత్రం ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎన్టీఆరే. ఇదే స్టైల్‌లో ఇంకో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడంటే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోస్ కూడా ఎన్టీఆర్‌ని ఫాలో అవుతారని చెప్పడానికి డౌటే అవసరం లేదు. ఆ తర్వాత తెలుగులో మంచి మంచి కథలు వస్తాయని కూడా చెప్పొచ్చు. అలాంటి ఓ మంచి మార్పుకు… ఓ కొత్త చరిత్రకు ‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఎన్టీఆర్ నాంది పలికాడు. అందుకు ఎన్టీఆర్‌ని కూడా తెలుగు ఇండస్ట్రీ జనాలందరూ అభినందించాల్సిందే.


లేబుళ్లు:

వెంకీ ‘గురు’ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా ?



‘బాబు బంగారం’తో సందడి చేసిన వెంకటేష్ ఇప్పుడు బాక్సర్ గా కనిపించాబోతున్నారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’రీమేక్‌లో వెంకటేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాక్సింగ్ కోచ్‌ స్టోరీ ఇది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరనీ ఫ్యాక్టరీ నుండి వచ్చినీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో బాక్సర్ కోచ్ గా కనిపించబోతున్నారు వెంకీ.

ఈ చిత్రానికి ‘గురు’అనే పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఖరారైయింది. శనివారం సాయంత్రం ‘గురు’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు టీం ప్రకటించింది.

ఈ సినిమాకి ఒరిజనల్ వెర్షన్ ని తెరకెక్కించిన సుధా ప్రసాదే దర్శకత్వంవహిస్తారు. అలాగే హీరోయిన్ గా కూడా రితికసింగ్ నే ఎంపిక చేశారు.


లేబుళ్లు:

ఫొటోస్: కాజల్ అగర్వాల్ పక్కా లోకల్ సాంగ్













లేబుళ్లు:

మెగా హీరోల బెండు తీసిన ఎన్టీఆర్..!!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి తరువాత ఆ రేంజ్ హిట్ కోసం దాదాపు 13 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సింహాద్రి రేంజ్ లో సగం కూడా అందుకునే విజయం ఎన్టీఆర్ సొంతం కాలేదు..ఈ గ్యాప్ లో టాలీవుడ్ టాప్ హీరోలు అందరు తమ సత్తా చాటుకున్నారు.


ఆల్ టైం టాప్ 5 లో ముఖ్యంగా మెగా హీరోలు నటించిన మూడు సినిమాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఫామ్ లో లేని యంగ్ టైగర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ తో తిరిగి ఫామ్ అందుకుని తన రేంజ్ ఏంటో చూపించాడు. కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని దక్కించుకున్నాడు.

ఈ క్రమంలో మగధీర 73.80 కోట్లు, అత్తారింటికి దారేది 74.60 కోట్లు, సరైనోడు 74.80 కోట్ల రికార్డులను బ్రేక్ చేసి 75 కోట్ల మార్క్ ని అందుకుని బాహుబలి 194 కోట్లు, శ్రీమంతుడు 87 కోట్ల తరువాత ప్లేస్ ని దక్కించుకున్నాడు. దాంతో ఎన్టీఆర్ ఫామ్ లో ఉంటే ఇలాంటి రికార్డులు వస్తాయని చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్.

లేబుళ్లు:

మహేష్ చిత్రంలో నయనతార..?



టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం లో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ నయనతార నటిస్తుందని వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళ్తే .. బ్రహ్మోత్సవం చిత్రం తో భారీ ప్లాప్ చూసిన మహేష్ బాబు , మురుగదాస్ తో చేస్తున్న చిత్రం ఫై భారీగా నమ్మకం పెట్టుకున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై లో జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ లో నయనతార నటిస్తుందని వార్త , సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ఈ పాత్రకు నయనతార అయితేనే బాగుంటుందని దర్శకుడు మురుగదాస్ ఆమెను ఎంపిక చేసాడని ప్రచారం జరుగుతుంది. కాకపోతే చిత్ర యూనిట్ నుండి ఈ వార్త ఫై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుండగా మహేష్ సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది.


లేబుళ్లు:

15, సెప్టెంబర్ 2016, గురువారం

చైతు కళ్యాణం ఈమెతో కాదు



సాహ‌సం స్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు నాగచైత‌న్య‌. ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్నినాయ‌న ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ తో ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘కళ్యాణం’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో కధానాయికగా ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు.

అయితే లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవమ లేదు. దీనిపై క్లారిటీ ఇచ్చింది లావణ్య. ”కళ్యాణ్ కృష్ణ- చైతు సినిమాలో నేను లేను’. అయితే కళ్యాణ్ సార్ డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయాలని వుంది” అని ట్వీట్ చేసింది లావణ్య. కళ్యాణ్ దర్శకత్వం వహించిన సోగ్గాడే చిన్నినాయ‌నలో లావణ్య హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.

ఇక చైతు సినిమా విషయానికి వస్తే.. నాగార్జున కెరీర్‌లో ఓ సూప‌ర్ హిట్ చిత్రం… నిన్నే పెళ్లాడ‌తా. కుటుంబ బంధాల్ని కృష్ణ‌వంశీ ఎంత గొప్ప‌గా ఆవిష్క‌రిస్తాడో ఈ సినిమాతో అర్థ‌మైంది. ఇప్పుడు ఇదే తరహాలో నాగ చైతన్య- కళ్యాణ్ కృష్ణ సినిమా వుండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


లేబుళ్లు:

ఎన్టీఆర్ కోసం నాలుగు కథలు



‘జనతా గ్యారేజ్‌’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు తారక్. ఈ సినిమా తర్వాత కొంతకాలం విరామం తీసుకొంటానని చెప్పినా.. ఆ బ్రేక్ సమయాన్ని కొత్త కథల్ని వినడం కోసం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకులు ఎన్టీఆర్ వద్దకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దగ్గరకు నాలుగు కధలు, నలుగురు దర్శకులు చేరారు. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని ప్రచారం సాగినా అది ఇంకా ఫైనల్ కాలేదు.

అలాగే అనిల్‌ రావిపూడి చెప్పిన ఓ కథని కూడా విన్నారు ఎన్టీఆర్‌. మరోపక్క పూరి జగన్నాథ్‌ ఎన్టీఆర్‌ కోసం ఎప్పుడో కథని సిద్ధం చేసి పెట్టుకొన్నారు. తాజాగా దర్శకుడు లింగుస్వామి కూడా కథ వినిపించాడు. ఈ నాలుగు కధలను విన్నారు ఎన్టీఆర్. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఫ్యామిలీ తో కలసి ఫారిన్ టూర్ వెళతారు తారక్. అటు నుంచి వచ్చిన తర్వాత కొత్త సినిమా కబురు చెప్పే అవకాశం వుంది.


లేబుళ్లు:

దట్ ఈజ్ ఎన్టీఆర్ స్టామినా..హిందీలో దుమ్ములేపిన గ్యారేజ్



ఈ మధ్య కాలంలో జనతా గ్యారేజ్ సినిమాకు కలిసొచ్చినంతగా ఇంకే సినిమాకూ జరగలేదేమో. ఎన్టీఆర్ హార్డ్ వర్క్‌కి అదృష్టం కూడా ఓ రేంజ్‌లో తోడవుతోంది. గ్యారేజ్‌తో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ కూడా లాభాల పంట పండిస్తోంది. కొరటాల శివ తప్పులను కూడా కవర్ చేసేంతే రేంజ్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్సులు ఉండడం గ్యారేజ్‌కి చాలా చాలా కలిసొచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ పెద్ద హీరో సినిమాకీ జరగనట్టుగా 15 కోట్ల రూపాయల పైన లాభాలను పంచుకున్న ప్రొడ్యూసర్స్‌కి ఇఫ్పుడు ఇంకో బంపర్ ఆఫర్ కూడా తగిలింది.

ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ చేసి టివిలలో టెలికాస్ట్ చేసినప్పుడు అదిరిపోయే రేటింగ్స్ తెచ్చుకుంటాయన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు కూడా హిందీ శాటిలైట్ ఛానల్స్‌లో, యూట్యూబ్‌లో చాలా బాగా ఆడేశాయి. ఇప్పుడిక జనతా గ్యారేజ్ లాంటి కంటెంట్ ఉన్న సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుంది? రిలీజ్‌కి బిఫోర్ ఆరు కోట్ల వరకూ పలికిన జనతా హిందీ శాటిలైట్ రైట్స్ ఇప్పుడు ఏకంగా 9 కోట్ల వరకూ అమ్ముడుపోయాయట. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇదే బిగ్గెస్ట్ ప్రైస్. అలాగే చాలా మంది తెలుగు హీరోలు ఈ అమౌంట్‌కి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆల్రెడీ టెంపర్ సినిమా హిందీ చానల్స్‌లో, యుూట్యూబ్‌లో దుమ్ము దులిపేసింది. ఇప్పుడిక జనతా గ్యారేజ్ సృష్టించబోయే సంచలనం ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూడాలి మరి.


లేబుళ్లు:

తెలుగు సినిమాల్లో టాప్ ప్లేస్ జనతాగ్యారేజ్ దే!!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ తెలుగులో 10 రోజుల్లోనే ఆల్ టైం టాప్ 5 మూవీస్ లో చోటు దక్కించుకుంది.


కాగా జనతాగ్యారేజ్ ఈ ఇయర్ అక్కడ డైరెక్ట్ గా రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో టాప్ ప్లేస్ ని దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది జనతాగ్యారేజ్.

బ్రహ్మోత్సవం 1.8 కోట్ల గ్రాస్, సర్దార్ గబ్బర్ సింగ్ 1.55 కోట్ల గ్రాస్, నాన్నకుప్రేమతో 1.42 కోట్ల గ్రాస్, సరైనోడు 1.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ ఇప్పటివరకు అక్కడ 2.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో 2016 తెలుగు సినిమాలో టాప్ ప్లేస్ ని అక్కడ సాధించింది జనతాగ్యారేజ్.

లేబుళ్లు:

అఖిల్ తో నివేదా లక్కీ ఛాన్స్..!



మలయాళ భామలకు టాలీవుడ్లో లక్కీ ఆఫర్లే వస్తుంటాయి.. జెంటిల్ మన్ సినిమాతో ప్రేక్షకుల మనసుదోచిన నివేదా థామస్ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ దక్కించుకుందని ఫిల్మ్ నగర్ టాక్. అక్కినేని అఖిల్ రెండో సినిమాగా చేస్తున్న సినిమాలో నివేదా హీరోయిన్ గా ఓకే అయ్యిందట. విక్రం కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నవంబర్ లో స్టార్ట్ అవనుంది. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ముస్లిం కుటుంబంలో పెరిగే హింది కుర్రాడిగా అఖిల్ నటించబోతున్నాడట.

మొదటి సినిమా అఖిల్ తో ఫుల్ క్రేజ్ సంపాదించిన అఖిల్ ఆ సినిమా ఫ్లాప్ తో సంవత్సరం గడుస్తున్నా సినిమా ఓకే చేయలేదు. తన సినిమా రేసులో దర్శకులందరికి టెస్ట్ చేసి ఫైనల్ గా విక్రంతో సినిమాకు సిద్ధమయ్యాడు. మనంతో ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉన్న విక్రం కుమార్ ఇప్పుడు అఖిల్ సినిమా చేయడం గొప్ప విషయం. ఇక సినిమాలో హీరోయిన్ గా నివేదా నటించడం కూడా సినిమాకు హిట్ సెంటిమెంట్ తోడైనట్టే మరి మొదటి సినిమా ఇచ్చిన షాక్ నుండి బయటపడాలంటే విక్రం సినిమాతో హిట్ అందుకోవాల్సిందే.


లేబుళ్లు:

మహేష్ బాబుపై విమర్శలు!!



తెలుగు సినిమా "సూపర్ స్టార్" అనే బిరుదు ఉన్న, మహేష్ బాబుకి తెలుగు చదవడం, రాయడం రాదు అన్న సంగతి తెలిసిందే. దానికి కారణం లేకపోలేదు. మహేష్ బాబు పుట్టింది చెన్నైలో. స్కూలు నుంచి హీరోగా మారేదాకా, చదువంత చెన్నైలోనే కొనసాగించాడు. తెలుగు ఎవరు నేర్పకపోవడంతో మహేష్ కి తెలుగు రాయడం గాని, చదవడం కాని రాదు. కాని మాట్లాడటం వచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటారా!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాపిక్ మీదే పవన్ - మహేష్ ఫ్యాన్స్ దెబ్బలాడుకుంటున్నారు. విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తన రెండొవ పుస్తకం "నేను-మనం-జనం" త్వరలోనే విడుదల చేయనున్న సంగతి తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ కి తెలుగు భాషపై పట్టు ఉందని, అందుకే పుస్తకాలు రాయగలుగుతున్నాడని, మరోపక్క తెలుగువాడిగా పుట్టి, తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగు ప్రేక్షకుల అభిమానంతో ఎదిగిన మహేష్ కి తెలుగు రాయటం, చదవటం రాకపోవడం అవమానకరం అని పవన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. గ్యాప్ ఇవ్వకుండా మహేష్ పై పెద్దగానే విమర్శలు చేస్తున్నారు.

చెన్నైలో పుట్టిపెరిగిన వాడికి తెలుగు రాయడం, చదవడం ఎలా వస్తుందని మహేష్ అభిమానులు డిఫెన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క జనతా గ్యారేజ్ సక్సెస్ తో ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ అభిమానులు జరుగుతున్నదంతా చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.


లేబుళ్లు:

బాహుబలి 2 నుండి రానా అవుట్



గత మూడేళ్ళుగా బాహుబలి చిత్రం కోసం ప్రభాస్, రానా , అనుష్క మిగితా తారాగణం అంత రాజమౌళి తో కష్టపడుతున్నారు..


ఇక బాహుబలి 2 కు వస్తే ఇప్పటికి 80 % షూటింగ్ పూర్తి అయ్యింది.ఇక ఈ చిత్రం నుండి రానా బయటకు వచ్చాడని తెలుస్తుంది.

రానా , ప్రభాస్ ల ఫై జరగాసిన పోరాట సన్నివేశాలన్నీ షూటింగ్ పూర్తి చేశాయట.ప్రస్తుతం రానా కు సంబదించిన షూటింగ్ మొత్తం పూర్తి కావడం తో రాజమౌళి వేరే సినిమా చేసుకొమ్మని చెప్పాడట..దీంతో రానా ఇక తన సినిమాలతో బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే వంశీ సినిమా లైన్ లో పెట్టిన రానా , మరో రెండు , మూడు ప్రాజెక్ట్స్ లను చేయబోతున్నాడట..మొత్తానికి రాజమౌళి ను రానా కు స్వేచ్ఛ వచ్చంది.

లేబుళ్లు:

తెలుగు యాంకర్ ఫోటోషూట్ తో మతిపోవాల్సిందే



తెలుగు బుల్లితెరపై  యాంకర్ల శకం దశలు దశలుగా కొనసాగుతుంది. ఉదయభాను, ఝాన్సీ, అనితా చౌదరి, సుమ, శిల్పా చక్రవర్తిలాంటి వాళ్లు ఏళితే, ఆ తర్వాత అనసూయ, రష్మీ లాంటి వాళ్లు కాస్త హాట్ డోస్ ను పెంచేసి మురిపిస్తున్నారు. వీళ్లంతా ఏళ్లకు ఏళ్లు కష్టపడితేకానీ ఇప్పుడున్న పొజిషన్ కు చేరుకుకోలేకపోయారు. కానీ ఇప్పుడున్న తెలుగు యాంకర్స్ లో షార్ట్ టైంలో పేరు తెచ్చుకుంటుంది మాత్రం ఒక్క శ్రీముఖి అని చెప్పుకోవాలి. 

ఓవైపు సినిమాలు, ఇంకోవైపు టీ షోలు, అదే చేత్తో మూవీ ఈవెంట్స్ ను ఒంటిచేత్తో నడిపిస్తోందీ వాలుకళ్ల సుందరి. ప్రస్తుతం యాంకరింగ్ లోకంలో దూసుకుపోతున్న స‌రికొత్త రాకెట్‌. క‌ళ్లుతిప్పుకోలేని గ్లామ‌ర్‌, గ‌ల‌గ‌ల మాట‌లు, చ‌క్కని స‌మ‌య‌స్ఫూర్తి, అంత‌కుమించి తెలివితేట‌లు ఇక యాంకర్ కి అంతకన్నా లక్షణాలు ఏం కావాలి? యాంక‌రింగ్ పీల్డ్ లో త‌క్కువ టైమ్‌లోనే తన‌తైన ముద్ర వేసింది శ్రీముఖి అంతే స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. 

ఇక టీవీషోలతో మన ఇంటి అమ్మాయిగా కనిపించే శ్రీముఖిలో హాట్ నెస్ యాంగిల్ కూడా చాలానే ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆమె చేసిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. వైట్ షర్ట్ వేసుకుని పై బటన్స్ విప్పేసి రకరకాల యాంగిల్స్ లో ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లు చూస్తే చూపుతిప్పుకోవాలని అనిపిస్తుందా చెప్పండి. మన దర్శకులు కరెక్ట్ కాంసంట్రేషన్ చేయట్లేదు గానీ, చేసుంటే సైడ్ క్యారెక్టర్లు ఏంటీ... ఏకంగా హీరోయిన్ క్యారెక్టర్లే ఇచ్చేయరంటారా చెప్పండి.


లేబుళ్లు:

మరో రికార్డుకు చేరువలో జనతా!



ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండోవారం కూడా దుమ్మురేపింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంటోంది. పనిదినాల్లో కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వారాంతాలు - సెలవు దినాల్లో కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా విడుదలైన మొదటివారం వినాయక చవితి సెలవు దినాలు కలిసి రావడంతో కలెన్షన్లు అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే వచ్చాయి. రెండోవారం కూడా వరుసగా సెలవు దినాలు రావడం జనతాకి కలిసి వచ్చిన విషయం. సెప్టెంబర్ 13న బక్రీద్ పండుగ సెలవు దినం కావడంతో అన్ని చోట్లా జనతా కలెక్షన్లు బాగున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. 

 ఇక  నేడు హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల్లో అధికారికంగా సెలవు దినం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వినాయక నిమజ్జనం రూపంలో మరో సెలవు రోజు జనతాకి కలిసి వచ్చిందన్నమాట! నిమజ్జనం రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనతా కలెక్షన్లు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో కలెక్షన్ల పరంగా జనతా గ్యారేజ్ రూ. 75 కోట్ల క్లబ్బులోకి చేరీoది.ఇదే లెక్కన మూడో వారం ముగిసేసరికి జనతా గ్యారేజ్ వసూళ్లు రూ. 80 కోట్లు దాటేస్తుందని ఓ అంచనా.

ప్రాంతాల వారీగా 13 రోజుల్లో జనతా వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నిజాం      :  రూ. 16.72 కోట్లు
సీడెడ్      :   రూ. 10.20 కోట్లు
ఉత్తరాంధ్ర  :  రూ. 6.77 కోట్లు
గుంటూరు :  రూ. 5.32 కోట్లు
కృష్ణా       :  రూ. 4.00 కోట్లు
ఈస్ట్        :  రూ. 4.36 కోట్లు
వెస్ట్        :  రూ.  3.75 కోట్లు
నెల్లూరు   :  రూ. 2.00 కోట్లు

ప్రాంతాల వారీగా చూసుకుంటే సినిమా విడుదలైన తొలి 10 రోజుల్లో ఆంధ్రా - నైజాం ప్రాంతాల్లో జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్ లో ఉంది. మొత్తం రూ. 53.13 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కేవలం పది రోజుల్లోనే రూ. 75.75 కోట్లు వసూళ్లు రాబట్టుకుంది.

లేబుళ్లు:

14, సెప్టెంబర్ 2016, బుధవారం

సుక్కు నోట ఆది డైలాగ్.. తొడగొట్టు చిన్నా



ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్ షిప్ తో పాటు అండర్ స్టాండింగ్ కూడా ఉంది. అందుకే వీళ్లిద్దరూ కలిసి నాన్నకు ప్రేమతో చిత్రాన్ని ఆ రేంజ్ లో పండించగలిగారు. ఆ మూవీతోనే మొదటిసారి ఎన్టీఆర్ 50 కోట్ల రూపాయల షేర్ ను అందుకోగలిగాడు. ఇప్పుడు తన నెక్ట్స్ పిక్చర్ జనతా గ్యారేజ్ తో 70 కోట్ల క్లబ్ లోకి కూడా దూసుకొచ్చేశాడు జూనియర్. 

జనతా గ్యారేజ్ సక్సెస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకునేందుకు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో.. దర్శకుడు సుకుమార్ మాట్లాడాడు. అసలు కామెడీనే కాదు.. కామెడీ యాక్టర్ కూడా లేని ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని కొంత టెన్షన్ పడ్డ మాట వాస్తవమే అని అంగీకరించిన సుకుమార్.. రిలీజ్ తర్వాత రికార్డులు బ్లాస్ట్ అయ్యాయని చెప్పాడు. 'ఆది సినిమాలో ఎన్టీఆర్ కి తొడగొట్టు చిన్నా అనే డైలాగ్ ఉంటుంది. ఇలాంటి సినిమా పడితే ఎన్టీఆర్ ఏంటో అర్ధమవుతుంది' అంటూ ఫ్యాన్స్ కి హుషారు కలిగించాడు సుకుమార్. అదే టైమ్ లో గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివను కూడా ఆకాశానికి ఎత్తేశాడు.

'తెలుగు సినిమాలో శివకు ముందు.. శివకు తర్వాత అంటూ ఉంటాం. అలాగే కమర్షియల్ సినిమాల లెక్కలో కొరటాల శివకు ముందు.. కొరటాల శివకు తర్వాత అనడం అతిశయోక్తిగా ఉన్నా నిజమే' అన్న సుకుమార్.. ఇప్పటికే శివకు ఫాలోయర్స్ కూడా వచ్చేశారని పొగిడేశాడు. 




లేబుళ్లు: