కాజల్ డిమాండ్ మామూలుగా లేదుగా..
రెండేళ్లు వెనక్కి వెళ్తే కాజల్ అగర్వాల్ పనైపోయిందని తేల్చేశారు విశ్లేషకులు. అప్పటికి ఆమె చేతిలో ఒకటీ అరా అవకాశాలే ఉన్నాయి. పైగా గ్లామర్ కూడా కొంచెం దెబ్బ తిన్నట్లు కనిపించింది. తన గురించి నెగెటివ్ ప్రచారం జరుగుతుండగానే పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల సరసన అవకాశాలు దక్కించుకుంది కాజల్. తమిళం..హిందీ భాషల్లోనూ ఆమెకు మంచి అవకాశాలే దక్కాయి. ఇంతలో సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం సినిమాలు డిజాస్టర్లు కావడంతో మళ్లీ ఆమె గురించి నెగెటివ్ ప్రచారం మొదలైంది. అయినా కాజల్ ఊపేమీ తగ్గలేదు. ఈ మధ్యే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ తో ఓ ఊపు ఊపేసిన చందమామ.. మంచి మంచి అవకాశాలే అందుకుంటోంది.
ఆల్రెడీ అజిత్ సరసన ఓ సినిమాకు కమిటైన కాజల్.. డేట్లు సర్దుబాటు చేయలేక విక్రమ్ తో సినిమాను వదులుకుంది. లేటెస్టుగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం. తుపాకి.. జిల్లా లాంటి సినిమాలతో విజయ్ కు లక్కీ హీరోయిన్ అనిపించుకున్న కాజల్.. అతడితో మూడోసారి జత కట్టబోతోందట. ప్రస్తుతం భరతన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు విజయ్. కీర్తి సురేష్ కథానాయిక. అది అతడికి 60వ సినిమా. దీని తర్వాత తనకు ‘తెరి’ లాంటి హిట్టిచ్చిన అట్లీతో మరో సినిమా చేయబోతున్నాడు విజయ్. ఈ సినిమాకు కాజల్ దాదాపుగా ఫైనలైజ్ అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి మన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం.
Tags: Kajal Agarwal, Actress Kajal Agarwal, Telugu News
లేబుళ్లు: Kajal agarwal, Telugu news


<< హోమ్