20, ఫిబ్రవరి 2019, బుధవారం

వైసిపి లో చేరాల‌ని బెదిరిస్తున్నారు :నాగార్జున జ‌గ‌న్ ను ఎలా క‌లుస్తారు: చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తాము తిరిగి అధికారంలోకి వ‌స్తే త‌న ఆట‌లు సాగ‌వ‌ని కేసీఆర్ ఏపిలో జ‌గ‌న్ను సామంత రాజుగా పెట్టుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆరో పించారు. హైద‌రాబాద్ లో ఆస్తులు ఉన్న నేత‌ల‌ను బెదిరించి వైసిపి లో చేరుస్తున్నార‌ని ఆరోపించారు. ఇక, సినీ హీరో నాగార్జున వైసిపి అధినేత జ‌గ‌న్ తో సమావేశం అవ్వ‌టాన్ని త‌ప్పుబ‌ట్టారు....



పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసిందని...దీంతో దాడి వెనుక రాజకీయ లబ్ధి దాగి ఉందా అనే అనుమానం దేశ వ్యాప్తంగా బలపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో సీ ఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వార్థం కోసం దేశాన్ని ఎక్కడికైనా తీసుకుపోతామంటే ఉపేక్షించేది లేదని స్ప ష్టం చేశారు. దేశాన్ని భ్రష్టు పట్టించే చర్యలను అడ్డుకుని తీరాలని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకేను రిమోట్ కంట్రో ల్తో బీజేపీ నడిపిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాత్ర చేస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ విషయంలో మనం స్పష్టతతో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర స్థాయిలో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

బెదిరించి వైసిపి లో చేరుస్తున్నారు..


ఏపిలో తిరిగి టిడిపి అధికారంలోకి వస్తే త‌న ఆట‌లు సాగ‌వ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుంద ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇందు కోసం జ‌గ‌న్ ను సామంతరాజును చేయాల‌నేది ఆయ‌న ల‌క్ష్యంగా క‌నిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. హైద‌రాబాద్‌లో ఆస్తులు..వ్యాపారాలు ఉన్న నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని వైసిపి లో చేరాల‌ని బ్లాక్ మె యిల్ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. వైసిపి లో చేరితే హైద‌రాబాద్‌లో ఆస్తుల‌ను భ‌రోసా ఏర్ప‌డుతోంద‌ని ఆయ‌న వివ రించారు. ఈ బెదిరింపుల కార‌ణంగానే కొంద‌రు నేత‌లు వైసిపి లో చేరుతున్నార‌ని పేర్కొన్నారు.


నాగార్జున వెళ్లి జ‌గ‌న్ ను క‌లుస్తారా..

నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతా యని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన జగన్ లాంటి వ్యక్తులతో నాగార్జు న భేటీ కావడం సరైంది కాదని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. వైకాపాలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆక్షే పించారు. జ‌గ‌న్ తో భేటీ పై ఇప్ప‌టికే నాగార్జున వివ‌ర‌ణ ఇచ్చారు. తాను మ‌ర్యాద పూర్వ‌కంగానే జ‌గ‌న్ ను క‌లిసాన‌ని.. ఇందులో రాజ‌కీయాలు లేవ‌ని స్ప‌ష్టం చేసారు.

లేబుళ్లు:

సందీప్ కిషన్ అభిమాని మృతి: కుటుంబ సభ్యులను పరామర్శ

ఇటీవల తనను అమితంగా ఇష్టపడే అభిమాని మరణించడం యువ క‌థానాయ‌కుడు సందీప్‌కిష‌న్‌కు విషాదాన్ని మిగిల్చింది. తన తొలి చిత్రం ప్ర‌స్థానం నుంచి అభిమానిగా మారిన క‌డ‌ప శ్రీను శుక్రవారం జనవరి 18న ప్రొద్దుటూరులో గుండెపోటుతో క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమాని మృతి కలత చెందిన సందీప్ కిషన్ ఇటీవల మృతుని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. కడప శ్రీను కుటుంబానికి ప్రతీ నెల రూ.7వేలను ఇస్తానని ప్రకటించారు కూడా.


 
తీరని శోకంలో మునిగిన కడప శ్రీను కుటుంబాన్ని ఇటీవల కలిసి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక అండతోపాటు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని మాట ఇచ్చినట్టు తెలిసిందే.

 
తన అభిమాని మరణంతో ఇబ్బందుల్లో పడిన కుటుంబాన్ని ఆదుకోవడానికి సందీప్ కిషన్ ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అభిమానులను పట్టించుకోని హీరోలు ఉన్న ఈ రోజుల్లో సందీప్ కిషన్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

లేబుళ్లు:

19, ఫిబ్రవరి 2019, మంగళవారం

హార్వర్డ్ యూనివర్శిటీ సదస్సులో రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్’ గురించి ఏమన్నారంటే?

'బాహుబలి' ప్రాజెక్టుతో ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో సునామీ సృష్టించిన దర్శకుడు రాజమౌళి... 'ఆర్ఆర్ఆర్' పేరుతో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్లో ప్లాన్ చేశారు.

2018లో లాంచ్ అయిన ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రాజమౌళి ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్శిటీలో జరుగుతున్న సదస్సులో ప్రసంగించే అవకాశం దక్కించుకున్న ఆయన తొలిసారిగా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు.

'ఇండియా ఎట్ ఇంఫ్లెక్షన్ పాయింట్’ 
హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ‘ఇండియా ఎట్ ఇంఫ్లెక్షన్ పాయింట్' అనే అంశంపై జరిగిన సదస్సులో రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.


' ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా
‘ఆర్ఆర్ఆర్' ప్యాన్ ఇండియా చిత్రంగా రాజమౌళి అభివర్ణించారు. బడ్జెట్‌ పరంగా చూస్తే బాహుబలికి సమానమైన చిత్రంగా దీన్ని చెప్పవచ్చని తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్' మొదలైన తర్వాత రాజమౌళి దీని గురించి మాట్లాడటం ఇదే తొలిసారి.


ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టు విషయంలో ఏ చిన్న విషయం కూడా లీక్ కాకుండా రాజమౌళి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సినిమా సెట్లోకి సెల్ ఫోన్లు అనుమతించడం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఏమిటి? స్టోరీ బ్యాగ్రౌండ్ ఏమిటి? ఇలా ప్రతి విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది.


'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామ్ చరణ్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీని రూ. 300 కోట్ల ఖర్చుతో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లు, ఇతర తారాగణం ఎవరు? అనేది త్వరలో వెల్లడించనున్నారు.

లేబుళ్లు:

5, ఫిబ్రవరి 2019, మంగళవారం

కేబుల్ టీవీ చానెల్స్ రేట్లు పెంచారని ఈ మహిళా ఏం అంటుందో వింటే నవ్వు ఆపుకోలేరు

కేబుల్ టీవీ చానెల్స్ రేట్లు పెంచారని ఈ మహిళా ఏం అంటుందో వింటే నవ్వు ఆపుకోలేరు.


లేబుళ్లు: