వైసిపి లో చేరాల‌ని బెదిరిస్తున్నారు :నాగార్జున జ‌గ‌న్ ను ఎలా క‌లుస్తారు: చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తాము తిరిగి అధికారంలోకి వ‌స్తే త‌న ఆట‌లు సాగ‌వ‌ని కేసీఆర్ ఏపిలో జ‌గ‌న్ను సామంత రాజుగా పెట్టుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆరో పించారు. హైద‌రాబాద్ లో ఆస్తులు ఉన్న నేత‌ల‌ను బెదిరించి వైసిపి లో చేరుస్తున్నార‌ని ఆరోపించారు. ఇక, సినీ హీరో నాగార్జున వైసిపి అధినేత జ‌గ‌న్ తో సమావేశం అవ్వ‌టాన్ని త‌ప్పుబ‌ట్టారు....



పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసిందని...దీంతో దాడి వెనుక రాజకీయ లబ్ధి దాగి ఉందా అనే అనుమానం దేశ వ్యాప్తంగా బలపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో సీ ఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వార్థం కోసం దేశాన్ని ఎక్కడికైనా తీసుకుపోతామంటే ఉపేక్షించేది లేదని స్ప ష్టం చేశారు. దేశాన్ని భ్రష్టు పట్టించే చర్యలను అడ్డుకుని తీరాలని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకేను రిమోట్ కంట్రో ల్తో బీజేపీ నడిపిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాత్ర చేస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ విషయంలో మనం స్పష్టతతో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర స్థాయిలో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

బెదిరించి వైసిపి లో చేరుస్తున్నారు..


ఏపిలో తిరిగి టిడిపి అధికారంలోకి వస్తే త‌న ఆట‌లు సాగ‌వ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుంద ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇందు కోసం జ‌గ‌న్ ను సామంతరాజును చేయాల‌నేది ఆయ‌న ల‌క్ష్యంగా క‌నిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. హైద‌రాబాద్‌లో ఆస్తులు..వ్యాపారాలు ఉన్న నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని వైసిపి లో చేరాల‌ని బ్లాక్ మె యిల్ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. వైసిపి లో చేరితే హైద‌రాబాద్‌లో ఆస్తుల‌ను భ‌రోసా ఏర్ప‌డుతోంద‌ని ఆయ‌న వివ రించారు. ఈ బెదిరింపుల కార‌ణంగానే కొంద‌రు నేత‌లు వైసిపి లో చేరుతున్నార‌ని పేర్కొన్నారు.


నాగార్జున వెళ్లి జ‌గ‌న్ ను క‌లుస్తారా..

నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతా యని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన జగన్ లాంటి వ్యక్తులతో నాగార్జు న భేటీ కావడం సరైంది కాదని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. వైకాపాలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆక్షే పించారు. జ‌గ‌న్ తో భేటీ పై ఇప్ప‌టికే నాగార్జున వివ‌ర‌ణ ఇచ్చారు. తాను మ‌ర్యాద పూర్వ‌కంగానే జ‌గ‌న్ ను క‌లిసాన‌ని.. ఇందులో రాజ‌కీయాలు లేవ‌ని స్ప‌ష్టం చేసారు.

కామెంట్‌లు