28, మే 2017, ఆదివారం

ఎన్టీఆర్ కు జూనియర్ నివాళులు


నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో హాజరైన ఎన్టీఆర్ , తాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. తెలుగువారికి ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు.

హరికృష్ణ మాట్లాడుతూ ..ఈరోజు తెలుగు వారికి పండుగ రోజు అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన పథకాలే.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయని ఆయన చెప్పారు. స్త్రీలు ఒంటరిగా తిరుగుతున్నారంటే అది ఎన్టీఆర్ పాలన వల్లే అని ఆయన పేర్కొన్నారు. ఆయన అనుకున్నది సాధించి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని అన్నారు.

ఎన్టీఆర్‌ కుమారులు హరికృష్ణ, రామకృష్ణ సహా పలువురు కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.

లేబుళ్లు:

త్రివిక్రమ్ తో పవన్ ఫుల్ స్టాప్ ??

pawan-kalyan-tivikram-movie-stops

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ తొలి వారంలో ప్రారంభమైన షూటింగ్ కి.. చిన్న చిన్న బ్రేకులు తప్ప షూటింగ్ జరిగిపోతూనే ఉంది. ఎప్పటిమాదిరిగానే పవర్ స్టార్ మూవీకి సంబంధించిన ఏ అప్ డేట్ బయటకు రావడం లేదు. మాటల మాంత్రికుడితో పవన్ చేస్తున్న మూవీకి.. ఇప్పటికే #PSPK25 అంటూ హ్యాష్ ట్యాగ్ తలిగించేసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

అభిమానుల సంబరాలకు ఓ యాంగిల్ లో బ్రేక్ పడిపోయే న్యూస్ ఇది. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాతో.. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయనున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత చేస్తాడో తెలీదు కానీ.. 2019 ఎలక్షన్స్ వరకూ మాత్రం పవన్ కు ఇదే ఆఖరి చిత్రం అనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే తనతో సినిమాలకు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశాడట పవన్. పొలిటికల్ గా యాక్టివ్ నెస్ పెంచాల్సిన అవసరం ఉండడం.. అనేక జిల్లాల్లో పర్యటించాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట పవన్.

అనంతపూర్ నుంచి ఎన్నికల్లో నిలబడతానని చెప్పిన పవన్.. ఏ నియోజకవర్గం అనే విషయంపై డిస్కషన్స్ జరుపుతున్నాడట. అలాగే జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టడం కోసం.. ప్రస్తుతానికి సినిమాలకు ఓ ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయినట్లు టాలీవుడ్ లో తెగ చెప్పేసుకుంటున్నారు.

లేబుళ్లు: ,

26, మే 2017, శుక్రవారం

ఎన్టీఆర్ జైలవకుశ దిమ్మతిరిగే ప్రైజ్..!

ntr-jai-lava-kusa-huge-price
Add caption

ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో స్టార్ హీరోల సినిమాల మీద అంచనాలను పెంచేయడం కామనే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న జై లవకుశ సినిమాలో తారక్ ఫస్ట్ లుక్ అంచనాలను పెంచడమే కాదు అదేపనిగా ఆ రెండు రోజులు హాట్ న్యూస్ గా నిలిచేలా చేసింది. రాయల్ లుక్ లో రావణగా తారక్ అదరగొట్టేశాడు.

ఈ లుక్ చూసి సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారట. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ చేస్తున్న మూవీ కాబట్టి ఆ సినిమా రేంజ్ దాటి బిజినెస్ చేస్తుందట. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ కు బాండాగారంగా మారిన ఓవర్సీస్ లో కూడా జై లవకుశకు భారీ డిమాండ్ ఏర్పడిందట.

జై లవకుశ కళ్యాణ్ రాం సినిమా ఓవర్సీస్ రైట్స్ 14 కోట్లు చెబుతున్నాడట. తారక్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జనతా గ్యారెజ్ ఇక్కడ 2 మిలియన్ డాలర్స్ కలక్షన్ తీసుకురాలేదు. మరి 14 కోట్లు పెట్టాలంటే సినిమా కలక్షన్స్ 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయాలి.

అంతకుముందు వచ్చిన ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ఓవర్సీస్ లో 2.2 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ సాధించింది. ఆ సినిమా కలక్షన్స్ పై సుకుమార్ డైరక్షన్ ప్రభావం కూడా ఉంది. మరి బాబికి అంత సీన్ ఉందా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఇవన్ని లెక్కలెలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం కళ్యాణ్ రాం అనుకున్న ప్రైజ్ ఒక్క పైసా తగ్గేది లేదు అంటున్నాడట.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా జై లవకుశ ఓ రేంజ్ లో బిజినెస్ చేస్తుందట. జనతా గ్యారేజ్ ఫుల్ రన్ లో 80 కోట్ల దాకా తెస్తే జై లవకుశ ప్రీ రిలీజ్ బిజినెస్సే 80 కోట్ల దాకా చేస్తున్నారట. మరి తారక్ కు 100 కోట్ల కలక్షన్స్ తెస్తేనే కాని ఈ సినిమా హిట్ అన్నట్టు లెక్క.. జూనియర్ ను 100 కోట్ల క్లబ్ లో నిలబెట్టే సినిమా జై లవకుశ అవుతుందా లేదా అన్నది చూడాలి.

లేబుళ్లు:

బికినీ టాపులో సమంత

samantha-bikini-photo

చేనేత వస్త్రాలు అంటే ముతకగా ఉంటాయని.. ఓల్డ్ ఫ్యాషన్ అని.. వాటిని వేసుకుంటే పాత తరం మనుషులు అంటారని.. జనాల్లో అపోహ ఉంది. ఈ జనరేషన్ హ్యాండ్ లూమ్స్ .. డిజైనర్ డ్రెస్ లకు ఏ మాత్రం తీసిపోవనే విషయాన్ని ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రూవ్ చేసేసింది.

తాజాగా సమంత ఓ ఫోటో షేర్ చేసింది. గభాలున చూస్తే ఎవరో టాప్ డిజైనర్ డిజైన్ చేశారని అనుకోవడం ఖాయం. సమంత ఆ రేంజ్ లో అందాలు ఆరబోసేసింది. క్లీవేజ్ అందాల నుంచి.. నడుం మడతల వరకు.. బికినీ టాపులో అందాలను ప్రదర్శించింది. నాభి షోకులను చూపించేందుకు కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు సమంత. టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న సమంతకు ఇలా అందాలు చూపిస్తూ పోజులు ఇవ్వడం.. ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం కొత్తేమీ కాదు. అయితే.. మరో నాలుగు నెలల్లో పెళ్లి చేసుకోబోతూ కూడా ఇంత డేరింగ్ గా ఉండడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

జేఎఫ్ డబ్ల్యూ మేగజైన్ కోసం ఈ పోజ్ ఇచ్చిన సమంత.. 'తెలంగాణ కళాకారులు'.. 'చేనేత వస్త్రాలు'.. 'హ్యాండ్ లూమ్స్ లో సెక్సీగా' అనే అర్ధం వచ్చేలా హ్యాష్ ట్యాగ్ లు పెట్టి.. తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మరో అడుగు ముందుకు వేసేసింది. ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా చాలా ప్రొఫెషనల్ గా ఈ రేంజులో సోకులు ఆరబోయడం సమంతకే చెల్లింది.

anchor sashi real behaviour with girls


లేబుళ్లు:

23, మే 2017, మంగళవారం

ఎన్టీఆర్ శిఖరం…ఆయన్ను అందుకోలెం……


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన 26 సినిమాల్లో చాలా సినిమాలు నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తిని తీసుకోచ్చినవే…కానీ వాటిలో ఎన్టీఆర్ కి నటుడిగా పీక్స్ లో క్రేజ్ తెచ్చిన అతికొద్ది సినిమాల్లో టెంపర్ సినిమా ఒకటి.

రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాతో ఆల్ మోస్ట్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ రేంజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి గ్రేట్ నెస్ ఉన్న ఈ సినిమాను సౌత్ లో కానీ నార్త్ లో కానీ రీమేక్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు ఇన్ని రోజులు.

గా ఎట్టకేలకు రీసెంట్ గా బాజిరావ్ మస్తానీ ఫేమ్ రణవీర్ సింగ్ ఈ రీమేక్ కి సిద్ధం అయ్యాడు. కాగా ఎన్టీఆర్ యాక్టింగ్ ని రిప్లేస్ చేయగలవు అని అనుకుంటున్నావా అంటే అది కష్టం కానీ నావల్ల ఎంత అయితే అంత చేస్తా అని అంటున్నాడట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉందట.

22, మే 2017, సోమవారం

మీరు వినాలనుకుంటున్నారా మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ మాటలని ...???


మీరు వినాలనుకుంటున్నారా మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ మాటలని ...???
అయితే ఒక్క sms పంపండి ...!
అలా అయితే మాదగ్గర దీనికోసం మంచి చిట్కా కలదు. ఎవరి మాటలైనా వినటానికి మీరు ఒకటి చేయవలిసి ఉంటుంది. అదే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.ఈ యాప్ పేరు "టికిల్ మై ఫోన్ "ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు వేరొకరి సంభాషణలను వినవచ్చు. వారికి తెలియాకుండానే ..! అది ఎలా అంటే మీరు అనుమానించే వ్యక్తులు వేరేవారికి కాల్ చేసినప్పుడు మీకు కూడా కాల్ వస్తుంది. తద్వారా మీరు వారి మాటలు వినవచ్చు. పదండి.. ఓ లుక్కేద్దాం ..! ఈ యాప్ ని ఎలా వినియోగించాలో ...?
#1అన్నిటికంటే ముందు ఈ యాప్ ని ఏ ఫోన్ లో మీరు మాటలు వినాలనుకుంటున్నారో ఆ ఫోన్ లో ఇంస్టాల్ చేయండి.
#2 ఇప్పుడు మీరు మీ ఫోన్ నుంచి ఆ ఫోన్ కి ఎదో ఒక sms పంపండి. కానీ జాగ్రత్త వహించండి. మీరు ఈ ఫోన్ లో అయితే యాప్ ఇన్స్టాల్ చేశారో దానికి sms పంపాలి.'
#4 మీరు కాల్ వింటున్నప్పుడు పొరపాటున కాల్ కట్ అయితే మరలా మీరు sms పంపాలి. సో మరలా మీకు కాల్ వస్తుంది. మరలా మీరు వారి మాటలు వినవచ్చు.

21, మే 2017, ఆదివారం

బ్రేకింగ్ న్యూస్…ఇండస్ట్రీని షేక్ చేస్తూన్న జైలవకుశ..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జై లవ కుశ’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఈ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోన్న రాశిఖన్నా పాల్గొనగా పెళ్లి సీన్ చిత్రీకరిస్తున్నారట.
ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్ హక్కుల నిమిత్తం భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ చానెల్ జెమిని 14కోట్లు ఇచ్చి మరీ ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారమ్. ఎన్టీఆర్ గత సినిమాల  కంటే ‘జై లవ కుశ’ శాటిలైట్ హక్కుల కోసం భారీ మొత్తం దక్కిందని చెప్పొచ్చు.

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని  నిర్మిస్తున్నారు. టేబుల్ ప్రాఫిట్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాని విడుదల చేస్తారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సో.. అన్నయ్యకు తమ్ముడు ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాతో భారీ గిఫ్ట్ నే ఇస్తున్నాడని చెప్పొచ్చు.

లేబుళ్లు:

18, మే 2017, గురువారం

కన్నడ సినిమా నుంచి ఫిలిం ఫేర్ కు ఎన్టీఆర్

ntr-nominated-geliya-geliya-song-siima-awards-2017

జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఇప్పటికే బోలెడన్ని అవార్డులు అందుకున్నాడు. ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఏడుసార్లు ఉత్తమ నటుడిగా నామినేషన్లు తెచ్చుకుని.. సింహాద్రి.. యమదొంగ సినిమాలకు రెండు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఐతే ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఎన్టీఆర్ కు కొత్త రకమైన నామినేషన్ దక్కింది. అతను ఉత్తమ డెబ్యూ సింగర్ నామినేషన్ తెచ్చుకోవడం విశేషం. ఐతే ఎన్టీఆర్ ఎప్పుడో ‘యమదొంగ’లో ఓలమ్మీ తిక్కరేగిందా పాటతోనే గాయకుడయ్యాడు కదా. ఇప్పుడు డెబ్యూ సింగర్ ఏంటి అని సందేహం కలుగుతోంది కదా. ఇక్కడే ఉంది ట్విస్టు. ఎన్టీఆర్ నామినేషన్ దక్కించుకున్నది తెలుగు సినిమాకు కాదు. కన్నడ చిత్రానికి.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన ‘చక్రవ్యూహ’ అనే సినిమాలో తారక్.. గెలయా గెలయా అనే పాట పాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ పాట ఇన్ స్టంట్ హిట్టయింది. కన్నడ జనాలకు అది బాగా నచ్చేసింది. ఆ పాటకే తారక్ ఫిలిం ఫేర్ నామినేషన్ దక్కించుకున్నాడు. ఈ పాటకు తారక్ అవార్డు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదేమో. నటుడిగా ఎన్నో అవార్డులందుకున్నప్పటికీ.. గాయకుడిగా.. అది కూడా కన్నడ నుంచి ఫిలిం ఫేర్ అవార్డు తీసుకుంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ‘చక్రవ్యూహ’ సినిమాకు తమన్ సంగీతాన్నందించాడు. ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ కోసం నందమూరి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న టైంలో ఎన్టీఆర్ కు ఉత్తమ గాయకుడిగా ఫిలిం ఫేర్ నామినేషన్ దక్కిందన్న వార్త వారికి మరింత ఊపునిస్తోంది.


లేబుళ్లు: ,

16, మే 2017, మంగళవారం

గెట్ రెడీ ఫర్.. నందమూరి 'రెడ్డి గారు'


నందమూరి బాలకృష్ణ.. ఒకప్పుడు ఆయన ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అంతేకాదు.. సమరసింహా రెడ్డి.. చెన్నకేశ రెడ్డి.. అంటూ రెడ్డి పేర్లను కూడా ఆయన ఇమ్మోర్టలైజ్ చేశారు. అలాంటి బాలయ్య ఈ మధ్యన రూటు మార్చి గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాను చేయడానికి అడుగులు వేశారు. ఆ సినిమా సక్సెస్ తరువాత అదే తరమాలో కొనసాగుతారని అనుకుంటే.. ఆయన మాత్రం మరోసారి కమర్షియల్ సినిమాలనే ఎంచుకున్నారు.

ఇప్పటికే పూరి జగన్ డైరక్షన్లో మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా ఒకటి చేస్తున్న ఆయన.. తదుపరి కె.ఎస్.రవికుమార్ డైరక్షన్లో ఒక సినిమాను చేయడానికి సన్నద్దమవుతున్నారు. రజనీకాంత్ కోసం రెడీ చేసిన ఒక కథను ఇప్పుడు బాలయ్యతో చేస్తున్నారనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాకు టైటిల్ ఏమని పెడితే బాగుంటుంది అని అనుకుంటున్న వేళ.. ''రెడ్డి గారు'' అనే టైటిల్ అయితే బాగుంటుందని ఫిక్సయ్యారట. ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు కాని.. ఈ టైటిల్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వినిపిస్తోంది.

కాకపోతే ఈ టైటిల్ అభిమానులకు నచ్చినా కూడా ఆయన పొలిటికల్ శ్రేయోభిలాషులకు మాత్రం పెద్దగా కిక్కివ్వట్లేదు. ఎందుకంటే ఇలా ఒక సామాజిక వర్గానికి చెందిన పేరును టైటిల్ గా పెడితే.. తక్కిన సామాజిక వర్గాల వారు హర్టయ్యే ఛాన్సుంది కదా అంటున్నారు పొలిటికల్ అభిమానులు. చూద్దాం మరి బాలయ్య ఈ టైటిల్ కు ఓకె చెబుతారో లేదో.

లేబుళ్లు:

డీజే పై మళ్లీ దాడి మొదలైంది


డీజే - దువ్వాడ జగన్నాధం.. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ ప్రకటించడమే సెన్సేషన్. మూవీకి సంబంధించిన అప్ డేట్స్ అన్నీ వైరల్ గా స్ప్రెడ్ అయ్యాయ్ కానీ.. అసలు విషయం ఏంటనే సంగతి.. డీజే టీజర్ రిలీజ్ అయినపుడే తెలిసింది.

సరైనోడు సక్సెస్ మీట్ లో 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కు.. డీజే టీజర్ కు డిజ్ లైక్స్ రూపంలో రిటార్ట్ ఇచ్చారు పవన్ ఫ్యాన్స్. ఆ మధ్య సినిమా సాంగ్స్ కి సిద్ధం కావాలంటూ.. హరీష్ శంకర్ ఓ ట్వీట్ పెడితే.. మేం డిజ్ లైక్స్ కి రెడీ అంటూ పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ సాక్షిగానే చెప్పారు. ఇప్పుడు ఆడియో టీజర్ ను రిలీజ్ చేసింది డీజే టీం. చిన్న మ్యూజిక్ బిట్ మాత్రమే కావడంతో.. ఇప్పటివరకూ 5 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఆడియో టీజర్ కు ఇప్పటి వరకూ 17 వేల లైక్స్ రాగా.. డిజ్ లైక్స్ ఇప్పటికే 11వేలు దాటిపోయాయి.

అంటే పని కట్టుకుని మరీ డిజ్ లైక్స్ కొడుతున్న విషయం తెలిసిపోతోంది. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా చెప్పను బ్రదర్ ను ఏ మాత్రం మరచిపోలేదని అర్దమవుతుంది. జస్ట్ టీజర్ కే ఇలా ఉంటే.. ఇకపై రాబోయే పాటలు.. ట్రైలర్ కు ఎలాంటి రియాక్షన్ రానుందో చూడాలి.

15, మే 2017, సోమవారం

గెలుపెవరిది… ‘స్పైడర్’ వర్సెస్ ‘జై లవకుశ’

ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాలలో కూడా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన మురుగదాస్ “స్పైడర్” సినిమా ‘ఫస్ట్ లుక్’ అంచనాలను అందుకోవడంలో విఫలమైందన్న విషయం తెలిసిందే. ఏదో ఒక కార్పొరేట్ కంపెనీని యాడ్ ఇస్తున్నట్లుగా ‘స్పైడర్’ స్టిల్స్ ఉన్నాయన్న కామెంట్స్ విరివిగా వినిపించాయి. అలాగే ‘స్పైడర్’ టైటిల్ యొక్క థీమ్ ను అయినా ప్రతిబింబిస్తుందని భావించగా, అది కూడా సింపుల్ గా ప్రజెంట్ చేసి సినిమాపై ఉన్న హైప్ ను తగ్గించడంలో సక్సెస్ సాధించింది చిత్ర యూనిట్. ‘స్పైడర్’ తర్వాత ఆ రేంజ్ లో ‘ఫస్ట్ లుక్’పై అంచనాలు ఏర్పడ్డ సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” నమోదైంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్న నేపధ్యంలో ఒక పాత్రలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గెటప్ అదిరిపోతుందన్న టాక్ కు తోడూ, ఇటీవల ఓ డిఫరెంట్ గెటప్ లో ఎన్టీఆర్ మాస్క్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో “జై లవకుశ” ఫస్ట్ లుక్ విభిన్నంగా ఉండే ఎన్టీఆర్ పాత్రతో విడుదల అవుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు కూడా ‘అదిరిపోతుందన్న’ సంకేతాలు ఇవ్వడంతో, ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్ట్ గా “జై లవకుశ” రూపుదాల్చుకుంది. మరి అంతే క్రేజ్ ను కొనసాగించాలంటే, ‘స్పైడర్’ మాదిరి కాకుండా ‘ఫస్ట్ లుక్’తోనే ప్రేక్షకులను పడేయాలి. మరి దానికి వేదిక జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం అయిన మే 19వ తేదీ వరకు వేచిచూడాల్సిందే! ఫస్ట్ లుక్ పై వచ్చిన క్లారిటీ, ఇంకా ట్రైలర్, టీజర్ మరియు సినిమా విడుదల తేదీ తదితర అంశాలలో రావాల్సి ఉంది. 


లేబుళ్లు: , ,

‘జై లవకుశ’లో ఎన్టీఆర్ స్పెషల్ ట్రీట్

jr-ntr-special-treat-jai-lavakusa

ప్రస్తుతం టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అతడికి అన్ని రకాల డ్యాన్సులూ వచ్చు. చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు తారక్. తన సినిమాల్లో అప్పుడప్పుడూ ఈ ప్రావీణ్యం ప్రదర్శించాడు. ‘కంత్రి’ సినిమాలోని ఓ పాటలో క్లాసికల్.. మోడర్న్.. కలిపి చేసిన డ్యాన్స్ అభిమానుల్ని అలరించింది.
ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో తన శాస్త్రీయ నృత్య ప్రతిభను చూపించబోతున్నాడట. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓ పాత్ర క్లాసికల్ డ్యాన్సరట. ఓ ఎపిసోడ్లో ఆ పాత్ర తన నృత్య ప్రతిభను చూపిస్తుందట. ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్లో అదరగొట్టేశాడని.. ఇది అభిమానులకు స్పెషల్ ట్రీటే అని అంటున్నాయి చిత్ర వర్గాలు.

మార్చిలో సెట్స్ మీదికి వెళ్లిన ‘జై లవకుశ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. గత ఏడాది ‘జనతా గ్యారేజ్’ రిలీజైన సెప్టెంబరు 1నే ‘జై లవకుశ’ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టైటిల్ లోగో లాంచ్ చేసిన చిత్ర బృందం ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయనుంది. ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా.. నివేదా థామస్ నటిస్తున్నారు.


లేబుళ్లు:

9, మే 2017, మంగళవారం

యూ ట్యూబ్ వీడియోతో బాధపడ్డ సింగర్!

singer-sunitha-daughter-video

ఒకప్పుడు చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ మీడియాకు దూరంగా ఉండే గాయని సునీత, ఇటీవల కాలంలో ఏదొక రూపేణా వార్తల్లో నిలుస్తుండడం విశేషం. తన భర్త విషయంలో స్పష్టత ఇచ్చిన సమయంలో సునీత పేరు మీడియా వర్గాల్లో హాట్ హాట్ గా హల్చల్ చేయగా, తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో తాను బాధపడిన ఓ యూ ట్యూబ్ వీడియో గురించి ప్రస్తావించారు.

‘సునీత కూతుర్ని చూసారా… కత్తిలా ఉంది…’ అనే టైటిల్ తో యూ ట్యూబ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసారని, నా కూతురిని కామెంట్ చేయడానికి వాళ్ళెవరు? నేను, నా పిల్లలు ఉన్న ఫోటోని ఎడిటింగ్ చేసి, దానికి బ్యాక్ గ్రౌండ్ సంగీతం జోడించి రూపొందించిన ఈ వీడియోపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయాలనిపించిందని, అయితే మనం ఈ ఫిర్యాదుతో ఎంతమందిని నియత్రించగలం అనే ప్రశ్నతో ఆగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ యూ ట్యూబ్ వీడియో తనను బాగా ఇబ్బంది పెట్టిందని, వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేయడమే కాకుండా తన పిల్లలను కూడా సీన్ లోకి లాగడం తనకు కోపాన్ని తెప్పించిందని సునీత వాపోయింది. ఇక టాలీవుడ్ టాప్ గాయకురాలిగా ‘బాహుబలి’ సినిమాలో ఎందుకు పాడలేదు? అన్న ప్రశ్నకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిలు ఫ్రెష్ వాయిస్ తో పాడించాలని నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, అందుకే తనకు అవకాశం దక్కలేదేమో అంటూ సమాధానం ఇచ్చుకుంది.

లేబుళ్లు:

ఎన్టీఆర్ పేరుకున్న పవర్ ఇది…

ntr-tollywood-ruler
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ…..ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ హేమాహేమీలు టెక్నీషియన్స్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.


కాగా సినిమాలో ఎన్టీఆర్ లుక్స్, పోస్టర్స్, కొన్ని కాస్ట్యూమ్స్ కోసం ఇప్పుడు బాలీవుడ్ నుండి ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ కం ఫ్యాషన్ డిసైనర్ అయిన డబూ రత్నానిని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదివరకు ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ పోస్టర్స్ అండ్ కొన్ని కాస్టూమ్స్ ఈయనే డిసైన్ చేసినట్లు టాక్.


బాలీవుడ్ లో ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ కం ఫ్యాషన్ డిసైనర్ గా ఫుల్ డిమాండ్ ఉన్నా…సౌత్ లో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు పిలిచినా రాని ఈయన కేవలం ఎన్టీఆర్ సినిమాల కోసం రావడం విశేషంగానే ఉందని అంతా అనుకుంటున్నారు. ఇదంతా ఎన్టీఆర్ క్రేజ్ వల్లే జరిగిందని అనుకుంటున్నారు అందరూ…

లేబుళ్లు:

అన్నా చెల్లెళ్లులా పెరిగాం, మాకు పెళ్లా. నీహారికతో తన వివాహంపై సాయిధరమ్ వివరణ

saidharmatej-niharika-marriage-issue
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్, చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కుమార్తె, హీరోయిన్ నీహారికలు ఓ ఇంటివారు కాబోతున్నారంటూ సోమవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన వార్తకు తెర పడింది. నిహారికను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు సాయిధరమ్ తేజ్‌ను తీవ్రంగా బాధించాయి. అన్నాచెల్లెళ్లులా కలిసి మెలిసి పెరిగిన తమకు పెళ్లి జరుగనున్నట్లు వార్తలు రావడంపై తేజ్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన వార్తలను ఇచ్చే ముందు కనీసం ధ్రువీకరించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


వరుసకు మరదలైన నటుడు నాగబాబు కుమార్తె నిహారికతో తనకు త్వరలో వివాహం జరగనుందని వచ్చిన వార్తలను హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఖండించారు. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధితో ఓ ప్రకటన విడుదల చేశారు. నిహారికను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు తనను బాధించాయని తెలిపారు. చిన్నతనం నుంచి ఒకే కుటుంబలో కలిసిమెలిసి పెరిగామని ఒకరినొకరం అన్నాచెల్లెళ్లుగా భావిస్తామని వివరించారు. ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన వార్తలను ఇచ్చే ముందు ధ్రువీకరించుకోవాలని కోరారు. ఆధారం లేని వార్తలు ఎదుటివారి మనో భావాలను దెబ్బతీస్తాయని చెప్పారు.
చిరంజీవి సోదరి విజయదుర్గ కుమారుడు సాయి ధరమ్‌ తేజ్‌. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నీహారిక. వీరిద్దరు వీరిద్దరు వరుసకు బావామరదళ్లు కూడా. వీరిద్దరు పరస్పరం ఇష్టపడుతున్నారని, దాంతో ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సోషల్ మీడియా కారుకూతలు కూసింది. నిహారిక, సాయి ధరమ్‌ తేజ్‌ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారని, అంతేతప్ప, వారిద్దరి మధ్య సహజంగానే సాన్నిహిత్యం అనేది ఉంటుందని, పెళ్లివార్త పుకార్లే అని సాయిధరమ్ స్నేహితులు వెంటనే స్పందించినప్పటికీ నష్టం జరిగిపోయింది.
అన్యాయంగా సెలబ్రిటీల జీవితాలపై అపనిందలు వేస్తున్న ఇలాంటి ముష్కర కథనాలను, ప్రసారం చేస్తున్న చానెళ్లను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లేబుళ్లు: , ,

8, మే 2017, సోమవారం

ఎన్టీఆర్ వెంట వెళ్ళిన మహేష్ స్క్రిప్ట్!

ntr-mahesh-script

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో “స్పైడర్” సినిమాలో నటిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు, దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ స్క్రిప్ట్, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ప్రయాణించింది. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా కధతో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి? అనుకుంటే… ఇక్కడే కొరటాల శివ తెరపైకి వచ్చాడు మరి.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సతీసమేతంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ తో పాటు కొరటాల శివ కూడా స్వామి దర్శనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొట్టాయి. ‘బుడ్డోడు’తో ‘జనతా గ్యారేజ్’ తీసిన తర్వాత పెరిగిన సత్సంబంధాల రీత్యా కొరటాల కూడా జూనియర్ తో పాటు వెళ్లి ఉంటారని అంతా భావించిన తరుణంలో… కొరటాల వెళ్ళిన ఉద్దేశం వేరేనన్న విషయం బయటకు వచ్చింది.

తన సినిమాలు ప్రారంభం కాబోయే ముందు కధకు సంబంధించిన స్క్రిప్ట్ ను స్వామి వారి ఆశీర్వాదం నిమిత్తం దర్శనం చేసుకోవడం కొరటాలకు సెంటిమెంట్ గా మారింది. తొలి సినిమా ‘మిర్చి’తో మొదలైన ఈ ఒరవడి, ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ల విషయంలోనూ కొనసాగింది. తాజాగా “భరత్ అనే నేను” సినిమాకు కూడా ఇదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మహేష్ తో తాను తీయబోయే స్క్రిప్ట్ ను తీసుకువెళ్ళారు కొరటాల. అలా ఈ సినిమాలో జూనియర్ ను కూడా భాగస్వామ్యం చేసారు కొరటాల.

లేబుళ్లు:

వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లకు షాకింగ్ న్యూస్...

whatsapp-admins

వాట్సప్‌ గ్రూప్‌లో తేడా వస్తే.. జైలే.. ‘నేను చేయలేదు’ అంటే కుదరదు
షేర్‌ చేయకూడని అంశాలు
తెలియని సమాచారం
తప్పుడు సమాచారం
తప్పుదారి పట్టించేవి
విద్వేషాలు రెచ్చగొట్టేవి
వివాదాలకు కారణమయ్యేవి
వర్గపోరుకు దారితీసేవి
కించపరిచేవి.. అసభ్యకరమైనవి
వదంతులు.. తప్పుడు వార్తలు
మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు
గ్రూప్‌లో ఎవరు తప్పు చేసినా బాధ్యత అడ్మిన్‌దే
దోషిగా తేలితే.. 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష
చేతిలో ఫోన్‌.. చౌకగా ఇంటర్నెట్‌.. ఉచితంగా వాట్సప్‌ ఉంది కదా.. అని నాలుగు గ్రూప్‌లు క్రియేట్‌ చేసి వాటికి అడ్మిన్‌ అయి ఏదో ఘనకార్యం చేసినట్లు భావిస్తున్నారా..! అయితే జాగ్రత్త..! మీరు సృష్టించిన గ్రూప్‌లో ఎవరో.. ఏదో తేడా చేశారనుకోండి.. ఆ పాపం మీ మెడకూ చుట్టుకుంటుంది. వివాదాస్పద.. అసభ్య పోస్ట్‌ చేసిన సభ్యుడితో పాటు మీరూ.. మూడు నుంచి ఐదేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. అదేంటి.. ఎవరో.. ఏదో పోస్ట్‌ చేస్తే.. అడ్మిన్‌కి ఏం సంబంధం అంటారా..! ఉంది. అందుకే.. ఇటీవల కర్ణాకటలో ‘బాల్సేబాయ్స్‌’ అనే గ్రూప్‌లో కొందరు సభ్యులు ప్రధాని మోదీ చిత్రాన్ని అసభ్యకరంగా ‘మార్ఫే’సి పోస్ట్‌ చేయగా.. చివరకు అడ్మిన్‌ కూడా కటకటాలపాలయ్యాడు. ఇలా వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ను అరెస్ట్‌ చేయడం ఇదే తొలిసారి. వాట్సప్‌.. ఫేస్‌బుక్‌లలో గ్రూప్‌ల వల్ల దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలనూ హెచ్చరిస్తున్నాయి. వదంతులు.. తప్పుడు వార్తల వ్యాప్తికి ఇవే కారణమవుతున్నాయని గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు వాట్స్‌ప..ఫే్‌సబుక్‌ ఇతర గ్రూప్‌లను కట్టడిచేసే పనిలో పడ్డారు. గ్రూపుల ద్వారా అసభ్యకర, తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాట్సప్‌లో వివాదాస్పద పోస్ట్‌లు రాకుండా.. ఆయా గ్రూపుల అడ్మిన్‌లను కూడా బాధ్యులను చేస్తున్నారు. ఒక్క జమ్మూ కశ్మీర్లోనే 500పైగా వాట్సప్‌ గ్రూపులు సైనికులపైకి రాళ్లు విసిరేందుకు అక్కడి యువతను ప్రోత్సహించినట్లు పోలీసులు గుర్తించి వాటిని ఇప్పుడు బంద్‌ చేస్తున్నారు. మొత్తానికి వాట్సప్‌.. గ్రూప్‌కి అడ్మిన్‌ అంటే ఇప్పుడు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎవరో ఏదో షేర్‌ చేశారు కదా.. అని అది అసలో కాదో ధ్రువీకరించుకోకుండా మళ్లీ షేర్‌ చేస్తే ఇబ్బందుల్లో పడ్డట్లే. గ్రూప్‌లో పెడితే గ్రూప్‌ సభ్యులకు తప్ప.. ఇతరులకు తెలియదు.. అనుకోవడం భ్రమ. గ్రూప్‌లో ఇతరులు దీన్ని మరో గ్రూప్‌లలో షేర్‌ చేస్తారు. ఇలా గొలుసుకట్టు షేర్లలో అది కొన్ని గంటల్లోనే ఊహకు కూడా అందనంత మందికి చేరిపోతుంది. వీరిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కేసు మొదటి గ్రూప్‌ అడ్మిన్‌ వరకూ రావొచ్చు. ఆ పోస్ట్‌ను సృష్టించిన వారితో పాటు అడ్మినూ చిక్కుల్లోపడతాడు. అందువల్ల గ్రూప్‌ అడ్మిన్‌లు కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ పోలీసులు.. నిపుణులు సూచిస్తున్నారు. ఏ లక్ష్యం .. లేదా అంఽశంపై గ్రూప్‌ క్రియేట్‌ చేశారో.. దానిపైనే పోస్టులను అనుమతించాలి తప్ప.. ఇతర వివాదాస్పద పోస్టులు.. వ్యాఖ్యలను అనుమతించవద్దని సూచిస్తున్నారు. సాధారణంగా ఏవైనా నేరాలు జరిగితే.. వాటికి పక్కా ఆధారాలు సేకరించడం కష్టం. కానీ సోషల్‌ మీడియా.. వాట్సప్‌ గ్రూప్‌లలో.. తేడా చేస్తే.. పక్కా ఆధారాలు సేకరించడం పెద్ద సమస్య ఏమీ కాదు. కొన్ని గంటల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి దోషిగా నిలబెట్టవచ్చని పోలీసులు అంటున్నారు. అందువల్ల ఫేస్‌బుక్‌లోకానీ.. వాట్సప్‌లోకానీ.. గ్రూప్‌ క్రియేట్‌ చేసే ముందు.. సభ్యులను ఆహ్వానించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.
సాధారణ ఫొటో పెట్టినా నేరమే..!!
వాట్సప్ లో గ్రూప్‌లో ప్రతి పోస్ట్‌కీ అడ్మిన్‌దే బాధ్యత అని తెలుగు రాష్ర్టాల పోలీసులు అంటున్నారు. పార్టీలు..ఇతర ప్రాంతాల్లో ఫొటోలను కూడా అవతలివారి అనుమతి లేకుండా తీసి.. వాట్స్‌పలో పంచుకోవడం సరికాదని చెబుతున్నారు. ఇది అవతలి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తుంది కనుక.. వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కటకటాలపాలుకాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎదుటి వ్యక్తుల ఇష్టం లేకుండా.. వారి ఫొటోను సోషల్‌ మీడియాలోనో.. వాట్స్‌పలోనో షేర్‌ చేయడం ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం నేరమవుతుందని తెలిపారు.
వారణాసి కలెక్టరు, ఎస్పీ విడుదల చేసిన నోటీసు ప్రకారం
అడ్మిన్‌ బాధ్యతలు

వాట్సప్‌.. ఫేస్‌బుక్‌ గ్రూప్‌ అడ్మిన్‌ పరిపక్వతతో ఆలోచించగలిగినవాడై ఉండాలి. గ్రూప్‌లో ప్రతి పోస్ట్‌కీ.. బాధ్యత తీసుకోవాలి.
గ్రూప్‌లో యాడ్‌ చేసే ప్రతి సభ్యుడూ అడ్మిన్‌కు తెలిసి ఉండాలి.
ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే.. వెంటనే గ్రూప్‌ నుంచి తొలగించాలి
సదరు అసభ్య సమాచారం.. తప్పుడు వార్త.. వదంతిపై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి
ఆ వివాదాస్పద పోస్టింగ్‌కి సబంధించి అడ్మిన్‌ ఏం చర్యలూ తీసుకోకుంటే.. అతనిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు
అడ్మినే వివాదాస్పద పోస్ట్‌ చేస్తే.. ఐటీ చట్టం, ఐపీసీ సెక

లేబుళ్లు:

5, మే 2017, శుక్రవారం

కాజల్ రేంజ్ ఈ రేంజులో పడిందా

kajal-agarwal-with-lawrence

కాజల్ అగర్వాల్... దశాబ్దం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. బోలెడు అందంతోపాటు కాస్తంత అభినయం కూడా వచ్చి ఉండటం ఆమెకు ప్లస్ పాయింటని చెప్పొచ్చు.  అందుకే నిన్న మొన్నటి వరకు భారీ చిత్రమేదైనా సరే హీరోయిన్ గా కాజల్ ఫస్ట్ ఛాయిస్ అన్నట్టుగా ఆమె హవా నడిచింది. దాదాపు అగ్ర హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే ప్రస్తుతం తన టైం అంతగా బాగున్నట్టు లేదు.

బ్రహ్మోత్సవం సినిమా తర్వాత యంగ్ హీరోల పక్కన కాజల్ కనిపించింది లేదు. జనతా గ్యారేజ్ లో కనిపించినా ఐటం సాంగుకే పరిమితమైంది. లేటెస్ట్ గా ఖైదీ నెంబర్ 150 లో చిరు పక్కన చిట్టి పాత్రలో నటించి మెప్పించింది.  ఇందులోనూ ఎప్పటిలాగే అందంగా కనిపించింది.  ఈ సినిమా తర్వాత కొత్త అవకాశాలు తలుపు తడతాయని భావించినా అలాంటిదేం జరగలేదు. యంగ్ హీరోలు ఎవరూ ఇప్పడు కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడటం లేదని టాలీవుడ్ సమాచారం. ఇదే టైంలో సీనియర్ హీరోలు కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. హర్రర్ సినిమాలతో హైలైట్ అయిన రాఘవ లారెన్స్ పక్కన హీరోయిన్ గా కాజల్ కు తాజాగా ఛాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బాహుబలి చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారని సమాచారం. రాజమౌళి అసిస్టెంట్లలో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం చేయొచ్చని టాక్. మరి కాజల్ ఈ ప్రపోజల్ ను  ఓకే చేస్తుందో లేదో చూడాలి. వెయిట్ అండ్ సీ.

లేబుళ్లు: