13, జూన్ 2017, మంగళవారం

బుల్లితెరపై ఎన్టీఆర్ ఓకే అనేశాడు.. లుక్ అదిరింది

jr ntr bigboss show coming soon


హిందీలో స‌ల్మాన్ వ్యాఖ్యాత‌గా రూపొందిన బిగ్‌బాస్ షో ఎంత హిట్ అయిందో తెలిసిందే.
అయితే అదే షోని తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌నున్నాడ‌ని వచ్చిన వార్తలు నిజమయ్యాయి.
ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ పేజీలో బిగ్‌బాస్ షో చేయ‌బోతున్న‌ట్టు ఓ పిక్ ద్వారా తెలియ‌జేశాడు.
మ‌రి వెండితెర‌పై ఇప్పుడు అగ్రస్థాన నటుడిగా రాణిస్తున్న ఎన్టీఆర్ బుల్లితెర‌పై ఎలా ఆకట్టుకుండాడో చూడాలి.

లేబుళ్లు: ,

11, జూన్ 2017, ఆదివారం

లాస్య ‘యంఎల్‌ఏ’ చెల్లెలా?


యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసిన లాస్య నటిగా వెండితెరపై మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘రాజా మీరు కేక’ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆమెకు కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘యంఎల్‌ఏ’లో నటించే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని లాస్య ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ‘యంఎల్‌ఏ తొలిరోజు షూటింగ్‌ పూర్తైంది. కొంచెం బెరుకుగా అనిపించింది. కానీ బాగా జరిగింది. కల్యాణ్‌రామ్‌ సూపర్‌కూల్‌. వెన్నెల కిశోర్‌, దర్శకుడు ఉపేంద్ర మధ్వానీతో కలిసి సరదాగా పనిచేశాము.’ అన్నారు. ఇందులో లాస్య కల్యాణ్‌రామ్‌ చెల్లెలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
‘యంఎల్‌ఏ’లో కల్యాణ్‌రామ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని నిర్విహించి, టైటిల్‌ ప్రకటించారు. మణిశర్మ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

లేబుళ్లు: ,

రజనీ మూవీ లో తెలుగు సీనియర్ నటి

కబాలి ఫేమ్ పా. రంజిత్ – రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కాలా’ చిత్ర షూటింగ్ ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే.. జూన్ 23 నుండి రెండోవ షెడ్యూల్ చెన్నైలో మొదలుపెట్టుకోబోతుంది..ఈ మూవీ లో తెలుగు సీనియర్ నటి ఈశ్వరి రావు కు ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ఈ మధ్యనే అ..ఆ , నేను లోకల్ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు దక్కించుకొని ప్రేక్షకులను అలరించిన ఈమెకు , ఇప్పుడు కాలా లో కూడా మంచి పాత్ర దక్కిందని అంటున్నారు.
eswari rao to play rajinikanth wife
 నానా పటేకర్, హుమా క్యూరేషి , అంజలి పాటిల్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు ఈ మూవీ లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీ కడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ తో అభిమానుల్లో అంచనాలు మొదలు అయ్యాయి.కబాలి తో హిట్ కొట్టలేక పోయిన రంజిత్ ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసి ఉన్నట్లు తెలుస్తుంది.

లేబుళ్లు: ,

‘జై లవకుశ’ చరిత్రలో నిలిచిపోయే సినిమా… అభిమానులకి త్రిబుల్ కిక్

ntr jai lavakusa release date


‘జై లవకుశ’ షూటింగ్‌ అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకున్నా ఫర్వాలేదని మొదట అనుకున్నారు కానీ, ఇప్పుడు దసరా వరకు డిలే చేయకూడదని డిసైడ్‌ అయ్యారు. సోదరుడు కళ్యాణ్‌రామ్‌కి పెద్ద హిట్‌ ఇవ్వాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ చేస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 1 రిలీజ్‌ టార్గెట్‌ చేస్తోంది. అయితే ఇప్పటికి పూర్తయిన షూటింగ్‌, ఇకపై జరగాల్సిన వర్క్‌ పోల్చి చూసుకుంటే, సెప్టెంబర్‌ 1కి రావడం కష్టమని అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను సెప్టెంబర్‌ 1కి ఈ చిత్రం రిలీజ్‌ కావాలని ఎన్టీఆర్, డైరెక్టర్ బాబీ లతో సహా ‘జై లవకుశ’ టీమ్ మొత్తం అహో రాత్రులు ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధమవుతున్నారంట.

దసరా కి ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి.అప్పుడు సినిమా విడుదల చేయాలనుకోవడం పెద్ద మూర్ఖత్వమే.అందుకని ప్రాజెక్ట్ సేఫ్ కావాలంటే ముందుగా ప్రకటించినట్లు సెప్టెంబర్ 1 న అయితేనే చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నారు. మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న కారణంగా మాములు సినిమాల కంటే తన పెర్ఫార్మన్స్ ఎక్కడా తగ్గకుండా ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడట. తన ఫ్యాన్స్ కి ఏమాత్రం నిరుత్సాహం కలగకుండా త్రిబుల్ కిక్ అందించేలా చేయాలని, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి ఒక సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ని అందించాలని అన్ని రకాలుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.ఏది ఏమైనా అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎప్పటికీ మరచిపోలేని సినిమా గా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు.

లేబుళ్లు:

5, జూన్ 2017, సోమవారం

ఆశ్చర్యపరుస్తున్న జూనియర్ రంజాన్ సెంటిమెంట్ !


ఇప్పుడు ఇలా ఉండగా ఈమూవీ ఫస్ట్ లుక్ టీజర్ కు రంజాన్ సెంటిమెంట్ వెంటాడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి.  అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈనెల 23న శుక్రవారం రోజు ‘జై లవ కుశ’ టీజర్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది అని ఫిలింనగర్ టాక్. దీనికి కారణం గత ఏడాది ‘జనతా గ్యారేజ్’ కు రంజాన్ ఉన్న కనెక్షన్. క్రితం సంవత్సరం రంజాన్ కానుకగా ‘జనతా గ్యారేజ్’ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ తోనే ఈఏడాది కూడా రంజాన్ టైమ్ కు తన కొత్త సినిమా టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నాడట ఎన్టీఆర్. ఈమధ్యనే ‘జై లవ కుశ’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీలో  విలన్ గా కనిపించనున్న జై క్యారెక్టర్ ఫస్ట్ లుక్ తో విడుడుదల చేసినట్లుగా ఇప్పుడు ఈటీజర్ కోసం కూడ ‘జై’ క్యారెక్టర్ నే సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈపాత్రకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ బూత్ బంగ్లా జైలు సెట్ లో కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు. ఆ సన్నివేశాలలో కొన్నింటిని ఎంపిక చేసి ఈటీజర్ లో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ సినిమాలకు ఏర్పడిన భారీ క్రేజ్ రీత్యా ఈ సినిమాకు అప్పడే దాదాపు 80 కోట్ల వరకు బిజినెస్ అయిన నేపధ్యంలో ఈమూవీని భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు..  

లేబుళ్లు: ,

4, జూన్ 2017, ఆదివారం

చిన్న సినిమాలో ఎన్టీఆర్…2 నిమిషాలు థియేటర్ దద్దరిల్లిపోయింది

ntr jr


టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ టెంపర్ కి ముందు వేరు…టెంపర్ తర్వాత వేరు అని చెప్పొచ్చు. టెంపర్ నుండి ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకుంటూ ఇప్పుడు శిఖరాగ్రాన చేరుకున్నాడు యంగ్ టైగర్.

ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ప్రతీ చిన్న సినిమాలో ఎన్టీఆర్ రిఫెరెన్స్ లతో సీన్స్ ని తీయడం మొదలుపెట్టేశారు….రీసెంట్ గా ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోని నిర్మించిన BVSN ప్రసాద్ నిర్మించిన సరికొత్త సినిమా రాధలో ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోని స్పూఫ్ చేశారు.

కాగా ఈ సీన్ లో ఎన్టీఆర్ పేరు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయే రేంజ్ లో అరుపులతో హోరెత్తిందని చూసినవాళ్ళు చెబుతున్నారు. ఒక్క ఈ సినిమా అనే కాదు ఈ మధ్య చాలా సినిమాల్లో ఎన్టీఆర్ రిఫెరెన్స్ లో ఓ రేంజ్ లో వర్కౌట్ అవుతున్నాయని చెప్పొచ్చు..జైలవకుశ అంచనాలను అందుకుంటే ఈ రచ్చ మరింతగా ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో చెబుతున్నారు.

లేబుళ్లు: ,

గురు హీరోయిన్ ఎన్టీఆర్ గురించి ఏమంటుందో తెలుసా???

"ritika singh about ntr"


టాలీవుడ్ లో అడుగుపెట్టే ప్రతీ హీరోయిన్ అందరికన్నా ముందుగా కామెంట్ చేసే హీరోలలో ఎన్టీఆర్ ముందు వరుసలో నిలుస్తాడు. టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రతీ హీరోయిన్ ని మీ ఫేవరేట్ హీరో ఎవరు ఎవరితో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అని అడగడం కామనే.

రీసెంట్ గా గురు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన చిన్నది రుతికని కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఏ హీరోతో నటించాలని ఉంది అన్న ప్రశ్నకి తడుముకోకుండా ఎన్టీఆర్ తో నటించడానికి ఎదురుచూస్తున్నాను అని చెప్పిందట అమ్మడు.

ఎన్టీఆర్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని అలాంటి నటుడితో నటించడం కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానుల మనసుని గెలుచుకుంది ఈ బ్యూటీ. గురు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అవ్వడంతో తెలుగులో ఈమెకి మరిన్ని అవకాశాలు ఖాయమని అంటున్నారు. అందులో ఎన్టీఆర్ తో చాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

లేబుళ్లు: ,