బ్రేకప్ : భర్తతో విడాకులకు రెడీ అయిన అమలాపాల్

ముద్దుగుమ్మ అమలాపాల్ ప్రేమ-పెళ్లి వ్యవహారం గురించి తెలిసిందే. దర్శకుడు ఎఎల్ విజయ్ తో దాదాపు మూడేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నారు. విజయ్ దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లో అమలాపాల్ హీరోయిగా చేసింది. విజయ్ హిందూ, అమలాపాల్ క్రిస్టియన్.. అయినా పెద్దలని ఒప్పించి జూన్ 12, 2014న వీరిద్దరు ఒక్కటయ్యారు. ఓ సంవత్సరం పాటు అన్యోన్యంగా సాగిన.. వీరి దాంపత్య జీవితం ఆ తర్వాత.. మనస్పర్థలు చోటు చేసుకొని.. యేడాది కాలంగా దూరంగానే ఉంటున్నట్టు సమాచారమ్. తాజాగా, విజయ్ తో విడిపోవాలనే నిర్ణయానికి అమలా వచ్చినట్టు సమాచారమ్.

కామెంట్‌లు