టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలతోనే కాదు, తన మంచి మనసుతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు.నాగార్జున అనే క్యాన్సర్ పేషెంట్ ని పరామర్శించేందుకు స్వయంగా వెళ్లాడు తారక్.
గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన నాగార్జున క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.తన ఆఖరి కోరికగా తనకెంతో ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ ని కలవాలని కలలు కన్నాడు.అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే నాగార్జునని కలిసేందుకు వెళ్లి, పరామర్శించి కొంత డబ్బుసాయాన్ని సైతం అందించాడు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో జనతాగ్యారేజ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా డబ్బింగ్,షూటింగ్స్ లో బిజీగా ఉండి కూడ తన అభిమానికోసం ఇలా కదిలి వెళ్లడం తన మంచి మనసుకు అద్దం పడుతోందని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి