యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కెరీర్ మొదటి నుండీ మాస్ లోనే భారీ క్రేజ్ ఉంది, మిగతా హీరోలు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమాలు చేసి టాప్ స్టార్స్ అయితే ఎన్టీఆర్ కి మాత్రం కేవలం మాస్ ఫాలోయింగ్ తోనే స్టార్ స్టేటస్ అయ్యింది.
కానీ ప్రతీసారి మాస్ సినిమాలు చేయడం అంతమంచిది కాదని తెలుసుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో అన్ని వర్గాలకు చేరువ అయ్యాడు. ఇప్పుడు మిగిలిఉన్న లేడీ ఫాలోయింగ్ ని కూడా సొంతం చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు.
లేటెస్ట్ గా జనతాగ్యారేజ్ సెట్స్ లో లేడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ తో ఫోటోగ్రాఫ్ కోసం బారులు తీరగా వారిలో కొందరికి ఎన్టీఆర్ తో ఫోటో దిగే చాన్స్ దక్కింది. ఎన్టీఆర్ అంటే మాకు చాలా ఇష్టమని చెబుతున్నారు ఆ ఫ్యాన్స్. సినిమా రిలీజ్ కాకుండానే ఇలా ఉంటే రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ కి ఎంత ఫాలోయింగ్ పెరుగుతుందో అని అంతా అనుకుంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి