సెప్టెంబర్ చివర్లో మొదలుకాబోతున్న యంగ్ టైగర్ సరికొత్త సంచలనం


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో ఓ గుర్తింపు ఉంది, తన సినిమాల్లో ఎక్కువ ఎక్స్ పెరిమెంట్లు చేసిన తొలి హీరో అని చెప్పొచ్చు, చేసిన 25 సినిమాల్లో ఎవ్వరూ చేయని పాత్రలను కొన్ని ఎన్టీఆర్ చేసి మెప్పించాడు.


కాగా ఇప్పుడు మరో కొత్త పాత్రకి సిద్ధం


అవుతున్న యంగ్ టైగర్ ఆ సినిమాను మొదలుపెట్టడానికి ఇప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడట. కెరీర్ లో తొలిసారిగా ఓ థ్రిల్లర్ లో నటించబోతున్నాడు యంగ్ టైగర్.

వక్కంతం వంశీ లాంటి టాలెంటెడ్ స్టొరీ రైటర్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ ని ఇప్పటివరకు ఎవ్వరూ చూపించనంత కొత్తగా చూపించాలని ఫిక్స్ అయిన వంశీ ఇందులో అది చేసి చూపించబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ చివర్లో సెట్స్ పైకి వెళ్లి సమ్మర్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


కామెంట్‌లు